రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, తిరువళ్లువర్ దినోత్సవం, ఉళవర్ తిరునాళ్ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు వారపు సెలవులుగా పాటిస్తాయి. ఇదే క్రమంలో ఈ జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు (వారాంతాలు కలుపుకొని) ఉంటాయి.
ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా సెలవులు మారవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు శాఖ సెలవు షెడ్యూల్‌ను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం అవసరం.
వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు – గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోం
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాళం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మకర సంక్రాంతి – తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం
జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం – తమిళనాడు
జనవరి 17: ఉళవర్ తిరునాళ్ – తమిళనాడు
జనవరి 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవు
బ్యాంకులు మూసివున్నా ఇవి పనిచేస్తాయి
బ్యాంకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఏటీఎం నగదు ఉపసంహరణ వంటి సేవలను సాధారణంగానే వినియోగించుకోవచ్చు. అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించిన లావాదేవీలు సెలవు రోజుల్లో జరగవు.


