ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్.. | Bank holidays in India February 2026 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..

Jan 31 2026 2:56 PM | Updated on Jan 31 2026 3:11 PM

Bank holidays in India February 2026

2026 జనవరి నెల ముగిసింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా.. భారతదేశంలోని అన్ని బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.

➤ఫిబ్రవరి 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 14 (శనివారం) - రెండవ శనివారం కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 18 (బుధవారం)- లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కింలోని గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 19 (గురువారం) - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 20 (శుక్రవారం) - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజ్వాల్ (మిజోరం), ఇంఫాల్ (మణిపూర్)లలోని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤ఫిబ్రవరి 28 (శనివారం) - నాల్గవ శనివారం కారణంగా భారతదేశం అంతటా సెలవు

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement