టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.
➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు.
➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.
➤నేటి యువకులు జెండర్ రోల్స్‌కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.
➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్‌ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.
➤కెరీర్‌లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది.
➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు.


