breaking news
global survey
-
మీరు ఆర్థిక అక్షరాస్యులేనా?!
‘భారతీయ స్త్రీలు ఆర్థికంగా అక్షరాస్యులు కాకపోవడానికిప్రధాన కారణం పితృస్వామ్యమే’ అంటోంది గ్లోబల్ సర్వే స్టాండర్ట్ అండ్ పూర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆర్ధిక భద్రత, ఆర్థిక అక్షరాస్యత స్త్రీకి ఎంత అవసరమో తెలుసుకుంటే ఆమె పురోభివృద్ధిలో మరిన్ని మంచిమార్పులు చోటుచేసుకుంటాయన్నది అక్షర సత్యం. సం΄ాదనలో నేటితరం మహిళలూ తమ సత్తాను చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్నారు. అక్షరాస్యతలోనూ ముందడుగు వేస్తున్నారు. అయితే, ఆర్థిక అక్షరాస్యతలో మాత్రం మహిళ వెనకంజలోనే ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ బారోమీటర్ సర్వే స్పష్టం చేస్తోంది. 28 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో (స్తీ–పురుషులు ఇద్దరినీ కలిపి) భారతదేశం 23వ స్థానంలో ఉంది. కేవలం 35 శాతం మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యులుగా ఉంటే, 65 శాతం మందికి ఆర్థిక అవగాహన తక్కువ. ఇందులోనూ మహిళలు మరింతగా వెనకబడి ఉన్నారు అని తెలియజేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వందకోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు సొంత బ్యాంకు ఖాతా కూడా లేనివారున్నారు. భావోద్వేగాలతో ఆట తరచూ భర్తలు తమ భార్యలతో ‘నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నువ్వు సం΄ాదించాల్సిన అవసరం ఏముంది? ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది’ అనే ఎమోషనల్ స్ట్రాటజీలతో మహిళలు ఇరుక్కుంటున్నారు. దీంతో మహిళలు క్రమంగా ఒంటరిగా, నిస్సహాయంగా మారుతుంటారు. దురదృష్టం ఏమిటంటే ‘ప్రేమ’ అనే పేరుతో జరిగే ఆర్థిక దుర్వినియోగాన్ని మహిళలు గుర్తించలేక΄ోతున్నారు. ఆర్థిక భద్రత లేక΄ోవడంతో స్త్రీలు తమకి నప్పని సంబంధాలలోనూ సర్దుబాటు చేసుకుంటూ జీవించాల్సి వస్తుంది. చెడు సంబంధాలలోకి వెళుతుంటారు. డబ్బును ΄÷దుపు చేసి పెట్టుబడులు పెట్టడానికి బదులు, ఆమె కుటుంబం కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. చివరకు అదే కుటుంబంలోని వ్యక్తులు లేదా పిల్లలు స్త్రీల మీద ఆర్థిక ఒత్తిడిని తీసుకువస్తున్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గృహహింసను తగ్గించవచ్చని ‘రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే సంస్థ ‘ది ఎకనామిక్ అబ్యూజ్ అండ్ ది ఇం΄ార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరీ ఆఫ్ ఉమెన్’ నివేదికలో పేర్కొంది. నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి కుటుంబం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సాధారణంగా మహిళలు ఉండరు. లక్ష్మి ఒక సాధారణ గృహిణి. ఇప్పటికీ బ్యాంకు ఖాతా తెరవడానికి, కేవైసీ చేయడానికి భర్తతో కలిసే బ్యాంకుకు వెళుతుంది. ఆర్థికవిషయాలు అంటే ఆమెకు ఒక విధమైన భయం. సొంతంగా ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయదు. ఇలాంటి గృహలక్ష్ములు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఉమ ఉద్యోగం చేస్తుంది. కానీ, ఆమె ఏటీఎం కార్డ్ భర్త వద్ద ఉంటుంది. ΄ాస్వర్డ్ లాంటివి ఆమె స్వయంగా రూ΄÷ందించదు. అవన్నీ ఆమె భర్త చేస్తాడు. ఉద్యోగం చేస్తున్నా కూడా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థికస్వేచ్ఛ లేని ఇలాంటి మహిళలు కోట్లాదిమంది ఉన్నారు. షాపింగ్‌లో సమస్య లేదు ‘ఆర్థిక అక్షరాస్యత అంటే బ్యాంకుకు వెళ్లడం, అకౌంట్ ఓపెన్ చేయడం, చిన్న చిన్న లావాదేవీలు చేయడం అనుకోవాలా?!’ అనే ప్రశ్న ఉదయించకమానదు. అయితే, ‘ఇండియన్ ఉమెన్ అండ్ ఫైనాన్షియల్ ఫిట్నెస్’ రచయిత సునీల్ గాంధీ మాట్లాడుతూ ‘చాలామంది మహిళలకు మొబైల్ యాప్‌లో షాపింగ్ చేయడం, క్యాబ్ బుక్ చేసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండటం లేదు. అయితే, తమ సొంత బ్యాంకు ఖాతాను నిర్వహించడంలో లేదా ఆన్లైన్ లావాదేవీలు, పెట్టుబడుల పట్ల మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. ‘ఆమె బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, డబ్బు లావాదేవీలు, వడ్డీలు, చక్రవడ్డీల ఉచ్చులో చిక్కుకోకూడదు అని పురుషులు భావిస్తారు. ఆమె కూడా ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టడానికి, ఈఎమ్ఐ కట్టడానికి, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపదు. వ్యక్తిగత ఫైనాన్స్, జ్ఞానం, నైపుణ్యాలు, వంటి ఆర్థిక సమాచారం ఉన్నవారు తమ డబ్బుకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు ఆర్థికంగా అక్షరాస్యులు’ అని సునీల్ గాంధీ వివరిస్తున్నారు. మహిళలను నియంత్రించే ఆయుధం ఉద్దేశపూర్వకంగానే మహిళలకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ ఇవ్వడం లేదు. కుటుంబంలోని మగవారే దీనిని అడ్డు కుంటున్నారు. భారతీయ స్త్రీలు ఇంటిని చూసుకుంటారు. పురుషులు సం΄ాదిస్తారు. దీంతో ‘తమకు ఏం అవసరమో పురుషులే చూసుకుంటారు’ అనే ఆలోచన స్త్రీలను ఆర్థిక స్వేచ్ఛకు దూరం చేస్తుంది. చేతిలో డబ్బు, దానిని ఖర్చు చేసే హక్కు పురుషులకు ఉండటం మహిళలను నియంత్రించే ఆయుధంగా మారింది. – గీతికా చంద్ర,‘ఫైనాన్స్ బేసిక్స్ ఫర్ ఉమెన్’ రచయిత్రి కొట్టకుండా వేధింపులు ‘నేను సం΄ాదిస్తున్నాను, నా సం΄ాదనతో ఇల్లు నడుస్తోంది. నేను సం΄ాదించక΄ోతే కుటుంబం దిక్కు లేనిది అవుతుంది. నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నా ఇష్టం మేరకు అన్నీ నడవాలి’ ఈ తరహా ఆలోచన పురుషుల్లో పెరిగి మహిళలపై వేధింపులకు కారణమవుతోంది. 95 శాతం గృహహింస కేసుల్లో డబ్బు ప్రధాన΄పాత్ర పోషిస్తోంది. చాలామంది మహిళలు ఈ విధమైన ఆర్థిక వేధింపులకు గురవుతున్నారు. – సీమీ వినాయక్, సైకాలజిస్ట్ అవగాహనకు మార్గాలు.. ఆర్థికంగా అక్షరాస్యత ఉన్న మహిళలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వేటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దుర్వినియోగం అవుతుంది అనే విషయాల పట్ల అవగాహన ఉండాలి. అంతేకాదు, ఏ పథకాల్లో డబ్బు ఉంచడం ప్రయోజనకరం... వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మార్కెట్లో ఆర్థిక కదలిక ఏమిటో తెలుస్తుంది. ఫిక్స్డ్ డి΄ాజిట్స్, స్కీమ్‌లు, నాన్–డీమ్యాట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ΄ాలసీ గురించి అవగాహన పెంచుకోవాలి. మహిళలు తమ భర్త ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో తప్పక తెలుసుకోవాలి. ఏయే రుణాలు తీసుకుంటున్నారు, వాటి కాలపరిమితి ఎంత, వడ్డీ ఎంత అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలా లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఆన్లైన్ లావాదేవీల మొత్తం ప్రక్రియను తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బ్యాంకులు, ఫిక్స్డ్ డి΄ాజిట్లు, ΄ోస్టాఫీస్, జీవిత బీమాలో పెట్టుబడి పెట్టినట్లయితే ఎప్పుడూ కంబైన్డ్‌గా చేయడం మంచిది. నామినీలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ సొంత బ్యాంకు ఖాతా వివరాలను ఎల్లప్పుడూ అప్డేట్లో ఉంచండి. -
సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం
Tendulkar Entered Brandwatchs 50 Most Influential People Globally On Twitter: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ట్విటర్ వేదికగా బ్రాండ్‌వాచ్ అనే సంస్థ నిర్వహించిన విశ్వవ్యాప్త వార్షిక(2021) పరిశోధనలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే స్థానం లభించగా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో, సచిన్ 35వ స్థానంలో నిలిచారు. మోదీ, సచిన్‌లు అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్(ద రాక్), లియోనార్డో డికాప్రియో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కంటే ముందు వరుసలో ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, సచిన్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అనంతరం ఎంపీగా, దశాబ్దానికి పైగా యునిసెఫ్ దక్షిణాసియా అంబాసిడర్‌గా పలు గౌరవాలను దక్కించుకున్న సంగతి తెలసిందే. చదవండి: 'ఆ విషయంలో' రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాకిస్థాన్ కెప్టెన్ -
ఏలియన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
సాక్షి : టీవీ షోల్లో, సినిమాల్లో ఏలియన్ల ప్రస్తావన వచ్చినప్పుడు జనాలు ఆసక్తిగా గమనించటం పరిపాటే. గ్రహాంతరవాసులు ఉనికి కోసం ఓవైపు అగ్రదేశాలు పోటాపోటీ పరిశోధనలు నిర్వహిస్తున్న వేళ ఓ గ్లోబల్ సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏలియన్లు ఉన్నాయన్న సంగతి పక్కనపెడితే.. వాటి ఉనికిని బలంగా నమ్మే ప్రజల శాతం చాలా ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు మన ఆధునీకరణకు వాటి అవసరం చాలా ఉంటుందని పేర్కొంటూ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలను కూడా వీళ్లు సమర్థించటం గమనార్హం. మొత్తం 24 దేశాల్లో.. 15 భాషల్లో ఈ సర్వే కొనసాగగా.. ది లాస్ట్ జెడి ఈవెంట్లో దీనిని ప్రచురించారు. స్టార్ వార్స్ చిత్రాలో 8వ సిరీస్ గా ది లాస్ట్ జెడి వచ్చే వారం విడుదల కానున్న విషయం తెలిసిందే. మొత్తం 26,000 మందిపై ఈ సర్వే నిర్వహించగా.. 47 శాతం గ్రహాంతరవాసులు ఉన్నాయనే నమ్ముతున్నామని చెప్పారు. అందుకు కొన్ని ఘటనలకు వీరు సాక్ష్యాలుగా చూపారు కూడా. భూమ్మీద అయితే మనుషులు ఎలా ఉన్నారో.. ఇతర గ్రహాలపై కూడా ప్రాణులు ఉండి తీరతాయని 61 శాతం మంది తమ వాదన వినిపించారు. మిగిలిన వారు మాత్రం అదంతా హుళక్కేనని కొట్టి పారేశారు. ఇక ఏలియన్లు ఉన్నాయని ఎక్కువగా నమ్మేవారిలో రష్యన్ల సంఖ్య అధికంగా ఉండగా.. మెక్సికో, చైనా, నెదర్లాండ్ ప్రజలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
ఇంట్లో కంటే హోటల్ లోనే 'ఆ' మజా ఎక్కువట!
టొరంటో: మీరు ఎప్పుడైనా శృంగారాన్ని హోటల్ లో అనుభవించారా? ఇంట్లో కంటే హోటల్లోనే ఎక్కువసేపు ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్టు, ఆ సుఖం ఎక్కువ ఫలప్రదం అయినట్టు అనిపించిందా? మీ పెదవులపై విరబూసిన చిలిపి చిర్నవ్వు ఔననని సమాధానం ఇస్తే... ఈ విషయంలో మీరొక్కరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇదే అనుకుంటున్నారని తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. 11 దేశాల్లో 2,200 మందిపై అధ్యయనం జరిపిన అధ్యయనంలో హోటల్ లో శృంగార అనుభవం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న చాలామంది ఇంట్లో కంటే హోటల్ లోనే శృంగార ఆస్వాదనను 25 నుంచి 49 నిమిషాలపాటు అధికంగా అనుభవించామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న 53.5శాతం కెనడియన్లు హోటల్ గదిలో శృంగార ఉల్లాసభరితంగా, సాహసోపేతంగా సాగిందని అభిప్రాయపడ్డారు. హోటల్ టునైట్ సంస్థ ఈ అంతర్జాతీయ సర్వే నిర్వహించింది. నార్త అమెరికన్స్ కూడా హోటల్ లో ఆ అనుభవంలోనే ఎక్కువ మజా ఉందని చెప్పారు. ఇటాలియన్లు, ఆస్ట్రేలియన్లు, రష్యన్లు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హోటల్ గదిలో శృంగారాన్ని స్వేచ్ఛగా అనుభవించినట్టు, భాగస్వాములతో ఎక్కువ ప్రేమతో గడిపినట్టు తెలిపారు. హోటల్ గది కాదు నాణ్యమైన పరుపు కూడా శృంగార ఆస్వాదనలో ప్రముఖ పాత్ర పోషిస్తుందట. సర్వేలో పాల్గొన్న వారు చక్కనైన పరుపు ఉండటంతో భాగస్వామితో ఎక్కువ ప్రేమతో మెలిగినట్టు తెలిపారు. కెనడా పురుషులు విశాలమైన పరుపులు ఎక్కువ సౌఖ్యం ఉంటుందని భావిస్తే.. కెనడా మగువులు మాత్రం పరుపు కాస్త గట్టిగా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు. -
గ్లోబల్ సర్వేలో మోదీ నంబర్ 1
బీజింగ్: దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, బ్రెజిల్, చైనాలలో 4500 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే చేశారు. ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 5 పాయింట్లకు గాను మోదీ 3.74 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలవగా, జిన్‌పింగ్ 3.58 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. తొమ్మిది దేశాలలోని ప్రఖ్యాత నాయకులలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, జిన్‌పింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.