వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు! | RBI MPC Member Warns of Economic Risks from Iran Israel War | Sakshi
Sakshi News home page

వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు!

Mar 6 2026 7:41 PM | Updated on Mar 6 2026 8:07 PM

RBI MPC Member Warns of Economic Risks from Iran Israel War

పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థకు సమీప కాలంలో సవాళ్లు ఎదురుకావొచ్చని.. దీర్ఘకాల వృద్ధికి ఎలాంటి విఘాతం ఉండదని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో జీడీపీని అధిక వృద్ధి క్రమంలో నడిపించేందుకు వీలుగా ద్రవ్య, పరపతి విధానాల మధ్య సమన్వయం అవసరమన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు పెరుగుదల, ఎగుమతులకు ఆటంకాలు, గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు రెమిటెన్స్‌లు (నగదు బదిలీ) వృద్ధికి తక్షణ ప్రధాన సవాళ్లుగా గుర్తించినట్టు చెప్పారు. పశి్చమాసియా ప్రాంతంతో ప్రపంచానికి ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్న దృష్ట్యా ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. ఇదే జరిగి, ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోతే చౌక చమురు సరఫరాల ద్వారా భారత్‌ ప్రయోజనం పొందుతుందని నగేష్‌ చెప్పారు.

చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్క్లను అధిగమించొచ్చని పేర్కొన్నారు. వెనెజులా చమురు నిల్వలను భారత్‌కు తెరవడం సాయపడుతుందన్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందన్నారు. బలమైన అవకాశాలు, నియంత్రణలోనే ద్రవ్యోల్బణం భారత్‌ దీర్ఘకాలం పాటు మెరుగైన వృద్ధిని కొనసాగించే సానుకూల స్థితిలో ఉన్నట్టు చెప్పారు. 7 శాతం నుంచి 8 శాతానికి వృద్ధి రేటు మెరుగుపడేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement