సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ | China Testing Self Driving Electric Scooter | Sakshi
Sakshi News home page

సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ

Mar 20 2026 6:00 PM | Updated on Mar 20 2026 6:56 PM

China Testing Self Driving Electric Scooter

ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.

చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.

వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Advertisement
 
Advertisement
Advertisement