ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా | Flipkart CFO Sriram Venkataraman Exits Ahead of IPO | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా

Mar 20 2026 5:17 PM | Updated on Mar 20 2026 6:26 PM

Flipkart CFO Sriram Venkataraman Exits Ahead of IPO

పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.

''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.

ఐపీఓ లక్ష్యంగా..
2025 డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement