2025 డిసెంబర్ నెల ముగుస్తోంది. త్వరలో 2026 జనవరి ప్రారంభం కానుంది. ఈ నెలలో బ్యాంకులకు సుమారు 16 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.
➤జనవరి 1: న్యూ ఇయర్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 2: మన్నం జయంతి సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 3: హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో బ్యాంకులకు సెలవు
➤జనవరి 4: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 11: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా.. కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 14: మకర సంక్రాంతి/మాగ్ బిహు సందర్భంగా.. అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి.. సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు
➤జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 17: ఉళవర్ తిరునాల్ సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 18: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతీ పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
➤జనవరి 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 25: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
➤జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బ్యాంకులకు సెలవు
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.


