వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌ | Banks Likely to Remain Closed for Four Straight Days in Late January | Sakshi
Sakshi News home page

వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌

Jan 23 2026 1:03 PM | Updated on Jan 23 2026 1:17 PM

Banks Likely to Remain Closed for Four Straight Days in Late January

జనవరి నెలాఖరులో బ్యాంకు పనులుండే కస్టమర్లకు అలర్ట్‌.. వరుస సెలవులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల బ్యాంక్ సెలవులు ఖరారవ్వగా, నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.

జనవరి 24 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్‌తో జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె జరిగితే, నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు పూర్తిగా మూసి ఉండే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ సేవలు యథావిధిగా..
సెలవుల నేపథ్యంలో బ్యాంక్ బ్రాంచ్‌లలో చేయాల్సిన అత్యవసర పనులను కస్టమర్లు ముందుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివున్నా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వీటి ద్వారా చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్లు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement