రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్‌బీఐ | RBI says 98. 44 Percent of withdrawn Rs 2000 banknotes returned | Sakshi
Sakshi News home page

రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్‌బీఐ

Mar 4 2026 5:31 AM | Updated on Mar 4 2026 12:21 PM

RBI says 98. 44 Percent of withdrawn Rs 2000 banknotes returned

ముంబై: మార్కెట్‌ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది.

అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement