-
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్‌బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్ పేరు మీద కల్‌బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్‌సైట్‌ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
97 శాతం వెనక్కి వచ్చిన రెండువేల నోట్లు.. మిగిలింది ఎన్ని కోట్లంటే?
ముంబై: చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది’’ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు.. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది. కాగా, రూ.2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. రెండువేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..
విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్ సైనికుడు సీపీఎల్ లూథర్ హెర్షెల్ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్ 1న జరిగిన కొరియన్ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా. ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. కొరియన్ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్ సత్కారమని యూస్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. (చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement