
లక్నో : ‘సృష్టిలో దేవుడు స్త్రీకి అత్యంత శక్తిని ఇచ్చాడు. బిడ్డలను కనడమే కాదు వారి పాలనను కూడా అంతే సక్రమంగా చూస్తుంది’ అంటోంది ఐఎఎస్ అధికారి సౌమ్య పాండే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమార్తెతో డ్యూటీ చేస్తున్న సౌమ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో
బిజీగా మహమ్మారి పనులు..
‘కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం’ అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్‌డీఎం అధికారిగా నియమించబడ్డారు. డెలివరీ అయిన 14 రోజుల తరువాత తన మూడు వారాల కుమార్తెతో కార్యాలయానికి వచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదేవిధంగా, నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను. చదవండి: ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హత్య
ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో ఎస్‌డిఎమ్ ఆఫీసర్‌గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్‌లో చేరాను. ఈ అంటువ్యాధి సమయంలో పనిచేసేటప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల’ని సౌమ్య పాండే సూచనలు చేసింది.