Success story of Anand Deshpande, who left US job to build Rs 36,000 crore company in India - Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ

Published Wed, Apr 12 2023 3:32 PM | Last Updated on Wed, Apr 12 2023 3:55 PM

Success story of Anand Deshpande left US job to build Rs 36000 crore company in India - Sakshi

న్యూఢిల్లీ: జీవితం ఎపుడు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో తెలియదు. ఒకానొక క్షణంలో ఏదో ఒక పాయింట్‌ ట్రిగ్గర్‌ అవుతుంది. అదే కొత్త ఆవిష్కారానికి బీజం వేస్తుంది. గ్లోబల్ సాప్ట్‌వేర్‌ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌ ఎండీ ఆనంద్‌ దేశ్‌పాండే  సక్సెస్‌స్టోరీ అలాంటిదే.  గ్లోబల్ బిజినెస్‌తో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థకు ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా, దేశ్‌పాండే  రూ. 10,600 కోట్ల నికర విలువకు చేరుకున్నారు.

మహారాష్ట్రలోని అకోలాలో ఆనంద్‌ దేశ్‌పాండే జన్మించారు. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) టౌన్‌షిప్‌లో పెరిగారు. పాఠశాల విద్య  తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతోఆటు ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో కూడా పాస్‌ కావడంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లో చేరాడు. ఐఐటీ తర్వాత  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుని నిర్ణయించారు.  (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్‌)

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తైన తరువాత ముఖ టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (HP)లో తన ఉద్యోగంలో చేరాడు. ఇదే యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ హోల్డర్ కూడా. ఇక్కడే దేశ్‌పాండే జీవితం  కీలక మలుపు తిరిగింది.  వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందాలా లేదంటే  ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇండియా తిరిగి  వచ్యేయ్యాలి అనే రెండేరెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. చివరికి ఆరునెలల తర్వాత ఇండియాకు తిరిగి రావాలనేనిర్ణయించుకున్నారు. కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు గుడ్‌బై చెప్పేశారు. 

అలా 1990లో పూణేలో తన సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌ ప్రారంభించాడు. అయితే ఇలా కంపెనీ అంత ఈజీగా ఏమీ సాధ్య పడ లేదు. తన దగ్గరున్న సొమ్ముతోపాటు, స్నేహితులు,కుటుంబ సభ్యుల  దగ్గర అప్పు  తీసుకున్నాడు. చివరికి రూ.2 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ స్థాపించాడు. ఆరోజు దేశ్‌ పాండే చేసిన రిస్క్‌ అతన్ని బిలియనీర్‌ను చేసింది. ప్రస్తుతం పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌ మార్కెట్ క్యాప్ రూ.36,000 కోట్లకు పైగా ఉందంటే అతని కృషిని పట్టుదల అర్థం చేసుకోవచ్చు.(బైక్‌ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్‌)

లాంచ్‌ చేసిన పదేళ్లకు తొలిసారిగా దేశ్‌పాండే కంపెనీ 2000లో ఇంటెల్ క్యాపిటల్ ద్వారా ఒక మిలియన్ల డాలర్ల భారీ నిధులను సేకరించింది. అనంతరం 2005లో నార్వెస్ట్ వెంచర్ పార్టనర్‌లు, గాబ్రియేల్ వెంచర్ పార్టనర్‌లు దేశ్‌పాండే సంస్థలో 20 మిలియన్లు పెట్టుబడి పెట్టాయి ఇక ఆ తరువాత 2010లో ఐపీవోను విజయవంతంగా పూర్తి చేశారు. దేశ్‌పాండే మంచి పరోపకారి కూడా. తన కుటుంబంతో కలిసి దేఆస్రా అనే ఫౌండేషన్‌ను కూడా నిర్వహిస్తుండటం విశేషం. దీని ద్వారా  యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. 2012లో  IIT ఖరగ్‌పూర్‌ విశిష్ట పూర్వవిద్యార్థిగా గుర్తింపు,  2007లో ఇండియానా యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ ద్వారా కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 1.1 బిలియన్‌ డాలర్లు సంపద ఉన్నపుడే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల డేటాలో ఆనంద్ దేశ్‌పాండే బిలియనీర్ల ఎలైట్ క్లబ్‌లో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement