breaking news
banks closed
-
బ్యాంకు సెలవులు.. జూలైలో ఇదిగో ఈ రోజుల్లోనే..
ప్రాంతీయ సెలవులు, వారాంతపు మూసివేతల కారణంగా 2025 జూలైలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితాను విడుదల చేసింది. జూలైలో దేశవ్యాప్త ప్రభుత్వ సెలవులు లేవు. అయితే అన్ని ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతో పాటు కొన్ని రాష్ట్రాలకు సెలవులు ఉంటాయి.బ్యాంకుల సెలవుల జాబితా ప్రతి నెలా భిన్నంగా ఉంటుంది. వివిధ ప్రాంతాలను బట్టి ఆర్బీఐ ఈ జాబితాను జారీ చేస్తుంది. మీకు కూడా వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, సెలవుల జాబితాను చూసి మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. జూలైలో ప్రాంతీయ పండుగలు, సందర్భాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు వేర్వేరు రోజులు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి.జూలైలో బ్యాంకు సెలవులుజూలై 3 (గురువారం) - త్రిపురలోని అగర్తలాలో ఖర్చి పూజజూలై 5 (శనివారం) - జమ్మూ కశ్మీర్ లో గురు హరోబింద్ జీ జయంతిజూలై 6 - ఆదివారంజూలై 12 - రెండో శనివారంజూలై 13- ఆదివారంజూలై 14 (సోమవారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో బెహ్ దేంఖ్లామ్ ఫెస్టివల్జూలై 16 (బుధవారం) - ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హరేలా ఫెస్టివల్జూలై 17 (గురువారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో యు తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 19 (శనివారం) - త్రిపురలోని అగర్తలాలో కేర్ పూజజూలై 20 - ఆదివారంజూలై 26 - నాలుగో శనివారంజూలై 27 - ఆదివారంజూలై 28 (సోమవారం) - సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ద్రుక్పా త్షె-జీఈ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆ రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు తెరిచే ఉంటాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అన్ని సెలవు దినాల్లోనూ కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల్లో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. -
బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం. అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో ఉండవు. ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవుజూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవుజూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ యాప్‌లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు. -
బ్యాంకులకు వరుస సెలవులు
కొత్త ఏడాది (New Year 2025) మొదలవుతోంది. తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు (Bank holidays) ఉన్నాయి. వివిధ పండుగలు, విశేషమైన సందర్భాల కారణంగా జనవరిలో (January) చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సెలవులు, అలాగే రాష్ట్రాలవారీగా మారే కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో కూడా బ్యాంకులను మూసివేస్తారు. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.జనవరిలో సెలవులు ఇవే..జనవరి 1: బుధవారం- నూతన సంవత్సరాదిజనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతిజనవరి 5: ఆదివారం జనవరి 6: సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి జనవరి 11: శనివారం- మిషనరీ డే, రెండవ శనివారం జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి జనవరి 13: సోమవారం- లోహ్రి జనవరి 14: మంగళవారం- మకర సంక్రాంతి, మాఘ బిహు, పొంగల్జనవరి 15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడు), తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం) జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్ జనవరి 19: ఆదివారం జనవరి 22: ఇమోయిన్ జనవరి 23: గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 25: శనివారం- నాల్గవ శనివారం జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం జనవరి 30: సోనమ్ లోసర్దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. -
వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు
సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..సెలవుల జాబితా ఇదే.. » అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చమ బెంగాల్లో బ్యాంకుల మూత» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో సెలవు» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్టక్లో సెలవు» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుఅక్టోబర్లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. -
ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్!
ఈ వారంలో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇది ముఖ్యమైన సమాచారం. సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా.. ఈ ఐదు రోజుల పాటు మూత పడనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, రామ నవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలోని బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో సెలవుల జాబితాను ఆర్బీఐ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి. -
అక్టోబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు
రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. (RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా) అక్టోబర్ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు. (గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ) అక్టోబర్ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ సెలవుల జాబితా ఇది.. అక్టోబర్ 1: ఆదివారం అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 8: ఆదివారం అక్టోబర్ 14: రెండవ శనివారం అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా) అక్టోబర్ 15: ఆదివారం అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా) అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా) అక్టోబర్ 22: ఆదివారం అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం). అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా) అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్) అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా) అక్టోబర్ 28: నాల్గవ శనివారం అక్టోబర్ 29: ఆదివారం అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్) -
జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులే!
వచ్చే జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. కారణం రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా దాదాపు 15 రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవులు ప్రకటించింది. నెలలో మొదటి, మూడో శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవులు, రాష్ట్రాలు నిర్దేశించిన ప్రకారం స్థానిక సెలవు దినాలలో బ్యాంకులు పనిచేయవు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే అనే మూడు కేటగిరీల కింద ఆర్బీఐ సాధారణంగా ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది. వచ్చే జూలైలో మొదటి సెలవు జూలై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజుతో ప్రారంభమవుతుంది. జూలై 29న మొహర్రం వంటి తదుపరి సెలవుల వరకు కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలు మినహా ఈ సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి. జూలై నెల బ్యాంకు సెలవులు ఇవే.. జూలై 4: ఆదివారం జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్) జూలై 6: ఎంహెచ్ఐపీ డే (MHIP Day) (మిజోరాం) జూలై 8: రెండో శనివారం జూలై 9: ఆదివారం జూలై 11: కేర్ పూజ (త్రిపుర) జూలై 13: భాను జయంతి (సిక్కిం) జూలై 16: ఆదివారం జూలై 17: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయ) జూలై 22: నాలుగో శనివారం జూలై 23: ఆదివారం జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో) జూలై 30: ఆదివారం జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్) ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా -
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
నిలిచిపోయిన లావాదేవీలు నెల్లూరు(బృందావనం): ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలను వ్యతిరేకిస్తూ యూఎఫ్‌బీఐ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఒక రోజు సమ్మె నిర్వహించారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా దర్గామిట్టలోని ఆంధ్రాబ్యాంక్ ప్రధానశాఖ వద్ద నిర్వహించిన సమావేశంలో యూఎఫ్‌బీఐ జిల్లా అధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రసాద్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు. ప్రైవేటీకరణతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు. ఈ విధానాలను బ్యాంకు ఉద్యోగులు సమష్టిగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మనుగడను కాపాడుకోవాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎల్ఐసీ యూనియన్ల నాయకులు దామా అంకయ్య, రామరాజు, మోహన్‌రావు, నగేష్, ఆంజనేయులు, యూఎఫ్‌బీఐ నాయకులు వి.ఉదయ్‌కుమార్, ఆనంద్రాంసింగ్ డి.మురళీకృష్ణ, రమణప్రసాద్, రఘురామ్‌కుమార్, భాస్కర్ తదితరులు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. స్తంభించిన బ్యాంక్‌ల లావాదేవీలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 200కుపైగా ప్రభుత్వ బ్యాంకుల్లో బ్యాంక్ సిబ్బంది సమ్మెతో వందల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయినట్లు ఉద్యోగులు తెలిపారు.