బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు | Bank Holidays This Week Banks To Remain Closed For Up To 3 Days | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు

Jun 23 2025 5:20 PM | Updated on Jun 23 2025 6:23 PM

Bank Holidays This Week Banks To Remain Closed For Up To 3 Days

జూన్‌ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం.  అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.

ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ  పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు.  దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్‌ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో​ ఉండవు.  

ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..

  • జూన్ 27  శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవు

  • జూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవు

  • జూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.

  • జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవు

బ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్‌, మొబైల్ యాప్‌లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు.

Advertisement
 
Advertisement
Advertisement