ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ వారం బ్యాంక్ హాలిడేస్ ఇవే! | Bank holidays SBI HDFC ICICI Branches Will Be Closed on These Days From 23 30 Nov 2026 | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ వారం బ్యాంక్ హాలిడేస్ ఇవే!

Nov 22 2026 12:04 PM | Updated on Nov 22 2026 12:44 PM

Bank holidays SBI HDFC ICICI Branches Will Be Closed on These Days From 23 30 Nov 2026

బ్యాంకులకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు ఏవైనా ఉంటే.. సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. ప్రస్తుతం చాలా బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, కొన్ని పనుల కోసం నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి ఉంటుంది.

చెక్కుల క్లియరెన్స్, లోన్ సంబంధించిన ప్రక్రియలు, క్యాష్ డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం వంటి పనుల కోసం బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే.. బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకుని ముందుగానే తమ పనులను ప్లాన్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో నవంబర్ 22 నుంచి నవంబర్ 28 వరకు బ్యాంకుల సెలవుల వివరాలను తెలుసుకుందాం.

●నవంబర్ 22: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు
●నవంబర్ 23: సెంట్ కుట్ స్నెమ్ సందర్భంగా మేఘాలయలోని షిల్లాంగ్‌లో బ్యాంకులు పనిచేయవు
●నవంబర్ 24: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహస్ పూర్ణిమ సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్‌తో పాటు కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి.
●నవంబర్ 27: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలోని బెంగళూరులో బ్యాంకులకు సెలవు
●నవంబర్ 28: నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు

ఆదివారాలు, రెండో.. నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. అయితే.. పండుగలు, ప్రాంతీయ వేడుకల కారణంగా కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో మాత్రమే అదనపు సెలవులు వర్తిస్తాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ చెల్లింపు విధానాలతో పాటు ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement