అంబానీ, అదానీలను మించిన దాత! | EdelGive Hurun India Philanthropy List 2026 | Sakshi
Sakshi News home page

అంబానీ, అదానీలను మించిన దాత!

Nov 22 2026 10:01 AM | Updated on Nov 22 2026 10:13 AM

EdelGive Hurun India Philanthropy List 2026

భారతదేశంలో డబ్బు సంపాదించడమే కాదు.. అందులో కొంత భాగాన్ని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సంఖ్య పెరుగుతూనే ఉంది. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి మొదలైన రంగాలకు వీరు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.

తాజాగా.. విడుదలైన ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2026 ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 219 మంది దాతలు కలిపి రూ.11,554 కోట్ల విరాళాలు అందించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ విరాళాల మొత్తం 11 శాతం పెరిగింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబం వరుసగా ఐదో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచారు.

➤శివ్ నాడార్ కుటుంబం ఏకంగా రూ.2,593 కోట్ల విరాళాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది
➤రెండో స్థానంలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.877 కోట్ల విరాళాలతో నిలిచింది
➤మూడో స్థానంలో బజాజ్ కుటుంబం రూ.632 కోట్ల విరాళాలు అందించింది
➤రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం రూ.620 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది
➤ఐదో స్థానంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి రూ.380 కోట్ల విరాళాలతో ఉన్నారు
➤కుమార మంగళం బిర్లా కుటుంబం రూ.366 కోట్లతో ఆరో స్థానంలో
➤సైరస్ పూనావాలా& అదార్ పూనావాలా రూ.336 కోట్లతో ఏడో స్థానంలో నిలిచారు
➤సుధీర్ మెహతా, సమీర్ మెహతా కలిసి రూ.334 కోట్ల విరాళాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు
➤రంజన్ పాయ్ కుటుంబం రూ.219 కోట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా
➤రోహిణి నీలేకణి రూ.215 కోట్ల విరాళాలతో పదో స్థానంలో నిలిచారు

ఈ జాబితాలో అత్యధిక విరాళాలు అందించిన మహిళగా రోహిణి నీలేకణి ప్రత్యేక గుర్తింపు పొందారు. మొత్తం మీద.. భారతదేశంలో సంపన్నులు సామాజిక సేవ, విద్య, వైద్యం వంటి రంగాలకు అందిస్తున్న ఆర్థిక సహాయం పెరుగుతోందని ఈ నివేదిక తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement