‘బిట్‌కాయిన్‌ కొంటున్నారా? తొందరపడొద్దు’ | Robert Kiyosaki Bitcoin Warning Wait for Market Crash Before Buying Again | Sakshi
Sakshi News home page

‘బిట్‌కాయిన్‌ కొంటున్నారా? తొందరపడొద్దు’

Nov 21 2026 9:36 PM | Updated on Nov 21 2026 9:41 PM

Robert Kiyosaki Bitcoin Warning Wait for Market Crash Before Buying Again

బిట్‌ కాయిన్‌ కొనుగోలుపై ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్‌కాయిన్‌ ధరల్లో భారీ పతనం వచ్చినప్పుడు తొందరపడి కొనుగోలు చేయకూడదని, మార్కెట్‌ పతనం పూర్తయ్యే వరకు వేచి చూడాలని సూచించారు. పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదనే సామెతను ఉదహరిస్తూ, పెట్టుబడుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు కియోసాకి తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. మార్కెట్‌లో పతనం కొనసాగుతున్న సమయంలో కొనుగోలు చేయడానికి తొందరపడకూడదని, క్రాష్‌ పూర్తయి పరిస్థితులు చక్కబడిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని వివరించారు. బిట్‌కాయిన్‌ విషయంలోనూ తాను ఇదే వ్యూహాన్ని అనుసరించినట్లు వెల్లడించారు.

గతంలో బిట్‌కాయిన్‌ ధర భారీగా పడిపోయిన తర్వాత ఒక్కో కాయిన్‌ను 20,000 డాలర్ల వద్ద కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు కియోసాకి తెలిపారు. ఇప్పుడు కూడా బిట్‌కాయిన్‌ మార్కెట్‌లో మరోసారి కనిష్ఠ స్థాయికి చేరుకునే వరకు వేచి చూస్తానని పేర్కొన్నారు. ధరలు పడిపోతున్న సమయంలో తొందరపడి పెట్టుబడి పెట్టడం కంటే, సరైన కొనుగోలు అవకాశాల కోసం ఎదురుచూడటం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

పెట్టుబడుల్లో లాభం అనేది విక్రయించే సమయంలోనే కాకుండా, ఏ ధరకు కొనుగోలు చేశామనే అంశంపైనా ఆధారపడి ఉంటుందని కియోసాకి గుర్తుచేశారు. ‘మీరు విక్రయించినప్పుడు కాదు.. కొనుగోలు చేసినప్పుడే మీ లాభం నిర్ణయమవుతుంది’ అనే పెట్టుబడి సూత్రాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు.

అంటే, మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం కంటే, సరైన సమయంలో తక్కువ ధరకు ఆస్తులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సందేశం ఇచ్చారు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మార్కెట్‌ పతనాన్ని గమనిస్తూ, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలన్నది కియోసాకి తాజా ఎక్స్‌ పోస్ట్‌ సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement