breaking news
Hurun List
-
30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు..
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ యువతరం వైపు మరింతగా అడుగులు వేస్తోందని ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్30 లిస్ట్ 2026’ (Avendus-Hurun India U30 List 2026 102) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లలోపు వయస్సున్న 102 మంది యువ పారిశ్రామికవేత్తలు, నవ తరం వ్యాపార వారసులను ఈ జాబితా గుర్తించింది. గత ఏడాది 80 మందితో పోలిస్తే ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరగడం విశేషం. ఈ యువ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ జాబితా ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా’ వివిధ వయసు క్యాటగిరీల సిరీస్‌లో తొలి భాగం కాగా, తరువాత అండర్35, అండర్40 జాబితాలు కూడా విడుదల కానున్నాయి.స్వయం ప్రతిభతో ఎదిగినవారే అధికంఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది ఫస్ట్ జనరేషన్ ఎంట్రాప్రెన్యూర్లు. కుటుంబ వ్యాపారాల వారసుల కంటే స్వయంగా సంస్థలను ప్రారంభించి విజయవంతం చేసిన యువతే ఎక్కువగా ఉండటం భారత స్టార్టప్ రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది. జాబితాలో చోటు పొందిన వారి సగటు వయస్సు 28 సంవత్సరాలు కావడం మరో విశేషం.డీప్‌టెక్, ఏఐ, స్పేస్‌టెక్ హవాఈసారి జాబితాలో ప్రతి నలుగురిలో ఒకరు డీప్‌టెక్ లేదా హార్డ్‌టెక్ రంగాలకు చెందినవారే. మొత్తం 27 మంది ఈ విభాగాల నుంచి ఎంపికయ్యారు. ఇందులో ఏఐ & మెషిన్ లర్నింగ్‌కు చెందినవారు 8 మంది, ఈవీ & ఆటో కాంపోనెంట్స్ రంగానికి చెందినవారు ఏడుగురు, స్పేస్ టెక్ నుంచి ఆరుగురు, ఏరోస్పేస్ & డిఫెన్స్ నుంచి నలుగురు, సైబర్ సెక్యూరిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్‌ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది.20 ఏళ్లకే జాతీయ గుర్తింపుఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులు 20 ఏళ్ల ఒంకార్ సింగ్ బాత్రా (Apolink), ధ్రవ్య షా (Supermemory). వీరిద్దరూ ఒకరు స్పేస్‌టెక్, మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్‌లను నిర్మిస్తున్నారు. గత ఏడాది అత్యంత చిన్న వయస్కులు 22 ఏళ్ల వారు కాగా, ఈసారి ఆ రికార్డు 20 ఏళ్లకు చేరింది.మహిళా పారిశ్రామికవేత్తల ముద్రఈ ఏడాది ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు సంపాదించారు. అంజలి సర్దానా (Pronto), శ్రేయా మిట్టల్, రియా మిట్టల్ (Cava Athleisure), దేవికా ఘోలాప్ (OptraSCAN), దేవాంశి కేజ్రీవాల్ (Skillmatics), సురమ్యా జైన్ (RAS Luxury Skincare) ఇందులో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారిగా జాబితాలోకి వచ్చారు.బెంగళూరు అగ్రస్థానంస్టార్టప్ల కేంద్రంగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈసారి 21 మంది యువ వ్యాపారవేత్తలు అక్కడి నుంచే ఎంపికయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. అదే సమయంలో మెట్రో నగరాల వెలుపల నుంచి 40 మంది యువ వ్యాపారవేత్తలు ఎంపిక కావడం దేశవ్యాప్తంగా పారిశ్రామిక విస్తరణకు సంకేతంగా నిలిచింది.బిట్స్ పిలానీ మరోసారి టాప్విద్యాసంస్థల పరంగా బిట్స్ పిలానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏడుగురు ఉండగా, ఈసారి ఆ సంస్థ పూర్వ విద్యార్థుల సంఖ్య 11కు పెరిగింది.జెప్టో, భారత్‌పే ముందంజఅండర్30 జాబితాలోని టాప్-10 సంస్థలు కలిపి 3.5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు సమీకరించాయి. ఇందులో జెప్టో (Zepto) ఒక్కటే 2.3 బిలియన్ డాలర్లు, భారత్‌పే(BharatPe) సుమారు 650 మిలియన్ డాలర్లు సమీకరించి అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం జాబితాలోని యువ పారిశ్రామికవేత్తలు కలిపి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.లింక్డ్ఇన్లో ఆదిత్ పాలిచా హవాజెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచాకు లింక్డ్ఇన్లో సుమారు 3.77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అదే ఈ జాబితాలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వై కాంబినేటర్, గూగుల్ వంటి సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతు ఈ యువ సంస్థలకు లభించడం విశేషం. పిక్సెల్, జెప్టో, బోల్డ్ కేర్ వంటి స్టార్టప్‌లు అత్యధిక పెట్టుబడిదారులను ఆకర్షించిన సంస్థలుగా నిలిచాయి.భారత స్టార్టప్ రంగంలో కొత్త ధోరణిఈ ఏడాది నివేదికలో ప్రధానంగా కనిపించిన మార్పు సాఫ్ట్వేర్ ఆధారిత స్టార్టప్‌ల నుంచి డీప్‌టెక్, స్పేస్‌టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ టెక్నాలజీ వంటి హార్డ్‌టెక్ రంగాల వైపు యువ వ్యవస్థాపకులు వేగంగా మళ్లడం. దీంతో భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత సాంకేతికత ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోందని నివేదిక విశ్లేషించింది. -
విలువైన కంపెనీల్లో ‘తెలుగు’ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. 2025కి సంబంధించి హురూన్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌లో భాగమైన బర్గండీ ప్రైవేట్ దేశీయంగా అత్యంత విలువైన టాప్ 500 కంపెనీలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీల మొత్తం విలువ రూ. 12.1 లక్షల కోట్లుగా ఉంది. 2021 నుంచి చూస్తే 75 శాతం పెరిగింది. ఇవి గత ఐదేళ్లుగా ప్రతి రోజు సుమారు రూ. 283 కోట్ల విలువను జోడించాయి. జాబితాలోని 39 తెలుగు కంపెనీలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో 3.4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 70 శాతం పెరిగింది. ఇక మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో 8,480 మంది ఉద్యోగినులతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అగ్రస్థానంలో ఉండగా, 8,143 మందితో మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రెండో స్థానంలో, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ 3,427 మందితో మూడో స్థానంలో ఉంది. ఎంటార్ టెక్నాలజీస్, స్కైరూట్ ఏరోస్పేస్ మొదలైన వాటికి ఈసారి స్థానం లభించింది. హెల్త్‌కేర్ రంగంలో తెలంగాణ నుంచి 16 సంస్థలు, ఏరోస్పేస్–డిఫెన్స్‌లో 5, పారిశ్రామికోత్పత్తుల్లో 3, ఆటోమొబైల్–ఆటో విడిభాగాల్లో 3, నిర్మాణం–ఇంజనీరింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, కన్జూమర్ గూడ్స్ రంగాల్లో తలో రెండు కంపెనీల చొప్పున ఉన్నాయి. రిలయన్స్ టాప్.. జాతీయ స్థాయిలో టాప్ 500 కంపెనీలన్నింటి వేల్యుయేషన్ 3.4 లక్షల కోట్లడాలర్లుగా ఉంది. ఇది కెనడా జీడీపీ, ఇండొనేసియా–స్పెయిన్‌ల సంయుక్త జీడీపీ కన్నా అధికమని హురూన్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. వీటిలో దాదాపు 89 లక్షల మంది సిబ్బంది ఉండగా, పన్నుల కింద అవి రూ. 3.23 లక్షల కోట్లు చెల్లిస్తున్నాయి. 2026 ఏప్రిల్ 30 నాటికి కనీసం రూ. 10,230 కోట్ల విలువ చేసే కంపెనీలకు ఈసారి లిస్టులో చోటు దక్కింది. గత ఎడిషన్‌లో ఇది రూ. 9,580 కోట్లుగా ఉంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 19,36,230 కోట్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో నిల్చింది. కాగా, అత్యంత విలువైన అన్‌లిస్టెండ్ కంపెనీగా ఎన్ఎస్ఈ అగ్రస్థానంలో కొనసాగింది. సంస్థ వేల్యుయేషన్ రూ. 4,86,340 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్ దిగ్గజాల్లో మేఘా ఇంజనీరింగ్ ఆరో స్థానంలో, జిరోధా అయిదో స్థానంలో, గ్రీన్కో 8వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఎస్ఈ రూ. 30,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చోటు హురూన్ ఇండియా 2025 లిస్టులో 5 ఐపీఎల్ టీమ్‌లకు చోటు దక్కింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం వేల్యుయేషన్ రూ. 71,000 కోట్లు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20,850 కోట్లతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా, ఓవరాల్ లిస్టులో 270వ స్థానంలో నిల్చింది. -
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో హెచ్‌యూఎల్ టాప్
భారతదేశ కార్పొరేట్ దిగ్గజాలు కేవలం లాభాల ఆర్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని టాప్ 50 కంపెనీలు గడిచిన ఏడాదిలో ఏకంగా రూ.8,000 కోట్లను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాయి. ఈ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందడం విశేషం.అగ్రస్థానంలో హిందుస్థాన్ యూనిలీవర్సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో హిందుస్థాన్ యూనిలీవర్ 53.9 పాయింట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో హెచ్‌యూఎల్ ప్రదర్శించిన సమతుల్య పనితీరు ఈ ఘనతకు కారణమైంది.టాప్ 5 కంపెనీల వివరాలుర్యాంక్కంపెనీస్కోరు (పాయింట్లు)కీలక అంశం1హిందుస్థాన్ యూనిలీవర్53.9సమతుల్య ఎస్డీజీ పనితీరు2హెచ్‌సీఎల్ టెక్నాలజీస్53.8అత్యధిక మహిళా శ్రామిక శక్తి (67,217 మంది)3గ్రాసిమ్ ఇండస్ట్రీస్52.6సుస్థిర పారిశ్రామిక విధానాలు4టాటా మోటార్స్51.8గ్రీన్ మొబిలిటీ5డాబర్ ఇండియా50.3బాధ్యతాయుతమైన వినియోగం సాంకేతిక రంగంలో మహిళా సాధికారతఈ జాబితాలో 53.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రగతిని కనబరిచింది. భారత సాంకేతిక రంగంలోనే అత్యధికంగా 67,217 మంది మహిళలకు ఉపాధి కల్పించి మహిళా సాధికారతలో ఆదర్శంగా నిలిచింది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల తగ్గింపు, శక్తి-సమర్థవంతమైన డిజిటల్ సొల్యూషన్ల విస్తరణలో ఈ సంస్థ ముందుంది.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంకార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాయి.జాబితాలోని 50 కంపెనీలలో 48 సంస్థలు పర్యావరణ లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలోగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.40 కంపెనీలు ఉత్పత్తి, వినియోగంలో పారదర్శకతను పాటిస్తున్నాయి.30 కంపెనీలు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు అడుగులు వేస్తున్నాయి.ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 50 కంపెనీలు కలిసి మొత్తం రూ.48.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. తమ భారీ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)సీఎస్ఆర్ ద్వారా కంపెనీలు తాము సంపాదించే లాభాల్లో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేస్తాయి. అంటే.. సమాజం నుంచి వనరులను తీసుకుంటున్న కంపెనీలు తిరిగి సమాజానికి మేలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఒక నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ లాభాలు లేదా టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ సగటు నికర లాభంలో కనీసం 2 శాతం మొత్తాన్ని సీఎస్ఆర్ కార్యకలాపాలకు ఖర్చు చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..
భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్వర్క్ దీపిందర్‌ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.తొలి ప్రయత్నంలోనే మూడో స్థానంప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.టాప్-10 సెల్ఫ్‌మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ 2025ర్యాంక్వ్యాపారవేత్తలుకంపెనీ పేరు1దీపిందర్ గోయల్ఎటర్నెల్ (జొమాటో)2రాధాకృష్ణ దమానీడీమార్ట్3రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ఇండిగో4అభయ్ సోయిమ్యాక్స్ హెల్త్ కేర్5శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డిస్విగ్గీ6దీప్ కర్లా, రాజేశ్ మాగౌమేక్ మై ట్రిప్7యాశిష్ దహియా, అలోక్ బన్సల్పాలసీ బజార్8విజయ్ శేఖర్ శర్మపేటీఎం9ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్నైకా10పీయూష్ బన్సల్ & టీమ్లెన్స్‌కార్ట్ -
స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ అధినేత్రి రోష్నీ నాడార్ మల్హోత్రా సరికొత్త రికార్డులు సృష్టించారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్‌లిస్ట్-2025 దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. రూ.2.84 లక్షల కోట్లతో సంపదతో మూడో స్థానం కైవసం చేకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ రూ.8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండో స్థానంలో నిలిచారు. ఎం3ఎం ఇండియా, హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్‌ను విడుదల చేశాయి. ఆ జాబితాలో దేశంలోని ధనవంతుల జాబితాలో మూడో స్థానం దక్కించుకుని సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. హురున్ ధనవంతుల జాబితాలో టాప్ -10లో నిలిచిన పిన్న వయస్కురాలు ఆమే కావడం గమనార్హం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రోష్నీ నాడార్ మల్హోత్రా రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నా.. ఆమె సంపద వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఆమె సెల్ఫ్‌మేడ్ విమెన్ జాబితాలో ఆమె లేరు. అయినప్పటికీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్నీ నాడార్. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, తనదైన శైలిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్‌లిస్ట్-2025లో చోటు దక్కించుకున్న సెల్ఫ్ మేడ్ విమెన్ ఆంత్రపప్రెన్యూర్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. 1.జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)భారతదేశంలో స్వయం- నిర్మిత మహిళా మిలియనీర్ల జాబితాలో అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. సంపద రూ. 50,170 కోట్లు. అరిస్టా నెట్వర్క్స్ అధ్యక్షురాలు సీఈవో జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి దేశంలోనే ప్రముఖ కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటైన అరిస్టా నెట్‌వర్క్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ గత సంవత్సరం 7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది.2. రాధా వెంబు (Radha Vembu)జోహో కార్ప్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధా వెంబు రెండవ స్థానంలో ఉన్నారు. రూ. ఆమె సంపద రూ. 46,580 కోట్లు. జోహోను ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి స్థాపించారు. ఆయన 1996లో అడ్వెంట్‌నెట్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు.3. ఫల్గుణి నాయర్ (Falguni Nayar)సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ రిటైలర్ అయిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 39,810 కోట్లు.4. కిరణ్ మజుందార్-షా ( Kiran Mazumdar-Shaw)బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్-షా రూ. 29,330 కోట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. భారతదేశ బయోటెక్, హెల్త్‌కేర్ రంగాలలో మార్గదర్శకురాలిగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తొలి తరం వ్యవస్థాపకురాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా సత్తా చాటిన మహిళ. 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించారు.5. రుచి కల్రా (Ruchi Kalra)B2B కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో రుచి కల్రా అయిదో స్థానంలో ఉన్నారు. ఆఫ్బిజినెస్ను సహ-స్థాపించడానికి మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. తరువాత హైదరాబాద్‌లోని ఐఎస్బి నుండి ఎంబీఏ సంపాదించారు. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 9,130 కోట్లు.6. జూహి చావ్లా (Juhi Chawla)90లలో బాలీవుడ్ నేలిన స్టార్ హీరోయిన్ జూహి చావ్లా నేడు వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడులతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చావ్లా నికర ఆస్తుల విలువ రూ. 7,790 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఆమె సంపదలో 69 శాతం పెరుగుదలను చూసింది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ నుండి వస్తుంది. 7. నేహా బన్సాల్ (Neha Bansal)లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ ప్రస్తుతం కంపెనీలో వర్తకం, చట్టపరమైన విధులకు నాయకత్వం వహిస్తున్నారు. రూ. 5,640 కోట్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. లెన్స్కార్ట్ను ప్రారంభించడానికి ముందు, బన్సాల్ 2010 నుండి 2014 వరకు DNS అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా, BCom ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.8. ఇంద్రా నూయి (Indra Nooyi) పెప్సికోలో 24 సంవత్సరాలు సేవలందించిన తర్వాత, కంపెనీ మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి రూ. 5,130 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. 2019లో పదవీ విరమణ చేశారు. CEOగా, తన పదవీకాలంలో అమ్మకాలను దాదాపు రెట్టింపు చేశారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టారు. పెప్సికో నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, నూయి 2019లో అమెజాన్ బోర్డు, డ్యూయిష్ బ్యాంక్ యొక్క గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో చేరారు. 2023లో AI-ఆధారిత డేటా భద్రత, నిర్వహణ స్టార్టప్ కోహెసిటీ CEO అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. నూయి భారతదేశంలో పెరిగారు. యేల్ నుండి MBA పట్టా పొందారు. 9. నేహా నార్ఖేడే ( Neha Narkhede)స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ సంస్థ కాన్ఫ్లూయెంట్ కోఫౌండర్,మాజీ సీటీవో నేహా నికర ఆస్తుల విలువ రూ. 4,160 కోట్లు. మహారాష్ట్రలోని పూణేకు చోందిన నేహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ అపాచీ కాఫ్కాను సహ-సృష్టించారు. ప్రస్తుతం ఆమె కాన్ఫ్లూయెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు 2021లో రిస్క్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్ డెవలపర్ ఓస్సిలార్ను సహ-స్థాపించారు. అంతేకాదు గత ఏడాది ఆమె ఫోర్బ్స్ అమెరికా యొక్క స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరిగా జాబితాలో చోటు సంపాదించారు.10. కవిత సుబ్రమణియన్ (Kavitha Subramanian)భారతీయ ఆన్లైన్ పెట్టుబడి వేదిక, అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకురాలు కవిత భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా వ్యవస్థాపకుల జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 3,840 కోట్లు. అప్‌స్టాక్స్‌ను ప్రారంభించడానికి ముందు ఆమె 2015-2016 వరకు లీప్‌ఫ్రాగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. SKS మైక్రోఫైనాన్స్ లిమిటెడ్‌లోని యాక్టిస్లో పనిచేశారు. IIT బాంబే పూర్వ విద్యార్థిని, ది వార్టన్ స్కూల్ MBA గ్రాడ్యుయేట్. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్‌లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్‌ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్‌ఫామ్‌లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు.


