
దేశంలోకెల్లా అత్యధిక సంపన్నుల జాబితాలో తొలిసారిగా టాప్-3లో చోటు దక్కింకుని మహిళా వ్యాపారవేత్త రోష్నీ నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. 2025 ఎంఐఎం బిలియనీర్ జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. హెచ్‌సీఎల్ అధినేత్రి రోష్నీ నాడార్ మల్హోత్రా రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3 ర్యాంక్ కైవసం చేసుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా సత్తా చాటారు. హురున్ ధనవంతుల జాబితాలో టాప్ 10లో నిలిచిన పిన్న వయస్కురాలు కూడా ఆమె ఘనత సాధించారు. రోష్నీ నాడార్ మల్హోత్రా తర్వాత 10 రిచెస్ట్ భారత మహిళా వ్యాపారవేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)
భారతదేశంలో స్వయం- నిర్మిత మహిళా మిలియనీర్ల జాబితాలో అరిస్టా నెట్‌వర్క్స్ అధ్యక్షురాలు & CEO జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. సంపద రూ. 50,170 కోట్లు. అరిస్టా నెట్‌వర్క్స్ అధ్యక్షురాలు CEO జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి భారతదేశంలోని ప్రముఖ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థలలో ఒకటైన అరిస్టా నెట్‌వర్క్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ గత సంవత్సరం 7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది.
2. రాధా వెంబు (Radha Vembu)
జోహో కార్ప్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధా వెంబు రెండవ స్థానంలో ఉన్నారు. రూ. ఆమె సంపద రూ. 46,580 కోట్లు. జోహోను ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి స్థాపించారు. ఆయన 1996లో అడ్వెంట్‌నెట్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు.
3. ఫల్గుణి నాయర్ (Falguni Nayar)
సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ రిటైలర్ అయిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 46,580 కోట్లు.
4. కిరణ్ మజుందార్-షా ( Kiran Mazumdar-Shaw)
బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్-షా రూ. 29,330 కోట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. భారతదేశ బయోటెక్, హెల్త్‌కేర్ రంగాలలో మార్గదర్శకురాలిగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తొలి తరం వ్యవస్థాపకురాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా సత్తా చాటిన మహిళ. 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
5. రుచి కల్రా (Ruchi Kalra)
B2B కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో రుచి కల్రా అయిదో స్థానంలో ఉన్నారు. ఆఫ్‌బిజినెస్‌ను సహ-స్థాపించడానికి మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. తరువాత హైదరాబాద్‌లోని ఐఎస్‌బి నుండి ఎంబీఏ సంపాదించారు. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 9,130 కోట్లు.
6. జూహి చావ్లా (Juhi Chawla)
90లలో బాలీవుడ్ నేలిన స్టార్ హీరోయిన్ జూహి చావ్లా నేడు వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడుల వైవిధ్యభరితమైన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చావ్లా నికర ఆస్తుల విలువ రూ. 7,790 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఆమె సంపదలో 69 శాతం పెరుగుదలను చూసింది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ నుండి వస్తుంది. రూ. 12,490 కోట్ల సంపదతో అత్యంత ధనిక హీరో షారుఖ్ ఖాన్ తర్వాత రెండవ స్థానంలో ఉండటం విశేషం.
7. నేహా బన్సాల్ (Neha Bansal)
లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ ప్రస్తుతం కంపెనీలో వర్తకం, చట్టపరమైన విధులకు నాయకత్వం వహిస్తున్నారు. రూ. 5,640 కోట్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. లెన్స్‌కార్ట్‌ను ప్రారంభించడానికి ముందు, బన్సాల్ 2010 నుండి 2014 వరకు DNS అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా, BCom ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
8. ఇంద్రా నూయి (Indra Nooyi)
పెప్సికోలో 24 సంవత్సరాలు సేవలందించిన తర్వాత, కంపెనీ మాజీ చైర్‌పర్సన్ సీఈవో ఇంద్రా నూయి రూ. 5,130 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. 2019లో పదవీ విరమణ చేశారు. CEOగా, తన పదవీకాలంలో అమ్మకాలను దాదాపు రెట్టింపు చేశారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు మరియు పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టారు. పెప్సికో నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, నూయి 2019లో అమెజాన్ బోర్డు, డ్యూయిష్ బ్యాంక్ యొక్క గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో చేరారు. 2023లో AI-ఆధారిత డేటా భద్రత, నిర్వహణ స్టార్టప్ కోహెసిటీ CEO అడ్వైజరీ కౌన్సిల్‌లో చేరారు. నూయి భారతదేశంలో పెరిగారు. యేల్ నుండి MBA పట్టా పొందారు.
9. నేహా నార్ఖేడే ( Neha Narkhede)
స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ సంస్థ కాన్ఫ్లూయెంట్ కోఫౌండర్,మాజీ సీటీవో నేహా నికర ఆస్తుల విలువ రూ. 4,160 కోట్లు. మహారాష్ట్రలోని పూణేకు చోందిన నేహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ అపాచీ కాఫ్కాను సహ-సృష్టించారు. ప్రస్తుతం ఆమె కాన్ఫ్లూయెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు 2021లో రిస్క్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్ డెవలపర్ ఓస్సిలార్‌ను సహ-స్థాపించారు. అంతేకాదు గత ఏడాది ఆమె ఫోర్బ్స్ అమెరికా యొక్క స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరిగా జాబితాలో చోటు సంపాదించారు.
10. కవిత సుబ్రమణియన్ (Kavitha Subramanian)
భారతీయ ఆన్‌లైన్ పెట్టుబడి వేదిక, అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకురాలు కవిత భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా వ్యవస్థాపకుల జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 3,840 కోట్లు. అప్‌స్టాక్స్‌ను ప్రారంభించడానికి ముందు ఆమె 2015-2016 వరకు లీప్‌ఫ్రాగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. SKS మైక్రోఫైనాన్స్ లిమిటెడ్‌లోని యాక్టిస్‌లో పనిచేశారు. IIT బాంబే పూర్వ విద్యార్థిని, ది వార్టన్ స్కూల్ MBA గ్రాడ్యుయేట్.