బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పలు సేవల కోసం వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారం ప్రారంభం కాగానే బ్యాంకు శాఖలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. సెలవులేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు.
సాధారణ వారపు సెలవుల్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ వారం నవంబర్ 22న శనివారం, నవంబర్ 23న ఆదివారం రెండు రోజులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ షెడ్యూల్ సెలవులు కాకుండా, వారంలోని అన్ని ఇతర రోజులలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
సాధారణంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా పాటిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 22న నెలలో నాల్గవ శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజన సెలవు ఉంటుంది.
బ్యాంకులు ఎప్పుడు మూసిఉంటాయి?
ఆర్బీఐ సెలవుదినాలు మినహా ఆదివారాలు, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.నవంబర్ నెలలో ఇప్పటివరకు, ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మొత్తం ఆరు రోజుల పాటు మూసి ఉన్నాయి.
ఈ నెలలో సెలవులు ఏమైనా మిగిలి ఉన్నాయా?
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అన్ని బ్యాంకు శాఖలు మూసిఉంచే ఆదివారాలు మినహా నవంబర్ నెలలో మిగిలిన రోజుల్లో అదనపు బ్యాంకు సెలవులు లేవు. జాబితా చేసిన బ్యాంక్ తదుపరి సెలవుదినం డిసెంబరులో మాత్రమే ఉంటుంది.
దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల సందర్భంగా సెలవులను నిర్ణయిస్తారు.


