బంగారం ధరలు: ఒక్క వారంలో ‘ఎంత’ మారిపోయాయో.. | Gold Prices Rise Sharply In Telugu States, 24K And 22K Rates Show Strong Weekly Recovery | Sakshi
Sakshi News home page

Gold Rates In India: ఒక్క వారంలో ‘ఎంత’ మారిపోయాయో..

Dec 14 2025 11:53 AM | Updated on Dec 14 2025 1:22 PM

Gold prices jump sharply this week yellow metal surges by Rs

దేశంలో బంగారం అంటే అందరికీ ప్రీతే. అవకాశం ఉన్నప్పుడల్లా కాస్తయినా పసిడిని కొంటుంటారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ధరల్ని గమనిస్తూ ఉంటారు. తగ్గినప్పుడు కొనేసుకుందాం అనుకుంటారు. పెరిగినప్పుడు అయ్యో.. అంటూ నిరాశపడతారు. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా మారాయి.. ఎంత పెరిగాయి.. ఎంత తగ్గాయి.. ఆ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..

తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్‌ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మధ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ వారాంతంలో బలమైన పెరుగుదలతో వారం ముగిసింది.

ధరలు పెరిగాయిలా..

డిసెంబర్ 7న 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,150గా ఉండగా, మరుసటి రోజు రూ.1,30,420కు కొద్దిగా పెరిగింది. డిసెంబర్ 9న అనూహ్యంగా రూ.1,29,440కు పడిపోయింది. అయితే మార్కెట్ త్వరగా రికవరీ అయింది. డిసెంబర్ 10న రూ.1,30,310కు, 11న రూ.1,30,750కు పెరిగింది.

ఇక వారాంతంలో అసలైన ఊపు వచ్చింది. డిసెంబర్ 12న 24 క్యారెట్ బంగారం రూ.1,34,180కు ఎగిసింది. డిసెంబర్ 13, 14న రూ.1,33,910కు కొద్దిగా తగ్గినా, నికరంగా వారంలో రూ.3,760 ఖరీదైంది.

ఇక 22 క్యారెట్ల బంగారం ధోరణి కూడా ఇదే. డిసెంబర్ 7న రూ.1,19,300తో ప్రారంభమై, 9న రూ.1,18,650కు తగ్గి, మధ్యలో రూ.1,19,450, రూ.1,19,850కు రికవరీ అయింది. డిసెంబర్ 12న రూ.1,23,000కు ఎగసి, వారాంతంలో రూ.1,22,750కు స్థిరపడింది. మొత్తంగా వారంలో రూ.3,450 పెరిగింది.

పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, మిడిల్ ఈస్ట్ సంఘర్షణలు వంటి అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని స్థానిక జువెలర్స్పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement