ఇంకొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. ఇప్పటికే పండుగలు, ఇతర పర్వ దినాలకు సంబంధించిన సెలవులను సంబంధిత శాఖలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే ఏడాది (2026) సుమారు 21 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.
➤మకర సంక్రాంతి (జనవరి 15)
➤రిపబ్లిక్ డే (జనవరి 26)
➤హోలీ (మార్చి 3)
➤ఉగాది (మార్చి 19)
➤రంజాన్ (మార్చి 21)
➤శ్రీరామ నవమి (మార్చి 27)
➤అకౌంట్స్ క్లోజింగ్ డే (ఏప్రిల్ 1)
➤గుడ్‌ఫ్రైడే (ఏప్రిల్ 3)
➤అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)
➤మే డే (మే 1)
➤బక్రీద్ (మే 27)
➤మొహర్రం (జూన్ 26)
➤స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)
➤మిలాద్ ఉన్-నబీ (ఆగస్టు 26)
➤శ్రీకృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్ 4)
➤వినాయక చవితి (సెప్టెంబర్ 14)
➤గాంధీ జయంతి (అక్టోబర్ 2)
➤విజయ దశమి (అక్టోబర్ 20)
➤దీపావళి (నవంబర్ 8)
➤గురునానక్ జయంతి (నవంబర్ 24)
➤క్రిస్మస్ (డిసెంబర్ 25)
బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!


