ఇండెక్సులలో రీట్స్‌కు చోటు | SEBI plans REITs index entry to enhance liquidity, participation | Sakshi
Sakshi News home page

ఇండెక్సులలో రీట్స్‌కు చోటు

Nov 22 2025 4:12 AM | Updated on Nov 22 2025 4:12 AM

SEBI plans REITs index entry to enhance liquidity, participation

పరిశ్రమ నిపుణులతో సెబీ చర్చలు 

న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు(రీట్స్‌)ను మార్కెట్‌ ఇండెక్సులలో చేర్చే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో రీట్స్‌కు లిక్విడిటీ భారీగా మెరుగుపడే వీలున్నట్లు తెలియజేశారు. 2025 రిట్స్, ఇని్వట్స్‌ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ పాండే ఇండెక్సులలో రీట్స్‌ను పొందుపరిచేందుకు పరిశ్రమ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. 

రియల్టీ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు రీట్స్‌ను జారీ చేస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లకు అధిక ధరల రియలీ్టని ఆఫర్‌ చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా డివిడెండ్‌ ఆదాయం ఆర్జించేందుకు వీలు కల్పించడంతోపాటు.. భవిష్యత్‌లో పెట్టుబడుల వృద్ధికి సైతం రీట్స్‌ ఉపయోగపడతాయి. ఇండెక్సులలో చోటు లభిస్తే రీట్స్‌లో లిక్విడిటీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. మరోపక్క రీట్స్, ఇని్వట్స్‌ సంబంధిత బిజినెస్‌ల సులభతర నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.  

ఎంఎఫ్‌ పథకాలలో.. 
ఇన్వెస్టర్లకు రక్షణ కలి్పస్తూనే లిక్విడ్‌ ఎంఎఫ్‌ పథకాలలో రీట్స్, ఇన్విట్స్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకున్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు సెబీ చీఫ్‌ పాండే తెలియజేశారు. ఈ బాటలో తగిన రక్షణాత్మక విధానాలకు తెరతీయడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులలో ప్రయివేట్‌ ఇని్వట్స్‌ పెట్టుబడులు చేపట్టేందుకు అవకాశాలను అన్వేíÙస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విధంగా రీట్స్, ఇని్వట్స్‌లో మరిన్ని పెట్టుబడులను చేపట్టేందుకు వీలుగా సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్‌ ఆస్తుల మానిటైజేషన్‌ను పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో పెట్టుబడులపై బీమా రంగ నియంత్రణ సంస్థ, పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత సంస్థ, ఈపీఎఫ్‌వో తదితరాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎఫ్‌లపై సెబీ ఆంక్షలు ప్రీఐపీవోలో పెట్టుబడులకు చెక్‌ 
న్యూఢిల్లీ: ప్రీఐపీవోలో షేర్ల కొనుగోలుపై మ్యూచువల్‌ ఫండ్స్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్‌ పెట్టినట్లు తెలుస్తోంది. సంబంధితవర్గాల సమాచారం ప్రకారం ఐపీవోకుముందు షేర్ల జారీ(ప్లేస్‌మెంట్స్‌)లో ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయకుండా సెబీ నిషేధం విధించింది. తద్వారా ఐపీవోలలో లిక్విడిటీని పెంచడంతోపాటు.. కంపెనీల విలువ నిర్ధారణలో పారదర్శకతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రీఐపీవో షేర్ల జారీలో పాల్గొనకుండా ఆదేశించామని, అయితే యాంకర్‌ రౌండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతులు కొనసాగుతాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ నెల మొదట్లో సెబీ యాంకర్‌ ఇన్వెస్టర్‌ కేటగిరీ, షేర్ల కేటాయింపులో సైతం సవరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌కు మరింత చోటు కల్పించింది. ఇందుకు వీలుగా యాంకర్‌ పోర్షన్‌ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచిన విషయం విదితమే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement