ప్రధాన వార్తలు
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ప్రపంచ రికార్డు బద్దలుఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు.బాబర్ డకౌట్వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.ఇందుకు తోడు ఈ మ్యాచ్‌లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.110 పరుగులకు ఆలౌట్లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్నీల్ బార్ట్‌మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకంఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్‌లలో 4234 పరుగులు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 4231 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్‌లలో 4188 పరుగులు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్‌లలో 3869 పరుగులు🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్‌లలో 3710 పరుగులు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్
‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
‘ధమాకా’ తర్వాత రవితేజ ఖాతాలో సరైన హిట్టే పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. ఇద్దరి నుంచి వరుస సినిమాలు వస్తున్నా.. ‘ధమాకా’ స్థాయి హిట్ మాత్రం రాలేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు జోడీగా ‘మాస్ జాతర’(Mass Jathara Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ధమాకా’ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మాస్ జాతర’(Mass Jathara Movie Review )పై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్ జాతర’ అందుకుందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..లక్ష్మణ్ భేరి(రవితేజ) పవర్ఫుల్ రైల్వే పోలీసు అధికారి. రైల్వే స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా చూసుకునే బాధ్యతే తనది. కానీ దాంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరిగినా.. ఆయన ఎంటర్ అవుతుంటారు. ఓ కేసు విషయంలో మంత్రి కొడుకుని కొట్టి.. వరంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ గ్రామం మొత్తం శివుడు(నవీన్ చంద్ర) కంట్రోల్లో ఉంటుంది. అక్కడి రైతులతో గంజాయి పండించి..కోల్‌కత్తాకు సరఫరా చేయడం ఆయన పని. లక్ష్మణ్ భేరీ వచ్చీరావడంతోనే శివుడు చేసే స్మగ్లింగ్ పనికి ఎదురుతిరుగుతాడు. కానీ ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు మొత్తం శివుడికి సపోర్ట్‌గా నిలుస్తారు. కేవలం రైల్వే స్టేషన్ పరిధిమేర మాత్రమే అధికారాలు ఉన్న లక్ష్మణ్..శివుడి దందాని ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాస్ జాతర’ చూడాల్సిందే. ఎలా ఉందంటే...కమర్షియల్ సినిమాకు కొత్త కథ అవసరం లేదు. హీరోకి భారీ ఎలివేషన్స్, బలమైన విలన్.. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు. ఇవన్నీ ‘మాస్ జాతర’లో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు భాను భోగవరపు పూర్తిగా సఫలం కాలేదు. కథ-కథనం పక్కకి పెట్టి..కేవలం రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవి కొంతవరకు ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేసినా.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా కొన్ని చోట్ల అయినా వాస్తవికంగా అనిపించాలి. కానీ ఈ సినిమా అలా ఎక్కడ అనిపించదు. రవితేజ పాత్ర ఒకచోట తెలంగాణ యాస మాట్లాడితే..మరికొన్ని చోట్ల సాధారణ భాష మాట్లాడుతుంది. హీరోయిన్ పాత్ర శ్రీకాకుళం యాస మాట్లాడితే.. ఆమె తండ్రి మాత్రం సాధారణ భాషలో మాట్లాడతాడు. సీరియస్‌గా ఉండే హీరో..హీరోయిన్ కనిపించగానే కామెడీ చేస్తుంటాడు. లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. హీరో-తాతయ్యల మధ్య వచ్చే సన్నివేశాలు అటు పూర్తిగా నవ్వించ లేదు.. ఇటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయాయి. ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు. రవితేజ ఎంట్రీ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాసేపటికే కథనం రొటీన్‌గా సాగుతుంది. తాత(రాజేంద్రప్రసాద్) తో లక్ష్మణ్ భేరీ చేసే కామెడీ కొంతమేర నవ్విస్తుంది. ఇక హీరో అడవివరం వెళ్లిన తర్వాత కథనంలో మార్పు ఉంటుందని ఆశించినా...అక్కడ నిరాశే ఎదురవుతుంది. శివుడి ఎంట్రీ వరకు అద్బుతంగా చూపించి.. మళ్లీ రోటీన్‌గానే కథని ముందుకు నడిపించారు. క్లైమాక్స్.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు గుర్తుకు చేస్తుంది. కథ-కథనం రొటీన్‌గా ఉన్నా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. శివుడి మామ గ్యాంగ్‌తో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా అదిరిపోతుంది. కథ-కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే..‘మాస్ జాతర’ ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పోలీసు పాత్రలు ఆయన అవలీలగా చేసేస్తాడు. రైల్వే పోలీసు అధికారి లక్ష్మణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఫ్యాన్స్ కోరుకునేలా తెరపై కనిపించి అలరించాడు. ఇక శివుడి పాత్రలో నవీచంద్రం విలనిజం అద్భుతంగా పండించాడు. ఆయనలోని కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. తులసి పాత్రకు శ్రీలీల న్యాయం చేసింది. హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నా..వాటి ప్లేస్మెంట్ సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
ఎంపీ రవి కిషన్‌కి హత్యా బెదిరింపులు.. చంపేస్తామంటూ..
గోరఖ్‌పూర్: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తమ వర్గాన్ని అనుమానించేలా రవి కిషన్ మాట్లాడారంటూ నిందితుడు ఆవేశంతో రగిలిపోయాడు. అయితే, ఈ బెదిరింపులపై ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ ఇలాంటి ఫోన్ కాల్స్‌కు తాను భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో, బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటనలో నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ద్వివేది స్పందిస్తూ.. ‘రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. ఎంపీకి సంబంధించి ప్రతీ కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఎంపీని ఉద్దేశిస్తూ నిందితుడు పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని తెలిపారు.ఇదిలా ఉండగా, రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ..‘నన్ను ఫోన్లో దుర్భాషలాడారు, నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను. ఇటువంటి వ్యక్తులే సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది నా రాజకీయ వ్యూహం. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు.. మనందరిపై దాడి’ అని వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో భిక్షాటన నిషేధం.. మరి వీళ్ళసంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిక్షాటనను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఒక సామాజీక రుగ్మత వంటిదని, ప్రజలను సోమరులుగా చేస్తుందని భావించిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడాన్ని గత ఏడాది నుంచే దీనిపై కసరత్తు చేసిన సర్కారు.. తాజాగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ నిషేధపు విధానాలపై అధ్యయనం చేసింది. అనంతరం ఈ నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి మనదేశంలో అయితే మిజోరం, మధ్యప్రదేశ్, యూపీలోని లక్నోలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ పరిమితంగా ఈ భిక్షాటన మీద నిషేధం ఉంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది. చంద్రబాబు పాలనలో భారీగా విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ బిచ్చగాళ్ళు రోడ్లమీద కనిపిస్తే రాష్ట్రం పరువు పోతుందని భావించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలా? కొన్ని పెట్టుబడులు తెచ్చే సంస్థలు.. ఆఫీసులు ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లోనే నిషేధం విధించాలా? అనే విషయంపై అధికారులతో చర్చించి యాచనను నిషేధించారు. ఇది కాకుండా విదేశాల విషయంలో ఐతే సౌదీ అరేబియా, డెన్మార్క్, ఆస్ట్రియా తదితర దేశాల్లో కొన్ని చోట్ల సంపూర్ణంగా.. కొన్ని చోట్ల పాక్షికంగా యాచక వృత్తిమీద నిషేధం ఉంది..మరి వీళ్ళ సంగతేమిటి ?యాచనను ఏపీలో నిషేధించిన తరుణంలో సోషల్ మీడియాలో రాజకీయపరమైన ట్రోలింగులు పోస్టింగులు వెల్లువెత్తాయి. ఎన్నికలకు ముందు యుపీఐ క్యూ ఆర్ కోడ్ చూపించి కార్యకర్తల నుంచి చందాలు.. విరాళాలు వసూలు చేసిన నాగబాబు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇలా యాచనను నిషేధిస్తే మరి నాగబాబులాంటి పొలిటికల్ బిచ్చగాళ్ల భవిష్యత్ ఏమి కావాలి.. అలాంటివాళ్ళు ప్రజలు వేసిన బిచ్చం మీదనే కదా బతుకుతారు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.ఇంకొందరు అయితే ప్రతివారం వేర్వేరు సంస్థల నుంచి అప్పులు తెస్తేనే తప్ప రాష్ట్రప్రభుత్వ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని చంద్రబాబు కూడా ఒక బిచ్చగాడే కదా... మరి అయన రేపట్నుంచి ఎవరిదగ్గర బిచ్చమెత్తుతారు అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి కొందరైతే పవన్ భవిష్యత్ ఎలా మరి.. చంద్రబాబు బిచ్చం వేసిన డిప్యూటీ సీఎం పదవి పేరుతో కులుకుతున్న పవన్ ఇకముందు పదవులు అడుక్కోకుండా ఎలా బతుకుతారు.. అయన సొంతంగా గెలవలేరు కదా..టీడీపీవాళ్ళు బిచ్చం వేయాల్సిందే కదా అని పోస్టింగులు పెడుతున్నారు. -సిమ్మాదిరప్పన్న
చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచేసింది. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, తదితర పంటలకు, ఉద్యాన తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే మురిగిపోతోంది. నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మెజారిటీ శాతం మునిగిన పంటను పూర్తిగా పరిశీలించిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. తమకు జరిగిన నష్టంపై ప్రతి చోటా రైతులు ఏకరువు పెట్టారు. నేలకొరిగిన పంటను కాపాడుకోవడంలో భాగంగా పొలంలో ఉండిపోయిన నీటిని బయటకు పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ రైతులు పలు చోట్ల కనిపించారు. పడిపోయిన వరి పంటను కట్టలు కట్టుకుంటున్నారు. అధికారులు వస్తే జరిగిన నష్టాన్ని చూపాలని ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించారు. కాగా, తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రైతాంగంలో ఆందోళన » శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుపాను 23 మండలాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, తులిగాం, ఇన్నేషుపేట, కోట»ొమ్మాళి మండలంలోని గుంజిలోవ తదితర గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. » విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతోపాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. వరి మొదళ్లు కుళ్లిపోయాయి. మళ్లీ.. పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే.. వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. » పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి ముద్దయ్యింది. » అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 15,800 ఎకరాల్లో పంటలు నష్టపోతే... అధికారులు మాత్రం 2వేల ఎకరాలే చూపిస్తున్నారు. 13,800 ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో చెరకు, వెయ్యి ఎకరాల్లో బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 60వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం! కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 60 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, దొండ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల పరిధిలోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేలంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరంలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగింది. పొలాల్లోని ముంపునీరు బయటకు వెళ్లే దారి లేక పంటను కాపాడుకునేందుకు కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డుపైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. కేంద్రాలకు వచ్చిన వారికే పరిహారమట! డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 76,709 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. కేవలం సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే నగదు పరిహారం అందిస్తామని చెప్పడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. గోదారి జిల్లాల్లో గుండెకోత తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో తుపాను ప్రభావం 209 గ్రామాల్లో కినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్, వీరవాసరం, నరసాపురం రూరల్ పరిధిలోని తాడేరు, బేతపూడి, తుందుర్రు, కంశాల బేతపూడి, మత్స్యపురిలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగిపోయి ఉంది. ముంపునీరు లాగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతూ, వెన్నులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపించాయి. ఈ ప్రాంతంలోని తొక్కోడి డ్రెయిన్‌లోని పూడిక ముంపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో పొలాల్లోకి నీరు ఎగదన్నుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. కోతకు పనికిరాదన్న భావనతో తాడేరులో పశువుల కోసం పంటను కోసేస్తున్న పరిస్థితి కనిపించింది. » ఏలూరు జిల్లాలో మోంథా తుపాను అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ బలమైన ఈదురుగాలుల ప్రభావంతో వరి కంకులు నేలకొరిగాయి. మరోవైపు రోజుల తరబడి పంట చేల్లో నీళ్లు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల పంట కుళ్లిన పరిస్థితి. ‘సరిగ్గా ఇంకో 15 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవి. కనీసం పెట్టుబడులైనా దక్కేవి. కోతలకు ముందు తుపాను విరుచుకుపడటంతో వరి కంకులు నేలకొరిగాయి. పర్యవసానంగా మళ్లీ ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అనివార్యంగా మారిన పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు. కృష్ణ కృష్ణా.. ఆదుకునే వారేరీ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు నీటి పాలవ్వడంతో అరకొర పంటనైనా రక్షించుకుందామనే తాపత్రయంలో అన్నదాతలు ఉన్నారు. కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు, మంతెన గ్రామాల్లో రైతులు నేలవాలిన వరిపైరును దుబ్బులుగా కడుతూ మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేల వాలిన వరి పైరును నిలగట్టేందుకు కూలీల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు రైతులు పంట చేను వైపు దీనంగా చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. పొలాల్లో నిలిచిన నీరు పంట బోదెల్లోకి సైతం మళ్లక పోవటంతో పొలాల్లో ఉన్న వరి దుబ్బులను నిలగట్టి పంట నష్టాన్ని నివారించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు కూలీల ఖర్చు అదనపు భారంగా మారింది. ఒక్కొక్కరికి రూ 330 చొప్పున కూలీ చెల్లిస్తూ వరి దుబ్బులను నిలగడుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న∙నమ్మకం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిలిస్తే కన్నీరై పారుతోంది » గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, అరటి, పసుపు, కూరగాయలు, పూలు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బురదమయమైన పొలాలు, ఇంకా నీట నానుతున్న పంటలు, పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు, ఇప్పటికే తెచ్చిన అప్పులకు తోడు పంటను కాపాడుకునేందుకు కొత్త అప్పుల కోసం పడే తిప్పలు, ఎరువుల కోసం అరువు కోసం దీనంగా వెతికే చూపులు.. ఇలాంటి దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. » భారీ వర్షాలకు బాపట్ల జిల్లా అతలాకుతలమైంది. వరి, పత్తి, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటి పాలయ్యాయి. పర్చూరు వాగు, రొంపేరులు పొంగి పొర్లడంతో పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో శుక్రవారం నాటికి 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండిపోయింది. నల్లమడ డ్రైన్, ఈపూరుపాలెం స్రైట్ కట్, పేరలి డ్రైన్లు పొంగి పొర్లడంతో బాపట్ల పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు ఇప్పటికీ నీటిలో ఉన్న పొలాలను చూపించారు. » ప్రకాశం జిల్లాలో ఏ రైతును పలకరించినా కన్నీరు పెట్టుకుని, గద్గద స్వరంతో దీనగాధను వినిపిస్తున్నారు. ప్రధానంగా నష్టపోయిన పంటల్లో సింహ భాగం పత్తిదే. కొన్ని ప్రాంతాల్లో ఒక తీత పత్తిని తీయగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు ఒక తీత కూడా తీయలేదు. తీద్దామని సన్నద్ధమయ్యే లోపు వరుసబెట్టి కురిసిన వర్షాలు, ఆపై మోంథా తుపాను అన్నదాత నెత్తిన పిడుగులా పడింది. వరి, పొగాకు, సజ్జ, మొక్కజొన్న, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లింది. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గోపతోటి శామ్యూల్ 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అంతా నీటిలో మునిగి పోయిందని, నాలుగు రోజులైనా పంట ఇంకా నీటిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామానికి చెందిన కసిబిసి వెంకటేశ్వర్లదీ ఇదే పరిస్థితి. అయితే ఇతను 20 ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేయగా, పంట నీట మునిగింది. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, జొన్న, వేరుశనగ, తమలపాకు, అరటి, బొప్పాయి, పసుపు తదితర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఎన్యుమరేషన్ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కోత దశ సమయంలో పూర్తిగా నీట మునిగి మొలకలెత్తాయి. గింజ ధాన్యం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కర్షకులు కంటతడ పెడుతున్నారు. » నంద్యాల జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగానికి సగం పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వరి, వేరుశనగ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. పరిహారం పరిహాసం! మోంథా తుపాను వల్ల కలిగిన నష్టంకన్నా, ప్రభుత్వం రైతులకు పెడుతున్న కష్టమే వారిని ఎక్కువగా బాధ పెడుతోంది. కళ్ల ముందు పంట నష్టపోయి పొలం గట్టున నీళ్లు నిండిన కళ్లతో నిలబడి తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో రైతులు చూస్తుంటే.. అధికారులు అలా వచ్చి పైపైన చూసి.. అబ్బే ఇది పరిహారం చెల్లించాల్సిన నష్టం కాదు.. దీనికి ఏమాత్రం పరిహారం రాదన్నట్లు చులకనగా చూసి వెళ్లిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యెత్తులో ఉన్న చెరుకు పంట నిలువునా నీట మునిగినా, అబ్బే ఇదొక నష్టమే కాదన్నట్లుగా అధికారులు చూస్తున్నారని వాపోతున్నారు. తుపాను పంట నష్టాన్ని లెక్కించే క్రమంలో అధికారులు ఒక ప్రామాణికతను నిర్ధారించారు. రైతు వేసిన మొత్తం పంటలో 30 శాతం నష్టం జరిగితేనే దానికి పరిహారం ఇవ్వదగిందిగా లెక్కలోకి వేస్తున్నారు. అంతకన్నా తక్కువ నష్టం జరిగితే పైసా కూడా పరిహారం రాదు. ఈ మేరకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బీమా సంస్థల నుంచి ఏమాత్రం పరిహారం వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం దయతలచి ఇచ్చే సాయం తప్ప, దర్జాగా రైతులకు దక్కే బీమా పరిహారం ఇప్పుడు దక్కకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. దీంతో ఏదైనా విపత్తుల్లో పంటలకు నష్టం వస్తే సదరు బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కింద పరిహారం చెల్లించేవి. ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మొత్తం 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా రూపంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీమా చెల్లించకపోవడంతో కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే సదరు బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడంతో కేవలం 19 లక్షల మందికి మాత్రమే అరకొరగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మిగతా వారు పూర్తిగా నష్టపోయినట్లే అని అధికారులే స్పష్టంచేస్తున్నారు. పరిహారం వస్తుందో రాదో... మొక్కజొన్న పొత్తులు కోసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాం. ఈలోగా వర్షం వచ్చి మొత్తం పొత్తులను తడిపేసింది. రంగుమారిపోయి నాణ్యత తగ్గిపోయాయి. వీటిని కొనుగోలు చేస్తారో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పంట నష్టానికి పరిహారం వస్తుందో రాదో తెలియదు. అంతా దైవా«దీనం. వేసిన పంటలు చేతికి వచ్చేవరకు నమ్మకంలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే భయంగా ఉంది. – చందక నారాయణమ్మ, పెరిపి గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా పశువుల మేతగా అయినా పనికొస్తుందని.. ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరింది. విత్తనం నుంచి దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు వరకు ఖర్చయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మాయదారి తుపాను వచ్చింది. వర్షాల వలన రోజుల తరబడి పొట్టల పైవరకు నీరు నిలిచిపోయింది. వరి వెన్నులు కుళ్లిపోతుండటంతో నీరు లాగగానే పైరు పడిపోతుంది. కంకులు తాలుగా మారిపోతాయి. పశువులకు మేతగా అయినా పనికొస్తుందని ఇప్పుడే కోసేస్తున్నాం – పెంటపాటి త్రిమూర్తులు, తాడేరు, భీమవరం రూరల్, ప.గోదావరి జిల్లా వ్యవసాయం అంటేనే వణుకు పుడుతోంది ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యవసాయం చేయాలంటేనే వణుకు పుడుతోంది. పంట పండించే వరకు ఎరువుల కోసం పాట్లు పడవలసి వచ్చింది. చేలో వేద్దామంటే యూరియా కూడా దొరకలేదు. అదేదో గట్టెక్కామనుకుంటుంటే పంట వచ్చిన సమయంలో పొలాన్ని ముంపు నీరు ముంచేసింది. సొంత పొలం రెండు ఎకరాలు, తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గింజ గట్టిపడుతున్న సమయంలో ముంపునకు గురై, నీటిలో నిండిపోయింది. రూ.10 వేలు అయినా చేతికొస్తుందో లేదో. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం కౌలు రైతుకు ఏమీ లేవు దేవుడు మాన్యం రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నా. స్వర్ణ రకం సాగు చేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికివచ్చే తరుణంలో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు అంతా తారుమారైంది. కౌలురైతు కావడంతో ఎలాంటి సాయం దక్కదని ఆందోళనగా ఉంది. ఏ అధికారీ ఇప్పటి వరకు పొలం వైపు రాలేదు. – సీమల జానరాజు, చిన్న రైతు, పెదపాడు, ఏలూరు జిల్లా రైతు పరిస్థితి దయనీయం నాకు సెంటు పొలం లేదు. స్టూవర్టుపురం రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. ఎకరాకు రూ.10 వేల చొప్పున ముందే రూ.లక్ష చెల్లించాను. ఇప్పటికీ పైర్లు నాట్లువేసి 70 రోజులు అయ్యింది. ఒక్కో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చుచేశాను. 10 ఎకరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పొలం మొత్తం నీటిలో మునిగింది. మాలాంటి రైతుల పరిస్థితి దయనీయం. – కుంచాల లక్ష్మారెడ్డి, బేతపూడి, బాపట్ల జిల్లా పెట్టుబడీ రాదు ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు మద్దిపాటి హరే రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులు, వర్షాలకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. 7 ఎకరాల్లో పంట నేల కొరిగింది. ఇప్పటికే పంట సాగుకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి గింజ గట్టిపడే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ప్రకృతి కన్నెర్ర చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిగింది. ప్రస్తుతం ఆ వరి పనలు కట్టేందుకు ఎకరానికి మరో రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మరో రూ.70 వేలు అదనపు భారం పడుతోంది. దీంతోపాటు ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందుతుందని భావిస్తే.. ప్రస్తుతం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి రోజూ 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలి ఇచ్చి పనలు కట్టిస్తున్నారు. మొక్క బతుకుతుందో లేదో.. ఈ రైతు పేరు చాగంరెడ్డి రామకోటి రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ దశలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పైరు నీట మునిగింది. ఒక రోజంతా కష్టపడి ఇంజిన్లతో పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపాడు.రెండవ రోజు నేలవాలిన మొక్కలను పైకి లేపుతున్నారు. మూడవ రోజు బలం మందులు పిచికారీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రైతుకు ఎకరాకు సుమారు రూ. 60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. కౌలు అదనం. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లు, ఎరువుల ఖర్చు అదనం. ఇంతా చేసినా మొక్క బతుకుతుందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. పడిపోయిన చేను కోసేస్తున్నాడు ఈ రైతు పేరు చప్పగడ్డి నాగేశ్వరరావు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామం. 1.20 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆర్ఆర్ వరి రకం వేయడంతో త్వరగా పండేసింది. మరో పది రోజుల్లో కోత కోయాలనుకునేలోపే తుపాను దెబ్బతో పంట మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. నిన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి చూసి ఫొటో తీసుకుని వెళ్ళిపోయింది. పరిహారం ఇస్తారో లేదో ఎవరూ చెప్పడం లేదు. నేలకొరిగిన పొలాన్ని కోసేస్తున్నాడు. కోసి ఎండ పెడితే ఏదో కొద్దిగానైనా ధాన్యం చేతికొస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, పొలాన్ని చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశలన్నీ వరదపాలుఈ రైతు పేరు మేర్నిడి గంగరాజు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం. 8వ ఏట నుంచే వ్యవసాయం పనుల్లో ఉన్నాడు. రెండు ఎకరాలు సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించడంతో వరిచేలు ఈనిక పూర్తయి గింజ తోడుకునే దశకు చేరుకుంది. ఈ సమయంలో మోంథా తుపాను నట్టేట ముంచేసింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నేలనంటేసింది. గింజ పాలు తోడుకునే దశలో ఉండడంతో పువ్వారం రాలిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెబుతున్నాడు. అంచనాలో సగం దిగుబడి కూడా రాదని వాపోతున్నాడు.
ఎకరానికి రూ. 10 వేలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరదల్లో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేలు, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత కాలనీలు సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్షణమే నివేదికలు ఇవ్వండి.. తుపాను ప్రభావంపై వెంటనే పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో 12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉంది. ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు అక్కడి కలెక్టర్లతో సత్వరం సమీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలి. వరదలు తగ్గుముఖం పట్టినందున వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. చెత్తను తొలగించి, శానిటేషన్ చేయాలి. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలి. వరదల వల్ల మరణించినవారి జాబితాలను పారదర్శకంగా ఇచ్చేలా పోలీసు శాఖ వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదుచేసి నివేదికలు అందించాలి.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తాం. వరదల వల్ల మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.5 వేలు, పెద్ద పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు ఇచ్చేలా పశుసంవర్ధక శాఖ నివేదికలు పంపాలి. పత్తి, వరి చేతికి వచ్చే ముందు నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. నీట మునిగిన పంటతోపాటు ఇసుక మేటలు వేసిన ప్రాంతాల బాధిత రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు సాయం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. ఇల్లు మునిగినవారికి రూ.15 వేలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.వరదలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాలి. అర్హులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చే అంశంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. వరద ప్రాంతాలపై అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మరోసారి సమీక్ష నిర్వహిస్తాం’అని సీఎం తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఎన్ని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారన్న వివరాలు కూడా చూస్తామని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలేదని అన్నారు.ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాగా పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా ఉంటాయని తెలిపారు. వరదలపై వెంటనే పూర్తి నివేదికలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం పంపుతామని, ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీటి నిర్వహణపై నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలాల కబ్జాదారులపై ఉక్కుపాదం.. వరంగల్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే తరచూ వరదలు వస్తున్నాయని సీఎం అన్నారు. చెరువులోకి వెళ్లే నాలాలు కబ్జాకు గురైతే ఆ కబ్జాలను తప్పక తొలగించాలని ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, పదిమంది కోసం పదివేల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాందించుకున్న ఇంటి సామగ్రి, పిల్లల సరి్టఫికెట్లు వంటి కీలక వస్తువులు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీ వేయాలని ఆదేశించారు. కాలనీవాసుల గోడు విన్న సీఎంసమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీల్లో పర్యటించిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. బాధితులు సీఎంకు తమ సమస్యలు ఏకరువు పెట్టగా.. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద నష్టంపై హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటోల ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.
దబంగ్ ధమాకా
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ మరోసారి విజేతగా నిలిచింది. 12వ సీజన్లో ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 2 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ రెండోసారి టైటిల్ సాధించింది. శుక్రవారం ఇక్కడి త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఢిల్లీ జట్టు 31–28తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. 2021–22లో ఎనిమిదో సీజన్లో తొలి సారి దబంగ్ ఢిల్లీ చాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుత హెడ్ కోచ్ జోగిందర్ నర్వాల్ అప్పుడు కెప్టెన్. అతని సారథ్యంలో కూడా పాయింట్ తేడాతోనే (37–36) పట్నా పైరేట్స్‌ను ఓడించి టైటిల్ సాధించింది. తాజా ఫైనల్లో దబంగ్ రెయిడర్లు నీరజ్ నర్వాల్ (9), అజింక్యా పవార్ (6) అదరగొట్టారు. 12 సార్లు కూతకెళ్లిన నీరజ్ 2 బోనస్ సహా 8 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను విజయవంతంగా టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. అజింక్యా కూడా 12 సార్లు కూతకెళ్లి 6 సార్లు పాయింట్లతో వచ్చాడు. డిఫెండర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ టాకిలింగ్తో చేయలేకపోయినా రెయిడింగ్తోనే ఢిల్లీ టైటిల్‌ను మళ్లీ సాకారం చేసుకుంది. డిఫెండర్లలో సౌరభ్, సుర్జీత్ సింగ్ చెరో 2 పాయింట్లే చేయగలిగారు. ప్రత్యర్థి పుణేరి జట్టులో రెయిడర్ ఆదిత్య షిండే (10) జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన ఆదిత్య 10 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. మరో రెయిడర్ పంకజ్ మోహిత్ 4 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. డిఫెండర్లలో అభినేశ్ నటరాజన్ (4), గౌరవ్ ఖత్రి (3) మెరుగ్గా ఆడారు. 2023–24 చాంపియన్ పుణేరి రెండోసారి విజేతగా నిలవాలని భావించగా, ఫైనల్ ఓటమితో రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2022 ఫైనల్లో పుణేరి పల్టన్‌పై గెలుపొందడం ద్వారానే జైపూర్ పింక్‌పాంథర్స్ పీకేఎల్‌లో రెండో సారి చాంపియన్‌షిప్ సాధించింది. జైపూర్లానే ఇప్పుడు ఢిల్లీ కూడా పల్టన్‌ను పల్టీ కొట్టించి రెండో టైటిల్‌తో పండగ చేసుకుంది.
‘తాత్కాలిక సంధి’ కాలం!
ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు దక్షిణ కొరియాలోని బూసాన్‌లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్‌లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. ఈ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్పింగ్లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్‌తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్విడియా కంపెనీ చిప్‌లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్వెల్ చిప్‌ల విషయం చర్చకు రాలేదంటున్నారు.అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్‌ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్‌ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్‌పింగ్‌తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్‌లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ఇక.. ఆలయ భూముల వంతు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒకరకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీచేసింది. దేవదాయ శాఖకు సంబం«ధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దేవదాయశాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజినీరు, ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవదాయశాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ఈ కమిటీలో ఉంటారని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో దేవదాయశాఖ పరి«ధిలో ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాల భూములున్నాయి. వీటిలో 4,244 ఎకరాలకుపైగా అత్యంత విలువైన భూములు పట్టణాల్లో ఉన్నాయి. ఇవి 1.55 కోట్ల చదరపు గజాల ఖాళీ భూములుగాను, 50 వేల చదరపు గజాల కట్టడాలుగాను ఉన్నాయి. అంటే మొత్తం 2.05 కోట్ల చదరపు గజాలు. ఈ ఏడాది మే నెలలో ఇలాంటిదే ఒక జీవో దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆలయ భూములను లీజుకివ్వాలంటే.. వేలం పాట నిర్వహించి, హెచ్చుపాటదారుకి నిర్ణీత మొత్తానికి ఇవ్వాలి. లీజు గడువు ముగియగానే మళ్లీ వేలం నిర్వహించాలి. దీనికి తూట్లు పొడుస్తూ 20 సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సేవాకార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వ్యవసాయేతర ఆలయ భూములను బహిరంగ వేలంతో సంబంధం లేకుండానే లీజు రూపంలో ఇవ్వడం లేదా పొడిగించడానికి వీలుగా దేవదాయశాఖ నిబంధనల్లో మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మే 2వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి సహా భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘దీన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సినవాళ్లకు ఆలయ భూములు కట్టబెట్టడానికి ఈ ఉత్తర్వులు పనికొస్తాయి. న్యాయపరంగా కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది..’ అని అప్పట్లో ఆయా భక్తసంఘాలు సోషల్ మీడియా వేదికలపై పేర్కొన్నాయి. ఈ అంశంపై అప్పట్లో సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్.. ప్రజల నుంచి అభ్యంతరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై పరిశీలన ప్రక్రియలోనే ఆగిపోయింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఆలయభూములను కూడా లీజుకిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం జీవో జారీచేయడాన్ని భక్త సమాజం తప్పుపడుతోంది. ఇలాంటి జీవోలు ప్రభుత్వం అనుకున్న వారికి నామమాత్రం ధరకు కావాల్సినంత కాలం లీజుకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని, తద్వారా ఆలయాల మనుగడ ప్ర«శ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి తలరాత మారుస్తారో?
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్‌లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. మైనారిటీ వంతెన దాటాల్సిందే.. బిహార్‌లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్‌గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్‌గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు. గత ఎన్నికలే గుణపాఠం 2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్‌బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాధామన్‌లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్‌కు ఉన్న అయిష్టత మరో కారణం. ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది. చీలికపై నితీశ్ ఆశలు..! నితీశ్ కుమార్ ‘మహాగఠ్‌బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందిఎంఐఎం ఆత్మగౌరవ నినాదం ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్‌లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
‘వీసా-1బీ వీసా ఫీజు తగ్గించాలి.. భారతీయులే కీలకం’
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్‌ఐడీలు!
కరూర్ ఘటన.. తప్పు 'విజయ్'ది మాత్రమే కాదు: అజిత్
కొత్త పింఛన్ ఏదీ బాబూ..?
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
శ్రీవారి కల్యాణకట్టలో ఆకతాయికి దేహశుద్ధి
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ అన్నీ క్లోజ్
మహీంద్రా ఈఎస్‌యూవీకి శాంసంగ్ డిజిటల్ కీ
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
బంగారం జాక్‌పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
..ఆగవయ్యా! వరద అంచనా కోసం వచ్చాం.. ఆదుకోవడానికి కాదు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ట్రంప్‌కి ఊహించని ఎదురుదెబ్బ!
ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగం
అన్ని తిట్లు సార్నే తిడితే ఎలాగయ్యా! కోన్ని తిట్లు వ్యవస్థను కూడా తిట్టు!
‘అమ్మానాన్నలకు విడాకుల సలహా ఇచ్చింది నేనే’
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో మీకు తెలీదు!
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
మొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు ఆవిష్కరణ!
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు
‘వీసా-1బీ వీసా ఫీజు తగ్గించాలి.. భారతీయులే కీలకం’
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్‌ఐడీలు!
కరూర్ ఘటన.. తప్పు 'విజయ్'ది మాత్రమే కాదు: అజిత్
కొత్త పింఛన్ ఏదీ బాబూ..?
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
శ్రీవారి కల్యాణకట్టలో ఆకతాయికి దేహశుద్ధి
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ అన్నీ క్లోజ్
మహీంద్రా ఈఎస్‌యూవీకి శాంసంగ్ డిజిటల్ కీ
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
బంగారం జాక్‌పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
..ఆగవయ్యా! వరద అంచనా కోసం వచ్చాం.. ఆదుకోవడానికి కాదు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ట్రంప్‌కి ఊహించని ఎదురుదెబ్బ!
ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగం
అన్ని తిట్లు సార్నే తిడితే ఎలాగయ్యా! కోన్ని తిట్లు వ్యవస్థను కూడా తిట్టు!
‘అమ్మానాన్నలకు విడాకుల సలహా ఇచ్చింది నేనే’
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో మీకు తెలీదు!
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
మొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు ఆవిష్కరణ!
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
సినిమా
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.
హైదరాబాద్‌కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
టాలీవుడ్ సినిమాకు ఉన్న క్రేజే వేరు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే రాజమౌళి బాహుహలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. అందుకే మన తెలుగు సినిమాలంటే ఫారినర్స్ కూడా పడి చచ్చిపోతారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే పుష్ప మేనరిజంతో అలరిస్తాడు. తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో నితిన్ రాబిన్‌హుడ్ మూవీలో కెమియో పాత్రలో సందడి చేశాడు.అంతలా తెలుగు సినిమాలకు ఫారినర్స్ ఫిదా అవుతున్నారు. డేవిడ్ వార్నర్ లాగే ఎప్పటి నుంచో స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ దంపతులు మన చిత్రాలకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొత్త సినిమాలో ఏ హిట్ సాంగ్ వచ్చినా వీరిద్దరు కలిసి రీల్ చేయాల్సిందే. అలా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టు సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాకుండా పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.తాజాగా మరో టాలీవుడ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అంటూ సాగే పాటతో అలరించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం మూవీలో ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇటీవల రిలీజైన కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. కర్ల్ స్వాన్బెర్గ్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్.. మీరిద్దరు హైదరాబాద్‌కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియన్స్ కంటే మీ వీడియోలే బాగుంటాయని మరికొందరు కొనియాడుతున్నారు. మీ ఇద్దరికి ఆధార్, పాన్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అంటూ మరో నెటిజన్స్ భరోసానిస్తూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా మన తెలుగు సినిమాకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg)
మహేశ్‌తో సందీప్ సినిమా?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి తెరపైకి వచ్చింది.‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, మహేశ్‌బాబు–సందీప్ రెడ్డిల కాంబినేషన్లో ఓ సినిమా రూపోందేందుకు సన్నా హాలు మొదలయ్యాయని భోగట్టా. ఇక ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’తో మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి. ఇలా మహేశ్, సందీప్ తమ ప్రస్తుత ్రపాజెక్ట్లను పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
'దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ కాదు'.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్!
అలనాటి అందాల భామ, బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి చాలా రోజుల తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 24 ఏళ్ల పాటు విదేశాల్లో ఉన్న నటి.. ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సన్యాసిగా మారి బ్యూటీ మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన కోసం గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా మమతా వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ మమతా ఎలాంటి కామెంట్స్ చేసింది? అవీ వివాదానికి ఎందుకు దారితీశాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం టెర్రిరిస్ట్ కాదంటూ క్లీన్ చీట్ ఇచ్చిపడేసింది మమతా కులకర్ణి. అతను ముంబయిలో పేలుళ్లకు పాల్పడలేదంటూ కామెంట్స్ చేసింది. అతను ఎలాంటి బాంబు బ్లాస్ట్ చేయలేదని.. దేశ ద్రోహి కాదంటూ మాట్లాడింది. మమతా కామెంట్స్ కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.దీంతో హీరోయిన్ మమతా కులకర్ణి తన వ్యాఖ్యలపై స్పందించింది. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడింది.. దావూద్ ఇబ్రహీం గురించి కాదు.. విక్కీ గోస్వామి గురించి అని తెలిపింది. దావూద్ నిజంగా ఉగ్రవాదినే అని వెల్లడించింది. కాగా.. గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో అరెస్టైన గోస్వామికి.. ఈమెతో రిలేషన్ ఉంది.దావూద్‌ను నేనెప్పుడు కలవలేదు..అంతేకాకుండా తాను దావూద్‌ను ఎప్పుడూ కలవలేదని.. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. నాకు ఇప్పుడు రాజకీయాలతో కానీ.. సినిమా పరిశ్రమతో కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మికతపై అంకితభావంతో ఉన్నానని పేర్కొంది. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కాగా.. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌కు పారిపోయాడు. రెండు దశాబ్దాలకు పైగా కరాచీలో నివసిస్తున్నట్లు సమాచారం.మమతా కులకర్ణి సినీ జీవితం1990ల ప్రారంభంలో మమతా కులకర్ణి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. క్రాంతివీర్, కరణ్ అర్జున్, చైనా గేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2002లో నటనకు పూర్తిగా స్వస్తి పలికింది. 2016లో, థానే పోలీసులు ఆమెను 2 వేల కోట్ల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2024లో ఆమెపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మమతా సన్యాసిగా జీవనం సాగిస్తోంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్‌పై తీవ్ర ప్రభావం
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
కోస్తాకు ‘మోంథా’ తుపాను గండం..
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
క్రీడలు
తిప్పేసిన రషీద్ ఖాన్
హరారే: స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతితో విజృంభించడంతో జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టికరిపించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 19.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. బ్రెండన్ టేలర్ (3), మయెర్స్ (6), బెనెట్ (16), ర్యాన్ బుర్ల్ (10), మున్యోంగా (19), ముసెకివా (13), ఇవాన్స్ (12) విఫలమయ్యారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ముజీబ్, అబ్దుల్లా అహ్మద్జాయ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (51 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... అజ్మతుల్లా ఓమర్జాయ్ (13 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు. వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), డార్విస్ రసూలి (17) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నామమాత్రమైన చివరి టి20 జరగనుంది.
దబంగ్ ధమాకా
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ మరోసారి విజేతగా నిలిచింది. 12వ సీజన్లో ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 2 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ రెండోసారి టైటిల్ సాధించింది. శుక్రవారం ఇక్కడి త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఢిల్లీ జట్టు 31–28తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. 2021–22లో ఎనిమిదో సీజన్లో తొలి సారి దబంగ్ ఢిల్లీ చాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుత హెడ్ కోచ్ జోగిందర్ నర్వాల్ అప్పుడు కెప్టెన్. అతని సారథ్యంలో కూడా పాయింట్ తేడాతోనే (37–36) పట్నా పైరేట్స్‌ను ఓడించి టైటిల్ సాధించింది. తాజా ఫైనల్లో దబంగ్ రెయిడర్లు నీరజ్ నర్వాల్ (9), అజింక్యా పవార్ (6) అదరగొట్టారు. 12 సార్లు కూతకెళ్లిన నీరజ్ 2 బోనస్ సహా 8 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను విజయవంతంగా టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. అజింక్యా కూడా 12 సార్లు కూతకెళ్లి 6 సార్లు పాయింట్లతో వచ్చాడు. డిఫెండర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ టాకిలింగ్తో చేయలేకపోయినా రెయిడింగ్తోనే ఢిల్లీ టైటిల్‌ను మళ్లీ సాకారం చేసుకుంది. డిఫెండర్లలో సౌరభ్, సుర్జీత్ సింగ్ చెరో 2 పాయింట్లే చేయగలిగారు. ప్రత్యర్థి పుణేరి జట్టులో రెయిడర్ ఆదిత్య షిండే (10) జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన ఆదిత్య 10 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. మరో రెయిడర్ పంకజ్ మోహిత్ 4 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. డిఫెండర్లలో అభినేశ్ నటరాజన్ (4), గౌరవ్ ఖత్రి (3) మెరుగ్గా ఆడారు. 2023–24 చాంపియన్ పుణేరి రెండోసారి విజేతగా నిలవాలని భావించగా, ఫైనల్ ఓటమితో రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2022 ఫైనల్లో పుణేరి పల్టన్‌పై గెలుపొందడం ద్వారానే జైపూర్ పింక్‌పాంథర్స్ పీకేఎల్‌లో రెండో సారి చాంపియన్‌షిప్ సాధించింది. జైపూర్లానే ఇప్పుడు ఢిల్లీ కూడా పల్టన్‌ను పల్టీ కొట్టించి రెండో టైటిల్‌తో పండగ చేసుకుంది.
‘ఆస్ట్రేలియా స్కోరు చూసి భయపడలేదు’
ముంబై: ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి తాము ఏ దశలోనూ భయపడలేదని, సాధించగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగామని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఈ పోరులో 134 బంతుల్లో 127 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో జెమీమా మన జట్టును గెలిపించింది. ‘ఆ్రస్టేలియా జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు, చివరకు వారు సాధించిన స్కోరును చూస్తే కనీసం 30 పరుగులు తక్కువగా చేశారని చెప్పగలను. డీవై పాటిల్ స్టేడియం పిచ్‌పై ఎలాంటి లక్ష్యమైనా ఛేదించవచ్చని మాకు బాగా తెలుసు. కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని కూడా మాకు ఇక్కడ ఉన్న అనుభవం చెబుతుంది. అందుకే ముందు పట్టుదలగా నిలబడటంపైనే దృష్టి పెట్టాను’ అని జెమీమా వ్యాఖ్యానించింది. తాను, హర్మన్ కలిసి మ్యాచ్‌ను ముగించాలని గట్టిగా అనుకున్నామని...అయితే హర్మన్ అవుట్‌తో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొంది. ‘ఒక దశలో నేను బాగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోతూ వచ్చాను. అయితే హర్మన్ అవుట్ కావడంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది. ఇది ఒక రకంగా నాకు మేలు చేసింది. ఆమె పరుగులు కూడా నేను చేయాల్సి ఉందని అనిపించింది. దాంతో మళ్లీ సరైన స్థితికి వచ్చి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను’ అని జెమీమా చెప్పింది.
ఫిడే ప్రపంచ కప్‌లో పాల్గోనున్న రాజా రిత్విక్
గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ పాల్గోనున్నాడు. రిత్విక్ మొదటి రౌండ్లో కజకిస్థాన్‌కు చెందిన నోగర్బెక్ కాజిబెక్‌తో తలపడనున్నాడు. . ఈ ఇద్దరు ఆటగాళ్లు నవంబర్ 1, 2 తేదీలలో రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడతారు. ఒకవేళ రెండు రౌండ్ల తర్వాత పాయింట్లు సమానమైతే ఈ ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు నవంబర్ 3న రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టై-బ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు.ఇక ప్రపంచ కప్‌లో పాల్గొనడం పట్ల రాజా రిత్విక్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడనుండడం తన స్కిల్స్‌కు నిజమైన పరీక్ష అని రిత్విక్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 80 దేశాల నుంచి మొత్తం 208 మంది చెస్ ఆటగాళ్లు భాగం కానున్నారు. అయితే భారత్ నుంచి మొత్తం 24 మంది ప్లేయర్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బిజినెస్
పట్టాలు కాదు.. పనిలో నైపుణ్యం కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ తెలిపారు. సంప్రదాయ డిగ్రీలకు బదులు సంభాషణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు. మారుతున్న వాతావరణం నేపథ్యంలో యాజమాన్యాలు ప్రత్యక్ష నైపుణ్యాలు, అప్పగించిన పనిని వేగంగా చేయగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో చూస్తున్నట్టు తెలిపారు. సంభాషణ, క్రిటికల్ థింకింగ్, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, ఉద్యోగం చేయడానికి సన్నద్ధతపై ఉద్యోగార్థులు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. డేటా ఆధారిత సామర్థ్యాల గుర్తింపు, ఇంటర్న్‌షిప్‌లు, చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా వారి సన్నద్ధతను యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా సంస్థలతో కలసి కరిక్యులమ్ రూపొందించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా నైపుణ్యాల కొరత నేపథ్యంలో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయంతో గ్రాడ్యుయేట్లు పని ప్రదేశాల్లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఐఎన్‌ఏఈ–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు.. పరిశోధన, ఆవిష్కరణలపై ఐఐటీ హైదరాబాద్–రెనెసెస్ మధ్య భాగస్వామ్యాలను శర్మ ప్రస్తావించారు. ప్రభుత్వం సైతం ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని.. నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని కింద 2023–24లో 9.3 లక్షల అభ్యర్థులను చేరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 46 లక్షల మంది అప్రెంటిస్íÙప్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.
టెక్స్టైల్స్, రత్నాభరణాల ఎగుమతుల్లో వైవిధ్యం
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమెరికా కాకుండా ఇతర మార్కెట్లకు మెరుగుపడినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. యూఏఈ, వియత్నాం, బెల్జియం, సౌదీ అరేబియాకు ఈ రంగాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఆసియా, యూరప్, పశి్చమాసియా దేశాల్లో డిమాండ్ భారత ఎగుమతులకు కలిసొస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల (రొయ్యలు, చేపలు తదితర) ఎగుమతులు 15.6 శాతం పెరిగి 4.83 బిలియన్ డాలర్లకు చేరాయి. 1.44 బిలియన్ డాలర్లతో అమెరికా భారత సముద్ర ఉత్పత్తులకు ఈ కాలంలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ కాలంలో వియత్నాంకు 100 శాతం, బెల్జియంకు 73 శాతం, థాయిలాండ్‌కు 54 శాతం చొప్పున క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు పెరిగాయి. చైనాకు 10 శాతం, మలేసియాకు 64 శాతం, జపాన్‌కు 11 శాతం వరకు ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల అమెరికా తదిర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఎగుమతులు విస్తృతం కావడం వల్ల టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించే వెసులుబాటు లభిస్తుంది. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ కాలంలో టెక్స్టైల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 1.23 శాతం పెరిగి 28 బిలియన్ డాలర్లకు చేరాయి. యూఏఈకి ఎగుమతులు అత్యధికంగా 8.6 శాతం పెరిగి 136.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నెదర్లాండ్స్‌కు 12 శాతం, పోలండ్‌కు 24 శాతం, స్పెయిన్‌కు 9 శాతం, ఈజిప్‌్టకు 25 శాతం చొప్పున టెక్స్టైల్స్ ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇక రత్నాభరణాల ఎగుమతులు సైతం 1.24 శాతం పెరిగి 22.73 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఈకి 38 శాతం అధికంగా 1.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దక్షిణ కొరియాకు 134 శాతం, సౌదీ అరేబియాకు 68 శాతం, కెనడాకు 41 శాతం చొప్పున రత్నాభరణాల ఎగుమతులు పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.
రూ.28 లక్షల స్ట్రీట్‌ఫైటర్ వీ4: దీని గురించి తెలుసా?
మల్టీస్ట్రాడా V2 & పానిగేల్ V2లను లాంచ్ చేసిన తర్వాత, డుకాటి 2026 స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 28.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేట్ డిజైన్, పెద్ద వింగ్లెట్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.2026 స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైక్ 1,103cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 214 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా బ్రెంబో మాస్టర్ సిలిండర్‌తో జత చేసిన బ్రెంబో టాప్-స్పెక్ హైప్యూర్ కాలిపర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్‌కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!ఈ బైక్ పూర్తిగా కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. 15.8-లీటర్ ఇంధన ట్యాంక్.. సీటును కలిసే చోటు వరకు విస్తరించి ఉంటుంది. బాడీ-రంగు వింగ్లెట్లు ఉన్నాయి. 6.9 ఇంచెస్ TFT డాష్.. బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలియజేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం గరిష్టంగా రూ. 1200 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1800లకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి 600 రూపాయలు పెరిగిందన్న మాట. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎలా ఉంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1800 పెరిగి రూ. 1,23,280 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగి రూ. 123430 వద్ద ఉంది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ల రేటు రూ. 1600 పెరిగి రూ. 1,13,150 వద్ద ఉంది.చెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం స్థిరంగా ఉన్న రేటు సాయంత్రానికి కూడా స్థిరంగానే ఉంది. ఇక్కడ 10 గ్రామ్స్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,280 వద్ద ఉండగా.. 10 గ్రామ్స్ 24 క్యారెట్ల రేటు రూ. 1,13,000 వద్దనే ఉంది.వెండి ధరలువెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 1,65,000 వద్ద ఉంది. అంటే ఒక గ్రామ్ సిల్వర్ ధర 165 రూపాయలన్నమాట. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 151000 వద్ద నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర కొంత తక్కువే అని తెలుస్తోంది.
ఫ్యామిలీ
వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!
అనగనగా దోల్ కోతర్ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది?ప్రధాన్‌మంత్రీ గ్రామ్ సడక్ యోజన ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామంలో కొత్తగా ఒక రోడ్డు నిర్మించాలనుకున్నారు. దారి మధ్యలో చేతి పంపు ఉంది. గ్రామ నీటి అవసరాలకు ఇదే ఆధారం.చేతి పంపును తీసేసి రోడ్డు నిర్మించడం సరికాదు అనుకున్న కాంట్రాక్టర్, ప్రత్యేక నిర్మాణంతో పంప్‌ను అలాగే ఉంచి, కొత్త రోడ్డు నిర్మించాడు.అయితే కథ సుఖాంతం కాలేదు. కాస్త సరదాగా చె΄్పాలంటే దుఃఖాంతం అయింది! గోతిలో హ్యాండ్ పంప్ ఉందని తెలియని వాహనదారులు అందులో పడి΄ోయి గాయాల ΄ాలవుతున్నారు. పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ అందులో పడి΄ోతున్నారు.‘ఇదెక్కడి పంప్ రా బాబూ’ అని గ్రామ ప్రజలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. ఈ రోడ్డు పంప్ వ్యవహారం ఊరు దాటి, జిల్లా దాటి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. సురక్షితమైన మరో చోట హ్యాండ్ పంప్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నెటిజనులు మాత్రం ‘రోడ్డు మధ్యలో ఉన్న దేశంలోని తొలి హ్యాండ్‌పంప్’ అని కామెంట్స్ పెడుతున్నారు! (చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..)
ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..
నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు. వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్‌కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్‌లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ‘వాకథాన్‌లు’ – ‘వాకింగ్ మారథాన్ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్‌లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్‌లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్‌లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్‌లు కూడా పెరిగాయి. ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్లకు థీమ్స్‌గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్‌లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్‌లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు. వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. వాకథాన్‌లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్‌లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. ‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్ వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్‌ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్‌గా పాల్గొంటారు. తమ వాకథాన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. బహుళ వాకథాన్‌లు.. బహుళ వాకథాన్‌లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్‌ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్థానర్లు అంటున్నారు. ఓపికకు పరీక్ష.. ‘వాకథాన్‌లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. కానీ వాకథాన్‌ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్‌ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు. (చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు)
ఎనిమిది పదుల వయసులో.. జాతీయ స్థాయి ఈత పోటీల్లో ప్రతిభ
ఎనిమిది పదుల వయసులో ఎంతో చలాకీగా ఈత కొడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదు పదుల సంఖ్యలో పతకాలు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయి ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతున్నాడు నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి. వ్యాయామం చేయడానికి కూడా బద్దకించే అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. – కూకట్పల్లి నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ –6లో నివాసముండే కే.లక్ష్మారెడ్డి(79) జాయతీ స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ఎనిమిది పదుల వయసులోనూ ఇటీవల (అక్టోబర్–11,12) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో 25, 50 మీటర్ల కేటగిరీలో రెండు ప్రథమ బహుమతులు సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. అదే పోటీల్లో 50, 100 మీటర్ల ఈత పోటీల్లోనూ రెండు ద్వితీయ పతకాలు, మిడ్లే పోటీలో ప్రథమ బహుమతి, రిలే పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి వివిధ కేటగిరీల్లో ఒకే సారి ఏకంగా ఆరు పతకాలు కైవసం చేసుకున్నాడు. 65వ ఏట నుంచి.. లక్ష్మారెడ్డి తన 65వ ఏట నుంచి ఈత పోటీల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్, నాందేడ్, కర్నూలు, కూకట్‌పల్లిలో నిర్వహించిన వివిధ కేటగిరిలో ఇప్పటికి 21 పతకాలను సాధించి, ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ యువతకు, తన తోటి వయసు వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యానికి నిత్యం సాధన.. ప్రతి రోజూ స్థానికంగా ఉండే స్విమ్మింగ్ పూల్‌లో ఈత ప్రాక్టీస్ చేస్తుంటారు. ముగ్గురు పిల్లలు ఉద్యోగాల రీత్యా ఒకరు విదేశాల్లో, మిగిలిన వారు బెంగళూరులో ఉంటున్నారు. భార్యతో పాటు కేపీహెచ్బీలో ఉంటూ స్థానికంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుట్టుపక్కల ఆసక్తి కలిగిన పిల్లలకు కూడా ఈత నేర్పిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు గానీ, లేదా ఈత గానీ సాధన చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మా రెడ్డి స్వస్థలం కృష్ణాజిల్లా, పెద ఓగిరాల. తన విజయాల గురించి చెబుతూ మిత్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ పోటీల్లో పాల్గొంటున్నానని వివరించారు.ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
పంట పొలాలకు బాలీవుడ్ పాటలు వినిపిస్తాడు!
మధ్యప్రదేశ్‌కు చెందిన యువ రైతు ఆకాష్ చౌరాసియ (Akash Chaurasia) ప్రతిరోజు ఉదయం తన ΄పొలానికి వెళతాడు. ‘వెళ్లి ఏం చేస్తాడు?’ అనే ప్రశ్నకు ‘ఇంకేమి చేస్తాడు. ΄ పొలం పనులు’ అంటే పప్పులో కాలేసినట్లే.అతడు వెళ్లేది పంట΄ పొలాలు, మొక్కలకు సంగీతం వినిపించడానికి!‘మనుషులే కాదు పంట పొలాలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి’ అంటున్న ఆకాశ్ గత పది సంవత్సరాలుగా పంట పొలాలకు సంగీతం వినిపిస్తున్నాడు. కొత్త మొక్కలు నాటినప్పుడు స్పెషల్ మ్యూజికల్ థెరపీ సెషన్లు నిర్వహించడం అనేది మరో విశేషం.‘మొక్కల ఎదుగుదలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుంది’ అంటున్నాడు ఆకాష్. ఆకాష్ మరో అడుగు ముందుకు వేసి ఆవులకు కూడా సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ‘ఆవులకు రోజూ సంగీతం వినిపించడం వల్ల గతంలో పోల్చితే అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి’ అని కూడా అంటున్నాడు. ఇదేదో బాగుంది కదూ..!ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
ఫొటోలు
హైటెక్స్‌లో అట్టహాసంగా కామికాన్ డ్రీమ్‌హాక్–2025 ఫెస్ట్ సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ -నయనిక ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
గ్రాండ్‌గా దిల్ రాజు సోదరుడి కూతురి పెళ్లి.. హాజరైన టాలీవుడ్ సినీతారలు (ఫొటోలు)
సాయిపల్లవి 'అమరన్' జ్ఞాపకాలు (ఫొటోలు)
హాఫ్ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
నెక్లెస్‌రోడ్డులో ఏక్తా రన్.. పాల్గొన్న చిరంజీవి, సజ్జనార్ (ఫొటోలు)
తిరుమలలో వైభవంగా శ్రీవారికి పుష్పయాగం (ఫోటోలు)
నారా రోహిత్, శిరీషల పెళ్లి.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
వెెకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ రాశి ఖన్నా (ఫోటోలు)
అంతర్జాతీయం
పాక్.. ఖబడ్దార్
తుర్కీయే(టర్కీ), ఖతార్‌ల మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణకు అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు తెర పడింది. ‘శాంతి కోసం ఇంకో అవకాశం..’ అంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటు తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం ఖరారు చేస్తూనే.. పాక్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాలిబాన్ తాత్కాలిక హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తమ అంతర్గత సమస్యలను ఆఫ్గానిస్తాన్‌పై మోపే ప్రయత్నాలు చేస్తే, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు ఆయన స్పష్టం చేశారు. ‘‘మీ సమస్య మీదే(తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ కార్యకలాపాల గురించి). పరిష్కారం కూడా మీ వద్దే ఉంటుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారు?.. .. ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నాం. యుద్ధ భూమిలో అఫ్గన్లు తమ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు. అలాంటిది మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు” అని ఆయన అన్నారాయన.గత కొన్నివారాలుగా పాక్-అఫ్గన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ తమ భూభాగంలో దాడులకు తెగబడుతోందని.. పౌరుల ప్రాణాలు తీస్తోందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించగా, అఫ్గన్ భూభాగంలో తలదాచుకున్న టీటీపీ ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నామని పాక్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఇరు వైపులా దాడులతో భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. ఈ మధ్యలో తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినా.. ఉల్లంఘనలు జరిగాయి. దీంతో ఖతార్, టర్కీ జోక్యం చేసుకుని ఇరుదేశాలకు ఓ ఒప్పందానికి తీసుకొచ్చాయి. నవంబర్ 6వ తేదీన ఇస్తాంబుల్ మరోమారు సమావేశమై ఒప్పందానికి తుదిరూపం దిద్దుతామని తుర్కీయే విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. గురువారం ప్రకటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టీటీపీ ఎలా పుట్టింది?.. ఆ ఒక్కడే పాక్‌ను ఎలా వణికిస్తున్నాడు?
కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..
ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘పో బయటకు..’ సోదరుడికి షాకిచ్చిన బ్రిటన్ రాజు
బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్‌ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్సోర్ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్హమ్ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రిన్స్ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఒత్తిడి మేరకు ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 27వ తేదీన లిచ్‌ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్స్టీన్ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్స్టీన్పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం.
వలసదారులపై మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను(వర్క్ పర్మిట్లు) అటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచి్చంది. దీంతో విదేశీ ఉద్యోగులు.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు–ఈఏడీ) పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై అటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు(ఈఏడీ) ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో ఈఏడీ పొడిగింపు కోసం ప్రతిఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతోపాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది. బైడెన్ నిర్ణయానికి మంగళం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(హెచ్–4 వీసాదారులు), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న ఎఫ్–1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాలవ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని జో బైడెన్ ప్రభుత్వ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడవులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్‌గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని యూఎస్ సిటిజెన్íÙప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టంచేసింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్(డాక్యుమెంటేషన్)లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. అసలు ఏమిటీ వర్క్ పర్మిట్? కొన్ని కేటగిరీల నాన్–ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్(ఈఏడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్–ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలంపాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి ఈఏడీ ఒక ఆధారం. గ్రీన్‌కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందినవారికి వర్క్ పర్మిట్‌తో అవసరం లేదు. అయితే, గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. హెచ్–1బీ వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
జాతీయం
మరో పదేళ్లు రక్షణ బంధం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్– అమెరికా కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘యూఎస్– ఇండియా మేజర్ డిఫెన్స్ పార్టనర్షిప్’పై కౌలాలంపూర్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీట్ హెగ్సెత్ శుక్రవారం సంతకాలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ (ఏషియాన్) సమావేశాల్లో భాగంగా రాజ్‌నాథ్, హెగ్సెత్ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య 2015లో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ ఏడాదితో ముగుస్తుండటంతో దాని స్థానంలో మరో పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తుంది. దీంతో ఆ దేశం నుంచి కీలకమైన రక్షణ సాంకేతికతోపాటు ఆయుధాల దిగుమతులకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి, కీలక నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి. రక్షణ బంధం ద్విగుణీకృతంతాజా ఒప్పందంతో భారత్– అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతుందని రాజ్‌నాథ్‌సింగ్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘భారత్–అమెరికా రక్షణ సంబంధాలకు ఈ డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ విధానపరంగా విస్తృతమైన మార్గదర్శనం చేస్తుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఈ ఒప్పందం ఉదాహరణ. హెగ్సెత్తో చర్చలు ఫలవంతం అయ్యాయి. రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారం ప్రధానమైనది’అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభం లాంటిదని హెగ్సెత్ తెలిపారు. సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం విషయంలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందం భారత్–అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయమని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా భారత్‌లో ఎఫ్414 జెట్ ఇంజన్ల ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందని వెల్లడించింది. రక్షణ రంగంలో సహకారంపై ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే పలు ఒప్పందాలు ఉన్నాయి. 2016లో ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్’, 2018లో కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రీమెంట్, 2020లో బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రీమెంట్ చేసుకున్నారు.
జమ్మూకశ్మీర్ పాపం కాంగ్రెస్‌దే
ఏక్తానగర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్ సమస్యకు ఆ పార్టీ తప్పిదాలే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు కశ్మీర్‌తోపాటు దేశం మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర సంస్థానాల తరహాలోనే మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలని ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ సంకల్పించగా, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అందుకు అనుమతించలేదని విమర్శించారు. శుక్రవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్లో పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌లో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ అంశంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని అన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ముక్కలైపోయిందని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పొరపాట్ల కారణంగా మన దేశం దశాబ్దాలుగా బాధలు అనుభవిస్తోందని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదానికి తల వంచుతున్న కాంగ్రెస్ ‘‘కొత్త చరిత్ర లిఖించడంలో ఒక్క క్షణం కూడా వృథా చేయొద్దని సర్దార్ పటేల్ బోధించారు. కానీ, మనం కొత్త చరిత్ర సృష్టించడానికి కష్టపడి పనిచేయాలి. అసాధ్యం అనుకున్న పనిని పటేల్ సుసాధ్యం చేశారు. 550కుపైగా సంస్థానాలను దేశంలో విలీనం చేశారు. ఆయన పాటించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు కొత్త చరిత్రను సృష్టించాయి. ‘ఒకే ఒక్క ఐక్య భారత్, అద్భుతమైన భారత్’ ఆయన స్వప్నం. దేశ సార్వబౌమత్వ పరిరక్షణకు పటేల్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచి్చన ప్రభుత్వాలు దేశ సార్వబౌమత్వాన్ని నిర్లక్ష్యం చేశాయి. పటేల్తరహాలో శ్రద్ధ చూపించలేదు. ఫలితంగా కశ్మీర్ అంశం పెద్ద సమస్యగా మారింది. ఈశాన్య భారతదేశంలోనూ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నక్సలైట్–మావోయిస్టు ఉగ్రవాదం దేశమంతటా వ్యాప్తి చెందింది. దేశ సమగ్రత, సార్వబౌమత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పటేల్ విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. వెన్నెముక లేనట్లుగా వ్యవహరించాయి. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంది. అక్కడ పాక్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం మొదలైంది. దానివల్ల మన దేశం ఇప్పటికీ నష్టపోతూనే ఉంది. అక్రమ వలసలతో పెనుముప్పు నక్సలైట్ల హింసాకాండపై గత 11 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఈ సమస్య పూర్తిగా మటుమాయం అయ్యేదాకా పోరాటం కొనసాగుతుంది. 2014 కంటే ముందు 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఇప్పుడు 11 జిల్లాల్లోనే వారి ఉనికి పరిమితమైంది. మరోవైపు అక్రమ వలసలు, చొరబాట్లతో దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదారులపై నిర్ణయాత్మక యుద్ధం చేయాలని నిర్ణయించాం. వందేమాతర గీతాన్ని ముక్కలు చేశారు కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలన నుంచి బానిస మనస్తత్వాన్ని వారసత్వంగా తెచి్చపెట్టింది. వలస పాలన ఆనవాళ్లను ఇప్పుడు వదిలించుకుంటున్నాం. దేశంలో రాజకీయ అస్పృశ్యతను ఒక సంస్కృతిగా మార్చారు. సర్దార్ పటేల్‌కు ఎలాంటి అవమానం జరిగిందో మనకు తెలుసు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా ఆయన పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో చూశాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ రామ్మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ను కూడా కాంగ్రెస్ కించపర్చింది. వందేమాతర గీతంలో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ మతాన్ని దృష్టిలో పెట్టుకొని తొలగించింది. ఇలా చేయడం సమాజాన్ని విభజించడం, బ్రిటిష్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం కాదా? భాషా వివాదాలు దురదృష్టకరం నేడు కొన్ని రాష్ట్రాల్లో భాష పేరిట వివాదాలు తలెత్తడం దురదృష్టకరం. దేశంలో ప్రతి భాషా జాతీయ భాషనే. ఒకరిపై మరో భాషను రుద్దే ప్రయత్నం ఎంతమాత్రం జరగడం లేదు. దేశ ఐక్యతకు భాష ఒక మూలస్తంభం’’ అని ప్రధాని మోదీ అన్నారు.మోదీ ఐక్యతా ప్రతిజ్ఞ రాష్ర్టీయ ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుకొనేందుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలని సూచించారు. ఈసారి ఏక్తా దివస్ వేడుకలు విభిన్నంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నేషనల్ యూనిటీ పరేడ్ నిర్వహించారు. పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయా దళాలకు మహిళలే నాయకత్వం వహించడం గమనార్హం. యూనిటీ పరేడ్ రిపబ్లిక్ డే పరేడ్ తరహాలో జరగడం విశేషం. అందంగా అలంకరించిన శకటాలను సైతం ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు.
ఎవరి తలరాత మారుస్తారో?
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్‌లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. మైనారిటీ వంతెన దాటాల్సిందే.. బిహార్‌లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్‌గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్‌గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు. గత ఎన్నికలే గుణపాఠం 2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్‌బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాధామన్‌లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్‌కు ఉన్న అయిష్టత మరో కారణం. ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది. చీలికపై నితీశ్ ఆశలు..! నితీశ్ కుమార్ ‘మహాగఠ్‌బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందిఎంఐఎం ఆత్మగౌరవ నినాదం ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్‌లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
పీరియడ్ సెలవు : శానిటరీ ప్యాడ్ ఫోటోలు పంపమన్న సూపర్ వైజర్లు
ఒక పక్క మహిళలు, పీరియడ్ సమస్యలను అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీరియడ్ లీవ్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తోంటే హర్యానాలోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైనం కలకలం రపింది. హర్యానాలోని రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో కొంతమంది మహిళా పారిశుద్ధ్య కార్మికులలు తాము పీరియడ్స్‌లో ఉన్నదీ లేనిదీ రుజువు చేసుకోవాల్సిన దుస్తితిపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.అక్టోబర్ 26నక్యాంపస్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అక్టోబర్ 26న మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయాన్ని హర్యానా గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్ సందర్శించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ మహిళలతో సహా పారిశుద్ధ్య కార్మికులందరిని విధులకు పిలిచారు. విధుల్లో ఉన్న పారిశుద్ధ్య మహిళలు ఆలస్యంగా వచ్చారు.మరికొంతమంది సెలవు అడిగారు. రుతుక్రమం, అనారోగ్యంతోఉన్నామని, సిబ్బంది చెప్పినప్పుడు, ఇద్దరు వినోద్, జితేంద్ర సూపర్వైజర్లు అబద్ధం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలకు సెలవు ఇవ్వలేదు సరికదా, ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని వీరు బలవంతం చేశారు. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ డ్యూటీకి వచ్చిన ఒక మహిళను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, రుతుక్రమాన్ని మరో మహిళా సిబ్బందితో తనిఖీ చేయించారు. అలాగే ఇలా చేయడానికి నిరాకరించిన మహిళల్ని ఉద్యోగంలోంచి తీసేస్తామని కూడా బెదిరించారు.ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన తెలిపారు.వీరికి తోటి మహిళా సిబ్బంది, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిరసనకు దిగాయి. దిగ్భ్రాంతి కరమైన సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌తో సంఘటన ఫోటోలు . వీడియోలను కూడా బాధితలు పంచుకున్నారు.వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణన్ కాంత్ దీనిపై ఇంటర్నల్ దర్యాప్తునకు ఆదేశించింది. మరియు దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సూపర్వైజర్లతోపాటు, మరొకరిపై కేసు నమోదైంది.కాగా హర్యానాలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పీరియడ్లీవ్ విధానమేమీ లేదు. కానీ ఇటీవలి ఆదేశాల ప్రకారం అన్ని మహిళా కాంట్రాక్టు ఉద్యోగులు (హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ ద్వారా నియమించబడిన వారితో సహా) నెలకు రెండు రోజుల క్యాజువల్ సెలవులు తీసుకోవచ్చు.
ఎన్ఆర్ఐ
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు)
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్‌గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్‌గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్‌ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్‌ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్‌లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్
Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్‌లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నాడు తల్లి.. నేడు కూతురు
జగిత్యాలక్రైం: నాడు భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపులతో తల్లి ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నేడు కూతురు సైతం అదే దూలానికి ఉరేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 16 ఏళ్ల క్రితం ఎండపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వెనంక రవికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి సహస్ర (16), మణికార్తీక్ సంతానం. ఈనేపథ్యంలో భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు జ్యోతిని వేధింపులకు గురిచేయడంతో 2017లో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రవి, సవిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో సహస్త్ర ఎండపల్లి మండలం కుమ్మరిపల్లి కసూ్తరిబాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెల క్రితం ఆమెకు ముక్కు ఆపరేషన్ జరిగింది. వసతి గృహంలో ముక్కు నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గతంలో తల్లి ఆత్మహత్య చేసుకున్న దూలానికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలి అమ్మమ్మ పొరండ్ల సుగుణ తన మనుమరాలి మృతిపై అనుమానాలున్నాయని, తండ్రి రవి, సవతి తల్లి సవిత, వెన్నంకి లక్ష్మి, వెన్నంకి శ్రీనివాస్‌లు కారణమని ఫిర్యాదు చేసింది. వేధింపులు భరించలేకనే కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతుందని, కుటుంబసభ్యులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, తల్లీకూతుళ్లు ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రి మార్చురీ గదిలో ఉంచగా, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం సాయంగా వచ్చిన 8 ఏళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరులోని పెద్ద మసీదు వీధికి చెందిన జమీర్ బాషా అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయకుడిగా వచ్చాడు. అదే సమయంలో పట్టణంలోని రాణిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి చికిత్స అందిస్తున్నారు. వారితో పాటు 8 ఏళ్ల చిన్నారి కూడా ఆస్పత్రికి వచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చిన్నారికి నిద్ర వస్తుండటంతో కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న గదిలోని బెడ్‌పై పడుకోబెట్టారు. చిన్నారి ఒంటరిగా నిద్రిస్తున్న విషయం గుర్తించిన జమీర్‌బాషా చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో ఆస్పత్రి భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని జమీర్బాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పారు.
బాలికపై జనసేన నేత లైంగిక దాడి
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడటం, ఆనక అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ జనసేన నాయకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి, మాయమాటలతో లోబరుచుకుని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఈ బాగోతం బయటపడితే పరువు పోతుందని కొందరు కూటమి నేతలు ఆ బాలిక తల్లితో పాటు బంధువులతో కేసు లేకుండా రాజీ చేసేందుకు యత్నించారు. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు కూడా తెచ్చారు. అయినప్పటికీ బాలిక తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి నిలదీయడంతో.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై బాణాపురానికి చెందిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలసి పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని ఒక భవనం నుంచి ఆ బాలికతో కలసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసింది. దీంతో తనపై బాబీ అనేక పర్యాయాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వెంకట కృష్ణపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రాజీకి తీవ్ర యత్నాలు బాబీని కేసు నుంచి తప్పించేందుకు, రాజీ చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు తెరవెనుక తీవ్రంగా యతి్నంచారు. అయితే, బాలిక తల్లి సహా కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో చివరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. నిందితుడు బాబీ ఐ.పోలవరం జెడ్పీ హైసూ్కల్లో విద్యాకమిటీ సభ్యుడు. క్రీడాకారుడు కావడంతో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తుంటాడు. బాధితురాలు నిందితుడికి సమీప బంధువు. ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఆక్వా కార్మికురాలు. నిందితుడు ఆ బాలికకు తరచూ చాక్లెట్లు కొనిపెడుతూ తన బంధువుకు చెందిన ఖాళీగా ఉన్న ఇంట్లో అఘాయిత్యానికి బరితెగిస్తున్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. నిందితుడి బారిన పడిన వారిలో ఇంకొందరు బాలికలూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాబీని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శబాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, కాశి మునిబాలకుమారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వీడియోలు
రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడా..!
ఆన్ లైన్ లో ఐ ఫోన్ ఆడర్ పెడితే టైల్స్ రాయి ముక్క పంపిండ్రు
అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో చంద్రబాబు నిర్లక్ష్యం
ఆలయ భూములపై బాబు కన్ను.. బినామీల కోసం జీవో జారీ
టాంజానియా అల్లర్లు.. 700 మందికిపైగా మృతి
రాంగ్ రూట్ లో వచ్చిన కారుకు బుద్ది చెప్పిన బస్సు డ్రైవర్
మంగళవారం మళ్లీ అప్పు చేయనున్న కూటమి ప్రభుత్వం
తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
బాలకృష్ణే చేయిస్తున్నాడా? చిరంజీవిపై DeepFake వెనుక టీడీపీ
పీకలు కోసేస్తాం.. లోకేష్ అనుచరుల బెదిరింపులు





