breaking news
NRI
-
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్‌ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్‌హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్‌లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్‌లో ట్రెయినీ ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్‌గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్‌గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్‌మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత -
చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్‌బాట్‌ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్‌జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్‌వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. -
అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్
మసాచుసెట్స్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. మసాచుసెట్స్‌లోని యాక్టన్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తన తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అర్జున్ అరవింద్ అనే యువకుడిపై అధికారులు హత్య కేసులు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత మంగళవారం మార్తా లేన్‌లోని వారి నివాసంలో సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆరోజు ఇంటికి వెళ్లాల్సిన ట్యూటర్ విషయాన్ని అర్జున్ తండ్రికి తెలిపారు. దీంతో ఆందోళన చెందిన అర్జున్ తండ్రి సాయంత్రం 6.37 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులో సిద్ధార్థ్, బేస్మెంట్లో సుధా మృతదేహాలను గుర్తించారు. ఇద్దరిపైనా తీవ్ర గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు అర్జున్ తన తల్లి కారులో పరారయ్యాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం ఉదయం వేలాండ్ ప్రాంతంలోని ఒక పార్కింగ్ స్థలంలో కారుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడే ముందు అర్జున్ అనుమానాస్పద రీతిలో ప్రవర్తించినట్లు మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. కుటుంబ సభ్యులను ఎలా అంతం చేయాలనే విషయాలపై అర్జున్ ఇంటర్నెట్, చాట్‌జీపీటీ ద్వారా శోధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. -
యూరప్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్‌కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (9 ఆగస్టు 2026) సాయంత్రం అత్యంత వైభవంగా కోలాహలంగ జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు. బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి మరియు అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ మరియు బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సింగపూర్ బోనాలు - 2026 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి అసౌకర్యం లేకుండ తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్) మరియు స్వాతి ఖానాపురం; సాయి కృష్ణ కొమాకుల; నగేష్ టేకూరి; నిఖిల్ పారుపల్లి; శ్రీధర్ మారోజు & ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్; కొల్లా శివ ప్రసాద్; మునిగెల కృష్ణం రాజు; పాతూరి రాంబాబు మరియు దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగలో ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల గారికి, సౌండ్ సాంకేతికతలో సహకరించిన యసరావేణి విజయ కుమార్ మెరుగు గారికి మరియు పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. -
బాల్టిమోర్‌లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్‌తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్‌లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు. -
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అక్కడే స్థిరపడాలనే ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విదేశీ విద్యను ఆకాంక్షిస్తున్న ప్రతి ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు (80 శాతం) చదువు పూర్తి కాగానే తిరిగి భారత్ రావాలని కోరుకుంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ ‘ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన తాజా నివేదిక ఈ ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది.మారుతున్న ప్రాధాన్యతలుదశాబ్దాలుగా మన దేశాన్ని వేధిస్తున్న ‘మేధో వలస’ (Brain Drain) దశ ముగిసి, భారత్ ఇప్పుడు ‘మేధో సమృద్ధి’ (Brain Gain) దిశగా పయనిస్తోందనడానికి ఈ నివేదిక నిదర్శనం. గతంలో విదేశీ డిగ్రీ అనగానే అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్), ఉద్యోగం పొందడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. కానీ నేటి యువతరం ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సంపాదించిన గ్లోబల్ ఎక్స్పోజర్, సాంకేతిక నైపుణ్యాలను స్వదేశంలోనే వినియోగించాలనుకుంటున్నారు. దాంతో సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించడం, వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఇన్నోవేషన్ ల్యాబ్‌లలో కీలక పాత్ర పోషించడం, గ్లోబల్ కార్పొరేట్ రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.స్వదేశంలో అవకాశాలు.. విదేశీ సవాళ్లుప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిలవడం, హైదరాబాద్, బెంగళూరు.. వంటి నగరాలు గ్లోబల్ టెక్నాలజీ హబ్‌లుగా మారడం విద్యార్థుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌లో లభిస్తున్న అవకాశాలు, వేతనాలు పాశ్చాత్య దేశాలకు దీటుగా ఉన్నాయి. మరోవైపు, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కఠినతరం అవుతున్న వీసా నిబంధనలు, వర్క్ పర్మిట్లపై పరిమితులు, పెరిగిన జీవన వ్యయం కూడా విద్యార్థులను స్వదేశం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి.అంతర్జాతీయ స్థాయి విద్యను, అక్కడి అనుభవాన్ని మూలధనంగా మార్చుకుని తిరిగొచ్చే ఈ మేధో సంపత్తి భారత ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే ఈ ‘మేధో సమృద్ధి’ రాబోయే దశాబ్దంలో ‘వికసిత భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
ఐర్లాండ్ గడ్డపై ప్రతిభ చాటిన తెలంగాణ బిడ్డలు
వైరా: ఐర్లాండ్‌లో ఈనెల 8వ తేదీన నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె అక్కడే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యాన ఐర్లాండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన భారత్ నుంచి వెళ్లి ఐర్లాండ్‌లో ఉంటున్న యువతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిఖిత నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో కేరళకు చెందిన అన్మోల్, వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఈ సందర్భంగా నిఖిత ‘సాక్షి’తో మాట్లాడుతూ స్టేజీ ఫెర్పార్మెన్స్‌ను పరిశీలించడమే కాక న్యాయనిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు. అపజయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తావన్న ప్రశ్నకు మనోధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేస్తానని వెల్లడించింది. కాగా, నిఖిత తల్లి సునీత వైరా 12వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఐర్లాండ్ అందాల పోటీల్లో ఆమె నెగ్గడంపై తల్లిదండ్రులు, వైరా వాసులు అభినందించారు. -
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో సిలికానాంధ్ర మనబడి
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్లో సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయణం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,712 మంది పాల్గొనగా, వారిలో అధిక సంఖ్యలో సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు ఉండటం విశేషం.పాల్గొన్నవారు సుమతీ శతకం, వేమన శతకం నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేసి తెలుగు భాషా ప్రావీణ్యాన్ని, తెలుగు సాహిత్యం పట్ల తమ అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సమిష్టి పారాయణం ద్వారా తెలుగు భాష, సాహిత్య వైభవం అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిధ్వనించింది.ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్, డీన్ చామర్తి రాజు మాట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న భాషా సేవకు నిదర్శనమన్నారు. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ప్రయాణం మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను నేర్పించాలని, భారతదేశంలోని తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఈ విషయంలో ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ప్రపంచంలోని ఏకైక తెలుగు విద్యాసంస్థగా సిలికానాంధ్ర మనబడి గుర్తింపు పొందిందని సంస్థ తెలిపింది. స్థాపన నుంచి ఇప్పటివరకు 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పినట్లు వెల్లడించింది.విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని దశలవారీగా పెంపొందించేలా బాలబడి–1, బాలబడి–2 నుంచి ప్రభాసం వరకు వివిధ స్థాయిల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది. తెలుగు భాష, సాహిత్యాల్లో మరింత లోతైన అధ్యయనం కోసం 'ప్రబోధం' పేరుతో ఉన్నత స్థాయి ఐచ్ఛిక కోర్సును కూడా అందిస్తున్నట్లు తెలిపింది. బాలరంజని యాప్ ద్వారా ఇంటరాక్టివ్ అభ్యాసంతో పాటు బాలానందం, తెలుగు మాట్లాట, తెలుగుకి పరుగు, మనతరం వంటి పాఠ్యేతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించింది.ఇదిలా ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, కెనడాలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ మొదటి వారాంతం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించే ఈ కార్యక్రమంలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. -
నీ కేబినెట్‌ను శుభ్రం చేసుకో బ్రో
సాక్షి, అమరావతి : ‘మా సంస్థ పేద పిల్లల కోసం పని చేస్తుంది. మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.. అంటే బృందంగా వద్దు.. మీరు మాత్రమే ఒంటరిగా కాఫీ షాప్‌కు రండి. అక్కడ మనిద్దరం మాట్లాడుకుందాం’ అంటూ చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రి వెదవ వేషాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటీ బరితెగింపు అని విస్తుపోతున్నారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు అంటూ టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు.ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా.. అంటూ వాకబు చేస్తున్నారు. లోకేశ్‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదంటే ఆయనకు బాగా కావాల్సిన మంత్రి కాబోలు అంటూ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ శైలా తాళ్లూరి అనే మహిళ ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందిస్తూ, మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.భారతదేశంతో పాటు కెన్యా, సియెర్రా లియోన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్యూర్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈమె సేవలకు పలు పురస్కారాలు కూడా లభించాయి. ఈ క్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన నాటా కార్యక్రమంలో డాక్టర్ శైలా తాళ్లూరి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అమాత్యుడు ఆమెను లోబరుచుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె కీలక మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు సదరు మంత్రిని ఉద్దేశించి కూడా నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారంటూ ఓ పోస్టు పెట్టారు.మీరు ఏం పీకారు?‘నారా లోకేశ్.. క్లీన్ అప్ యువర్ కేబినెట్ బ్రో.. నీ మంత్రుల్లో ఒకడి నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు. అన్ని అధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్‌లు పంపారు. బృందంగా వచ్చి కలుస్తామంటే.. కాదు కాదు కాఫీ షాప్‌కు ఒంటరిగా రమ్మన్నాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. అసభ్య మెసేజ్‌లు, ఫొటోలతో నన్ను విసిగించాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేద పిల్లల కోసం వచ్చే సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందనే భయంతో అవమానాన్ని దిగమింగి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. ఇప్పుడిక తప్పడం లేదు. ఆ మంత్రి ఎవరనేది నేను ఫొటో సహా నేరుగా చెబుతాను. కాకపోతే మాకు ఒకమాట చెప్పి ఉండాల్సిందని తర్వాత మీరు అంటారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఫలానా వారికి చెప్పి ఉండాల్సింది కదా.. మాకు చెప్పి ఉండాల్సింది కదా.. అంటారు. అందుకే ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను. ఒక్క ‘సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్’ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్‌గా అడుగుతున్నాను. ఇలాంటి ఘటనల్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏమి పీకుతున్నారు? పీకారు సో ఫార్??!! ఆ భోగాపురం పీపుల్ బెటర్.. చెట్లు పీకి ఇంకో చోట నాటారు. నా వద్ద ఉన్న చాట్ హిస్టరీ, స్క్రీన్షాట్లు ఆ మంత్రి వద్ద కూడా ఉంటాయి. మీకు ఫోన్లో పేరు చెప్పానుగా.. ఆయన ఫోన్ తీసుకుని చూడండి.. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. మీరు విచారణ నిర్వహిస్తే నా వద్ద ఉన్న ఆధారాలు అన్నీ ఇస్తాను. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ డాక్టర్ శైలా తాళ్లూరి డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్టుపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. -
ఏపీ కేబినెట్ మంత్రి చిలిపి చేష్టలు.. ఎన్ఆర్ఐ మహిళ వార్నింగ్!
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్ మంత్రిపై లైంగిక ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ కీలక కేబినెట్ మంత్రి తనను లైంగికంగా వేధించారంటూ అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.షైలా అనే పేరుతో ఉన్న సదరు ఎన్ఆర్ఐ మహిళ, మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుస పోస్టులు పెట్టారు. పేద పిల్లలకు సహాయం చేసేందుకు, సామాజిక సేవా కార్యక్రమాల నిమిత్తం తాను మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 'నాటా' వేడుకల సమయంలో సదరు మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించారు.అపాయింట్మెంట్ అడిగితే కాఫీ షాప్‌నకు ఒంటరిగా రావాలని ఒత్తిడి తెచ్చారని, అంతేకాకుండా కాళ్లు, చేతుల ఫోటోలు పంపిస్తూ అసభ్యకరంగా వ్యవహరించారని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వేధింపుల ఉదంతంపై నారా లోకేష్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సదరు మంత్రికి సంబంధించిన ఫోటోలు, ఆయన ఉపయోగించిన ఫోన్ నెంబర్లతో సహా పూర్తి ఆధారాలను బహిర్ఘతం చేస్తానని సదరు ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంపై టీడీపీలో చర్చాంశనీయంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నాయకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి అయి ఉంటారని, గతంలో ఆయన నాటా సదస్సుకు హాజరయ్యారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా సదరు మంత్రి అధికారికంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
H-1B, L-1 వీసాలు.. భారతీయులకు బిగ్ షాక్!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఐటీ కంపెనీలపై అదనపు భారంఅమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.ఎంత ఫీజు?ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.ఎందుకీ పెంపు?అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.తుది నిర్ణయం ఎప్పుడంటే..అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. -
‘రాయలసీమకు ఆనాటి నుంచి అన్యాయమే!’
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, తెలుగు వారికంటూ ప్రత్యేక రాష్ట్రం 1953లోనే ఏర్పడినా... రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఆర్థిక, జల వనరుల కేటాయింపులోనూ, అభివృద్ధిలోనూ వివక్షకు గురవుతూనే ఉన్నదని సాహిత్య, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలేలిన సీమగా, రతనాలు రాశులుగా పోసి అమ్మిన సీమగా... సాహిత్య చరిత్రలో పేర్కొంటూ వచ్చినప్పటికీ, వాస్తవానికి పాలకుల నిర్లక్ష్యంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే నేటికీ కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలలో భాగంగా ‘మన రాయలసీమ’ పేరిట ‘రాయలసీమ అవగాహన సదస్సు’ జరిగింది. ఆ సదస్సులో అందరి నోటా ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.ప్రబంధ కవులంతా రాయలసీమ వారే!దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీరింగ్ నిపుణుడు, ‘ఆటా’ వారి త్రైమాసిక పత్రిక ‘అమెరికా భారతి’ సంపాదకుడు ప్రకాశ్ తిమ్మాపురం అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు ఆవేదన నిండిన మాటలతో, ఆలోచనా స్ఫోరకంగా సాగింది. ఈ ‘రాయలసీమ అవగాహన సదస్సు’ తాలూకు ఉద్దేశాన్నీ, వర్తమాన పరిస్థితుల్లో దీనికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్నీ ప్రకాశ్ తన మాటల్లో ముందుగా ప్రస్తావించారు. సముచితమైన రాయలసీమ డిమాండ్లకు అందరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు గ్రహీత, సీనియర్ సాహిత్యవేత్త జె.ఎల్. రెడ్డి సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రాంత సాహితీ ప్రముఖుల కృషిని ప్రేక్షకులతో విహంగవీక్షణం చేయించారు. కథ, కవిత్వం, నవల, విమర్శ తదితర ప్రక్రియల్లో రాయలసీమ ప్రాంతం నుంచి సాగిన అపూర్వ కృషిని సాధికారికంగా వివరించారు.సీమ అభివృద్ధికి కట్టుబడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి!అలాగే, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అవధాన కవి, సాహితీవేత్త నరాల రామారెడ్డి ప్రసంగిస్తూ, ప్రబంధ సాహిత్యకవుల్లో తెనాలి రామకృష్ణ లాంటి ఒకరిద్దరు మినహా అల్లసాని పెద్దన లాంటి అనేకులు రాయలసీమ వారేనని గుర్తు చేశారు. ఆయన తన విస్తృత సాహితీ అధ్యయనాన్ని పంచుకుంటూ, అనేక పద్య ఉదాహరణలతో, రాయలసీమ ప్రాంతం గొప్పదనాన్ని గుర్తుచేశారు. ప్రబంధ కవుల నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకు ఎందరెందరో ప్రముఖుల రచనల్లోని ప్రత్యేకతను నరాల రామారెడ్డి వివరించారు.ఈ ‘మన రాయలసీమ’ సదస్సు కు ప్రధాన సూత్రధారి, సామాజిక పరిశీలకుడు, ‘ఆటా సాహిత్య విభాగం’ సలహాదారు అయిన జయదేవ్ మెట్టుపల్లి మాట్లాడుతూ, రాయలసీమ వెనుకబాటుకు మూలమైన చరిత్రను వివరించారు. చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలను పేర్కొన్నారు. రక్షణ ఒప్పందం కోసం నిజామ్ ప్రభువు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి ‘సీడెడ్’ (దత్తమండలాలు)గా కట్టబెట్టడం దగ్గర నుంచి 1928లో ‘రాయలసీమ’ అన్న నామకరణం జరగడం మొదలు నేటి దాకా జరిగిన చరిత్రను సంక్షిప్తంగా కళ్ళకు కట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచే తెలుగు రాష్ట్రానికి అధిక సంఖ్యలో ముఖ్యమంత్రులు వచ్చినా, రాజకీయ సంఖ్యాబలం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని గుర్తు చేశారు. ఎంవి రమణారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటివారు కొందరు మాత్రమే కడదాకా రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడ్డారన్నారు.కొన్ని జిల్లాలకు మరింత అన్యాయం!తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రముఖులు పంపిన సందేశాల సారాంశాన్ని సదస్సులో వినిపించారు. అమెరికాలో స్థిరపడ్డ కడప వాసి – సాఫ్ట్ వేర్ రంగ నిపుణుడు చరసాల ప్రసాద్ మాట్లాడుతూ, అనేక అంశాల్లో అనాదిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనాభరితంగా ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలోనూ కేటాయింపుల్లో కడప లాంటి జిల్లాలు మరింత వివక్షకు గురయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ చారిత్రక ఆధారాలు, గణాంకాలతో ‘కడప జిల్లా అభివృద్ధి – ఆత్మగౌరవం’ పేరిట రచయిత త్రివిక్రమ్ రాసిన పుస్తకంలోని పలు చర్చనీయాంశాలను ప్రసాద్ స్థూలంగా పరిచయం చేశారు. ఒకప్పటి ముఠా తగాదాలను సాకుగా చూపి, నేటికీ రాయలసీమ ప్రాంతాన్ని ఫ్యాక్షనిజానికి మారుపేరుగా రాజకీయ, సినీరంగాల్లో వేస్తున్న ముద్రను తీవ్రంగా ఖండించారు.ప్రొద్దుటూరుకు చెందిన సాహితీ ప్రియుడు సాధు గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఉపాధి – ఉద్యోగావకాశాల పరంగా మెరుగుపరచడానికి తమ వంతుగా చేస్తున్న కృషిని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు మరింతగా ముందుకు వస్తే, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు రాయలసీమ నుంచి వలసలు తగ్గి, స్థానికంగా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.తిరుపతికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిరిధర్ కుమార్ కుప్పాల ప్రసంగిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) నుంచి రైల్వేల వరకు తాను పనిచేసిన ప్రాంతాల్లో రాయలసీమకు ఎలా నష్టం వాటిల్లుతోందో తన స్వీయానుభవం నుంచి విశ్లేషించారు. 1980ల మధ్య నుంచి స్థానికేతరులదే టి.టి.డి.లో ప్రాబల్యం కావడంతో, రాయలసీమ స్థానిక పురోగతి, అవసరాలు, ఆకాంక్షలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. అలాగే, రాయలసీమ ప్రాంత రైల్వే లైన్లు కొన్ని ఎన్నో దశాబ్దాల ముందే వచ్చినా, అనేక ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమకు అన్యాయమే జరిగిందన్నారు. కొద్ది జిల్లాలకే కొత్త రైల్వే జోన్లు ఏర్పడుతున్నాయి కానీ, ఎప్పటి నుంచో ప్రజల డిమాండ్ లో ఉన్న బాలాజీ రైల్వే జోన్ ఇప్పటికీ నెరవేరనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాలకుల మెడలు వండిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమం తరహాలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని, మన వద్ద కూడా మరో రాయలసీమ ఉద్యమం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సభికులందరూ రాయలసీమ పురోభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.కర్నూలు హైకోర్టు కలకు ఇన్నేళ్ళా!ఇక, హైదరాబాద్ నుంచి ‘ఆటా -2026’ సదస్సుగా ప్రత్యేక సాహితీ అతిథిగా హాజరైన ప్రముఖ జర్నలిస్టు – రచయిత డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, రాయలసీమలో నీళ్ళకు కరవైనా కన్నీళ్ళకు కరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పంటల సేద్యం బరువైనా ప్రేమాభిమానాలను పొరుగువారికి పంచడంలో రాయలసీమకు సాటి లేదని తన స్వీయానుభవాలను పంచుకున్నారు. సాహిత్యంలో పుట్టపర్తి, రాళ్ళపల్లి, సంగీతంలో శ్రీపాద పినాకపాణి, సినీ రంగంలో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కెవి రెడ్డి, నాటక రంగంలో సురభి సంస్థ.. ఇలా రాయలసీమ తెలుగుజాతికి అందించిన రతనాలు అనేకమని సభికులకు గుర్తుచేశారు.దాదాపు నూరేళ్ళవుతున్నా అలనాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (పెద్దమనుషుల ఒప్పందం) వాగ్దానాలు నేటికీ తీరకపోవడం, కనీసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు లాంటి కష్టం – ఖర్చు పెద్దగా లేని పనులు సైతం పాలకపక్షాలు నెరవేర్చకపోవడం అన్యాయమని జయదేవ నిరసన వ్యక్తం చేశారు. ఘనమైన చరిత్ర, స్థానిక వనరులు ఉన్నప్పటికీ నేటికీ నిర్లక్ష్యం నీడలోనే మిగిలిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి తోటి తెలుగు ప్రాంతాల న్యాయబద్ధమైన ఉద్యమంలో ఇతర ప్రాంతాల వారు సైతం గళం విప్పి, కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రకంగా తెలుగు ప్రాంతాలన్నిటి సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసి కృషి చేద్దామన్నారు.రాయలసీమ అభివృద్ధికి అవసరమైతే మరో ఉద్యమం చేయాలని వక్తలతో పాటు సభికులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద, ‘ఆటా’ వేదికగా, అమెరికా తీరంలో సైతం... రాయలసీమ అభివృద్ధి పట్ల ఆలోచన రేకెత్తించడంలో ఈ ‘మన రాయలసీమ’ అవగాహన సదస్సు సఫలీకృతమైంది. ఆలోచన నుంచి ఆచరణకు అడుగులు వేయడమే ఇక మిగిలింది!- అమెరికా నుంచి రెంటాల జయదేవ -
డల్లాస్‌లో ఘనంగా ఎస్ జానకి సంగీత నివాళి కార్యక్రమం
టెక్సస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్‌లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి గారి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.డల్లాస్ మెట్రోప్లెక్స్‌లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి గారు ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి గారి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.” డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్‌రెడ్డికి అవార్డ్) -
బాల్టిమోర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభల్లో భాగంగా ఆదివారం వైఎస్సార్ జయంతి కార్యక్రమం, ఎన్ఆర్ఐలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని ఎన్ఆర్ఐలను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్‌కు మరోసారి అవకాశం కల్పించే దిశగా ప్రతి ఎన్ఆర్ఐ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల సందర్భంగా అమెరికా నలుమూలల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశాలు, పరస్పర చర్చలు, సూచనలు భవిష్యత్తులో పార్టీ సంస్థాగత బలోపేతానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. -
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్‌రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్‌లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్‌రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు. -
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్‌గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు) -
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్‌ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. -
న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్‌లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి. -
లండన్‌లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్‌కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది. ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో. ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్‌ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyanka | Indian in the US (@thatbrownbanni.usa) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు
కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన ఓ యువతి(26)ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య కేసుపై కెనడియన్ పోలీసులు వివరాలు తెలిపారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.మృతురాలిని నవనీత్ కౌర్‌గా, నిందితుడిని బ్రాంప్టన్‌కు చెందిన శరణ్జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకెవరూ పరారీలో లేరని, హత్య కేసుల దర్యాప్తు విభాగం విచారణ కొనసాగిస్తోందని తెలిపారు.హంబర్‌వుడ్ బులేవార్డ్, రెక్స్‌డేల్ బులేవార్డ్ కూడలిలో ఈ కాల్పులు జరిగాయని టొరంటో పోలీసు సర్వీస్ తెలిపింది. కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తుపాకీ గాయంతో ఉన్న నవనీత్ కౌర్‌ను గుర్తించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా, ఘటనాస్థలిలోనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు బాధితురాలు, నిందితుడు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై కాల్పులు జరిపి, పోలీసులు చేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. శరణ్జీత్ సింగ్‌పై హత్య కేసుతో పాటు, చట్టపరమైన షరతులను ఉల్లంఘించిన అభియోగం కూడా నమోదు చేశారు. -
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు) -
డల్లాస్‌లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్‌లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్ చేద్దాం.. జగనన్న కోసం కోడ్ చేద్దాం (డిజిటల్ టూల్స్/ యాప్‌లు/టెక్ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ పోర్టల్ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్ఆర్ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్ జగన్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. -
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
అమెరికాలో నిర్మల్ జిల్లా యువకుడి మృతి
నిర్మల్ జిల్లా : అమెరికాలో చదువు పూర్తయి ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. కానీ విధి చిన్నచూపు చూసింది. గత శనివారం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతడిని పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేర్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్‌రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి (24) మూడేళ్ల కిందట అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్కు ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. చదువు పూర్తయి అక్కడే ఉంటూ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో మూడు నెలల్లో ఇంటికి వస్తానని, ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, గత శనివారం మోటార్‌సైకిల్‌పై వెళ్తూ అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని అక్కడి ఆస్పత్రిలో చేరి్పంచారు. నిత్యానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యుల మాటలు వింటే కోలుకుంటాడేమోనని అతడి స్నేహితులు భావించారు. గురువారం అతడి పుట్టిన రోజు కావడంతో ఆస్పత్రికి వచ్చి బాధాతప్త హృదయంతో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. శ్రీనివాస్‌రెడ్డి, విశ్వరూప దంపతులకు కుమారుడు నిత్యానందరెడ్డి, కూతురు ఉన్నారు. అమెరికా వెళ్లి పెద్ద చదువు చదివిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. కానీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు
అమెరికాలో తెలుగు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా ఒత్తిడిని జయించడం ఎలా అనే దానిపై సదస్సు నిర్వహించింది..నాట్స్ టాంపా బే విభాగం ఆద్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ వక్త కె. గోపాలన్ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేశారు.. విక్రమ్ నంధ్యాల ఈ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఒత్తిడిని ముందస్తుగా గుర్తించడం ఎలా? అది ఎన్ని రకాలుగా మనపై ప్రభావం చూపుతుంది? అనే అంశాలను సులభమైన ఉదాహరణలతో గోపాలన్ వివరించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకుండా, వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా గోపాలన్ అందించిన ఆచరణాత్మక చిట్కాలు ఈ సదస్సుకు విచ్చేసిన వారిని ఎంతగానో ఆలోచింపజేశాయి. చదువుల్లో, కెరీర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందని యువత సంతోషం వ్యక్తం చేశారు... ఆఫీసు ఒత్తిళ్లను తగ్గించుకుని ప్రశాంతంగా పనిచేయడానికి చక్కటి మార్గాలు దొరికాయని ఉద్యోగులు కొనియాడారు. అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నాట్స్ నాయకులు రాజేశ్ కండ్రు వివరించారు. తెలుగువారి కోసం ఇలాంటి సదస్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించిన నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, డాక్టర్ మల్లికార్జున నంద్యాలను, టాంపా బే టీం నాయకులకు గోపాలన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కోట, శ్రీనివాస్ మల్లాది, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ, అనిల్ అరెమడ, రవి కాళిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని తదితరుల సమష్టి కృషి ఎంతో ఉంది. అలాగే, కార్యక్రమానికి అంకితభావంతో తమ సహకారం అందించిన మురళీకృష్ణ మేడిచెర్ల, కిషోర్ నారె, శ్రవణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.(చదవండి: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు) -
అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు
అమెరికా రాజకీయ రంగాన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ శిక్షణా వేదికపై ఒక తెలుగు కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అగ్రరాజ్యం వాషింగ్టన్ డి.సి.లో అత్యంత కఠినమైన వడపోతతో నిర్వహించే "అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్" మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో మన తెలుగు తేజం క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేశాడు.అమెరికాలోని 49 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులను మాత్రమే ఈ బాయ్స్ నేషన్ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ పోటీల్లో సత్తా చాటిన వారు మాత్రమే ఈ జాతీయ స్థాయికి అర్హత సాధిస్తారు. అలా ఎంపికైన యువత ఒక వారం పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.ఈ మహాసభల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ వాక్చాతుర్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో తోటి సెనెటర్లందరి మద్దతును కూడగట్టుకుంటూ నార్త్ కరొలినా తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అర్కాన్సాస్ కు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.తెలుగు వారందరికి గర్వకారణం..అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి అద్భుతమైన విజయాన్ని సాధించి యావత్ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడైన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మితల కుమారుడు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన "బాయ్స్ నేషన్" ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని తెలుగు వారి కీర్తిని అమెరికాలో రెపరెపలాడించాడు. ఈ అరుదైన విజయం ద్వారా క్రిష్ కొర్రపాటి క్యాపిటల్ హిల్ లో ఫెడరల్ అధికారులను కలవడంతో పాటు దేశ అత్యున్నత వేదికలపై తన గళాన్ని వినిపించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. -
హైదరాబాద్ వీరుడికి ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది. వీలున్నంత వరకు సహకరించాలని... బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్‌లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు. -
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్‌ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్‌గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్‌ఫోన్‌ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్‌ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్‌ముఖ్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్‌ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్‌ముఖ్‌కు జూన్‌లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
సైదాబాద్ (హైదరాబాద్): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాణీనగర్‌లో విషాద ఛాయలు యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్లు వాణీనగర్‌కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యరి్థంచారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. -
జర్మనీలో ఘనంగా బోనాల సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ, డప్పు వాయిద్యాలు, లాస్య నృత్యాలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షులు డాక్టర్ రఘు చాలిగంటి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లోని తెలంగాణ సంఘాలు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంతో పాటు, జర్మనీకి వచ్చే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సహకారం అందించాలని సూచించారు.హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆయన అభినందిస్తూ, జర్మనీలోని అన్ని నగరాల్లో ఇలాంటి బోనాల వేడుకలు నిర్వహించాలని, అలాగే ప్రతి ఏడాది ఒక నగరంలో తెలంగాణ కుటుంబాల కోసం “Meet & Greet” కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ బసవరాజు నాయకత్వాన్ని అభినందించిన ఆయన, హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అంపన్న రెడ్డి వుటుకూరి, రాహుల్ తుల, ఉదయ్ రెడ్డి కుడుముల, వినీత్ రెడ్డి, సత్యనారాయణ, రామ్ తదితర నిర్వాహకులు, వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..! వైరల్‌గా ఎన్నారై పోస్ట్) -
వీడియో కాల్స్‌లో కాదు : ఆరేళ్ల కెనడా జీవితాన్ని వీడి ఇండియాకు
ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్‌కు రావడం కెరీర్‌కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్ -
ఉదయ్.. హైదరాబాద్ విద్యార్థే!
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులైన తెలుగు తేజం ఉదయ్ రుద్దర్రాజు మన హైదరాబాద్, మణికొండ విద్యార్థే కావడం విశేషం. ప్రపంచ స్థాయి ఏఐ నమూనాలకు అవసరమైన అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్న ఉదయ్... గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) పూర్వ విద్యార్థి. 2011లో ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం కంప్యూటింగ్, కృతిమ మేధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సాంకేతిక నిపుణుడిగా ఎదిగారు. తాజాగా భవిష్యత్ కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత కీలక అవకాశం అందుకున్నారు. ఉదయ్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు అన్నారు. -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్‌కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్‌లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్‌లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్‌కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌తో పాటు టెన్నిస్‌లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్‌బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్‌ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్‌క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్‌ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్‌పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్గా గుర్తించారు.ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.Indian stabbed in US over his religionA 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026 -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అమెరికాలో సుమారు రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత ఒక టెకీ భారత దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం మాతృదేశానికి వచ్చానంటూ మెటా (Meta) ఇంజనీరింగ్ లీడర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తన 18 ఏళ్ల అమెరికా జీవితాన్ని డజనుకు పైగా సూట్‌కేసులలో సర్దేసి, బెంగళూరుకు మారిపోయినట్లు ఒక ఎయిర్పోర్ట్ ట్రాలీ ఫోటోను ఆయన షేర్ చేశారు.మెటాలో సీనియర్ ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేసిన బాలాజీ గురురాజన్, లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన నిర్ణయంతో పెద్దవాళ్లైపోయిన తన కన్నవాళ్లకు దగ్గరగా ఉండటంతోపాటు, పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్స్‌ను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉండేకన్నా, ఉమ్మడి కుటుంబంలో కలిసి పెరిగే అవకాశం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.18 ఏళ్ల ప్రయాణంమైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, మెటా వంటి దిగ్గజ సంస్థలలో పనిచేసిన ఆయన, అమెరికా తనకు కెరీర్‌ను, మంచి స్నేహితులను ఇచ్చిందని చెబుతూ, అక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇపుడిక తన పుట్టిన నేల, చిన్న వయసులో చూసిన బెంగళూరు నగరంలో ఇప్పుడు పిల్లల స్కూళ్లు, ఇల్లు, నిత్య జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం ఒక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందినెటిజన్ల స్పందనఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీగా మద్దతు, ప్రశంసలు లభించాయి. ఒక యూజర్ స్పందిస్తూ, బెంగళూరులోని సాంకేతిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇది "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్" (ప్రతిభావంతులు తిరిగి స్వదేశానికి రావడం) కు సంకేతమని పేర్కొన్నారు.తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందాన్ని డాలర్లతో కొనలేం మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాదు గతంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన పలువురు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని చిట్కాలను కూడా పంచుకోవడం విశేషం.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్ -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
క్లార్క్స్ బర్గ్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: ప్రజాహృదయనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని అమెరికాలోని వైఎస్సార్సీపీ డీఎంవీ (డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా) ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మేరీల్యాండ్ రాష్ట్రంలోని క్లార్క్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్పీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జీవితం, ప్రజా సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింత, వైఎస్సార్సీపీ యూఎస్ఏ అడ్వైజర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ సెక్రటరీ సుబ్బు రాయాని మాట్లాడుతూ మహానేత ఆశయాలను ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమర్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సంక్షేమ పాలనకు కొత్త దిశను చూపారని పేర్కొన్నారు. -
భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజినీర్ దారుణ హత్య
అట్లాంటా: అమెరికాలో భారతీయ సంతతి మహిళ గృహ హింసకు బలయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో వారి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. భర్త ఆవేశంలో తుపాకితో కాల్పులు జరపగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన కుమారుడ్ని కూడా చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కిర్క్ బి. వ్రజెసిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియాలోని స్మిర్నా సిటీలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ముందు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు 57 ఏళ్ల శీతల్ వ్రజెసిన్ ఇంట్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు.గాయపడిన కుమారుడు జేసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన శీతల్ వ్రజెసిన్ గూగుల్‌లో ఇంజనీరింగ్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గూగుల్‌లో చేరడానికి ముందు, ఆమె హోమ్ డిపోలో మొబైల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించారు. కంపెనీ డిజిటల్ హోమ్ డెకర్, ఫర్నిషింగ్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఇంగ్లాండ్, భారత్, ఘనా దేశాలలో పెరిగిన శీతల్.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక 'జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'కి వెళ్లారు. ఆమె అట్లాంటాలో తన భర్త మరియు ఇద్దరు పిల్లలు (జేసన్, జెస్సికా)లతో కలిసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ పేటెంట్లలో ఆమె రెండు పేటెంట్లకు ఇన్వెంటర్‌గా గుర్తింపు పొందారు. -
డబ్లిన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, వైఎస్సార్ జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఆలూరి సాంబశివ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి హాజరై, వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను పంచుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని అందరికీ చేరవేస్తూ, పార్టీ ఆశయాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
యూఏఈ టాపర్లకు భారీ కానుక.. ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్లు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన సెకండరీ (హైస్కూల్) పరీక్షల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన అగ్రశ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి 100,000 దిర్హమ్లు (సుమారు రూ.23 లక్షలు) నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తూ వారి ప్రతిభను గౌరవించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిన ప్రత్యేక సందేశంలో షేక్ మొహమ్మద్, "మీ అద్భుత విజయానికి అభినందనలు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ గర్వకారణమైన క్షణాన్ని మేమూ పంచుకుంటున్నాం. మీ విజయాలు దేశ భవిష్యత్తు నిర్మాణానికి మరో బలమైన పునాది" అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.విద్యార్థులకు అందించిన గిఫ్ట్ బాక్స్‌లో "మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం... మేము మీపై విశ్వాసం ఉంచుతున్నాం" అనే సందేశం కూడా ఉండటం విశేషం. ఈ మాటలు తమకు జీవితాంతం స్ఫూర్తినిస్తాయని, నగదు బహుమతి కంటే నాయకత్వం నుంచి లభించిన ఈ గుర్తింపే అత్యంత విలువైనదని పలువురు టాపర్లు భావోద్వేగంగా వెల్లడించారు.విద్యా రంగంలో ప్రతిభను ప్రోత్సహించడం, యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడం యూఏఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షేక్ మొహమ్మద్ మరోసారి స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అవార్డు గ్రహీతలు ప్రతిజ్ఞ చేశారు.هدية الشيخ محمد بن راشد آل مكتوملأوائل الثانوية العامة في الدولة 🇦🇪 pic.twitter.com/3fIOjZ8vTI— 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 (@M___R1212) July 11, 2026 -
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్‌లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు. -
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్‌కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్‌లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్‌కు భారత్‌కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్‌లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు. -
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్‌ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. -
ఎతిహాద్ రైల్ గుడ్ న్యూస్.. ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు
యూఏఈలో రైలు ప్రయాణాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఎతిహాద్ రైల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఫుజైరాకు ఎతిహాద్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ చెల్లుబాటు అయ్యే రైలు టికెట్‌ను చూపిస్తే, ఎంపిక చేసిన ప్రముఖ హోటళ్లలో వసతి, ఆహారం, స్పా సేవలు, వినోద సౌకర్యాలపై 25 శాతం వరకు ప్రత్యేక తగ్గింపులు పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లను ఎతిహాద్ రైల్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించింది.ఈ ఆఫర్లలో డబుల్‌ట్రీ బై హిల్టన్ ఫుజైరా సిటీ, ఇంటర్కాంటినెంటల్ ఫుజైరా రిసార్ట్, లే మెరిడియన్ అల్ అకా బీచ్ రిసార్ట్, రాడిసన్ బ్లూ రిసార్ట్ ఫుజైరా, ఫెయిర్మాంట్ ఫుజైరా బీచ్ రిసార్ట్, ఫుజైరా రొటానా రిసార్ట్ అండ్ స్పా, రాయల్ ఎం హోటల్ బై గెవాన్, అల్ బహార్ హోటల్ అండ్ రిసార్ట్ తదితర హోటళ్లు పాల్గొంటున్నాయి. హోటల్‌ను బట్టి గది అద్దె, రెస్టారెంట్ బిల్లులు, స్పా సేవలు, పూల్-బీచ్ యాక్సెస్ వంటి సౌకర్యాలపై ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి.కొన్ని హోటళ్లు ఉచిత రూమ్ అప్‌గ్రేడ్, ఎర్లీ చెక్-ఇన్, లేట్ చెక్-అవుట్, పిల్లలకు ఉచిత బస, భోజనం, మల్టీ-నైట్ స్టే ప్యాకేజీలు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ హోటళ్ల నిబంధనలు, గదుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.ఫుజైరాలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎతిహాద్ రైల్ తెలిపింది. ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లలో చాలా వరకు 2026 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయోజనాలు పొందాలంటే హోటల్లో చెక్-ఇన్ సమయంలో చెల్లుబాటు అయ్యే ఎతిహాద్ రైల్ టికెట్‌ను తప్పనిసరిగా చూపించాలి.ఇటీవల ప్రారంభమైన ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవల్లో భాగంగా అబుదాబి–ఫుజైరా మార్గంలో ప్రయాణ సమయం సుమారు 1 గంట 45 నిమిషాలకు పరిమితమైంది. ప్రారంభ ఆఫర్లో కంఫర్ట్ క్లాస్ టికెట్లు 55 దిర్హమ్ల నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు 120 దిర్హమ్ల నుంచి అందుబాటులో ఉండటంతో దేశీయ పర్యాటకానికి ఈ రైలు సేవలు కొత్త ఊపు తీసుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
యూఏఈలో లాంగ్ జర్నీ.. ప్రభుత్వం కీలక సూచనలు
అబుదాబి: యూఏఈలో తీవ్ర వేసవి వేడి కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు, వాహనాల యాంత్రిక లోపాలను నివారించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రమాద రహిత వేసవి’ రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా, ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది.ముఖ్యంగా ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందో లేదో నిర్ధారించుకోవాలని, రేడియేటర్లో కూలెంట్ లేదా నీటి స్థాయిని పరిశీలించాలని అధికారులు తెలిపారు. అలాగే ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉందో లేదో చెక్ చేయడంతో పాటు, టైర్ల పరిస్థితి, గాలి ఒత్తిడి, బ్రేకుల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. రాత్రి ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల ముందు హెడ్లైట్లు, బ్రేక్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.అంతేకాకుండా వాహనంలో అవసరమైన అత్యవసర భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఎండలో కారులో సులభంగా మంటలు అంటుకునే వస్తువులు, ప్రెషరైజ్డ్ కంటైనర్లు, లైటర్లు లేదా సువాసన స్ప్రేలు వంటి వస్తువులను వదిలివేయొద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు వాహనాన్ని నీడ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలని, స్టీరింగ్ వీల్ అధికంగా వేడిగా ఉంటే వెంటనే ప్రయాణం ప్రారంభించకుండా కొంతసేపు చల్లబడిన తర్వాతే డ్రైవ్ చేయాలని సూచించింది.ఈ ముందుజాగ్రత్తలు పాటించడం వల్ల ఓవర్‌హీటింగ్, టైర్ పేలిపోవడం, ఆకస్మిక యాంత్రిక వైఫల్యాలు వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు ముందు వాహనం పూర్తిగా రోడ్డుకు అనుకూల స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్‌ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతంస్టూడెంట్ వీసా (సబ్‌క్లాస్ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్‌క్లాస్ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.అంతర్జాతీయ విద్యారంగం స్పందనఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్‌లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్‌లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్‌లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్‌కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్‌కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్‌టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్‌ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్‌లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్‌లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్‌కు లీడర్!) -
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. -
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్‌కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్‌తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్‌ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్‌త్రూ సెషన్‌ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది. -
ఎడారి దేశంలో దారుణం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన ఓ యువకుడు శవమై కనిపించాడు. ఘటనకు సంబంధించి కువైట్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (29) మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి 2021లో కువైట్‌కు వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో సీనియర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 19న డిచ్పల్లి మండల పరిధిలోని మేలయతండాకు చెందిన గణేశ్.. కైలాశ్ వద్దకు వెళ్లి వాహనం రిపేర్ చేయాలని తీసుకెళ్లాడు.కైలాశ్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అక్కడే ఉన్న అతడి పెదనాన్న కుమారులు గణేశ్‌ను కలిసి ఆరా తీశారు. వాహనం రిపేర్ కాకపోవడంతో కైలాశ్‌ను తీసుకొచ్చి రూమ్‌కు కొద్దిదూరంలో దింపి వెళ్లినట్లు అతడు సమాధానం ఇచ్చాడు. కైలాశ్ ఆచూకీ లభించకపోవడంతో వారు కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు కేవలం ఒకరు మాత్రమే రావడం గమనించారు. నిందితుల్లో ఒకరైన కార్తీక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. క్రేన్ ప్రమాదంలో కైలాశ్ చనిపోయాడని, పోలీసు కేసు భయంతో తాను, తన తండ్రి కలిసి శవాన్ని అక్కడే ఇసుకలో పాతిపెట్టామని చెప్పాడు. హతుడి ఇంటికి వెళ్లిన మరో నిందితుడు..కైలాశ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత.. మరో నిందితుడు గణేశ్ సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకున్నాడు. నెలక్రితం కొరట్పల్లి తండాకు వెళ్లి కైలాశ్ తల్లిదండ్రులను కలిశాడు. కైలాశ్ ఆచూకీ తెలిసిందా అంటూ ఆరా తీశాడు. మంగళవా రం కువైట్‌లో కైలాశ్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీ సి, తన కుమారుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే గణేశ్ తమ గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో కైలాశ్ కుటుంబ సభ్యులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్..: మృతుడు గుగులోత్ కైలాశ్‌కు ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది. గత నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆచూకీ తెలియకుండా పోవడంతో పెళ్లి వాయిదా పడింది. తమ కుమారుడు ఇంటికి తిరిగి వస్తా డని నాలుగు నెలలు గా ఎదురు చూస్తు న్న తల్లిదండ్రులకు మృతి చెందాడని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
భార్యను చంపి.. మృతదేహం ఫొటో ప్రియురాలికి పంపి..
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యను హత్య చేశాడనే అభియోగాలపై అరెస్టయ్యాడు. తొమ్మిది నెలలపాటు సాగిన దర్యాప్తు చేసిన అనంతరం పోలీసులు అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. భార్యను గొంతు నులిమి హత్య చేసి, నేరాన్ని దాచిపెట్టేందుకు ఘటనా స్థలంలో ఆధారాలు మార్చినట్లు బెలెవ్యూ పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 30 ఏళ్ల అవినాష్ నార్నే భార్య రాజిత సబ్బినేని (27) 2025 అక్టోబర్‌లో అమెరికా వాషింగ్టన్‌లోని వారి అపార్ట్మెంట్లో హత్యకు గురయ్యారు. వివాహమైన ఆరు నెలలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఘటన జరిగిన రోజు తన భార్య బాత్రూంలో తలుపు వేసుకుని బయటకు రావడం లేదని అవినాష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా రాజిత మృత దేహం కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా, పోస్టుమార్టంలో గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మరణించినట్లు తేలింది. దీంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. డిజిటల్ ఆధారాలతో బయటపడిన నిజం ఘటన సమయంలో తాను 40 నిమిషాలు బయటకు వెళ్లి వచ్చినట్లు అవినాష్ చెప్పాడు. అయితే అపార్ట్మెంట్ స్మార్ట్ లాక్, డోర్ సెక్యూరిటీ డేటాను పరిశీలించిన పోలీసులు, అతడు బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని గుర్తించారు. దీంతో ఇతరులు హత్య చేసి ఉండే అవకాశాన్ని పోలీసులు కొట్టిపారేశారు. దర్యాప్తులో అవినాష్ కు భారత్‌లో మరో మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్లికి ముందు ప్రారంభమైన ఆ సంబంధం, పెళ్లి తర్వాత కూడా కొనసాగినట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. ఆ మహిళ వీరి వివాహానికి కూడా హాజరైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. కస్టడీలో అవినాష్ హత్య జరిగిన మరుసటి రోజే రాజిత మృతదేహం ఫొటోను అవినాష్ తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఆ విషయాన్ని అవినాష్ అంగీకరించాడు. మరణానికి ముందు కొన్ని వారాలుగా అవినాష్, రాజిత మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పోలీసులు విశ్లేషించారు. అవినాష్ తయారు చేసిన పానీయాలకు చేదు రుచి వస్తోందని రాజిత పలుమార్లు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.హత్య జరిగిన రోజు కూడా భర్త చేసిన స్మూతీ ‘మందులా, దగ్గు సిరప్‌లా ఉంది’అని ఆమె చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవినాష్‌ను అరెస్టు చేశాక జూలై 1న స్థానిక కోర్టులో అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బెయిల్ కావాలంటే అతడు కోర్టుకు సుమారు రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. -
రూ.70 కోట్ల లాటరీ.. ఆ అదృష్టవంతుడు భారతీయుడే!
అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు సునీల్ కుమార్ సదాశివన్ (52) యూఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.70 కోట్లు) గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. జూలై 1న జరిగిన 'లక్కీ డే' డ్రాలో ప్రకటించిన ఏడు విజేత సంఖ్యలను సరిగ్గా సరిపోల్చడంతో ఈ భారీ జాక్‌పాట్ అతని సొంతమైంది. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.విజయం గురించి స్పందించిన సునీల్ కుమార్.. తొలిసారి ఫలితాలు చూసినప్పుడు సంఖ్యలను తప్పుగా చదివానేమో అనిపించిందని, మరోసారి టికెట్‌ను పరిశీలించిన తర్వాతే తాను నిజంగానే గెలిచానని అర్థమైందన్నారు. "మొదట నమ్మలేకపోయాను. మళ్లీ చూసిన తర్వాతే ఇది నిజమని గ్రహించాను" అని ఆయన పేర్కొన్నారు.యూఏఈ లాటరీలో గత ఐదు వారాల వ్యవధిలో ప్రకటించిన రెండో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ విజేత సునీల్ కుమారే. అంతకుముందు మే నెలలో నేపాల్‌కు చెందిన టయాబ్ ఖాన్ తన స్నేహితులతో కలిసి ఇదే జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అలాగే 2025లో ప్రవాస భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా 100 మిలియన్ దిర్హామ్‌ల తొలి గ్రాండ్ ప్రైజ్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం యూఏఈ లాటరీ ప్రతి బుధవారం, శనివారం 'లక్కీ డే' డ్రాలను నిర్వహిస్తోంది. ప్రతి డ్రాలో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హామ్‌ల రెండో బహుమతి, అలాగే ముగ్గురు అదృష్టవంతులకు 50 వేల దిర్హామ్‌ల చొప్పున 'లక్కీ ఛాన్స్' నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ డ్రాలో పాల్గొనడానికి టికెట్ ధర 50 దిర్హామ్‌లు. -
ఖతార్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
దోహ: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతిని ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. పితాని శ్రీను, అబ్దుల్ అలీమ్ ఆధ్వర్యంలో అక్కడే స్థానికంగా ఉన్న అమృత రెస్టారెంట్లో కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమంలో గల్ప్ కో కన్వినర్ శశికిరణ్, ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్. అబ్దుల్ హలీం గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మండ వర్జిల్బాబు ,గల్ఫ్ ప్రతినిధులు నేతల జయరాజు ,నల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఖతార్ వైఎస్సాఆర్సీపీ కో కన్వీనర్లు కర్రీ లక్ష్మయ్య ,ఆరోన్ మనీష్, నాయకులు వర్ధనపు ప్రకాష్ ,గడ్డం చంటి శివ కుడిపూడి ,షైక్ దర్బార్ బాషా, హేమంత్ నరీం ,వసంతప్ప షోహు అహ్మద్ ,బాబు సీకోలు , హరినాధ్ రెడ్డి, నల్లి కిశోర్ ,గోసంగి రాజు , రాపాక సూర్య , వైఎస్సాఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్‌లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్‌టౌన్‌లోని ఉడ్‌ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్‌పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్‌లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్‌మెంట్‌కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్‌కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు. -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్‌గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్‌లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
సీఎం విజయ్ పర్యటనను నియంత్రించజాలం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్‌ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్‌ను అడిగింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది. -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వినర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వినర్ వేణు చుక్కలూరు వర్చువల్‌గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెర్త్‌లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్, త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వినర్ భరత్, విక్టోరియా కన్వినర్ కృష్ణా రెడ్డి, సహ కన్వినర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిషేక్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
అమెరికాలో రోడ్డుప్రమాదం..
మూలపాడు (ఇబ్రహీంపట్నం): అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) దుర్మరణం పాలైంది. మూలపాడుకు చెందిన రైతు అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతులకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసన్నలక్ష్మిని అమెరికాలో ఎంఎస్ చదివించారు. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. న్యూజెర్సీలో ఉంటున్న ఆమె జాబ్ కాల్‌లెటర్‌కు పూజ చేయించేందుకు కారులో స్నేహితులతో కలిసి బయలుదేరింది.న్యూయార్క్ ప్రాంతంలో రోడ్డుపై సిగ్నల్స్ వద్ద ప్రసన్నలక్ష్మి ప్రయాణిస్తున్న కారును మరోకారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ప్రసన్నలక్ష్మి దుర్మరణం వార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా మరణించినట్లు తెలిసింది. కారులోని మరో ఇద్దరు గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
దుబాయ్ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవల కోసం వాక్-ఇన్ ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇకపై ముందస్తుగా ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారికే కాన్సులేట్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన book.passportindiauae.com పోర్టల్ ద్వారా ధ్రువీకరించిన అపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి.అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం పరిమిత స్థాయిలో వాక్-ఇన్ సేవలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇటీవల దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరగడంతో సేవలను క్రమబద్ధీకరించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అపాయింట్మెంట్ స్లాట్లు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు విడుదల చేయబడతాయి. అవి తదుపరి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య సేవల కోసం చెల్లుబాటు అవుతాయి. అపాయింట్మెంట్ సమయానికి 15 నిమిషాల కంటే ముందుగా ప్రవేశం ఉండదని కాన్సులేట్ స్పష్టం చేసింది.రద్దీని తగ్గించేందుకు సాధారణంగా దరఖాస్తుదారులకే ప్రవేశం ఉంటుంది. అయితే ఇద్దరు తల్లిదండ్రులు హాజరు కావాల్సిన మైనర్ పిల్లల దరఖాస్తుల విషయంలో మినహాయింపు ఉంటుంది. దుబాయ్ కాన్సులేట్‌లో ప్రవేశం గేట్ నంబర్-1 ద్వారా కల్పించనున్నారు.నవజాత శిశువుల పాస్‌పోర్ట్ దరఖాస్తులు, అలాగే అత్యవసర ప్రయాణ పత్రం (ఎమర్జెన్సీ సర్టిఫికేట్) కోసం వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తుదారులు పూర్తిగా నింపిన ఫారమ్‌లు, అవసరమైన పత్రాలు, స్పష్టమైన ఫోటోలు, సంతకాలు/బొటనవేలు ముద్రలను ముందుగానే అప్లోడ్ చేసి రావాలని సూచించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తులు అధికారిక పోర్టల్ mportal.passportindia.gov.in/mission లో సమర్పించవచ్చు.మరోవైపు, జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాస్‌పోర్ట్ ఫీజు నిర్మాణాన్ని కూడా కాన్సులేట్ గుర్తుచేసింది. ప్రస్తుతం వర్తించే ఫీజులు నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తున్నందున ఖచ్చితమైన చిల్లరతో రావాలని దరఖాస్తుదారులకు సూచించింది. -
ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్గాల్స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్‌ను కట్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్‌లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్‌రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఓ భారత మహిళ అబుదాబిలో జాక్‌పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్‌కు రూ. 62 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్‌లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్‌ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె. -
NRI: గాంధీ మెమోరియల్.. ఘనంగా అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు!
డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అమెరికాదేశపు 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ - అమెరికా జనజీవన స్రవంతిలో భాగం అవుతూ, అర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు, దేశంలో కెల్లా ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకం ఇర్వింగ్ నగరంలో ఏర్పాటు చేసినందులకు ధన్యవాదములు అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రత్యేకఅతిథిగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ తన సందేశంలో ఎన్నో దశాబ్దాలగా టెక్సాస్ రాష్ట్రంలో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాలలో తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తద్వారా అమెరికా జిడిపి ఎదుగుదలలో భాగస్వాములవడం అభినందనీయం అని ప్రశంసించారు. 50 మందికి పైగా “స్వర స్వాతి సింగింగ్ గ్రూప్” చిన్నారులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక అమెరికా దేశభక్తి పూర్వక గీతాలు ఆలపించడం ఆనందగా ఉందని, ఈ దేశ భవిష్యత్ ఈ యువత చేతిలోనే ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. ఈ రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు వారితో పాటు తీసుకు వచ్చిన తమ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రతిభతో ఈ దేశాన్ని మరింత సుసంపన్నం చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్యం, ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలోనూ ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలను కల్పించింది అందుకు కృతజ్ఞతలు అన్నారు.మన భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములవ్వాలి. స్వాతంత్ర్యం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు; బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి. వైవిధ్యాన్ని ఆదరించండి. నిజాయితీని ఆచరించండి. మానవత్వాన్ని పెంపొందించండి. విభేదాలకంటే ఐక్యతను, స్వార్థం కంటే సేవాభావాన్ని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకుని ముందుకు సాగాలి అన్నారు.”మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు, ముర్తుజా భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తితో సహా అనేక సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక గీతాలతో పిల్లకు తర్ఫీదు ఇచ్చి, 50 మందికి పైగా చిన్నపిల్లలతో దేశభక్తి గీతాలను పాడించిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలికి, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు, ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, ప్రత్యేకఅతిథి టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ కు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
సిడ్నీలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అక్కడ ఉన్న తెలుగు వారందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సేవలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకొంటూ ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ సిడ్నీ కన్వీనర్ అమరనాథ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నేతలు రాజశేఖర్ లంకెల, శివ రెడ్డి, సిడ్నీ నాయకులు రామనాథ రెడ్డి చల్లా, పెద్ది రెడ్డి, చంద్ర మౌళి, గోపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్‌గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. -
కాన్సాస్‌లో ఆకస్మిక వరదలు : ఏపీకి చెందిన టెకీ దుర్మరణం
అమెరికాలో కాన్సాస్‌లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకుని వెంకటేష్ దొప్పలపూడి (33) అనే భారతీయ ఐటీ నిపుణుడు, ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పర్చూరు మండలానికి చెందినవ్యక్తిగా గుర్తించారు. శనివారం మధ్యాహ్నం ఆయన హ్యూస్టన్ నుండి ఉత్తర దిశగా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. వెంకటేష్ నెబ్రాస్కాలో నివసిస్తూ, H-1B వీసాపై అక్కడ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సౌత్-సెంట్రల్ కాన్సాస్‌లో కురిసిన భారీ వర్షాల (6 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం) కారణంగా అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి. వెల్లింగ్టన్లోని 'సౌత్ ఆలివర్ రోడ్' బ్రిడ్జ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో మునిగిపోయింది. కారులో ఒకరు చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం అందించడంతో సమ్నర్ కౌంటీ ఎమర్జెన్సీ రెస్పాండర్స్ రంగంలోకి దిగారు. అయిత వరద ఉధృతి, బలమైన ప్రవాహాల కారణంగా ప్రారంభంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, ఎయిర్ యూనిట్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. కాన్సాస్ హైవే పెట్రోల్ ఎయిర్ యూనిట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు అనంతరం ఆదివారం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించింది. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహాన్ని భారతదేశానికి (స్వగ్రామానికి) తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కన్సులేట్ పేర్కొంది. ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు -
డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మహాత్ముడు సైతం నిత్యం యోగా, ధ్యానం చేసేవారని, అలాంటి గాంధీవిగ్రహం ముందు ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం సంతోషం అని అతిథులకు సాదర స్వాగతం పలికారు. కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం ఆమోదించబడింది. 2015లో మొదటి యోగా దినోత్సవం నిర్వహించినప్పటి నుంచి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ జూన్ 21న యోగాలో పాల్గొంటున్నారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలను భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన ఒక గొప్ప బహుమతి అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. ‘యోగా అనే పదానికి అర్థం - ఐక్యత. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య ఉన్న అనుసంధానాన్ని సూచిస్తుంది. యోగా సాధన చేయడం వల్ల శరీర సౌలభ్యం, బలం, సరైన భంగిమ, శ్వాస నియంత్రణ మెరుగుపడతాయి. అలాగే, నేటి వేగవంతమైన ప్రపంచంలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడులను, ఆందోళనలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొం దించుకోవడానికి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని మనం సంకల్పిద్దాం’ అని అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలగా ఈ గాంధీ మెమోరియల్ వద్ద క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఏటా పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం, తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు లతో సహా అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు -
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్‌లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్‌లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్‌కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
తానా ప్రపంచ సాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. “అచ్చ తెలుగు తిట్లు” అనే అంశం మీద ఆదివారం జరిగిన 93 వ అంతర్జాల సమావేశం చాలా ఉల్లాసంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అనాదినుంచి తిట్లు తెలుగు భాషలో ఒక భాగంగానే ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలలో, స్నేహితుల మధ్య వాడే కొన్ని పదాలు బయటివారికి కఠినంగా అనిపించినా, అవి అక్కడ వారి ఆప్యాయత లేదా సంబంధాలకు సంకేతాలుగా ఉంటాయన్నారు. కన్యాశుల్కం నాటకంలాంటి నాటకాలలోను, పాత సినిమాలలోను వాడిన సరదా తిట్లు సునిశితమైన హాస్యాన్ని పంచాయి. వీధి భాష, గ్రామీణ సంభాషణలలో తిట్లు అలవోకగా చాలా సహజంగా జాలువారతాయి. అయితే అవి మోతాదు మించితే బూతులుగా పరిణమిస్తాయి, ప్రస్తుతం రాజకీయాలలో కొంతమంది రాజకీయనాయకులు “న బూతో న భవిష్యత్” గా మార్చుకుని, ఒకరిని మించి ఒకరు బూతులతో తిట్టుకోవడంతో సమాజంలో జుగుప్సాకర వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కనుక వాడే భాష పట్ల జాగ్రత్త అవసరం” అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు వేదకవి, సినీ గీతరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ళ భరణి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డి. విజయలక్ష్మి, రచయిత ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ రచయిత జి.యస్ మోహన్ తదితరులు హాజరయ్యారు. చివరగా తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ”తిట్ల మీద ఇంత సుదీర్ఘంగా ఒక సమావేశం జరగడం బహుశా ఇదే మొదటిసారి అయిఉంటుందని, పాల్గొన్న వక్తలందరూ ఎన్నో అరుదైన, విలువైన అంశాలను స్పృశించి ఈ తెలుగు తిట్ల సమావేశానికి శోభను చేకూర్చారని అందరికీ కృతజ్ఞతలు అన్నారు.(చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు
పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అమెరికాలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన వెంకటేష్ అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. అతడు గల్లంతయిన విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలిసింది. -
అమెరికాలో మోసం... హైదరాబాద్‌లో కేసు!
హైదరాబాద్: అమెరికాలో వ్యాపారవేత్తను మోసం చేసిన సంఘటనలో జూబ్లీహిల్స్‌కు చెందిన క్రాంతి విస్తాకులపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) కేసు నమోదు చేసింది. అమెరికా వాసి కేసీ మీహాన్ తన జీపీఏ హోల్డర్ ద్వారా ఈ ఫిర్యాదు చేశారు. క్రాంతి తాను ’ధామా’ సంస్థల వ్యవస్థాపకుడినని, తమ వ్యాపార విలువ 10 మిలియన్ డాలర్లని నమ్మించి, మీహాన్ నుంచి 2016లో 50 వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టించారు. ఏడాదిలోగా 10 శాతం వడ్డీతో అసలు తిరిగేస్తామని ప్రామిసరీ నోట్ రాసిచ్చిన, 0.5 శాతం ఈక్విటీ ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే గడువు తీరినా క్రాంతి డబ్బులు చెల్లించలేదు. వడ్డీతో కలిపి క్రాంతి చెల్లించాల్సిన మొత్తం 1,05,846 డాలర్లకు (రూ.90 లక్షలు) చేరింది. కాగా, క్రాంతి అమెరికాలోని సంస్థను మూసేసి, ఇతర ఇన్వెస్టర్ల నిధులు కూడా దురి్వనియోగం చేసి భారత్‌కు పారిపోవడంతో బాధితుడు సీసీఎస్‌ను ఆశ్రయించారు. -
భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి
ఢిల్లీ: భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0లో హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 24 గంటల ముందే వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు 21 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య వివరాలు ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) భాగస్వామ్యంతో 'ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు ఈ కాంటాక్ట్‌లెస్ హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ పోర్టల్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఈ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి.ఫామ్‌ను ఇలా నింపండి..భారతదేశానికి చేరుకోవడానికి ముందే ఈ ఎయిర్ సువిధ ఫామ్‌ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఫామ్‌లో నమోదు చేసే వివరాలు మీ ఒరిజినల్ ప్రయాణ పత్రాలతో (పాస్‌పోర్ట్, టికెట్) సరిపోలాలి. విమానాశ్రయంలో వెరిఫికేషన్ కోసం అక్నాలెడ్జ్మెంట్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.స్టెప్ 1: వ్యక్తిగత, ప్రయాణ వివరాలుమీ పాస్‌పోర్ట్ వివరాలు, జాతీయత గత 21 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాల వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించారా అనే విషయాన్ని పేర్కొనాలి. వీటితో పాటు మీ ఫ్లైట్ నంబర్, ఇండియాలో మీరు దిగే మొదటి విమానాశ్రయం పేరు, మరియు ట్రాన్సిట్ (కనెక్టింగ్) దేశాల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.స్టెప్ 2: వివరాలు, వెరిఫికేషన్భారతదేశంలోని మీ నివాస చిరునామా లేదా విదేశీ బస వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్/ఈమెయిల్‌కు వచ్చే OTP ద్వారా వివరాలను వెరిఫై చేయాలి.స్టెప్ 3: ఆరోగ్య సమాచారం మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు లేదా అక్కడ ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు డిక్లేర్ చేస్తే మాత్రమే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే హెల్త్ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.స్టెప్ 4: రివ్యూ, సబ్మిట్మీరు ఇచ్చిన వివరాలన్నీ చట్టబద్ధంగా సరైనవేనని నిర్ధారించుకుంటూ, మీ వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌పై టిక్ చేయాలి. అనంతరం ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.ఫామ్ సబ్మిట్ చేసిన అనంతరం..ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అలాగే మీ మెయిల్‌కు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ప్రయాణికులు ఈ అక్నాలెడ్జ్మెంట్ను డిజిటల్ రూపంలో ప్రింట్ తీసుకుని విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ వద్ద చూపించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎయిర్పోర్ట్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్ మీకు అవసరమైతే అదనపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. -
కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక!
94 ఏళ్ల బామ్మ భారతీయ పౌరసత్వం కోసం కలెక్టర్‌ని ఆశ్రయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తన శేష జీవితం భారతీయురాలిగా గడపాలంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పిన తీరు అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె కథేంటంటే..ఆ బామ్మే ఆంద్రప్రదేశ్‌కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. భర్త మరణానంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌లో ఆంకాలజిస్ట్‌గా (క్యాన్సర్ వైద్య నిపుణుడిగా) పనిచేసేవారు. 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మ అమెరికా పౌరురాలిగా మారారు. ఆమె అక్కడ సుమారు 18 ఏళ్లు నివసించారు. ఆ తర్వాత తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరడంతో ఆమె 2018లో తిరిగి భారతదేశానికి వచ్చారు. దాంతో ఆమెకు మళ్లీ భారతీయ పౌరురాలిగా మారాలనే కోరిక కలిగింది. ఈ ప్రక్రియ వేగంతంగా అవ్వాలని కోరుతూ మహాలక్ష్మమ్మ కలెక్టర్ గారిని కలిశారు. ఆయనతో బామ్మ "కలెక్టర్ గారు నాకు 95 ఏళ్లు నిండనున్నాయి. నా చివరి రోజులను నా మాతృభూమిలో భారతీయ పౌరురాలిగా గడపడమే నా ఏకైక కోరిక. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే నా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారతీయ పౌరసత్వం లభించేలా సహాయం చేయండి." అని కోరింది. తాను ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కేవలం తన మిగిలిన జీవితాన్ని తన జన్మస్థలంలోనే గడిపేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని స్థానికి అధికారులను కోరారు. దీనికి జిల్లా కలెక్టర్‌గారు స్పందిస్తూ..పౌరసత్వంపై తుది సిఫార్సును కేంద్ర అధికారులకు పంపే ముందు స్థానిక విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ తర్వాత ఈ అభ్యర్థనపై నిర్ణీత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ బామ్మకు హామీ ఇచ్చారు. (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
లండన్/కామారెడ్డి: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. ఈ హఠాన్మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా, ఘటనపై దర్యాప్తు జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్‌జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్‌లో ‘స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్‌బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్‌జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్‌సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్‌లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు
ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా కలర్ఫుల్గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్తో ఆహూతులను అలరించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు.ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్‌లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితెందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల విజయానికి కీలకమైన పాత్ర వహించాయని 'మాటా' నిర్వహకులు ప్రకటించారు.సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. -
ఉత్తర అమెరికాలో తెలుగు భాషాభివృద్ధిలో మరో మైలురాయి
ఉత్తర అమెరికాలో తెలుగు భాషా బోధనకు అంకితభావంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మరోసారి తన విద్యా ప్రస్థానంలో విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయులలో నిర్వహించిన వార్షిక తెలుగు విద్యా పరీక్షలకు మొత్తం 3,037 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పర్యవేక్షించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులలో 98.74% శాతం మంది ఉత్తీర్ణత సాధించడం, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల పిల్లల్లో తెలుగు భాషా పరిరక్షణ, ప్రచారం కోసం సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషికి గొప్ప గుర్తింపుగా నిలిచింది. పరీక్షల నిర్వహణ కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.మునిరత్నం నాయుడు, పరీక్షల నియంత్రణాధికారి డా.ముసుగు శ్రీనివాసరావు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 56 కేంద్రాల్లో పరీక్షలు అమెరికా, కెనడా వ్యాప్తంగా ఉన్న 56 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న తెలుగు పిల్లలు తమ మాతృభాషను నిబద్ధతతో నేర్చుకోవడం ఎంతో ఆనందదాయకమని మునిరత్నం నాయుడు అన్నారు. 3,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం, వారిలో దాదాపు 99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం, అలాగే సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల నాణ్యతకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. మాతృభాషను తరతరాలకు అందించే ఈ యజ్ఞంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను సత్కరిస్తూ, అమెరికా, కెనడాలోని 17 ప్రాంతాల్లో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, టెక్సాస్‌లోని డల్లాస్, మిచిగన్, వర్జీనియా ప్రాంతాల్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు డా. మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించారు. ఏరియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి డా. మృణాళిని చుండూరి, లాస్ ఏంజెలెస్, సిలికాన్ వ్యాలీలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్, ప్రెసిడెంట్ చమర్తి రాజు మాట్లాడుతూ ‘‘మనబడి ప్రారంభమైన నాటి నుంచి ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలకు మాతృభాషను చేరువ చేయడమే మా లక్ష్యం. ఈ సంవత్సరం సాధించిన 98.74 శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల కృషికి, తల్లిదండ్రుల అంకితభావానికి, మా స్వచ్ఛంద ఉపాధ్యాయుల సేవాభావానికి ప్రతిఫలం. తెలుగు భాషను కేవలం నేర్పడం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని తదుపరి తరాలకు అందించాలనే సంకల్పంతో మనబడి ముందుకు సాగుతోంది’’ అని తెలిపారు. -
రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..!
భారతీయ చీరకు ఎప్పటికీ వన్నెతరగని గౌరవం ఉందని మరోసారి రుజువైంది. బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైన రాయల్ కార్యక్రమంలో తప్పనిసరిగా డ్రెస్‌లు, టోపీలే ధరించాలి..కానీ ఆమె భారత సంప్రదాయ చీరనే ఎంచుకుని అందర్నీ ఆకర్షించడమే కాదు..అందురూ పనిగట్టుకుని ఆమెను పలకరించడం విశేషం. ఎవరామె అంటే..ఆ మహిళే భారత సంతతి రచయిత్రి కామిని బంగా. స్వతహాగా బ్రిటన్ పౌరురాలే అయినా..ఆమె భారత సాంప్రదాయ చీరలోనే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. పైగా తన మూలాలతో ఉన్న బంధాలు ఎన్నటికీ మారవని సగర్వంగా చెబుతోందామె. రాయల్ ఆస్కాట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ రచయిత్రి ఇలా సాంప్రదాయ చందేరి చీరలో తళక్కుమంది. ఇంతకీ ఏంటి రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్రపు పందెం కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి ఏడాది బెర్క్‌షైర్‌లోని ఆస్కట్ రేస్‌కోర్స్‌లో జరుగుతుంది. బ్రిటిష్ రాజకుటుంబంతో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందిన ఐదు రోజుల కార్యక్రమం ఇది. దీనికి హాజరయ్యే వారంతా ఆడంబరమైన దుస్తుల, ప్రత్యేమైన టోపీలు ధరించి వస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే రాయల్ ఎన్‌క్లోజర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కఠినమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ మహిళలు ఫార్మల్ దుస్తులతో పాటు టోపీలు లేదా ఫ్యాసినేటర్లను ధరించాలి, లేదా తగిన జాతీయ దుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ రచయిత్రి కామిని బంగా సాంప్రదాయ చీరనే ఎంచుకున్నారు. చీరనే ఎందుకంటే..తాను ఆస్కట్లో సాధారణంగా కనిపించే ఆకర్షణీయమైన దుస్తులే ధరించాలనుకుందట. తనకు రాయల్ ఆస్కట్ ఆహ్వానం అందగానే..తన బ్రిటన్ స్నేహతులతో షాపింగ్ కూడా చేశారట. ఆస్కట్ కోసం అందమైన మహిళలు ధరించే వేసవి దుస్తులు ప్రయత్నించి చూశానని, కానీ అవి తనకు సహజంగా అనిపించలేదన్నారు. తనెందుకో ఇంగ్లీష్ డ్రెస్, టోపీ తనకు ఎప్పటికీ సరిపోవని అనిపించిందన్నారు. తన స్నేహితులు ఆ డ్రెస్ తనకు బాగానే ఉందని చెప్పినా.. తనకే ఎందుకో సహజంగా అనిపించలేదన్నారు. చివరికి ఇలా బంగా రాయల్ ఆస్కట్కు వింటేజ్ ఆభరణాలతో కూడిన చందేరి చీరలో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను 20 ఏళ్లుగా యూకేలో నివశిస్తున్నానని, ఐనా ఈ దేశ పౌరురాలిగా కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ మారవని అంటోంది. అదీగాక తన వారసత్వాన్ని స్వీకరించడం వల్లే ఆస్కాట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తావని స్నేహితులు కూడా అనడంతో ఇలా ఈ ఆహార్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. అయితే అక్కడకు వచ్చిన వారిందరి నుంచి, అలాగే భద్రతా సిబ్బంది, అక్కడున్న యువతుల నుంచి విశేషస్పందన వచ్చిందని లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారామె. పైగా ప్రతి ఒక్కరూ తనను ఆపి మరి అభినందించారని చెప్పుకొచ్చింది. ఎక్కడైన భారతీయ చీరకు మించిన ఫ్యాషన్ లేదు కదా..!.(చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..) -
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. -
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్‌రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్‌లు ఆనందం వ్యక్తం చేశారు. -
గల్ఫ్‌లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
అమెరికాలో విద్వేషానికి చోటు లేదు
వాషింగ్టన్: అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా విద్వేష ఘటనలు పెరగటంపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష, పక్షపాతాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, జాతీయతతో సంబంధం లేకుండా, ఏ వర్గంపై అయినా జరిగే ద్వేషపూరిత చర్యలను సమిష్టిగా వ్యతిరేకించాలని ఎక్స్ వేదికగా నొక్కి చెప్పారు. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘శ్వేతజాతి ఆధిపత్యవాదులుగా గుర్తించబడిన ఒక బృందం సిటీ హాల్ బయట భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత జాతీయ జెండాను చించివేశారు. హిందువులైనా, ముస్లింలైనా, యూదులైనా.. ఎవరిపట్ల అయినా పక్షపాతం, వివక్షలకు వ్యతిరేకంగా మనం భుజం భుజం కలిపి నిలబడాలి. మతం, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. విద్వేషానికి వ్యతిరేకంగా సెనేట్‌లో తీర్మానంఈ విషయంపై కృష్ణమూర్తి గతంలో కాంగ్రెస్‌లో కూడా తన గళం వినిపించారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై దాడి చేస్తూ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన ఒక విద్వేషపూరిత పోస్ట్‌ను ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రచారం చేయడాన్ని కృష్ణమూర్తి ఖండించారు. భారతీయ అమెరికన్లు, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ డెమొక్రటిక్ సభ్యులతో కలిసి సెనేట్‌లో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.‘భారత్, చైనా గురించి అవమానకరమైన భాషను ఉపయోగించడం, వలసదారుల విధేయతను ప్రశ్నించడం, భారతీయ అమెరికన్లను, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని హానికరమైన మూసధోరణులను ప్రచారం చేయడం సరికాదు’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ‘ది సావేజ్ నేషన్’రేడియో కార్యక్రమంలో ‘ఇక్కడ జన్మింంచిన ఒక శిశువు తక్షణమే పౌరురాలు అవుతుంది. ఆ తర్వాత వారు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరక కూపం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు’ అంటూ వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని తీర్మానం ఖండించింది. ఈ భాష హానికరమైన మూస ధోరణులను బలపరుస్తుందని, వలస సమాజాల పట్ల విద్వేషాన్ని పెంచుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్‌గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్‌లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్‌లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్‌లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని.. -
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్‌కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.ఇదీ చదవండి : 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీగుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్‌ను యజమాని నిరవధికంగా సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ : తీవ్ర ఉద్రిక్తత -
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్ఆర్ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ఆర్వో ఖాతాల నుంచి ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్‌హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్‌తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్‌సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు) -
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్‌లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి. -
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. -
లండన్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మరణం
లండన్‌లో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లోని ఒక విలాసవంతమైన నివాస భవనంలో 36వ అంతస్తు బాల్కనీ నుండి కింద పడి భారత సంతతికి చెందిన దంపతులు, వారి తొమ్మిదేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మే 27న దక్షిణ లండన్‌లోని 46 అంతస్తుల భవనంలో జరిగింది.మే 27న భవనం 36వ అంతస్తులపైనుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సేవా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారామెడిక్స్ వారిని బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాకేష్ పై (47), ఆయన భార్య అదితి పరల్కర్ (46) తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ (9) అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే సందేహాలు వెల్లువెత్తాయి.సిద్‌కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, ఇదే వారి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్, ఆదితి 2020లో భారత్‌లో తమ కుమారుడికి వైద్యం చేయించారని, అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడం, ఇక దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో వారు లండన్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.ఘోర విషాదం, ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో యూకేలోనే పుట్టాడని, ఆ సమస్యలే వారు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయల్ ఆ భవన నివాసితులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ దంపతులు ఫైనాన్స్ , నిర్మాణ రంగ కన్సల్టింగ్ విభాగాల్లో పనిచేసేవారు. ఫ్రెండ్స్ అంతా వీరిని 'ఆది' 'రాబిన్' అని పిల్చుకునే వారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ అనారోగ్యం విషయంలో అదితి బాగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా, రాబిన్ ప్రశాంతంగా, పరిస్థితులను మేనేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.మరోవైపు ఈ విషాదానికి కొన్ని వారాల ముందు, వీరి ఇంటినుంచి అరుపులు కేకలు వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త -
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
టాంపా, ఫ్లోరిడా: అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి విశేషగా నిలిచింది. అమెరికా స్టెయిన్ బ్రెన్నర్ హైస్కూల్ (ఫ్లోరిడా)లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో ద్వితీయ బహుమతి సాధించింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యార్థుల ఆవిష్కరణల పోటీలలో ఒకటైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్‌లో, 35 రాష్ట్రాల నుండి పాల్గొన్న 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన “ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)” అనే వినూత్న ఆవిష్కరణకు గాను ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఇషాన్వి జాతీయ స్థాయి ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ ఇన్వెన్షన్ కన్వెన్షన్ నుండి ప్రారంభమైంది.స్మార్ట్ కేన్ ప్రత్యేకతలుఈ స్మార్ట్ కేన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడేలా ఆధునిక AI సాంకేతికతతో రూపొందించబడింది.రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థఆన్-డివైస్ (Large Language Models) ద్వారా ప్రాసెసింగ్బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశంఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందిఅడ్డంకులను ముందుగానే గుర్తించే (Obstacle Detection) వ్యవస్థతప్పు గుర్తింపులను తగ్గించే False Detection Suppression టెక్నాలజీఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు. ఇషాన్వి విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మరోవైపు తెలుగు సమాజానికి గర్వకారణమవుతుందని విధ్యార్దిని ఇషాన్వి సబ్నివీసు తెలిపింది.దీనికి హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందిందించింది. ఇషాన్వి లాంటి యువ ఆవిష్కర్తలు ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ భవిష్యత్ టెక్నాలజీ దిశను నిర్దేశిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. -
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్‌కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్‌రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్‌రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్‌రెడ్డి ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్‌రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్‌రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్‌కు రానున్న మృతదేహం..అనురూప్‌రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. "దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.ప్రమాదానికి గల కారణాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వివరిస్తూ.. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి గురైన ట్రక్కు, బస్సులను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం.. సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని భారత రాయబార కార్యాలయ అధికారులు పరామర్శించారు. -
నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. యూకేలో జైలు శిక్ష ఎన్నేళ్లంటే?
లండన్: యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. ఈక్రమంలో యూకే సొలిసిటర్ శ్రీనివాస్ సంచలన విషయాలు బయటపెట్టారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ బృందం నుంచి తప్పుకున్న ఏఐ సలహాదారు
వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్‌కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్‌షిప్‌లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్‌గా పనిచేశారు.ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు. -
పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చిచంపారు
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్‌ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్‌లో టైలర్‌గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్‌తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు. -
గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్
అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు భారీ ఊరట లభించింది. గ్రీన్‌కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు అమెరికా ఫెడరల్ కోర్టు చెక్ పెట్టింది. ఆ ఆదేశాలు చెల్లుబాటు కావని తీర్పు ఇచ్చింది. దీంతో స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడికి మరో పరాభవం ఎదురైనట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన పలు వలస విధానాలపై రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం "జాతీయ భద్రత" పేరుతో 39 దేశాలకు చెందిన విదేశీయుల గ్రీన్‌కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అంతేకాకుండా ఆశ్రయం (అసైలమ్) కోసం దరఖాస్తు చేసిన వారి కేసులను కూడా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయాలను పరిశీలించిన న్యాయమూర్తి జాన్ మెక్కానెల్.. ప్రభుత్వం తనకు లేని అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు."అమెరికాకు రావాలంటే చట్టాన్ని అనుసరించాలి అని తరచూ చెబుతుంటారు. ఈ కేసులో దరఖాస్తుదారులు అదే చేశారు. అయినప్పటికీ వారికి అన్యాయం జరిగింది. చట్టాన్ని పాటించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన దరఖాస్తుదారులను ఇలా నిరవధికంగా వేచి ఉండమని చెప్పలేరు" అంటూ కీలక తీర్పు ఇచ్చింది.ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పులు. ఈ ఘటనలో అరెస్టైన వ్యక్తి అఫ్గానిస్థాన్‌కు చెందినవాడు కావడంతో ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణంగా చూపుతూ పలు దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. అనంతరం "ట్రావెల్ బ్యాన్" జాబితాను విస్తరించి మొత్తం 39 దేశాలను చేర్చింది. ఈ జాబితాలోని దేశాల పౌరుల గ్రీన్‌కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిరవధికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఆశ్రయం కోరిన వారి దరఖాస్తులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.అయితే కోర్టు తాజాగా ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చింది. వలస ప్రయోజనాలపై నిలిపివేత, ఆశ్రయ దరఖాస్తుల నిలిపివేత, ఇప్పటికే ఆమోదించిన కేసుల పునఃసమీక్ష, ట్రావెల్ బ్యాన్ దేశాలకు చెందిన వారిపై ప్రత్యేక ప్రతికూల దృష్టితో వ్యవహరించే విధానాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వేలాది మంది వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్‌కార్డుల కోసం, ఉద్యోగ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారింది.అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా, చట్టబద్ధ వలస మార్గాలను పరిరక్షించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న రాజకీయ పోరులో ఈ తీర్పు మరో కీలక మలుపుగా మారింది. "జాతీయ భద్రత" పేరుతో విధించిన ఆంక్షలకు కోర్టు అడ్డుకట్ట వేయడంతో.. చట్టబద్ధంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
ప్రాణాలతో పోరాడుతుంటే.. సంకెళ్లు వేశారు!
కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్‌లో వైరల్‌గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్‌కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంగా యూరప్‌లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది. -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్‌కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: యూట్యూబర్ రమా నందన(అలియాస్ నందు), ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ దంపతులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్‌లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్‌లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్‌లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని క్రాంతి కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. -
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్‌కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది. -
న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు. -
నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో బిగ్ ట్విస్ట్?!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చాయి. నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ యూట్యూబ్‌లో ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్ చేశారా?. వైరల్ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.సోషల్ మీడియాలో నందు వరల్డ్‌తో ఫేమస్‌యిన రమానందన, జాగర్లముడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్‌లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్ దంపతులపై కేసుస్కామ్ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్‌ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్‌ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలుఒకప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ సింబల్‌గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్ మీడియా నిండిపోయింది. వైరల్ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్ చేశాయి. సోషల్ మీడియా స్టార్డమ్ నుంచి క్రిమినల్ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్ వరల్డ్ వ్యవహారం సోషల్ మీడియా నుంచి పోలీస్ స్టేషన్ వరకు హాట్టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్‌కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్ షిప్ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్ స్పాన్సర్ షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.యూట్యూబ్‌లో తమకు వస్తున్న ఫేమ్‌ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్‌కు డబ్బులు పంపిన సస్కక్రీన్ షార్ట్స్, మనీ ట్రాన్సాక్షన్ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. -
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్‌లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్‌లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్‌ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్‌కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్‌కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్‌ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
ఆటా సభలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్‌కు వివరించారు. -
కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది. -
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు) -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్‌లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్‌లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్‌లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్‌లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్‌మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్‌రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్‌రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్‌రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్‌రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్‌లో ఉన్న సెబాన్ రివర్‌లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్‌రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్‌రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్‌లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్‌లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్‌లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్‌తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్‌లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్ -
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యందరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.కాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది. -
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్‌మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు. -
అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి శ్రేయో పారిఖ్ విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన ఈ 14 ఏళ్ల బాలుడు, గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో తన అపార ప్రతిభ ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. శ్రేయ్ మొత్తం 90-సెకన్ల స్పెల్-ఆఫ్ రౌండ్లో అంచనాలకు తగ్గట్టుగా మొత్తం 32 పదాలను సరిగ్గా పలికి విజయం దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సుమారు రూ. 48 లక్షల నగదు, పతకం, స్క్రిప్స్ కప్, మెరియం వెబ్‌స్టర్ నుంచి రూ. 24 లక్షల నగదుర, డెల్టా నుంచి రూ. 96 వేలు విలువ చేసే ఫ్లైట్ క్రెడిట్లు, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా నుంచి రూ. 38 వేలు విలువ చేసే వర్క్స్ శ్రేయ్‌కు లభించనున్నాయి. గతంలో 2024 పోటీల్లో మూడోస్థానంలో నిలవడగా..తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోపీ దక్కించుకున్నాడు. ఇక శ్రేయ్‌కు టెన్నిస్, రీడింగ్, గణితం, చెస్ వంటివి అతడి అభిరుచులు. చివరగా తనకు ఎక్కువగా భారత్‌లోని తాతయ్య నానమ్మల వద్ద గడపడం అంటే మహా ఇష్టం అని చెబుతున్నాడు. (చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
ఆటా మహాసభలకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా బృందం మహాసభ కార్యక్రమ వివరాలను సీఎంకు వివరించారు. ఎన్నారైలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దత్తత అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎంను కలిసిన వారిలో ఆటా నేషనల్ కో–ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కో–ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహాసభలకు హాజరవుతానని ఆటా ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. చదవండి: ఇకపై ప్రభుత్వ ఆస్తిగా హైదరాబాద్ మెట్రోముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (#ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న… pic.twitter.com/g7WTYtpWl1— Telangana CMO (@TelanganaCMO) May 25, 2026 -
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్‌లో గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్‌గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్‌సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్‌తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు
సాంస్కృతిక సామరస్యానికి అంకితమైన ఒక ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన స్టిచింగ్ వసుధైవ కుటుంబకం (SVK), శ్రీ అన్నమాచార్యుల జీవితాన్ని, కాలాతీత వారసత్వాన్ని సంగీత ప్రతిభను ఘనంగా స్మరించుకుంది. మే 23న, ఆ సంగీత విద్వాంసుని 618వ జయంతి సందర్భంగా, SVK ఐండ్హోవెన్లో ఒక మహత్తరమైన శ్రీ అన్నమాచార్య ఆరాధనను నిర్వహించింది. ఈ సాంస్కృతిక మైలురాయి, పశ్చిమ ఐరోపా నలుమూలల నుంచి ఎన్నో ప్రఖ్యాత సంగీత, నృత్య పాఠశాలలను ఒకచోట చేర్చి, శ్రీ అన్నమాచార్యులువారికి కళ, సంగీతం, ప్రగాఢ భక్తితో కూడిన సామూహిక నివాళిని అర్పించింది. ఈ కార్యక్రమంలో 170 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అంతేగాదు 75 ఏళ్ల వయసు ఉన్న అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు, చిన్న పిల్లలు కూడా అన్నమాచార్యుల వారి క్లిష్టమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను, సంకీర్తనలను అలవోకగా పఠించడం, ప్రదర్శించడం చూడటం ప్రాచీన సంప్రదాయ పరిరక్షణకు ఒక నిదర్శనంగా నిలిచింది. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరమైన మద్దతుతో మంత్రముగ్ధులైన ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ, గొప్ప వారసత్వాన్ని తర్వాతి తరానికి ఎలా విజయవంతంగా అందించవచ్చో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఐండ్హోవెన్ నగర కౌన్సిలర్లు మిరియం ఫ్రోసీ, చైతాలి సేన్‌గుప్తాతో పాటు సంస్కృతి అండ్ సంస్కార్ సంస్థ అధిపతి వల్లభ్ పాండే, హెచ్ఎస్ఎస్ ఐండ్హోవెన్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వారిలో ఉన్నారు.అతిథులందరూ యువ కళాకారులను ఆశీర్వదించి.. వారి అసాధారణ క్రమశిక్షణను ప్రశంసించారు. శాస్త్రీయ కళల పట్ల వారి అంకితభావాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. అన్నమాచార్యుల చారిత్రక పాత్రకు తగిన నివాళిగా.. సుందరంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాల పవిత్ర వాతావరణంలో ఈ కళా ప్రదర్శనలు జరిగాయి.(చదవండి: సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్) -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్‌ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్‌కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్‌ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్‌ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు
లండన్: బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్ నుంచి పర్వీన్ రాణి కుటుంబం 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. పర్వీన్ రాణి కుమారుడు తుషార్ కుమార్ (23) లండన్‌లోని కింగ్స్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్ రాణి, తుషార్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు.ఈ క్రమంలో ఎల్స్ట్రీ అండ్ బోరమ్వుడ్ పట్టణ కౌన్సిల్‌కు తుషార్ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్ తల్లి పర్వీన్ రాణి హర్ట్స్‌మేర్ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్ చరిత్ర సృష్టించారు. Historic moment in UK politics! For the first time an Indian origin mother and son have become Mayors in Britain. 23 years old Tushar Kumar created history by becoming the youngest Mayor of borehamwood town council, while his mother Praveen Rani was elected mayor of Hertsmere… pic.twitter.com/Z2de5J8z7x— Neeraj Ranjan (@NeerajRanjan84) May 25, 2026 -
మన విద్యార్థులకు కరెన్సీ కష్టాలు
రూపాయి విలువ పతనం.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు శాపంగా మారింది. ఒక్కపూట తింటూ అర్థాకలితో బతుకుతున్నారు. తక్కువ ధరలో దొరుకుతుందని కొందరు కాలం చెల్లిన ఆహారం కోసం వెతుకుతున్నారు. డబ్బులు సరిపోక అదనపు పనులు చేస్తున్నారు. ఇదంతా వారి చదువులపై ప్రభావం చూపి విద్యార్థుల గ్రేడ్లు దెబ్బతింటున్నాయి. భారత రూపాయి ఇప్పుడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కొన్ని నెలల్లోనే తీవ్రమైంది. డాలర్‌కు రూపాయి విలువ 95 మార్కును దాటింది. ఏ క్షణంలోనైనా అది 100 చేరుకునే అవకాశం ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు పౌండ్తో పోలిస్తే రూపాయి బలహీనంగా కనిపించేది. 2013లో పౌండ్తో రూపాయి విలువ మూడంకెల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2022లో, యూరోతో పోలిస్తే రూపాయి 100 మార్కును తాకింది. ఇప్పుడు, డాలర్ విలువ 100 రూపాయలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కడుపు మాడ్చుకుంటూ విదేశాల్లో చదువు అంటే తాము ఊహించుకున్న జీవితం వేరు.. కానీ అక్కడ గడుపుతున్న జీవితం మరోలా ఉంది. బలహీనపడుతున్న రూపాయి, విదేశాల్లోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప.. మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కొందరు అసలు భోజనమే మానేయాల్సి వస్తోంది. మరికొందరు రోజుకు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు. యూకే, యూఎస్, ఆ్రస్టేలియా, సింగపూర్‌లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. బయట తినడం మొత్తమే మానేస్తున్నారు. తక్కువ ధర ఉన్న ఆహారం కోసం ‘టూ గుడ్ టు గో’వంటి యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఈ యాప్‌లు కోస్టా కాఫీ, స్టార్‌బక్స్ వంటి ఫుడ్ అవుట్లెట్లలో గడువు ముగియబోతున్న ఆహార వివరాలను పెడతాయి. ఆ లిస్టింగ్ లైవ్‌లోకి వచ్చిన వెంటనే క్షణాల్లో అయిపోతోంది. వేరోవరో బుక్ చేసుకుని అది చేజారిపోకుండా ఉండేందుకు విద్యార్థులు స్టోర్‌కు పరుగెడుతున్నారు. అదీ దొరక్కపోతే ఆకలితో అలమటించాల్సిందే. వర్సిటీ ఆహార పంపిణీపై అమెరికాలోని చాలా మంది విద్యార్థులు డబ్బు ఆదా చేసుకోవడానికి విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆహార పంపిణీపై ఆధారపడుతున్నారు. చాలా విశ్వవిద్యాలయాలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తాయి. బయట తినే ఖర్చులను తగ్గించుకోవడానికి విద్యార్థులు ఆ సామాగ్రిని తమ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కిరాణా సామగ్రిని సైతం కలిసి కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లను షేర్ చేసుకుంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఏడెనిమిది మంది విద్యార్థులు ఒకే గదిలో లేదా అపార్ట్మెంట్లో ఇరుక్కుని ఉంటున్నారు. అదనపు పని చాలా మంది విద్యార్థులు తమకు అధికారికంగా అనుమతి ఉన్న పని గంటలకు మించి పనిచేస్తున్నారు. అధికారిక పార్ట్‌టైమ్ ఉద్యోగాలతోపాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో నేల తుడవడం వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేస్తున్నారు. పౌండ్ బలపడుతున్న కొద్దీ యూకేలోని చిన్న విశ్వవిద్యాలయ పట్టణాల్లోనూ రోజువా రీ జీవితం మరింత ఖరీదైనదిగా మారింది. క్యాబ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజా రవాణా కూడా ఖరీదైనదిగా మారింది. దీంతో డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. భారత్‌లోని కుటుంబాలపై భారం... ఇది కేవలం విదేశాల్లోని విద్యార్థులనే కాదు.. భారత్ నుంచి వారి చదువుకు డబ్బు పంపుతున్న కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ కరెన్సీ పతనం మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయిస్తారు. ట్యూషన్ ఫీజులు, అద్దె, రానుపోను విమాన ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులను లెక్కిస్తారు. ఈ క్రమంలో కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం కరెన్సీ విలువ తగ్గడం ఫీజుల పెంపుదలలా పనిచేస్తోంది. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు సెమిస్టర్ వారీగా ఫీజులు వసూలు చేస్తాయి. రూపాయి విలువ పడిపోవడంతో చివరి సెమిస్టర్ల నాటికి అప్పటికే తీసుకున్న విద్యా రుణం సరిపోవడం లేదు. విద్యార్థుల ఖర్చులు పెరగడంతో మిగిలిన ఫీజులను భరించడానికి వారి తల్లిదండ్రులు అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఒకే డిగ్రీ కోసం రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక కోర్సులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రూపాయి–డాలర్ మారకపు రేటులో చిన్నపాటి తగ్గుదల కూడా నాలుగైదేళ్లలో అదనంగా పెరిగే లక్షల రూపాయలను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. గ్రేడ్లపై ప్రభావం.. భారతీయ విద్యార్థుల కష్టాలు వారి గ్రేడ్లలో ప్రతిబింబిస్తున్నాయి. డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు భోజనం మానేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు ఒకే గదిలో ఇరుక్కుని ఉంటున్నారు. నిరంతరం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో వారు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల గురించే కాకుండా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. వలస, పని వీసాల నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడంతో హెచ్–1బీ వీసా వ్యవస్థ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై అనిశ్చితి ఏర్పడింది. భవిష్యత్ గందరగోళంగా మారింది. డిస్కౌంట్లో దొరికిన ఆహారం తినే... ‘‘విదేశాల్లో చదువుకునే వారందరూ సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కాదు. స్కాలర్‌షిప్‌లపై చదువుకుంటున్న వారున్నారు. పిల్లల డిగ్రీల కోసం ఇళ్లను తాకట్టు పెట్టిన తల్లిదండ్రులూ ఉన్నారు. నా మాస్టర్స్ కోసం బడ్జెట్ వేసుకునేటప్పుడు రూపాయి అంశాన్ని నేను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ నేను లండన్ వెళ్లాక అర్థమైంది. అప్పుడు అమెరికన్ డాలర్ విలువ రూ.85 ఉంది. నేను తిరిగొచ్చేసరికి రూ. 93కి పెరిగింది. లండన్‌లో నేను చాలాసార్లు యాప్‌ల్లో డిస్కౌంట్లో దొరికిన ఆహారం తెచ్చుకునే కడుపు నింపుకున్నాను. యూకేలో ఉన్నా, అమెరికాలో చదువుతున్నా.. ఇంటి నుంచి పంపిన డబ్బును సరిపోయేలా వాడుకోవాలనే ఆందోళన ఉంటుంది. ఇది విద్యార్థుల గ్రేడ్లపై ప్రభావం చూపిస్తుంది’’అని యూకేలో చదువుకొని వచ్చిన థానేకు చెందిన మాన్వి కోలి చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పుతాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్ ఎకోసిస్టమ్‌లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.స్టార్టప్‌లకు ముప్పుఅక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్ ఫౌండర్, నిక్ డేవిడోవ్ గుర్తుచేశారు.చట్టసభ సభ్యుల ఆగ్రహంఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్
డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD)’.. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్స్కేప్లో జరిగిన ఈ వేడుక రెండు వేలకుపైగా జనంతో సందడిగా సాగింది. వెండర్ బూత్‌లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలతో పిల్లలు, యువత థ్రిల్ ఫీలయ్యారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ స్ప్రింగ్ ఫెస్ట్ ను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు.గ్రాండ్ స్కేప్ లో ఫుడ్ స్టాల్స్, ఐస్‌క్రీమ్ షాపులు ప్రత్యేకంగా కనిపించాయి. పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది.జాతీయ గీతాలతో ప్రారంభంఅమెరికా, భారత జాతీయ గీతాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) స్వాగతం పలికారు. యాంకర్ వీణ యలమంచిలి కార్యక్రమాన్ని షోను రన్ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్ప్రింగ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా) -
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు. మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం) -
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు, ఎన్నో టీమ్స్‌ను నడిపించారు. ఫలితంగా విదేశాల్లో జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్‌డౌన్ షురూ అయినట్టే.సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్ సైజ్ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన రేస్‌లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.సడన్‌గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్ఫర్ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.కెనడా, యూరప్ వైపు మొగ్గుదశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలు , AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు... -
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు. -
రష్యాలో డ్రోన్ దాడి.. ఏపీ వాసి మృతి
శ్రీకాకుళం జిల్లా: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలో విషాదం నింపింది. ఇచ్ఛాపురం మండలం ఒడిశా సరిహద్దు గ్రామమైన మాదుబందకు చెందిన ఎ.రామయ్య (26) పొట్టకూటి కోసం రష్యాకు వలస వెళ్లాడు. రష్యన్ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా.. సోమవారం వేకువజామున 4.40 నిమిషాల సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్ దాడిలో రామయ్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటికే రామయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు గౌరమ్మ, నిమ్మయ్యతో పాటు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గంజాం జిల్లా మేజిస్ట్రేట్ వి.కీర్తి బాసన్ మంగళవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..) -
మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్‌గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్‌కు స్వాగతం పలికారు.లక్ష్యాలు లండన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్‌గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్‌లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్‌గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 'బుక్‌మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు. -
ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) 2026 వేసవి క్రీడా సీజన్‌ను అధికారికంగా ప్రారంభించింది. లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఈలింగ్ హాన్వెలియన్స్ క్రికెట్ మైదానంలో జరిగిన TAL ప్రీమియర్ లీగ్ (TPL) 2026 17వ ఎడిషన్ ప్రారంభోత్సవాన్ని మే 16న ఘనంగా నిర్వహించింది.క్రికెట్, సమాజ స్పూర్తితో కాగా 2009లో TAL క్రికెట్ లీగ్‌గా ప్రారంభమైన ఈ టోర్నమెంట్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ క్రీడా వేడుకలలో ఒకటిగా ఎదిగింది. ప్రతి వేసవిలో ఆటగాళ్లు, కుటుంబాలు, అభిమానులను క్రికెట్, సమాజ స్పూర్తితో ఒక్కచోట చేర్చుతోంది. ఆటగాళ్లకు శుభాకాంక్షలుఈ ఏడాది టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. రాబోయే 15 వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్ నిర్వహించబడతాయి. చివరగా 2026 ఆగస్టు 16న స్లౌ క్రికెట్ క్లబ్లో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులను ఉద్దేశించి TAL ఛైర్మన్ రవి సబ్బా అన్ని జట్లకు, ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలను ఒక్కటిగా చేర్చే సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాల నిర్వహణ ద్వారా TAL ఎప్పటికీ తెలుగు సమాజానికి కేంద్రబిందువుగా నిలిచిందని రవి సబ్బా పేర్కొన్నారు. కుటుంబాలు, స్నేహితులు కలుసుకునే అవకాశాలను సృష్టించడం TAL ముఖ్య లక్ష్యమని తెలిపారు.100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కృషి చేసిన ట్రస్టీ సత్య పెద్ది రెడ్డి మరియు స్పోర్ట్స్ ఇన్చార్జ్ సింధూర చెరుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని వాలంటీర్లకు ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రస్టీ బోర్డు సభ్యులు సత్య పెద్ది రెడ్డి, అశోక్ మధిశెట్టి, వెంకట్ నీలా, రవి మొచెర్ల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట గార్ల సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.క్రీడా కార్యక్రమాలతో పాటు, TAL “100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్” పేరుతో ప్రత్యేక కమ్యూనిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనేవారు తమ ఆరోగ్యం , ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటూనే, తెలుగు సేవా సంస్థలు మరియు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నిధులు సమీకరించడానికి సహకరిస్తారు.ఈ కార్యక్రమాన్ని వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగే, సునీత అరిగే మరియు సింధూర చెరుకు సమన్వయం చేస్తూ, మరింత మంది సమాజ సభ్యులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..) -
కువైట్‌లో విషాదం: భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి
కువైట్: కువైట్‌లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. అబ్బాసియా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతురాలిని కేరళలోని ఎర్నాకులం జిల్లా, పెరుంబావూర్ సమీపంలోని చిరక్కర ముట్టం ప్రాంతానికి చెందిన ఫేబా బిజు మణి (14)గా గుర్తించారు. ఆమె అబ్బాసియాలోని 'యునైటెడ్ ఇండియన్ స్కూల్'లో 9వ తరగతి చదువుతోంది. అబ్బాసియా హైవే మార్కెట్ సమీపంలో ఉన్న ఒక నివాస భవనం పైనుంచి ఆమె కింద పడిపోయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు మృతదేహాన్ని తదుపరి న్యాయ, వైద్య ప్రక్రియల నిమిత్తం ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విద్యార్థిని మృతితో స్థానిక భారతీయ సమాజంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్‌జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్‌గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్‌లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్‌కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్‌లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్‌పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్‌కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్‌కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.


