సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి | YSR Jayanti celebrated in Sydney | Sakshi
Sakshi News home page

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి

Jul 5 2026 5:33 AM | Updated on Jul 5 2026 5:33 AM

YSR Jayanti celebrated in Sydney

సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం వైఎస్సార్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ కట్‌ చేసి అక్కడ ఉన్న తెలుగు వారందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసి సేవలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకొంటూ ఘనంగా నివాళి అర్పించారు. 

వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సిడ్నీ కన్వీనర్‌ అమరనాథ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా నేతలు రాజశేఖర్‌ లంకెల, శివ రెడ్డి, సిడ్నీ నాయకులు రామనాథ రెడ్డి చల్లా, పెద్ది రెడ్డి, చంద్ర మౌళి, గోపాల్‌ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement