వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల డిమాండ్
సాక్షి, అమరావతి: డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ పారిపోతోందని ఎద్దేవా చేశారు.
లక్షలాది రూపాయలు చేతులు మారాయి
డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచి్చన చరిత్ర ఎక్కడా లేదు. కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ కుంభకోణంపై పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి. – లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి
డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది. డాక్టర్, టీచర్ ఉద్యోగాలను ఏ పరీక్షలూ లేకుండా ఇష్టమొచి్చనట్లు కార్యకర్తలకు పంచుతామంటే చూస్తూ ఊరుకోం. కుంభకోణంపై కచి్చతంగా సీబీఐ విచారణ జరపాలి. మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
చర్చ అంటే పరారే
శాసనసభలో డీఎస్సీపై ఏదో నివేదిక చదివి.. చర్చకు సిద్ధమని ప్రకటించిన తండ్రీకొడుకులు శాసనమండలిలో చర్చ అంటే ఎందుకు పారిపోతున్నారు. డీఎస్సీలో అక్రమాలు, అవినీతిపై ఆధారాలతో నిరూపించడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
ఎందుకు జీవో మార్చారు
స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన 384 మందిలో ఎంతమందికి ఛాంపియన్‌షిప్‌లు, పతకాలు వచ్చాయో ప్రజల ముందు ఉంచాలి. నియామకాలు సక్రమంగా చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం మరి జీవో ఎందుకు మార్చింది? ఉపాధ్యాయ పోస్టు బేరసారాలు జరిగినట్లు ఆడియో/వీడియో ఆధారాలు వస్తే కేసు పెట్టామని చెప్పడం ద్వారా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయింది. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ
ప్రకటనల్లోనే గందరగోళం
శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చ జరగాలని పట్టుబడితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా తప్పించుకుంటోంది. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఒకలా.. కార్యదర్శి ఒకలా ప్రకటనలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ ఎంత గందరగోళంలో ఉందో అర్థమవుతోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సర్టీఫికెట్లపై స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ అసోసియేషన్ వారే లేఖ రాయడం మా దృష్టికి వచి్చంది. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ


