సాక్షి, ముంబై: మాజీ మిస్ పుణే త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త, మాజీ మహిళా న్యాయమూర్తి గిరిబాల సింగ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివాహమైన ఐదు నెలలకే ఈ ఏడాది మే 12న, త్విషా శర్మ భోపాల్‌లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పదంగా కన్నుమూయడం సంచలన రేపింది.
సీబీఐ దాఖలు చేసిన 636 పేజీల ఛార్జ్‌షీట్‌లో కట్న వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్‌మెంట్ టు సూసైడ్), ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో పనిచేయడం వంటి చట్టపరమైన సెక్షన్లను చేర్చారు.
నోయిడాకు చెందిన త్విషాకు, భూపాల్‌కు చెందిన న్యాయవది సమర్థ్ సింగ్‌తో 2025 డిసెంబర్‌లో పెళ్లి జరిగింది. ఎంబీఏ చదువుకున్న ఆమె పెళ్లికి ముందు ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసింది. అలాగే మిస్ పూణె టైటిల్ కూడా గెలుచుకున్నది. కార్పొరేట్ కెరీర్‌తో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఆమె యోగా శిక్షకురాలు కూడా. మే 12వ తేదీన అత్తారింట్లో ఆత్మహత్యు పాల్పడింది. అయితే త్విషాశర్మ కుటుంబ సభ్యులు ఆమెపై మానసిక,శారీరక వేధింపులు జరిగాయని, అధికారాన్ని ఉపయోగించి ఆధారాలను తుడిచిపెట్టేందుకు అత్తగారి కుటుంబం ప్రయత్నించిందని ఆరోపించారు. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు తొలుత పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్‌ను మే 22న జబల్‌పూర్‌లో అరెస్టు చేశారు. త్విషా అత్త రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కూడా కేసు పెట్టారు.
ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
మరణానికి కారణం ఉరివేసుకోవడమే అయినప్పటికీ, బాధితురాలి శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా జోక్యం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో కేసును సీబీఐకి అప్పగించారు. మృతదేహాన్ని ఉరి నుంచి కిందకు దించేందుకు ఉపయోగించినట్లు చెప్పిన 'జిమ్నాస్టిక్స్ బెల్ట్' ఆధారంగా సీబీఐ ఆ ఇంట్లో నేర స్థలాన్ని రీక్రియేట్ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించింది.
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!


