డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి | Hyderabad: Girl Student Complaint Against Govt Employee | Sakshi
Sakshi News home page

ప్రేమను నిరాకరించిందని యువతికి వేధింపులు

Oct 2 2026 6:42 PM | Updated on Oct 2 2026 6:42 PM

Hyderabad: Girl Student Complaint Against Govt Employee

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

హైద‌రాబాద్‌: ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించిన యువకుడిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... రామంతపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థినికి ఖైరతాబాద్‌కు చెందిన అలెక్స్‌(26) అనే ప్రభుత్వ ఉద్యోగి 2024 జూలైలో ఆమె స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడు.

2025 డిసెంబర్‌లో అలెక్స్‌ ప్రేమిస్తున్నానంటూ ప్రతిపాదించగా ఆమె నిరాకరించింది. దీంతో అతడితో మాట్లాడటం మానేసింది. అయినప్పటికీ అలెక్స్‌ ఆమెను ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూ, తనతో మాట్లాడాలని, తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన మాట వినకపోతే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించాడని తెలిపింది.

ఈ క్రమంలో 2026 మేలో బాధితురాలితో కలిసి ఉన్న ఫొటోలను ఆమె తల్లి వాట్సాప్‌ నంబర్‌కు పంపించాడు. తల్లిదండ్రులు అతడిని మందలించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా యువతికి పదేపదే ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోక్సో కేసులో జీవిత ఖైదు
గోల్కొండ: బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి కోర్టు జీవితఖైదు విధించింది. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. నాలుగేళ్ల బాలిక ఇంటి వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో ఆటుకుంటుంది. నారాయణ తాతా(76) ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తుండగా స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు చూశారు.

ఇదీ చ‌ద‌వండి: కేబీఆర్‌ పార్కులో వైల్డ్‌లైఫ్‌ వీక్‌ వేడుకలు.. ఫ్రీ ఎంట్రీ

దీంతో వారు అతడిని పట్టుకోని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ విషయంపై గత సంవత్సరం జూన్‌ 28వ తేదీన బాధితురాలి తల్లి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్‌ జడ్జ్‌ అర్చనకుమారి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 లక్షల  జరిమానా విధించారు.        

షీటీమ్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన
మూసాపేట: కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో  ‘షీ టీమ్‌’ బాలానగర్‌ సభ్యులు గురువారం విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. చందన మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో, సమాజంలో సభ్యతగా వ్యవహరించాలని, అవనసవర విషయాలతో సమయం వృథా చేసుకోవద్దన్నారు.

ఇదీ చ‌ద‌వండి: ప్లైదుబాయ్ ఘ‌ట‌న‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్‌

సెల్‌ఫోన్‌లో ఫొటోలు, మెసేజ్‌లు షేర్‌ చేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులపై హెచ్చరించారు. హక్కులు తెలుసుకుని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో షీ టీమ్‌ సిబ్బంది ఎస్‌ఐ జి. సదానందం కౌన్సిలర్‌ ఆర్‌. ఉమారాణి, పి. సంథ్యారాణిలు విద్యార్థినీలకు షీ టీమ్స్‌ సేవలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూసి కన్వీనర్‌ డా. పద్మ, ఎన్‌. శ్రావణి, శ్యామయ్య, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement