హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గం ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వందకు వందశాతం తామే గెలుస్తామన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పార్టీకి కొంత అడ్వాన్స్ ఉంటుదనే మాట వాస్తవమే కావొచ్చు కానీ తాము ఇక్కడ గెలిచి చూపెడాతామన్నారు తలసాని.
అక్కడ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడిన సందర్బంలో ఓటర్లు కూడా ప్రతిపక్ష పార్టీ పట్టం కడతారన్నారు. ఖైరతాబాద్ నియోజవర్గం అనేది ప్రత్యేకమైన నియోజకవర్గమన్నారు తలసాని. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తలసాని మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటన ద్వారా ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు.
‘సీఎం రేవంత్ సిరిసిల్ల పోయాడు.. సిద్దిపేట పోత అంటున్నాడు.. తర్వాత మేము కొడంగల్‌లో సభ పెడతాం. రానున్న రోజుల్లో కరెంట్ కోతలు తీవ్రంగా రానున్నాయి.దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ చాలా పని చేస్తోంది. మొన్న మాక్ అసెంబ్లీ పెడితే ఏం జరిగింది చూశాం. మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు భూ సర్వే కు పంపిస్తారా?, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ఎంపీలు వెళతారా?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. విజయారెడ్డి కీలక వ్యాఖ్యలు


