ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి సేవలు అందించాలి | YSRCP NRI Outreach Meeting In Charlotte North Carolina, Aluru Sambasiva Reddy Calls For Stronger Digital Campaign Strategy | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి సేవలు అందించాలి

Jul 31 2026 11:18 AM | Updated on Jul 31 2026 11:33 AM

YSRCP NRI Outreach Meeting Charlotte North Carolina Aluru Sambasiva Reddym Digital Campaign

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్‌ కో–ఆర్డినేటర్‌ ఆలూరు

అమెరికాలో ‘వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌ రీచ్‌’కు భారీగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు

సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్‌ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌ రీచ్‌ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ గ్లోబల్‌ కో–ఆర్డినేటర్‌ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్‌ఆర్‌ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.



అమెరికాలోని షార్లెట్, నార్త్‌ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌రీచ్‌ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement