ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో? | Bhogapuram International Airport, The Real Story Behind The Project And Chandrababu's Battle For Credit | Sakshi
Sakshi News home page

Bhogapuram Airport: ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో?

Jul 31 2026 10:25 AM | Updated on Jul 31 2026 11:12 AM

Chandrababu Bhogapuram Airport Credit Chori

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌ను నేనే కట్టాను.. సెల్‌ ఫోన్‌ను కూడా నేనే కనిపెట్టాను.. విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ నేనే తెచ్చానంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు. 2023 మే 3న  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించారు. అయితే, ఈ క్రెడిట్‌ అంతా వైఎస్‌ జగన్‌కు దక్కకూడదని ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది.

నిజాలు కళ్లముందు కనబడుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి..  ఎల్లో ముఠా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఇదే భ్రమలతో విషం కక్కుతున్నారు. సంక్షేమం, అభివద్దిని పక్కనపెట్టి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా చంద్రబాబు సర్కార్ పెట్టుకుంది.

అసలు జరిగింది ఇదే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టింది. కోర్టు వివాదాలు, కేసుల్ని పరిష్కరించడంతో పాటుు.. భూసేకరణను 2,750.78 ఎకరాలకు కుదించింది. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జీఎంఆర్‌ సంస్థతో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన ఎన్వోసీలు సహా మిగిలిన అనుమతుల్ని పొందారు. (Bhogapuram Airport Real Story)

ఇది కదా వాస్తవం.. 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు మరో వైపు, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.

భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.

విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్‌) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. (Bhogapuram Airport Timeline)

ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement