breaking news
Bhogapuram International Airport
-
భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు
పూసపాటిరేగ: అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రొటోకాల్ లేని నేతలను వీవీఐపీ గ్యాలరీలలో కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టు సభలో ముందు వరుసలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఆ తరువాత వరుసలో వీవీఐపీ పాసులు సంపాదించిన కూటమి నేతలు, జీఎంఆర్ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆ తరువాత వరుసలో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చివరి వరుసలో సాధారణ ప్రజలకు సమీపంలో ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవిస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. -
అత్యుత్సాహంతో ఆర్టీసీ స్వామిభక్తి
విజయనగరం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం చూపిన అత్యుత్సాహం గ్రామీణ ప్రయాణికులకు కష్టాలు తెచ్చింది. ప్రభుత్వం అడిగిన ప్రతిపాదన కంటే మరో 400 బస్సులు అదనంగా కేటాయించి ఆర్టీసీ అధికారులు తమ స్వామిభక్తిని చాటుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో కడప మినహా ఏకంగా మూడు జోన్ల నుంచి 2 వేల ఆర్టీసీ బస్సులను ఈ ఒక్క సభకే కేటాయించడం గమనార్హం. దీంతో ఆయా జోన్ల డిపోలను ఖాళీ చేసి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు తరలించారు. కొన్ని బస్సులు జనాలు లేకుండానే ఎయిర్‌పోర్టుకు ప్రయాణించాయి. -
థ్యాంక్యూ జగన్ అన్నా
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అందించిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పేర్కొంటూ... ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అనే సందేశాన్ని శనివారంపోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్యాగ్ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, అనుబంధ మౌలిక వసతుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పునాది పనులన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేయగా, ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా అదే ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత సీఎం చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోయినా, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని, అందుకే ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అంటూ ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
‘భోగాపురం’ పూర్తి క్రెడిట్ వైఎస్ జగన్‌దే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు...2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్ జగన్. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్ జగన్‌వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు. -
‘భోగాపురం’ ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం....ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. -
పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం: ప్రధాని మోదీ
సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్‌ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్‌కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. .. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్‌ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్‌సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
‘భోగాపురం.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు’
సాక్షి, తాడేపల్లి: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభంపై వైఎస్సార్సీపీ స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలంటూ పోస్టు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారని.. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా..‘రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ హయాంలో ఎయిర్‌పోర్టు భూసేకరణకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించటంతోపాటు, అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఎయిర్‌పోర్టుకు పునాది వేసి, దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అందుకే వారంతా థ్యాంక్యూ జగన్ అన్నా అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారు’ అని పోస్టు చేసింది. #BhogapuramAirportByJaganA Must Watch Video!🚨Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary… pic.twitter.com/AFyx2IhGO6— YSR Congress Party (@YSRCParty) August 1, 2026చంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు. వైఎస్ జగన్ కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. #CreditChorBabuచంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు వైయస్ జగన్ గారి కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… pic.twitter.com/yRFD3E75QV— YSR Congress Party (@YSRCParty) August 1, 2026 -
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
‘భోగాపురం’పై సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ వ్యయంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం అంచనా వ్యయంలో కొంత మాత్రమే నిర్మాణ సంస్థ వెచ్చించిందని ఆరోపించారు. మిగిలిన మౌలిక వసతులన్నీ ఏపీ ప్రభుత్వమే సమకూర్చిందని గుర్తు చేశారు. సుమారు 2 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర సేకరించి ఉచితంగా నిర్మాణ సంస్థకు ఇచ్చిందని, దీనికి పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించలేదని ఆరోపించారు.నిర్మాణ సంస్థకు భారీగా రాయితీలు కల్పించి పెట్టుబడి ముసుగులో యూజర్ డెవలప్మెంట్ ఫీజును ప్రయాణికుల నుంచి వసూలు చేయడానికి అనుమతిచ్చిందని దుయ్యబట్టారు. ఈ స్థాయిలో లబ్ధి చేకూర్చడం వెనుక ఏపీ మంత్రి లోకేష్ వర్గం ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రయాణికులపై మోపిన అదనపు చార్జీలను తక్షణమే తొలగించి, సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు?’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు. ‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు. -
భోగాపురం.. భూములిచ్చిన రైతులు చెప్పింది ఇదే..
సాక్షి, విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందని.. ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు తేల్చి చెప్పారు. గురువారం.. వైఎస్ జగన్ విశాఖ మీదగా శ్రీకాకుళం వెళ్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భోగాపురం అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలిపారు. అసలేం జరిగిందో భూములిచ్చిన తమకు తెలుసన్నారు. వైఎస్ జగన్ కృషితోనే ఇది జరిగిందన్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ కష్ట ఫలితం.. కానీ చంద్రబాబు మేం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు రైతులను మోసం చేయడానికి 15 వేల ఎకరాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500కి తగ్గించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పునరావాసం కల్పించి.. అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు.‘‘సౌకర్యాలు కల్పించి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం దారుణం. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం ఎవరో? ఏం జరిగిందో? భూములిచ్చిన రైతులకు తెలుసు’’ అని స్థానికులు పేర్కొన్నారు. -
ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్ జగన్‌దే
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు...విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది. -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్‌బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్‌పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్‌లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్‌బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
వైఎస్ జగన్ పట్టుదలకు సాక్ష్యం ఇదిగో..
చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది. -
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో?
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబు క్రెడిట్ చోరీపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌ను నేనే కట్టాను.. సెల్ ఫోన్‌ను కూడా నేనే కనిపెట్టాను.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు. 2023 మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్‌కు దక్కకూడదని ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది.నిజాలు కళ్లముందు కనబడుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి.. ఎల్లో ముఠా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఇదే భ్రమలతో విషం కక్కుతున్నారు. సంక్షేమం, అభివద్దిని పక్కనపెట్టి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా చంద్రబాబు సర్కార్ పెట్టుకుంది.అసలు జరిగింది ఇదే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టింది. కోర్టు వివాదాలు, కేసుల్ని పరిష్కరించడంతో పాటుు.. భూసేకరణను 2,750.78 ఎకరాలకు కుదించింది. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన ఎన్వోసీలు సహా మిగిలిన అనుమతుల్ని పొందారు. (Bhogapuram Airport Real Story)ఇది కదా వాస్తవం.. 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు మరో వైపు, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. (Bhogapuram Airport Timeline)ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది. -
భోగాపురం.. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు ఇలా..
భోగాపురం విమానాశ్రయం గురించిన అసలు వాస్తవాలు..2023 మే 3: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు.అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే 2023 మే నెల 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం విడుదల చేశారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మమా అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డబ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది.గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.ఫలించిన జగన్ శ్రమ...విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు, బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరులు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాస ప్యాకేజీని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది.అత్యాధునికంగా నిర్మాణం...దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ నాటి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. -
పని.. వైఎస్సార్సీపీది.. ప్రచారం.. చంద్రబాబుది
సాక్షి, అమరావతి: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సీఎం చంద్రబాబు ఏమీ చేయకపోయినా కీర్తి కోసం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ప్రాజెక్టు కట్టింది ఒకరైతే.. కీర్తి కొట్టేస్తోంది మరొకరు! ఇదీ భోగాపురం ఎయిర్‌పోర్టు కథ! పనులు చేసింది వైఎస్సార్ సీపీ.. ప్రచారం చంద్రబాబుది! క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్..! అదే చంద్రబాబు మార్కు రాజకీయం..! అంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు రూ.1,200 కోట్లు వెచ్చించి.. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకు రాగలిగామని గుర్తు చేశారు. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. తమ ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లో భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించామని గుర్తు చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఫైల్) తాము చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా శంకుస్థాపన చేయడం మినహా భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది చంద్రబాబూ? అని ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను సాక్ష్యాధారాలతో ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ఎండగట్టారు. క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ ట్యాగ్‌తో సాక్ష్యాధారాలు, భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన వీడియోను జత చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» ‘‘ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. » చంద్రబాబు గారూ..! భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. ఏమీ చేయకపోయినా 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా ఒక రాయి వేయడం మినహా భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? » జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబు గారూ?» అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం రూ.75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబు గారూ? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే.. అన్ని అనుమతులు, అన్ని ఎన్వోసీలు, అన్ని సౌకర్యాలు పూర్తి చేశాం కాబట్టే, కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.» మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.» చంద్రబాబు గారూ మీరు అప్పుడూ ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ చేయడం లేదు. విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ఎయిర్‌పోర్టు ఉంది కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖ నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవే కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారూ.. మీరు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి! గతంలో అయినా అంతే.. ఇప్పుడైనా అంతే! పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి’’ -
ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: చేయనిది చెప్పుకోవడం.. వేరొకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్‌లో భాగంగా.. ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ పునాది నుంచి నిధుల కేటాయింపుల దాకా అప్పటి జగన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై స్పందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులను వైఎస్ జగన్ హయాంలోనే సాధించామని ధర్మాన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.జగన్ ప్రభుత్వం వేసిన పునాదులే ఇవిభోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తామే పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని ధర్మాన విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. "భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ ప్రభుత్వం పునాది వేసింది. అవసరమైన అనుమతులు, సదుపాయాలు, నిధుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది" అని ధర్మాన పేర్కొన్నారు.భోగాపురంపై కొనసాగుతున్న క్రెడిట్ ఫైట్ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టు వేగం పుంజుకుందని వైఎస్సార్సీపీ చెబుతుండగా.. కూటమి ప్రభుత్వం అదంతా తమ క్రెడిటేనంటూ సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం చేసుకుంటోంది. కీలక వ్యాఖ్యలుఉత్తరాంధ్ర నిధులను అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడుతు పెడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజన వాదం బలపడే పరిస్థితులు వచ్చాయి. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. -
భోగాపురం 'చేరేదెలా'?
ముందుచూపు లేనివాడికి ముంగిట్లోనే ముప్పు అన్నట్లుంది విశాఖ మెట్రో నిర్లక్ష్యం. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే సిద్ధమవుతుంటే.. అక్కడికి వెళ్లే శాశ్వత రవాణా మార్గం మాత్రం పడకేసింది. భోగాపురానికి ‘వైజాగ్ మెట్రో’ అనుసంధానం అత్యవసరమని సాక్షాత్తూ ‘నీతిఆయోగ్’ మాస్టర్‌ప్లాన్ హెచ్చరిస్తున్నా.. కూటమి సర్కారు మాత్రం డీపీఆర్‌లను కాగితాలు దాటించడం లేదు. మెట్రో పట్టాలెక్కకపోతే.. భోగాపురం ప్రయాణం భవిష్యత్తులో నరకప్రాయమైన ‘ట్రాఫిక్ పద్మవ్యూహం’ కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా.. ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ గ్రోత్ హబ్ మాస్టర్‌ప్లాన్’లో నీతిఆయోగ్ విశాఖ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్‌వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ అవసరమని పేర్కొంది. భవిష్యత్ జనాభా, పారిశ్రామిక విస్తరణ, విమానాశ్రయం, పోర్టు కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. కాగితాలపైనే మెట్రో ఫేజ్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్–1, ఫేజ్–2 డీపీఆర్‌లు అంటూ కేవలం కాగితాలపైనే కాలయాపన చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అడుగులు వేయడం లేదు. కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణలో అవసరమైన చొరవ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వేలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, సరుకు రవాణా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెట్రో వంటి భారీ ప్రజారవాణా వ్యవస్థ లేకుంటే నగర ట్రాఫిక్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీచ్ కారిడార్ నత్తనడకనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల బీచ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం ప్రకటించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురాన్ని అనుసంధానించే ఈ 55 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.6,300 కోట్ల వ్యయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు భూసేకరణ, రహదారి విస్తరణ అంశాల వద్దే నిలిచిపోయింది. స్థానికుల అభ్యంతరాలు, మారిన ప్రతిపాదనల కారణంగా ఇప్పటికీ డీపీఆర్ దశను దాటలేకపోయింది. మెట్రో ఇక లగ్జరీ కాదు.. అత్యవసరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా లేకపోయినా.. విశాఖ నగరానికి మెట్రో అత్యవసరం. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో సహజ పరిమితుల మధ్య విస్తరించిన నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం తప్పనిసరి. ప్రస్తుతం నగరంలో బాటిల్‌నెక్ రోడ్లు అధికంగా ఉండటంతో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ప్లాన్లు, డీపీఆర్‌ల రూపకల్పనలో స్థానికుల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోంది. ఇకపై డీపీఆర్‌లలో మార్పుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. – యల్లపు రఘురామ్, వాణిజ్య నిపుణుడు ఐటీ అభివృద్ధికీ మెట్రో కీలకం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలంటే ప్రధాన ఐటీ కేంద్రాలకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మెట్రో కనెక్టివిటీ ఉండాలని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. మెరుగైన ప్రజారవాణా లేకపోవడం ఐటీ రంగ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని నివేదిక పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, నిధుల మంజూరులో వేగం పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా సూచించింది. -
పవన్‌ను సైడ్ చేసి మరీ క్రెడిట్ చోరీ
ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో మేజర్ క్రెడిట్ అంతా జగన్‌దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. హైటెక్ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్‌లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. జగన్ టైమ్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా, ఈ ఎయిర్ పోర్టును జగన్ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు యాజమాన్యం అయిన జీఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్‌పోర్టును వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్‌లో ఉన్న చిక్కు ముళ్లను విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్‌లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్‌కే దక్కుతుందని చెప్పొచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భోగాపురం పనులు ‘టేకాఫ్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికల్లా ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలనేది లక్ష్యం. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణ పనులను చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు పది అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప ముళ్లతో కూడిన కంచెను ఏర్పాటు చేయనున్నారు. పటిష్టంగా పొడవైన రన్‌వే.. కీలకమైన రన్‌వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఒక క్రమంలో లేకపోవడంతో తొలుత సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. నేరుగా రోడ్డు అనుసంధానం... చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం నుంచి, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ. 18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి భోగాపురం మండలంలోని ముక్కాం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సమీపంలోనే స్టాఫ్ క్వార్టర్లు... విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని అడ్డంకులను అధిగమించి... విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. కొంతమంది రైతులకు సంబంధించిన పరిహారం కోర్టులో జమచేసింది. నాలుగు గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించింది. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాం. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. – చింతా బంగార్రాజు, భోగాపురం తహసీల్దార్ -
ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ నమూనాను పరిశీలించిన సీఎం జగన్
-
భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
ఉత్తరాంధ్రకు సీఎం జగన్ నాలుగు వరాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతోపాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి జగన్ నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనతోపాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మండలంలోని ఎ.రావివలస వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, సవరవిల్లి వద్ద బహిరంగ సభ వేదికను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, కలెక్టర్ నాగలక్ష్మి, డీఐజీ హరికృష్ణ, ఎస్పీ దీపిక తదితరులు మంగళవారం పరిశీలించారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విశాఖ ఎయిర్‌పోర్టుకి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం మండలంలో 36 నెలల్లో నిర్మించే అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేస్తారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. రూ.21,844 కోట్లతో వైజాగ్ టెక్‌పార్క్ అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ‘భోగాపురం’ ప్రత్యేకతలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఎన్వోసీ, అనుమతులు సాధించింది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయ వివాదాలను పరిష్కరించడం ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దీన్ని పీపీపీ విధానంలో నిర్మించేలా జీఎంఆర్ గ్రూప్‌తో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం చేసుకుంది. అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం ద్వారా ఇటు విశాఖ అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానించనున్నారు. అంతర్జాతీయ ఎగ్జిట్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్తోపాటు తొలిదశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ దీని ప్రత్యేకతలు. 16వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలున్నాయి. విశాఖ–భోగాపురం మధ్య రూ.6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం కానుంది. రెండువైపులా సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. పర్యాటక అభివృద్ధి, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. విమానాశ్రయం కోసం స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసిన నాలుగు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ.77 కోట్లతో పునరావాసం కల్పించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పటికే వసతి కూడా కల్పించింది. అదానీ డేటా సెంటర్‌తో ఐటీ బూమ్ డేటా హబ్‌తో డేటా స్పీడ్ గణనీయంగా పెరగనుంది. సింగపూర్ – విశాఖ వరకు సముద్ర సబ్‌మెరైన్ కేబుల్ ఏర్పాటు ద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఐదు రెట్లు పెరుగుతుంది. తద్వారా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల్లో వృద్ధి నమోదు కానుంది. భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. విశ్వసనీయమైన డేటా భద్రతతోపాటు సేవల ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. అధునాతన టెక్ కంపెనీలు విశాఖను ఎంచుకోవడం ద్వారా ఐటీ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగుల జీవన శైలి మారనుంది. -
అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’
2023 మే 3: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ మరుక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్ సిద్ధంగా ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా సహా ఉత్తరాంధ్ర దశాదిశా మార్చేసే, రాష్ట్రంలో బహుముఖ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేసే భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం ఇది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మ మ అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డ బ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమా నాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15 వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఫలించిన జగన్మోహన్రెడ్డి శ్రమ... విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఢిల్లీ స్థాయి లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారా న్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరు లు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీ ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారికోసం నిర్మించింది. అత్యాధునికంగా నిర్మాణం... దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేయనున్నారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుకు త్వరలో శంకుస్థాపన
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కేసులను హైకోర్టు కొట్టేయడంతో త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈనెల 12న విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ విశాఖ వస్తున్న తరుణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు కూడా శంకుస్థాపన చేయించాలని ఏపీఏడీసీఎల్ యోచిస్తోంది. ప్రధాని యాత్రకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు కానందున.. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. రూ.2,300 కోట్లతో నిర్మాణం విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధంచేసింది. సుమారు రూ.2,300 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్టును జీఎంఆర్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. పనులు ప్రారంభించడానికి ఇంతకాలం కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా వాదించడం ద్వారా అనుకూలమైన తీర్పు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. అలాగే, మూడేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రెండున్నర ఏళ్లల్లోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణం ఇక భోగాపురం తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించేలా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ఏటా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ఎయిర్‌పోర్టు భారత నావికాదళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోకలపై అనేక ఆంక్షలున్నాయి. అదే భోగాపురంలో విమానాశ్రయం వస్తే 24 గంటలూ సర్వీసులు నడిపే అవకాశముంటుంది. ఇక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం ఏటా 4,400 టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా కొత్త విమానాశ్రయం వస్తే ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే నిరభ్యంతర సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది. అప్పట్లో టీడీపీ తీరుతో రోడ్డెక్కిన రైతులు గత టీడీపీ ప్రభుత్వంలో తొలుత 15 వేల ఎకరాలు అవసరమని ఆ పార్టీ నేతలు నాయకులు ప్రకటనలు చేయడంతో భోగాపురం మండల రైతులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో ఐదువేల ఎకరాలతో సరిపెట్టాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సాధారణ ఎన్నికలు సమీపించాయి. మరోవైపు.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తిచేయలేదు. కానీ, ఎన్నికలకు రెండునెలల ముందు ఫిబ్రవరి 14న ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెట్టింపు పైగా పరిహారం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి పరిహారాన్ని ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ప్రకటించారు. అంతకుముందు డి.పట్టా భూములకు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.12.50 లక్షలు మాత్రమే. అలాకాకుండా వారికీ జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో చాలామంది హైకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ శుక్రవారం హైకోర్టు పరిష్కరించింది. సంబంధిత రైతులకు పరిహారం ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆ మొత్తాన్ని చెల్లించడానికి జిల్లా కలెక్టరు ఎ. సూర్యకుమారి తదితర అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేస్తోంది. మరోవైపు.. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. అలాగే, విమానాశ్రయ పరిధిలోనే గత టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. జాతీయ రహదారి నుంచి అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మాణానికి అవసరమైన 119 ఎకరాల సేకరణ రెండో దశ నోటిఫికేషన్‌తో కొలిక్కి వచ్చింది. నిర్వాసితులకు టౌన్‌షిప్‌లను తలదన్నే కాలనీలు ఇక ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాక.. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున పునరావాస పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్కామ్‌కు చంద్రబాబు స్కెచ్ వేశారు. విమానాశ్రయ ప్రకటన చేసినప్పటి నుంచీ ముడుపుల కోసం అనేక జిమ్మిక్కులు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. చివరికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే తన ప్రణాళికను అధికారుల ద్వారా అమలు చేయించారు. తద్వారా చంద్రబాబు జేబులోకి కోట్ల రూపాయలు వెళ్లనున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎల్–1గా, జీఎంఆర్ ఎల్–2గా వచ్చిన విషయం తెలిసిందే. 30.2 శాతం రెవెన్యూ వాటా, ఎకరానికి ఏడాదికి లైసెన్స్ ఫీజు కింద 20 వేల రూపాయలు, ప్రతీ ఏడాది లైసెన్స్ ఫీజు మొత్తం ఆరు శాతం పెంచడంతోపాటు 26 శాతం ఈక్విటీ ఇస్తామని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. జీఎంఆర్ కేవలం 21.6 శాతమే రెవెన్యూ వాటా ఇస్తామని తెలిపింది. దీంతో అధికారులందరూ ఎయిర్ పోర్ట్ అధారిటీ ఇండియాకు టెండర్‌ను అప్పగించాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ముడుపులు అందే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు పట్టుపట్టి మరీ టెండర్‌ను రద్దు చేయించారు. అదనపు పనుల పేరుతో మళ్లీ టెండర్లు ఆహ్వానించి.. ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా పాల్గొనకుండా జీఎంఆర్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. ఈ టెండర్లలో డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీవీకే ఎయిర్ పోర్ట్ లిమిటెడ్, జీఎంఆర్ సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల్లో తొలుత రెవెన్యూ వాటా ఎంత ఇస్తారనేది పేర్కొనగా తరువాత పిలిచిన టెండర్లో విమాన టికెట్లో వాటా ఎంత ఇస్తారంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భూమిని లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని, విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్‌లో వచ్చిన తరువాత పదో సంవత్సరం నుంచి టికెట్ ఫీజు చెల్లించాలనే నిబంధనలు రూపొందించారు. టికెట్ ఫీజు బెంచ్ మార్క్‌గా 209 రూపాయలనే టెండర్ నిబంధనల్లో పెట్టారు. దీనిపై జీఎంఆర్ టికెట్ ఫీజుగా 303 రూపాయలు, డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ 261 రూపాయలు, వీవీకే 207 రూపాయలను కోట్ చేశాయి. ఎన్నికల కోడ్‌లో కథ నడిపిన చంద్రబాబు మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత అధికారులతో సీఎం చంద్రబాబు భోగాపురం ఫైలును నడిపించారు. మార్చి 15వ తేదీన అధికారులతో కూడిన సాధికార కమిటీ సమావేశమై బిడ్స్‌ను ఖరారు చేసింది. దాని ప్రకారం.. మూడు దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తొలుత 2,703 ఎకరాల్లో రూ. 2,302.51 కోట్లతో నిర్మాణం చేపడతారు. ఈ భూమిని 99 సంవత్సరాలకు ఎకరానికి రూపాయి లీజుకు అప్పగిస్తారు. ఈ భూమిని తాకట్టు పెట్టి జీఎంఆర్ సంస్థ పెట్టుబడిని సమీకరించనుంది. ఈ భూమి కాకుండా అదనంగా వాణిజ్య అవసరాలకు 793 ఎకరాలను, రెసిడెన్షియల్ అవసరాల కోసం 139 ఎకరాలను జీఎంఆర్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ భూమి అభివృద్ధి చేయడానికి రూ. 134 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. టికెట్ ఫీజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 303 రూపాయలు 2033 సంవత్సరం నుంచి ఇస్తారు. వీటిపై ఆర్థిక శాఖ, న్యాయ శాఖలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ సాధికార కమిటీ ఆమోదం తెలిపింది. సాధికార కమిటీని ప్రశ్నించిన ఆర్థిక శాఖ టెండర్ నిబంధనల్లో మార్పులపై ఆర్థిక శాఖ సాధికార కమిటీని నిలదీసింది. ‘ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తానన్న రెవెన్యూ వాటాతో పోల్చితే ఇప్పుడు జీఎంఆర్ ఇస్తానన్న టికెట్ ఫీజు అనేది నామమాత్రమే. అలాంటప్పుడు రెవెన్యూ వాటా నిబంధన మార్చేసి టికెట్ ఫీజు ఎందుకు పెట్టారు? టికెట్ బెంచ్ మార్క్ రూ.209గా నిర్ధారించడం వాస్తవికంగా లేదు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారా లేదా?. విశాఖ నావెల్ ఎయిర్ పోర్ట్ మూసేయకుండా అంతర్జాతీయ విమానాశ్రయం లాభదాయకం కాదు. ఇందుకు అనుమతి తీసుకున్నారా?. భూమి లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని ఏ ప్రాతిపదికన నిబంధనలు మార్చారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే టెండర్ నిబంధనల్లో పలు ఉల్లంఘనలున్నాయని, వీటిని సాధికార కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే సంబంధిత ఫైలు ఇంధన, ఎయిర్పోర్ట్, మౌలిక సదుపాయాల శాఖకు చేరింది. ఎలాగైనా అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం విమానాశ్రయం టెండర్‌ను జీఎంఆర్‌కు అప్పగింపచేయాలని సీఎం యత్నిస్తున్నట్టు అధికార వర్గాలంటున్నాయి. -
భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతి
సాక్షి బిజినెస్ బ్యూరో, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతి లభించింది.కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ మేరకు అనుమతిని మంజూరు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో లేవనెత్తిన అంశాలకు ప్రాజెక్టు అథారిటీ సంతృప్తికరంగా స్పందించినట్టు ఈఏసీ తెలిపింది. తుది ఈఐఏ, ఈఎంపీ నివేదికలో ఈ అంశాలను పొందుపరచాలని సూచించినట్టు పేర్కొంది. విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూ.2,260.73 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ప్రతిపాదనలు తొలి దశకు సంబంధించినవి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరనున్న నేపథ్యంలో దాన్ని భోగాపురం విమానాశ్రయం తగ్గించనుందని ఈఏసీ పేర్కొంది.


