సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


