breaking news
bhogapuram airport
-
భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ తర్వాత ప్రయాణికుల రియాక్షన్
-
అటెన్షన్ ప్లీజ్ ప్యాసింజర్స్... ఇక సెలవు!
మే ఐ హ్యావ్ యువర్అటెన్షన్ ప్లీజ్.. ఫ్లైట్ నం. వీటీజెడ్..విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూభోగాపురం ఈజ్ నౌ రెడీ ఫర్ టేకాఫ్.. అండ్ల్యాండింగ్ ఎట్ భోగాపురం టుడే ఆన్వార్డ్స్.ఆల్ బుక్డ్ ప్యాసింజర్స్.. ఆర్ రిక్వెస్టెడ్ టూ కీప్దెయిర్ లగేజ్ అండ్ ప్రొసీడ్ టూది భోగాపురం ఎయిర్పోర్ట్..ఏంటి.. నా అనౌన్స్మెంట్ మారిందని ఆలోచిస్తున్నారా..?నేనేనండీ.. మీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ని.మీ ఊరి సరిహద్దు దాటి.. గగనవీధిలో దూరతీరాలకు ఎగరాలనుకున్నప్పుడు మీ పాదాలకు ప్రప్రథమంగా రెక్కలు తొడిగింది నేనే!తీపి జ్ఞాపకాలతో మహా నగరానికి వచ్చిన ప్రియమైన వారిని మీ ఒడికి చేర్చింది..కొత్త ఆశల వైపు మిమ్మల్ని నడిపించింది నేనే.! ఇకపై.. నేను మీతో అనుబంధాన్ని పంచుకోలేనేమో.. ఎందుకంటే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవడంతో.. సుదీర్ఘ కాలం పాటు మీకు అందించిన పౌర విమాన సేవలకు స్వస్తి చెబుతూ ఈరోజుతో వీడ్కోలు పలుకుతున్నాను. ఇకపై సివిల్ సర్వీసులు నిలిపేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని మా డైరెక్టర్ (ఎయిర్పోర్ట్) పురుషోత్తం కూడా ప్రకటించేశారు. ఎనిమిది దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను చూసిన వెలుగు నీడలు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఒడిదొడుకుల జ్ఞాపకాలను ఒక్కసారి మీతో పంచుకోవాలనిపించింది. నా జ్ఞాపకాలు మీ గుండెల్లో పదిలంగా ఉన్నాయని నాకు తెలుసు. నా సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్లు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాల జ్ఞాపకాలను ఒక్కసారి మీ ముందుంచుతున్నాను.నా పుట్టుకే ఓ ‘యుద్ధం’..!అమ్మ కడుపులోంచి మీరందరూ బయటకు రావడానికి ఓ యుద్ధమే జరుగుతుంది. అలానే నా రక్తసిక్తమైన యుద్ధ భూమిలో నా జననం జరిగింది. నా పుట్టుక ఏ సౌకర్యవంతమైన ప్రయాణాల కోసమో జరగలేదు. 1940 ప్రారంభంలో.. ద్వితీయ ప్రపంచ యుద్ధ మేఘాలు అలముకున్న వేళ.. రాయల్ ఎయిర్‌ఫోర్స్(రాఫ్).. తమ సైనిక అవసరాల కోసం మేఘదూతలా ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా నేను రూపుదిద్దు కున్నాను. యుద్ధం ముగిశాక కొంతకాలం ప్రశాంతంగా ఉన్నా.. 1972 నాటికి భారత నౌకాదళం నా పరిసరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 1986లో నా పూర్తి యాజమాన్యం భారత నౌకాదళం పరిధిలోకి వచ్చింది. 1991 అక్టోబర్ 21న నాకు అధికారికంగా ’ఐఎన్ఎస్ డేగాా’ అని నామకరణం పేరుపెట్టి నేవల్ ఎయిర్‌స్టేషన్‌గా తీర్చిదిద్దారు.ఒక్క విమానంతో మొదలై..నౌకాదళానికి చెందిన స్థలంలోనే పౌర విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ‘ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ నా ప్రాంగణంలో సివిల్ ఎన్‌క్లేవ్‌ని ఏర్పాటు చేసింది. నా స్థావరం నుంచి క్రమబద్ధంగా వాణిజ్య ప్రయాణికుల సేవలు 1981లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇండిగో (అప్పట్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్) విమానం రోజుకు కేవలం ఒకే ఒక్క సర్వీసుతో ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ప్రయాణించేది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి సరిపడా నా పాత 6,000 అడుగుల రన్‌వే సరిపోయేది కాదు. దీంతో.. 2007 జూన్ 15న ఏకంగా 10,007 అడుగుల (3,050 మీటర్లు) భారీ రన్‌వే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎదురు చూడలేదు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయం కలిపి 70కి పైగా విమానాలు.. నా దగ్గర నుంచి రయ్‌రయ్‌మంటున్నాయి. 2009 ఫిబ్రవరిలో నూతన టెర్మినల్ భవనం ప్రారంభమైంది. అప్పటిదాకా పగటి పూటకే పరిమితమైన నాకు 2012లో ‘రాత్రివేళల ల్యాండింగ్’ సదుపాయం కల్పించారు. దాంతో సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకూ నా ద్వారా రాకపోకలు విస్తరించుకుంటూ.. మీకు సేవలందించాను.ఆంక్షల మరకలు..ఒక వైపు పౌర విమానాలు, మరోవైపు రక్షణ శాఖ యుద్ధ విమానాలతో నా వల్ల మీరు(ప్రయాణికులు) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రివేళల్లో ఆంక్షలు, నావికాదళ శిక్షణ సమయంలో సివిల్ విమానాలకు నిరీక్షణ వంటి సమస్యలు నాకు ఎంతో ఆవేదన మిగిల్చాయి. కానీ.. మీరు ఎప్పుడూ నన్ను దూరం చేసుకోలేదు. ఆ పట్టుదలతోనే.. నా కలలకు రెక్కలు తొడుగుతూ.. మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేర్చాను.ఇక్కడ చివరి ఫ్లైట్ విజయవాడ.. అక్కడ తొలిఫ్లైట్ సింగపూర్నా సేవలు ఆదివారం అర్ధరాత్రితో ముగిసిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్లిన చివరి ఫ్లైట్ సర్వీస్‌గా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో సర్వీసు నిలిచిపోయింది. అదేవిధంగా.. ఇక్కడ ల్యాండింగ్ అయిన చివరి సర్వీసుగా విజయవాడ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చరిత్రలో నిలిచిపోతుంది. అన్నట్లు.. మీ కొత్త ప్రయాణం మొదలయ్యే భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న తొలి సర్వీసుగా సింగపూర్ స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం కొత్త చరిత్రకు తొలి అడుగుగా మారుతోంది. నన్ను వీడి భోగాపురం చేరుకున్నా.. మీ ప్రతి ప్రయాణంలో.. నా జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా.. గగన విహారంలో వెళ్తున్నప్పుడు.. పై నుంచి నేను కనిపిస్తే.. ఒక హాయ్ చెప్పడం మర్చిపోవద్దు సుమా..!ఇక సెలవు! మీ.. విశాఖపట్నం అంతర్జాతీయవిమానాశ్రయంమౌనంగా 65 వసంతాల గగనంగోపాలపట్నం: ఆదివారం రాత్రి 10.45 గంటలకు విజయవాడ నుంచి విశాఖకు దిగిన ఎయిర్ ఇండియా విమానమే ఇక్కడ చివరి షెడ్యూల్డ్ ఫ్లైట్‌గా నిలిచింది. నిజానికి ఈ విమానం ఒక యుగాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. రన్‌వేపై చక్రాలు తాకిన ఆ క్షణమే, ఎన్నో కుటుంబాల కథలు, ఎన్నో వీడ్కోళ్లు, ఎన్నో కలయికలు నేసిన ఈ గడ్డ... ఇవాళ్టితో మౌనంగా మారిపోనుంది. 65 ఏళ్లు అంటే మాటలు కాదు. ఈ టార్మాక్‌పై తొలిసారి కాలుమోపిన అధికారి ఈపాటికి రిటైరై మనవళ్లతో ఆడుకుంటుండొచ్చు. ఇక్కడి కౌంటర్ల దగ్గర తొలి జీతం అందుకున్న యువకుడు ఈరోజు తెల్లబడిన జుట్టుతో, తడిసిన కళ్లతో తన ఐడీ కార్డును చివరిసారి మెడలో నుంచి తీస్తున్నాడు. దశాబ్దాలుగా ఇక్కడే సేవలందించిన కార్మికులు, సిబ్బంది ఈరోజు తమ కళ్లను తడి చేసుకోకుండా ఉండలేకపోయారు. కొందరు తోటి ఉద్యోగుల భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంటే, మరికొందరు మాట రాక మౌనంగా నిలబడిపోయారు. ‘ఈ నేలతో మా జీవితం పెనవేసుకుపోయింది, ఇప్పుడు దాన్ని వదిలి వెళ్లాలంటే గుండె తరుక్కుపోతోంది’ అంటూ కొందరు ఉద్యోగులు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఎవరికి వారు గుర్తుచేసుకుంటున్నారు.. ఎన్నో వానాకాలాల్లో ఫ్లైట్లు ఆలస్యమైనప్పుడు కలిసి టీ తాగిన క్షణాలను, పండగలకు సెలవులు లేకున్నా విధి నిర్వర్తించిన రాత్రులను, కంట్రోల్ టవర్ నుంచి ప్రతి ల్యాండింగ్‌నూ కళ్లారా చూసిన ఉద్విగ్న క్షణాలను. సామాన్లు సర్దుతున్న సిబ్బంది చేతులు వేగంగా కదులుతున్నా, మనసులు మాత్రం వెనక్కి లాగుతున్నాయి. ఒకరినొకరు కావలించుకుని, ‘మళ్లీ కలుద్దాం’అని బొంగురుపోయిన గొంతుతో చెప్పుకుంటున్నారు.. ఈ గోడల మధ్య, ఈ రన్‌వే పక్కన మాత్రం మళ్లీ కలవలేమని అందరికీ తెలుసు.ఇకపై ఇక్కడ యుద్ధ విమానాల గర్జన వినిపించొచ్చు, పోలీసు హెలికాప్టర్ల రెక్కల చప్పుడు వినిపించొచ్చు. కానీ సామాన్యుడిని ఆకాశంలోకి మోసుకెళ్లిన ఆ విమానాల శబ్దం మాత్రం, ఇక ఇక్కడ వినిపించదు. విశాఖ గగనానికి, పాత విమానాశ్రయానికి మధ్య ఉన్న ఈ అనుబంధం... ఈ రాత్రితో చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. కానీ ఆ 65 ఏళ్ల జ్ఞాపకాలు మాత్రం, ఇక్కడ సేవలందించిన ప్రతి గుండెలోనూ శాశ్వతంగా ఎగురుతూనే ఉంటాయి.ప్రకృతి ప్రకోపానికి భయపడ్డా..నా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. నేనెన్నో మెరుపులు చూశాను.. కొన్ని చేదు మరకలనూ ఎదుర్కొన్నాను. 2005లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిపోయాను. దాదాపు 10 రోజుల పాటు నా రన్‌వే నీటిలో మునిగిపోయి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక నా పనై పోయిందని అందరూ అన్నారు. ఇక 2014లో నా జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 2014 అక్టోబరు 12న గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన హుద్ హుద్ తుఫాన్ గాలులు.. నా టెర్మినల్ కప్పును ఎగరగొట్టాయి. అద్దాలన్నీ పగిలి పోయి, నా సర్వస్వం ఛిన్నాభిన్నమైంది. అదే నా చివరి రోజు అని అనుకున్నాను. కానీ, నేవీ అధికారులు అహోరాత్రులు శ్రమించడంతో.. కేవలం పదంటే పది రోజుల్లోనే కోలుకుని మళ్లీ విమానాలకు స్వాగతం పలికాను. ఇందులో మీ సహకారం కూడా ఎంతో ఉందని నాకు తెలుసు. -
బాబు ‘భోగా’స్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే.. ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దానిని చేసినట్లుగా చెప్పుకుంటూ ‘క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు తమ అధినేత వైఎస్ జగన్ అక్కర్లేదని, తాము సరిపోతామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయం నాలుగు గ్రామాల రైతుల త్యాగం, స్థానిక ప్రజల సహకారం, జగన్ ప్రభుత్వ కృషి ఫలితమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పెమ్మసానివి అసత్య వ్యాఖ్యలు భోగాపురం విమానాశ్రయం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని ఎంపీ గొల్ల బాబూరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్), రైతులకు పరిహారం చెల్లింపు వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2019 నాటికే 2,200 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం సేకరించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పడం అవాస్తవమని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం 2023 జూన్‌లో కుదిరిందని, అదే ఏడాది అక్టోబర్‌లో భూమిని సంస్థకు అప్పగించామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారన్న పెమ్మసాని వ్యాఖ్యలను గురుమూర్తి తప్పుబట్టారు. బాబు భూ దాహంతో భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులే కోర్టులను ఆశ్రయించారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారికి అమిత ప్రజాదరణ గల వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పెమ్మసానిని ఉద్దేశించి ఎంపీ తనూజారాణి వ్యాఖ్యానించారు. స్వయనా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే వైఎస్ జగన్ హయాంలో 86శాతం భోగాపురం విమానశ్రయ పనులు పూర్తయ్యాయని చెప్పారు కదా అని గుర్తుచేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంబోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి రూ.30 కోట్లు ఖర్చు చేశారని, దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని తనూజారాణి ప్రశి్నంచారు. -
చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా?
ఏమైంది.. అలనాటి తెలుగు ఆత్మగౌరవం.. ఏమైంది.. తెలుగు పౌరుషం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్ లు వీటిని పక్కనబెట్టరా అన్న సందేహం ప్రజలలో ఎందుకు వస్తోంది?ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే.. పర్వతం ఎవరికి తలవంచదన్నారే.. మేం భయపడతామా అని హూంకరించారే.. మరి ఇప్పుడు ఏమైంది. మరీ ఇంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది?మోడీ కన్నా తానే సీనియర్ని అని, ఆయనకన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటరే అని అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జై కొట్టడమే కాకుండా, సభికులతో కూడా జేజేలు కొట్టించడమేమిటి అని అంతా విస్తుపోతున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికి కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పుకాదు. కాని మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నదే చర్చగా ఉంది. దీనికి తోడు మా జీసీఎం జగన్ పై అసత్యాలు యధాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడి కాయ మేమే కొట్టాం అని చంద్రబాబు అంటుంటే..అవును.. అది నిజమే.. మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ నేతలు బదులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదలివేస్తే, జగన్ ప్రభుత్వం కదా మొత్తం అనుమతులు తెచ్చి,భూ సేకరణ పూర్తి చేసి, శంకుస్థాపన చేసి దానిని ముందుకు తీసుకువెళ్లింది! ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు 2023లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు కదా! అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జీఎంఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు. అది ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని అంటున్నారు. జగన్ హయాంలో 80 శాతం నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కుప్పం లో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా..అది ఎక్కడదాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్ర పరిస్తితి మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్ పోర్టు బదులు కొత్తది నిర్మించారు.అంతవరకు ఓకె. కాని దానితోనే అంతా అయిపోతుందా?ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు. కాని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు..రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా?అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇంతకాలం వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు.ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు.కాని అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఎందుకు ఇంతలా మారిపోయారు?మోడీకంటే తానే సీనియర్ ని అని ఒకప్పుడు చంద్రబాబు ధైర్యంగా చెప్పుకున్నారు.అంతేకాదు..మోడీ పాలన ఘోరంగా సాగుతోందని అంటూ ఏడేళ్ల క్రితం చీల్చి చెండాడినట్లు ప్రసంగాలు చేసేవారు.అప్పుడేమో ఏపీకి ఏమీ చేయడం లేదన్నారు. అసలు దేశానికే నష్టం జరుగుతోంందని ..ఇంకా చాలాచాలా ఆరోపించారు. అదే చంద్రబాబు ప్రస్తుతం మోడీని అధ్బుతం, అమోఘం, అన్న చందంగా స్పీచ్ ఇవ్వడం విన్నవారంతా మరీ అతిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? గత అనుభవాల రీత్యా తన విధేయతను కనబరుచుకోవడానికి మాట్లాడారా? లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా అన్నది తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి మోడీని ఎవరో దూషించారట. దానికి ఆయన గుండె కదలిపోయిందట.కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ అనిపించడం లేదూ!మోడీపై అంత ప్రేమ ,విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు. మోడీ కన్నా బిఎస్పి అధినేత్రి మాయావతి గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే! అవన్ని ఎందుకు చంద్రబాబు అప్పట్లో మోడీని అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని చెప్పలేదే!కొందరు మరో సంగతిని ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారు అంటూ ఎవరిపై పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో, వారితోనే చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ..మోడీకి మద్దతు ఇవ్వవచ్చు.కాని కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు. గుజరాత్ లో బిజెపినే గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ది జరుగుతోందట. అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు.ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా!గత టరమ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మళ్లీ అదికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తి అయ్యేది కదా! పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలోనే ఉండేవి కదా!పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ,తమ అనుంగులకు టీడీపీ పెద్దలు ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు కదా!అన్నిటికి మించి రెడ్ బుక్ పేరుతో అరాచాకాలకు అవకాశం ఉండేది కాదు కదా! మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా!మహిళను వివస్త్రను చేసిన ఘటనకు అవకాశం ఉండేది కాదు కదా!ఇలా అనుకోవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ కు అన్నీ తీసుకువెళతారా అని ప్రశ్నించారు .ఆంధ్ర అభివృద్ది చెందుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే ఏపీకి అంతా చేస్తున్నారని అంటున్నారు.దేనిని నమ్మాలి. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. ఈ నేపధ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మోడీని పొగుడుతున్నారని,ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతారా అని కామెంట్ చేశారు.సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే చంద్రబాబు ప్రభృతులు మోడీని పొగిడిన తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఉందని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు మంచిదే.ఎయిర్ బస్సు బాగానే ఉంటుంది.కాని ఎర్రబస్సు ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే అభివృద్ది అవుతుంది తప్ప,కేవలం బడాబాబుల కోసమే ఎయిర్ పోర్టు కాకూడదన్నది నిష్టుర సత్యం. -
ఆయన కచ్చితంగా వైఎస్ జగన్‌ను పొగుడుతారు!
భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే.ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటివారు వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా? వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు. పరువు పోతుందని... కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్‌ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్‌ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: -
ఈనాడు ఫేక్ ప్రచారాలు.. భోగాపురం ఎయిర్ పోర్టు పై స్టేట్మెంట్
-
బాబు, పవన్ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
-
నువ్వు దీనికే పనికొస్తావ్.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్..
-
ఎయిర్ పోర్ట్ ఓపెన్.. భోగాపురానికి కనెక్టివిటీ ఎక్కడ?
-
‘ఆత్మ’ సాక్షిగా.. క్రెడిట్ చోరీ కుట్రలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పూసపాటిరేగ: : నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక.. అంటూ నమ్మబలికే ఈనాడు తన నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకుంది! చంద్రబాబు సర్కారుకు భజంత్రీలు వాయించడం, తప్పుడు కథనాలను ప్రచురించడం, పాఠకుల కళ్లకు గంతలు కట్టడం, తిమ్మిని బమ్మి చేయడంలో తనకు సాటి లేదని మరోసారి రుజువు చేసుకుంది! భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో వేసేందుకు తహతహలాడుతూ ‘ఆత్మ’సాక్షిగా దొరికిపోవడం దీనికి పరాకాష్ట! మూడేళ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారంటూ ఈనాడు ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురించిన కథనం సర్వత్రా కలకలం రేపుతోంది. చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి యల్లాజీ అనే రైతు ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చారని, నేడు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారని ఈనాడు మైక్ ముందుకొచ్చి చెప్పినట్లు కథనాన్ని అచ్చోసింది. నిజం ఏమిటంటే.. మైలపల్లి యల్లాజీ 2023 జూలైలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు లోకం మాధవి స్వయంగా యల్లాజీ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. అదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేశారు. మూడేళ్ల క్రితం కన్నుమూసిన వ్యక్తి.. మళ్లీ తిరిగి వచ్చి ఈనాడు ప్రతినిధితో మాట్లాడారని తప్పుడు కథనాలు రాయడం పాఠకులను, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈనాడు వండి వార్చే అబద్ధాలకు ఇదో మచ్చు తునక అని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు బరి తెగింపు సర్వత్రా చర్చనీయాంశం కావడంతో నాలుక కరుచుకుని ఆదివారం అర్ధరాత్రి హడావుడిగా నెట్ ఎడిషన్‌లో ఆ ఫోటో మాత్రమే తొలగించి మరో ఫోటోను చేర్చడం కొసమెరుపు. పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు ప్రచురించి ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఈనాడు నిత్యం విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. నాడు టీడీపీ నేత పట్టాభిని కస్టడీలో పోలీసులు కొట్టారంటూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పాత ఫోటోలను ప్రచురించి ఈనాడు నమ్మించే యత్నం చేసింది. పట్టాభిని కొట్టారంటూ 2023 ఫిబ్రవరి 22న ఈనాడు ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. అయితే అందులో 2021 నాటి ఘటన ఫోటోలను ఈనాడు ప్రచురించింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, అవి పాత ఫొటోలని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వం ఆధారాలను బయటపెట్టడంతో ఈనాడు దుర్భుద్ధి బహిర్గతమైంది. దీంతో గత్యంతరం లేక తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ, చింతిస్తున్నట్లు ఈనాడు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. పట్టాభిని కొట్టారంటూ తొలుత ఈనాడు కథనం వెలువరించగానే కనీసం నిర్ధారించుకోకుండానే వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఆ వార్తను ట్వీట్ చేయడం గమనార్హం. పట్టాభిని కొట్టారంటూ కోర్టులో న్యాయమూర్తులకు కూడా ఆ ఫోటోలు చూపించారు. అనంతరం వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి గాయాలు లేవని, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు. దీంతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ఇప్పుడు కూడా అదే రీతిలో బురద చల్లేందుకు యత్నించి మరోసారి దొరికిపోయింది. -
కొబ్బరి కాయ, గుమ్మడి కాయ కట్టింది నువ్వా..? లైవ్ లో సంచలన వీడియోలు వేసి..
-
భోగాపురంలో బాబును అడ్డంగా ఇరికించిన శిలాఫలకం
-
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
-
కష్టం ఒకరిది.. సోకొకరిది.. భోగాపురం క్రెడిట్ జగన్ దే..
-
పాచిపోయిన ఉప్మా, బిర్యానీ... ఉండలు కట్టిన పెరుగన్నం
విశాఖపట్నం జిల్లా: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి తరలించిన ప్రజలకు శనివారం పాచిపోయిన ఉప్మా, బిర్యానీ, పులిహోర, ఉండలు కట్టిన పెరుగన్నం ప్యాకెట్లు అందించింది. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో వీటిని శుక్రవారం రాత్రి 11 గంటలకు వండి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలలో ప్యాకింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఉప్మా అందించారు. రాత్రి ప్యాకింగ్ చేసిన ఉప్మా ఉదయానికి పాచిపోయింది. మధ్యాహ్నం అందించిన 150 గ్రాముల బిర్యానీ ప్యాకెట్లో మీల్మేకర్ తప్ప ఎలాంటి కూరగాయలు వాడలేదు. రాత్రి చేసింది కావడంతో బిర్యానీ కూడా పాచిపోయిన వాసన వచ్చింది. దీంతోపాటు అందించిన 100 గ్రాముల పెరుగన్నం కూడా ఉండలు ఉండలుగా మారడంతో తినడానికి ఎవరూ ఇష్టపడలేదు. -
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్‌కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్‌ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్‌ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్‌ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్‌ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ జగన్ దే.. బాబు క్రెడిట్ చోరీని బయటపెట్టిన సజ్జల
-
‘భోగాపురం’ పూర్తి క్రెడిట్ వైఎస్ జగన్‌దే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు...2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్ జగన్. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్ జగన్‌వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు. -
‘భోగాపురం’ ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం....ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. -
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ స్పీచ్
-
పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం: ప్రధాని మోదీ
సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్‌ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్‌కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. .. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్‌ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్‌సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
జగనే గెలుస్తాడని చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్
-
ఎయిర్ పోర్ట్ ఎవరు కట్టారో భోగాపురంలో అడగండి! ఎల్లో మీడియాలో వాగడం కాదు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో జగన్ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేరు
-
జగన్ వల్లే ఎయిర్ పోర్ట్.. భోగాపురం ప్రజల రియాక్షన్
-
భోగాపురం ఎయిర్ పోర్టుపై 80శాతానికిపైగా క్రెడిట్ జగన్ దే..! ఇవిగో ఆధారాలు
-
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
ప్రాజెక్ట్ కు టెంకాయ కొడితే చాలు.. కట్టింది నేనేనని బాబు క్రెడిట్ కొట్టేస్తారు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
-
మోదీ సభకు జనసమీకరణ.. ఉద్యోగులపై భారీ ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అధికారులకు, చిరు ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు పీక మీద కత్తిలా తయారైంది. ప్రధానమంత్రి మోడీ హాజరయ్యే సభ కోసం ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్తున్నారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. అదే సమయంలో డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్లకు, పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 35వేల మందిని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టింది. తీసుకెళ్లిన దగ్గరి నుంచి భోజనం అందించేవరకు బాధ్యత తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు ఆదేశించింది. కానీ, ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలోని ప్రయాణికులకు కూడా ఈ రోజు కష్టాలు తప్పవు. దాదాపు 150 కిపైగా బస్సులు మోదీ సభకు తరలించడంతో జిల్లాలోని చాలా రోడ్ల బస్సు సరీ్వసులు రద్దు కానున్నాయి. జిల్లా నుంచి 35వేల మందిని తీసుకురావాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. వారికి అవసరమైన రవాణా, భోజనం ఇతరత్రా అన్నీ సమకూర్చుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకే అప్పగించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి 150ఆర్టీసీ బస్సులను కేటాయించింది. వాటితో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఎయిర్‌పోర్టుకే ఒత్తిడితో తిప్పుతోంది. ఇవి చాలదన్నట్టు ప్రైవేటు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చి, ఆ బస్సులన్నింటినీ మోదీ సభకు మళ్లించింది. రవాణా శాఖ ద్వారా ఎన్ని చేయాలో అన్నీ చేసింది. దీంతో ప్రయాణికులు ఈ రోజు కష్టాలు పడాల్సిందే. చాలావరకు ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, ఆమదాలవలస, బత్తిలి, టెక్కలి, సారవకోట, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి తదితర రూట్లలో ఆర్టీసీ సర్వీసులు తగ్గించేశారు. ఉదాహారణకు ఒక రూట్లో రోజుకి 10 సరీ్వసులు తిరిగితే.. ఇప్పుడు ఐదు సరీ్వసులే తిరగనున్నాయి. దాని ఫలితంగా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. పబ్లిక్, ప్రైవేటు బస్సులన్నీ అధికారుల చేతిలో పెట్టుకుని, గ్రామానికో బస్సు చొప్పున జనాలను తరలించేందుకు కేటాయించారు. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు, వెలుగు గ్రామ సహాయకులకు అప్పగించారు. జనాల్ని తరలించాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలా మంది చెప్పడంతో ఇరకాటంలో పడ్డారు. ఒక వైపు కూటమి నాయకుల టార్గెట్లు, మరోవైపు అధికారుల ఒత్తిళ్లు వెరసి జనసమీకరణ, తరలింపు బాధ్యతలతో ఉద్యోగులు, చిరుద్యోగులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఏఎన్ఎంల తరలింపు టెక్కలి: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనాల తరలింపులో భాగంగా అత్యవసరంగా గ్రామాల్లో వైద్య సేవలను అందజేసే ఏఎన్ఎంలను సైతం తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్కలి మండలానికి సంబంధించి సుమారు 20 మంది ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతీ నెలా చిన్న పిల్లలకు అందజేస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 మొదటి శనివారం గ్రామాల్లో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చిన్నారులకు అందజేయాల్సిన ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా అధికారులు ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించడం విస్మయానికి గురి చేస్తోంది. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సైతం బస్సులు లేక వెలవెలబోయింది. -
నాడు జగన్ శంకుస్థాపన.. నేడు ‘భోగాపురం’ అందాలు (ఫొటోలు)
-
నమ్మరేంట్రా బాబు.. జగన్ క్రెడిట్ కొట్టేసి దొరికిపోయిన బాబు!
-
ఏం పీకావని శిలాఫలకంలో నీ పేరు పెట్టుకున్నావు.. GMR బదులు లోకేష్ అని పెట్టుకో...
-
బోగస్ బాబు అసలు నిజాలు
-
మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ... శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమవుతోంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం.. ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా అడుగులు వేశారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. మూలపేట పోర్టు, షిప్ ల్యాండింగ్ సెంటర్లతో తీరానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బాబు పబ్లిసిటీ పీక్స్‌లో..!భూ సేకరణ చేయలేదు.. పునరావాసం ఊసు లేదు.. కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రంలో కొనసాగి, పౌర విమానయాన శాఖ దక్కించుకుని కూడా కనీసం ఎన్వోసీలు తేలేదు..! అయినా సరే భోగాపురం ఎయిర్‌పోర్టును తామే కట్టేశామని ప్రచారం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 – 19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు సాధించలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. భూసేకరణ, ఎన్వోసీలు, ఎటువంటి అనుమతులు లేకుండానే నాడు ఎన్నికల ముందు హడావుడిగా ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్టును అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులను మొదలు పెట్టలేకపోయారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయం చేసిన వైఎస్ జగన్ సర్కారు2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాల్లో నిర్మించే విధంగా 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో వైఎస్ జగన్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం లాంటి కీలక ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో దాఖలైన దాదాపు 130 కేసులను పరిష్కరించి ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. మూడు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను అధునాతనమైన కాలనీలకు తరలించి సరికొత్త ఇళ్లకు యజమానులను చేసింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలంతోపాటు రూ.8.5 లక్షల ఆర్థిక సాయం వెనువెంటనే అందించారు. భూ సేకరణ, పునరావాసం, విద్యుత్, నీరు, రహదారులు లాంటి కీలక మౌలిక వసతుల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లకుపైనే వ్యయం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలకమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని కేంద్రం నవంబర్ 2022లో జారీ చేసింది. ఇలా అన్ని అనుమతులు సాధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2023 మే 3న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో 3,800 మీటర్లు పొడవైన రన్‌వే నిర్మించడంతో బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ–330, ఎయిర్ బస్ ఏ–340 లాంటి అత్యాధునిక భారీ విమానాలను ల్యాండ్ చేసేందుకు వీలుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనుండగా ఆగస్టు 17 నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు మొదలు కానున్నాయి.క్రెడిట్ తండ్రీ, తనయులదే..!‘‘మా ఫస్ట్ ఎయిర్‌పోర్టుకు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేసి.. ఆయనే సీఎంగా ఉండగా నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం..’’ – 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుఎయిర్పోర్టుకు అనుబంధంగా మరిన్ని...» 5,000 చ.మీ విస్తీర్ణంలో లాజిస్టిక్ ఎకో సిస్టం, కార్గో టెర్మినల్ నిర్మాణంతో సరకు రవాణాకు విస్తృత అవకాశాలు» ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్ హాలింగ్ వ్యవస్థల ఏర్పాటు» విమానాశ్రయ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాల కల్పన 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్) -
మణిహారం భోగాపురం
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల టెర్మినల్‌ను పరిశీలించిన అనంతరం 11.30 గంటలకు జాతికి అంకితం చేస్తారు. ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ.. ఈ ప్రాంతానికి మణిహారంగా మారనుంది ఈ విమానాశ్రయం. ప్రారంభోత్సవం అనంతరం అదే వేదిక నుంచి రాష్ట్రంలోని రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శనివారం ప్రధాని ప్రారంభించనున్న భారీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓశాట్) ఫెసిలిటీ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. మొదటి విడత రూ.542.19 కోట్లు, రెండో విడత రూ.1,845.61 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌లు, ఐఓటీ పరికరాలకు కావాల్సిన అధునాతన 2.5డీ, త్రీడీ చిప్ ప్యాకేజింగ్, టెస్టింగ్ సేవలను ఇక్కడ అందించనున్నారు. -
‘భోగాపురం’పై సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ వ్యయంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం అంచనా వ్యయంలో కొంత మాత్రమే నిర్మాణ సంస్థ వెచ్చించిందని ఆరోపించారు. మిగిలిన మౌలిక వసతులన్నీ ఏపీ ప్రభుత్వమే సమకూర్చిందని గుర్తు చేశారు. సుమారు 2 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర సేకరించి ఉచితంగా నిర్మాణ సంస్థకు ఇచ్చిందని, దీనికి పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించలేదని ఆరోపించారు.నిర్మాణ సంస్థకు భారీగా రాయితీలు కల్పించి పెట్టుబడి ముసుగులో యూజర్ డెవలప్మెంట్ ఫీజును ప్రయాణికుల నుంచి వసూలు చేయడానికి అనుమతిచ్చిందని దుయ్యబట్టారు. ఈ స్థాయిలో లబ్ధి చేకూర్చడం వెనుక ఏపీ మంత్రి లోకేష్ వర్గం ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రయాణికులపై మోపిన అదనపు చార్జీలను తక్షణమే తొలగించి, సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జగన్ మాస్టర్ ప్లాన్
-
‘భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు?’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు. ‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు. -
భోగాపురం.. భూములిచ్చిన రైతులు చెప్పింది ఇదే..
సాక్షి, విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందని.. ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు తేల్చి చెప్పారు. గురువారం.. వైఎస్ జగన్ విశాఖ మీదగా శ్రీకాకుళం వెళ్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భోగాపురం అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలిపారు. అసలేం జరిగిందో భూములిచ్చిన తమకు తెలుసన్నారు. వైఎస్ జగన్ కృషితోనే ఇది జరిగిందన్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ కష్ట ఫలితం.. కానీ చంద్రబాబు మేం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు రైతులను మోసం చేయడానికి 15 వేల ఎకరాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500కి తగ్గించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పునరావాసం కల్పించి.. అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు.‘‘సౌకర్యాలు కల్పించి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం దారుణం. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం ఎవరో? ఏం జరిగిందో? భూములిచ్చిన రైతులకు తెలుసు’’ అని స్థానికులు పేర్కొన్నారు. -
ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్ జగన్‌దే
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు...విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది. -
ఉత్తరాంధ్ర ప్రజలకు మాటిస్తున్నా.. భోగాపురం ఎయిర్ పోర్ట్ మీ చేతిలో పెట్టేవరకు..
-
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్‌బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్‌పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్‌లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్‌బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
అవును జగన్ చేసాడు... భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు, లోకేష్ కు ఇచ్చిపడేసిన కారుమూరి
-
వైఎస్ జగన్ పట్టుదలకు సాక్ష్యం ఇదిగో..
చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది. -
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో?
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబు క్రెడిట్ చోరీపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌ను నేనే కట్టాను.. సెల్ ఫోన్‌ను కూడా నేనే కనిపెట్టాను.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు. 2023 మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్‌కు దక్కకూడదని ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది.నిజాలు కళ్లముందు కనబడుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి.. ఎల్లో ముఠా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఇదే భ్రమలతో విషం కక్కుతున్నారు. సంక్షేమం, అభివద్దిని పక్కనపెట్టి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా చంద్రబాబు సర్కార్ పెట్టుకుంది.అసలు జరిగింది ఇదే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టింది. కోర్టు వివాదాలు, కేసుల్ని పరిష్కరించడంతో పాటుు.. భూసేకరణను 2,750.78 ఎకరాలకు కుదించింది. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన ఎన్వోసీలు సహా మిగిలిన అనుమతుల్ని పొందారు. (Bhogapuram Airport Real Story)ఇది కదా వాస్తవం.. 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు మరో వైపు, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. (Bhogapuram Airport Timeline)ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది. -
భోగాపురం.. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు ఇలా..
భోగాపురం విమానాశ్రయం గురించిన అసలు వాస్తవాలు..2023 మే 3: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు.అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే 2023 మే నెల 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం విడుదల చేశారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మమా అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డబ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది.గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.ఫలించిన జగన్ శ్రమ...విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు, బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరులు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాస ప్యాకేజీని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది.అత్యాధునికంగా నిర్మాణం...దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ నాటి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. -
జగన్ వెంట జన సాగరం
సాక్షి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, అరసవల్లి: అడుగడుగునా ఖాకీలను మోహరించి చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకున్నా లెక్క చేయకుండా జన సముద్రం పోటెత్తింది! పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖ నుంచి సిక్కోలు దాకా జనవాహిని ఉప్పొంగింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు పట్టిందంటే జనం తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం జంక్షన్, అడవివరం, సత్తరువు జంక్షన్, నీలకుండీలు, ఆనందపురం జంక్షన్, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలోనే సుమారు మూడు గంటల పాటు సాగింది. దారి పొడవునా శ్రీకాకుళం దాకా ఎటు చూసినా జనమే. కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వకుండా జన ప్రవాహం కొనసాగింది. మధ్యాహ్నం 1:35 గంటలకు కాన్వాయ్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పర్యటనలో యువత, మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని గదమాయించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఖాకీలు ఎంతగా అడ్డుకున్నా జన ప్రవాహాన్ని నిరోధించలేక చివరకు చేతులెత్తేశారు. వెల్లువెత్తిన వినతులు విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్పోర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాకాణి నగర్ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిశీకులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్ (భీమిలి) వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం జంక్షన్ వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం తమ వద్ద నుంచి సేకరించిన డీ–పట్టా భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ రైతులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పోటెత్తిన మత్స్యకారులు...: మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, కోష్ట తదితర తీర ప్రాంతాల నుంచి వందలాది మత్స్యకార కుటుంబాలు జగన్ పర్యటనలో పోటెత్తాయి. అంపోలు ప్రాంతానికి గార, శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి అప్పలరాజుకు మద్దతుగా జగనన్నను కలిసి తమ ఆవేదన తెలియచేశారు. పోలీసుల ఆంక్షలు.. కాలి నడకన నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పొడవునా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిరోధించేందుకు యత్నించినా అభిమానం ముందు ఆ ఆంక్షలు నిలవలేదు. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, నాయకులు నేతలు కాలినడకనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంబోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్ చేశారు. రెండు వేల మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవునా, ప్రతి గ్రామ శివారులో కాపలా పెట్టారు. వైఎస్ జగన్ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్తరోడ్డు, పెదపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. జగన్ వెంటే సాగారు. వైఎస్ జగన్ వారిని నిరాశ పరచకుండా అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్ వర్మ, అర్నవ్ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలను సైతం అడ్డుకుని..నలుమూలల నుంచి తరలి వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు కీలక నేతల కార్లను గురువారం ఉదయం నుంచి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణించేందుకు సైతం నిరాకరించారు. కొత్తరోడ్డులో అంతిమయాత్ర వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం నరేంద్రపురం వద్ద మహిళలను ఆస్పత్రులకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. రాగోలు వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు.ఎచ్చెర్ల రోడ్డు నవభారత్ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట స్థానిక నేతల వాహనాలు వెళ్లకుండా జాతీయ రహదారిని గంట సేపు దిగ్భందించారు. అంపోలు కూడలిలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు ఉన్నారు. వీరంతా జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
కొంచమైనా సిగ్గుందా రాధాకృష్ణ.. కడుపుకు అన్నమే తింటున్నావా...?
-
భోగాపురం ఎయిర్‌పోర్టు.. నాడు మల్లికార్జునరావు వ్యాఖ్యలివే..
‘నా ఫస్ట్ ఎయిర్‌పోర్టు హైదరాబాద్ ఎయిర్ పోర్టు. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ వేశారు. మళ్లీ ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేశారు. మా రెండో ఎయిర్‌పోర్టు ఢిల్లీ ఎయిర్ పోర్టు. దానిని కూడా రాజశేఖరరెడ్డి వారితో పాటు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజున అది భగవంతుడు నిర్ణయమో తెలియదు.. వారి తనయుడు జగన్మోహన్రెడ్డి అమృత హస్తాలతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్ వేయడమనేది. వారే దీనిని మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.. ’– జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన సభలో చేసిన వ్యాఖ్యలివి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఇది చదివాక ఎవరైనా భోగాపురం ఎయిర్ పోర్టు ఘనత మాది అని చెప్పుకోగలరా? కానీ క్రెడిట్ చోరీలో పేరు కొట్టేయడంలో సిద్ధహస్తులైన చంద్రబాబు అండ్‌కో.. భోగాపురం ఎయిర్ పోర్టు తామే కట్టించామని చెప్పుకోవడం.. ప్రారంభోత్సవం పేరుతో పబ్లిసిటీ చేసుకోవడం చూస్తే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కల్గిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడింతల నిర్మాణం పూర్తయింది. మిగతా పని కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తయ్యింది. శంకుస్థాపన సమయంలోనే 2026లో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. శంకుస్థాపనకు ముందే భూసేకరణ పూర్తి చేశారు. అన్ని క్లియరెన్స్‌లు తెచ్చారు. జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకుని, శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కళ్లముందు కన్పించిన దృశ్యాలే. కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత తమదని చంద్రబాబు అండ్‌కో చెప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జూన్-జూలై నెలల్లో మొదలుపెడతాం.ఎయిర్ పోర్టు లాండ్ కు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయాయి.మూడేళ్ళలో భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తవుతుంది.దీని వల్ల ఏపీ రాష్ట్ర జీడీపీ భారీగా పెరుగుతుంది - జిఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ జీఎం రావు గారు.👏👏👏 pic.twitter.com/3yBW5xDBOZ— Dr. K Srinivasa Varma (@DrKSVarma) March 4, 2023 ఇదేం ఘనత.. ⇒ వాస్తవంగా ఎయిర్‌పోర్టుకు భూములు అప్పగించి, అన్ని క్లియరెన్స్‌లు తెచ్చి ఇవ్వడమే ప్రభు త్వం బాధ్యత. మిగతా అంతా జీఎంఆర్ చూసుకుంటోంది. ఆ విధంగా జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ, దానిని కూడా తమ ఘనత అని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విస్మయం కల్గిస్తోంది. ⇒ జీఎంఆర్ నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2005 మార్చిలో పనులు ప్రారంభిస్తే 2008 మార్చిలో ప్రారంభోత్సవం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు కంటే పెద్దదైన ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును 36 నెలల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ, దానికంటే చిన్నదైన, టెక్నాలజీ పెరిగిన సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఆపరేషన్లోకి రావడానికి 33 నెలలు పట్టింది. దీనిలో గొప్పేం ఉంది. భారతదేశంలో ఎన్నడూ జరగని అద్భుతంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ⇒ సాధారణంగా ప్రైవేటు కంపెనీలు తమ సొంత పెట్టుబడితో నిర్మించే ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకొస్తే, అంత త్వరగా పెట్టుబడిపై ఆదాయం వస్తుందని ఆత్రుత చూపిస్తాయి. కానీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి, మన ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాత్రం నెలకొకసారి నిర్మాణం జరుగుతున్న భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తనే దగ్గరుండి కట్టించినట్టు ప్రచారం చేసుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ∙చంద్రబాబు ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి అంత సామర్థ్యం, పట్టు ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులను పూర్తి చేయవచ్చు కదా. వేగంగా అందుబాటులోకి రావొచ్చు కదా.. అదేం చేయరు. ప్రైవేటు కంపెనీ ఘనతను తమ ఘనతగా చెప్పుకోవడం చూస్తుంటే క్రెడిట్ చోరీ, పబ్లిసిటీ పిచ్చి తప్ప అంతకుమించి ఏమీ లేదని స్పష్టమవుతోంది. కేటాయింపుల మాటేంటి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు, భూ సేకరణకు రూ.967 కోట్లు, ఆర్ అండ్ ఆర్ కు రూ.75 కోట్లు ఇలా మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టారు. మరి చంద్రబాబుప్రభుత్వంలో ఏం చేశారో చెప్పగలరా? -
వైఎస్ జగన్ 1200 కోట్లు పెట్టి పూర్తి చేస్తే వీళ్ళ అడవిడి ఏంటో..
-
భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన
-
నెరవేరిన ఉత్తరాంధ్రుల కల భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై జగన్ సంచలన ట్వీట్
-
భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ ఏపీ చరిత్రలో మరో సంచలనం
-
Bhogapuram Airport : జగన్ పునాది రాయి వేశారు.. కూటమి చేసిందేమి లేదు
-
ఇది బాబు మార్క్ రాజకీయం.. భోగాపురంపై వైఎస్ జగన్ ఏమన్నారంటే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పని వైఎస్సార్‌ది.. ప్రచారం చంద్రబాబుది!. ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’.. అదే చంద్రబాబు మార్కు రాజకీయం అంటూ మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు.. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ?. అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ?ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని ఎన్వోసీలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.A project built by one, but claimed by another, that’s the story of Bhogapuram Airport. The Work was done by YSRCP. The publicity belongs to Chandrababu!"𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗪𝗶𝘁𝗵𝗼𝘂𝘁 𝗖𝗼𝗻𝘁𝗿𝗶𝗯𝘂𝘁𝗶𝗼𝗻: 𝗧𝗵𝗮𝘁 𝗜𝘀 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗮𝗯𝗮𝗯𝘂'𝘀 𝗕𝗿𝗮𝗻𝗱 𝗼𝗳… pic.twitter.com/bZ2y3ttepa— YS Jagan Mohan Reddy (@ysjagan) July 29, 2026కానీ చంద్రబాబు.. మీరు అప్పుడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడం లేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘ఎయిర్‌పోర్టు ఉంది.. కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. -
భోగాపురం 'చేరేదెలా'?
ముందుచూపు లేనివాడికి ముంగిట్లోనే ముప్పు అన్నట్లుంది విశాఖ మెట్రో నిర్లక్ష్యం. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే సిద్ధమవుతుంటే.. అక్కడికి వెళ్లే శాశ్వత రవాణా మార్గం మాత్రం పడకేసింది. భోగాపురానికి ‘వైజాగ్ మెట్రో’ అనుసంధానం అత్యవసరమని సాక్షాత్తూ ‘నీతిఆయోగ్’ మాస్టర్‌ప్లాన్ హెచ్చరిస్తున్నా.. కూటమి సర్కారు మాత్రం డీపీఆర్‌లను కాగితాలు దాటించడం లేదు. మెట్రో పట్టాలెక్కకపోతే.. భోగాపురం ప్రయాణం భవిష్యత్తులో నరకప్రాయమైన ‘ట్రాఫిక్ పద్మవ్యూహం’ కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా.. ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ గ్రోత్ హబ్ మాస్టర్‌ప్లాన్’లో నీతిఆయోగ్ విశాఖ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్‌వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ అవసరమని పేర్కొంది. భవిష్యత్ జనాభా, పారిశ్రామిక విస్తరణ, విమానాశ్రయం, పోర్టు కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. కాగితాలపైనే మెట్రో ఫేజ్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్–1, ఫేజ్–2 డీపీఆర్‌లు అంటూ కేవలం కాగితాలపైనే కాలయాపన చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అడుగులు వేయడం లేదు. కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణలో అవసరమైన చొరవ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వేలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, సరుకు రవాణా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెట్రో వంటి భారీ ప్రజారవాణా వ్యవస్థ లేకుంటే నగర ట్రాఫిక్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీచ్ కారిడార్ నత్తనడకనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల బీచ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం ప్రకటించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురాన్ని అనుసంధానించే ఈ 55 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.6,300 కోట్ల వ్యయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు భూసేకరణ, రహదారి విస్తరణ అంశాల వద్దే నిలిచిపోయింది. స్థానికుల అభ్యంతరాలు, మారిన ప్రతిపాదనల కారణంగా ఇప్పటికీ డీపీఆర్ దశను దాటలేకపోయింది. మెట్రో ఇక లగ్జరీ కాదు.. అత్యవసరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా లేకపోయినా.. విశాఖ నగరానికి మెట్రో అత్యవసరం. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో సహజ పరిమితుల మధ్య విస్తరించిన నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం తప్పనిసరి. ప్రస్తుతం నగరంలో బాటిల్‌నెక్ రోడ్లు అధికంగా ఉండటంతో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ప్లాన్లు, డీపీఆర్‌ల రూపకల్పనలో స్థానికుల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోంది. ఇకపై డీపీఆర్‌లలో మార్పుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. – యల్లపు రఘురామ్, వాణిజ్య నిపుణుడు ఐటీ అభివృద్ధికీ మెట్రో కీలకం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలంటే ప్రధాన ఐటీ కేంద్రాలకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మెట్రో కనెక్టివిటీ ఉండాలని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. మెరుగైన ప్రజారవాణా లేకపోవడం ఐటీ రంగ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని నివేదిక పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, నిధుల మంజూరులో వేగం పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా సూచించింది. -
జగన్ కు పేరొస్తుందని భయపడి..! భోగాపురం రోడ్డుకు బాబు బ్రేక్ ?
-
పవన్‌ను సైడ్ చేసి మరీ క్రెడిట్ చోరీ
ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో మేజర్ క్రెడిట్ అంతా జగన్‌దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. హైటెక్ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్‌లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. జగన్ టైమ్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా, ఈ ఎయిర్ పోర్టును జగన్ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు యాజమాన్యం అయిన జీఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్‌పోర్టును వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్‌లో ఉన్న చిక్కు ముళ్లను విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్‌లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్‌కే దక్కుతుందని చెప్పొచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు
-
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భారీగా భూ దోపిడీకి పథకం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిందేమీ లేకపోగా.. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ, నిస్సంకోచంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలన్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 5 వేల ఎకరాలు అని చెప్పారన్నారు.దీంతో ప్రజలు ఆయన చిత్తశుద్ధిపై అనుమానంతో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో ఏకంగా 130 కేసులు దాఖలు చేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. నాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టుకు కనీస అనుమతులు తేవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో విశ్వాసాన్ని నింపి, కోర్టు కేసులను పరిష్కరించి 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. భూ సేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అంతర్జాతీయంగా చూసినా 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం ఏర్పాటవుతుంది. మేం ప్రభుత్వంపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. సమయాన్ని వెచ్చించి.. శ్రమించి విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.కనీసం కనెక్టివిటీ రోడ్డూ పూర్తి చేయలేదు..భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు (ఆ వీడియోను ప్రదర్శించారు). కానీ, ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు.రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నా చంద్రబాబు రోడ్డు పనులను చేయకుండా గాలికొదిలేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు. త్వరలో భోగాపురం నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సరైన రోడ్లు లేవు. చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్ ఇస్తారు. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? భూ సేకరణ చేశారా? కనీసం ఇప్పుడు జరగాల్సిన పనులైనా చేయించారా? చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తన కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండానే క్రెడిట్ కొట్టేస్తారు! ఎవరో పని చేస్తే.. ఆ క్రెడిట్ తీసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి సంకోచం లేకుండా చోరీ చేసేస్తారు.బాబు అనుమతులు కూడా తేలేకపోయారు..నాడు చంద్రబాబు హయాంలో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా.. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు, ఎన్వోసీలు తేలేకపోయారు. ఆ ప్రాజెక్టు అనుమతులు అన్నీ మేమే తీసుకొచ్చాం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్లు (రక్షణ శాఖ విభాగాలు) ఎక్కువగా ఉన్నందున ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. నేను స్వయంగా ప్రధానిని కలిసి లేఖలు ఇచ్చా. అనేక సార్లు విజ్ఞ్ఞప్తి చేశా.అందుకే.. మా హయాంలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవివేషన్ సెక్యూరిటీ), రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఎన్వోసీ, అన్ని బ్యాంకుల ఫైనాన్షియల్ క్లోజర్ పర్మిషన్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అవసరమైన అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. కోవిడ్ లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకెళ్లాం. ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది.⇒ భోగాపురం ఎయిర్‌పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది. ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు.. కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.⇒ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు. – వైఎస్ జగన్ -
YS Jagan: భోగాపురం కోసం క్రెడిట్ చోర్....ఎంత కష్టం వచ్చింది బాబు
-
నేను ఆరోజే చెప్పా, 2026లో తొలి ఫ్లైట్ ఎగురుతుందని
-
‘భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్‌ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని, రోడ్ అలైన్‌మెంట్‌కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే..:తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్ తదితరులు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.జగన్ వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్:2019లో జగన్ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్‌పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్ ఫ్రేమ్ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్ చొరవతో వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.ఎయిర్‌పోర్టుకు రోడ్ కనెక్టివిటి ఏదీ?:ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు పక్కా రోడ్ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఏం సమాధానం చెబుతారు?.ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్లో తీవ్ర ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్, అలైన్మెంట్ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ముమ్మాటికీ జగన్‌దే
మహారాణిపేట: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సోమవారం మద్దిల పాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏమీలేదని విమర్శించారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా భోగాపురం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు.భూసేకరణ, అనుమతులు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేద్దామని అప్పట్లో బాబు శంకుస్థాపన చేశారో తెలీదని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణతోపాటు అన్ని అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదేరోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. అందులో భాగమే ఆదివారం జరిగిన విమాన ల్యాండింగ్ ట్రయల్ రన్ అని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదే జగన్ విజన్‌కి తార్కాణమన్నారు. నిర్వాసితులకూ వైఎస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ.. నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండుచోట్ల కాలనీలు నిరి్మంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్‌పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రీల్స్ రామ్మోహన్‌ను పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. విజయవాడ విమానాశ్రయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారని, మరి దానిని రామ్మోహన్నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి? ‘అమరావతిలో కొత్తగా ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ నిరి్మస్తామని బాబు అంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. అది ప్రారంభమైందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి ప్రకటన చేయించాం. ఈ ఘనత జగన్‌కే దక్కుతుంది. భోగాపురం విమానాశ్రయానికి ఆరులేన్ల జాతీయ రహదారి ఏమైపోయింది.బాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్‌పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజుబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించాలని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం బాబు అలవాటు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు. విజన్ అంటే జగన్.. భజన అంటే బాబు‘విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏ చానెల్ పెట్టినా బాబుకు జాకీర్ హుస్సేన్ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డప్పు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ రోజు జగన్‌కి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాంత ప్రజల ఆశలను నిజం చేసింది. ఆ సంస్థకు ధన్యవాదాలు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. -
జగన్ శ్రమ ఫలితమే ‘భోగాపురం’
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర అంతా అసత్యాలు, బురిడీ, మాయమాటలు చెప్పటమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టం, ఆలోచన, శ్రమతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు ట్రైల్ రన్ అనంతరం ప్రెస్ మీట్లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామ్మోహన్నాయుడు దేశం మొత్తం సిగ్గుపడి తలవంచుకునేలా ఇండిగో వ్యవహారంలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అసలు భోగాపురం ఎయిర్‌పోర్టుకు, చంద్రబాబుకు ఏం సంబంధం? అని సూటిగా ప్రశి్నంచారు. సోమవారం మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 14వ తేదీన రాయి వేశారు. ఇదే రీతిలో డ్రామాలాడుతూ బందరు పోర్టుకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్ పటిష్ట ప్రణాళికా, చర్యలతో ఏడాదిలో బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో అది కూడా తామే కట్టామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు.నిజానికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2,200 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నగదు చెల్లించి వారికి కాలనీలు కూడా ఏర్పాటు చేసిన తరువాతే 2023లో శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి ఎన్‌హెచ్–16ని కలిపే విధంగా నిరి్మంచాలని, అందుకు రూ.6,600 కోట్లు మంజూరు చేయాలని ఆ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరి అందుకు ఒప్పించారు. ⇒ భోగాపురం ఎయిర్‌పోర్టును తామే నిరి్మంచామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అదే నిజమైతే 18 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎలా సాధ్యం? ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడమే చంద్రబాబు నైజం. తాము తీసుకువచ్చిన పరిశ్రమలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వెళ్లిపోయాయని చంద్రబాబు, లోకేశ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అలాగైతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎందుకు వెళ్లలేదు? ⇒ రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహిస్తామని చంద్రబాబు సర్కారు చెబుతున్నా టెండర్లు ఎందుకు రావట్లేదు? ఆదోని మెడికల్ కళాశాలకు టెండరు వచ్చిందని, కిమ్స్ హాస్పటల్ మేనేజ్మెంట్ దాన్ని దాఖలు చేసిందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. అయితే కిమ్స్ ఆస్పత్రి ప్రతినిధులు తాము ఆ టెండరు వేయలేదని చెప్పారు. దీనిపై విలేకరులు మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ను ప్రశ్నిస్తే.. ఆసుపత్రి నిర్వాహకుడు ప్రేమ్‌చంద్ షా దాఖలు చేశారని చెబుతున్నారు. నిజానికి దేశంలోని 26 కిమ్స్ ఆస్పత్రుల్లో ప్రేమ్‌చంద్ షా పేరుతో గుండె వైద్యనిపుణులు ఎవరూ లేరని మా పరిశీలనలో తేలింది. మరి ప్రేమ్‌చంద్ షా ఎవరు? ఆయన టెండరు వేసినట్లు, ఆయనెవరో ఆధారాలతో చెప్పే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? ⇒ ఎన్నికల ముందు రూ.15 వేలు ఫీజుతోనే మెడికల్ విద్య సీట్లు కళాశాలల ద్వారా అందుబాటులోకి తెస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మాయమాటలు చెప్పటం ఆయనకు అలవాటైపోయింది. ప్రభుత్వ వైద్యం బాగోదని.. ప్రైవేటు వైద్యం మాత్రమే బాగుంటుందని చెప్పిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా? ⇒ తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని, ప్రతి ఇంటి నుంచి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో కరెంట్ మీటర్లు పెడితే బద్దలు కొడతామని అన్న తండ్రీ, కుమారుడు ఇప్పుడు అవే మీటర్లు బిగిస్తున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం ఏకంగా రూ.10 వేలకు పెంచి ఇస్తామని నమ్మబలికి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకటి రెండు నెలలు మినహా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు వేయటం లేదు? సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న వాగ్దానం ఏమైంది? డీఏ, ఎరియర్స్ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించలేదు. ఐఆర్ కూడా ప్రకటించకుండా గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉపాధ్యాయులకు ‘టెట్’ పెడుతున్నారు. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు సంవత్సరానికి మూడుసార్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వంలో నిల్వ ఉంచిన సొమ్ము మినహా 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. హోంగార్డులకు జగన్మోహన్రెడ్డి హయాంలో జీతం పెంచారు. ఆ తరువాత మీరు ఒక్క రూపాయి అయిన జీతం పెంచారా? ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ కునారిల్లుతోందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వ్యాఖ్యానించటం నిజం కాదా? పోలీసులు కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది. ⇒ వైఎస్ జగన్ తన కుమార్తె వద్దకు లండన్ వెళితే రూ.12 కోట్లు ఖర్చు చేశారని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, లోకేశ్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బాలి, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లి తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతోంది? పోలీసులకు పెట్రోల్ ఖర్చులు ఇవ్వలేని వారు వీటికి రూ.కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చేసిన దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. ఎవరో చేసిన పని తన ఖాతాలో వేసుకుని, తానే చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం మానుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించటంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ⇒ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా, తలకిందులుగా తపస్సు చేసినా.. జనబలం, గుండెబలం ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ప్రజలంతా తమవాడిగా, ఇంట్లో మనిíÙగా గెలిపించుకోవటం ఖాయం. ⇒ చంద్రబాబు ప్రభుత్వం పలు సంస్థల పేరుతో వేల ఎకరాలు కేటాయింపులు చేస్తున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవటం ప్రజలను మోసం చేయటమే. సింగపూర్‌లా అమరావతి నిర్మాణం చేస్తామని ప్రభుత్వ పెద్దలు మాయమాటలు చెబుతున్నారు. మంత్రి నారాయణ మాత్రం రోజూ తుమ్మ చెట్లు నరుకుతున్నామని చెప్పటం మినహా ఇంతవరకు చేసిందేమీ లేదు.⇒ విదేశాల నుంచి తీసుకువచ్చిన ప్రతినిధులతో సమ్మిట్లు నిర్వహించి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. హోటళ్లలో వంటవారిని తీసుకొచ్చి సూటు బూటు వేస్తున్నారని తెలంగాణ మాజీ సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధపడటం విడ్డూరంగా ఉంది. -
భోగాపురంపై నీళ్లు నమిలిన మంత్రులు
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని భజన చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడిని నిద్రలో లేపి అడిగినా చెబుతాడని ప్రగల్భాలు పలికారు. దీంతో మీడియా ప్రతినిధులు కల్పించుకుని ‘ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పునరావాసం, భూసేకరణ కోసం గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు ఖర్చు చేశామని వైఎస్సార్సీపీ చెబుతోంది.’ వాస్తవం కాదా? అని మీడియా ప్రశి్నంచగా మంత్రులు నీళ్లు నమిలారు.ఎయిర్పోర్ట్ నిర్మాణంపై హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులను ఎవరి హయాంలో అధిగమించారు? అన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం గత ప్రభుత్వంలోనే పూర్తయినట్టు ప్రతిపక్షం చెబుతోందని మీడియా ప్రస్తావించగా అచ్చెన్నాయుడు కస్సుబుస్సులాడారు. వాస్తవాలను అంగీకరించలేక మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత అంతా బాబుకే దక్కాలన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై మీడియా వేసిన ప్రశ్నలతో అచ్చెన్నాయుడు అసహనానికి గురయ్యారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించేశానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అచ్చెన్నను ప్రశ్నించగా ‘వెళ్లి ఆయన్నే అడుక్కోండి’ అని వారిపై కస్సుమన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు సీమ ద్రోహి అని రాసేస్తారా? అంటూ చిందులు తొక్కారు. -
భోగాపురంలో రామ్మోహన్ షో.. బాబు తీరు అలా?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఆలోచన, కష్టంతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తీరుతో భారత్ పరువు పోయిందని విమర్శించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురంలో ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్ జరిగింది. విమానం రన్ వే మీద ఆగడం రామ్మోహన్ నాయుడు బిల్డప్ ఇచ్చాడు. హైదరాబాద్, భోగాపురంలో చంద్రబాబే ఎయిర్‌పోర్టులు కట్టారంటూ రామ్మోహన్ మాట్లాడుతున్నాడు. ఇండిగో అంశాల్లో భారతదేశం సిగ్గు పడుతుంది. ప్రపంచం ముందు భారత్ తలదించుకుంది. అది ఎవరి వల్లనో అందరూ గుర్తు పెట్టుకుంటారు.భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకి అసలు సంబంధం ఏంటి?. 2019 ఎన్నికల ముందు దిగిపోతూ శిలాఫలకం పెట్టాడు. ముందు 5 వేల ఎకరాలు అని.. తర్వాత 15వేల ఎకరాలు అని చంద్రబాబు అన్నాడు. ఒక్క ఎకరం కూడా భూమి తీసుకోకుండా శిలాఫలకం వేసి చంద్రబాబు దిగిపోయాడు. బందర్ పోర్టుకి 33వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేసారు. జగన్ రాకపోతే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదు. 2200 ఎకరాలు ఎయిర్‌పోర్టుకి చాలు అని.. భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చి.. కాలనీ నిర్మించి 2023లో శంకుస్థాపన చేశారు..జగన్ కష్టార్జితమే భోగాపురం.. అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్‌పోర్టు రైతుల త్యాగాలతో నిర్మాణం అవుతుందని.. 2026లో ప్రారంభం అవుతుందని వైఎస్ జగన్ చెప్పారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకి 6600 కోట్లతో ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ ప్రకటించారు. 18 నెలల్లో భూ సేకరణ చేసి ఎయిర్పోర్ట్ కట్టగలరా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎవరో చేసిన పని తన అకౌంట్లో వేసుకోవడం కూటమి నేతలు నేర్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎలా కట్టారు?. మీరు ఫొటోలు దిగే ఎయిర్‌పోర్టు జగన్ కష్టార్జితం. జగన్ మళ్ళీ రాడని, భూస్థాపితం చేశామని కూటమి నేతలు చెపుతున్నారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అసమర్థ పాలన అని చెప్పుకునే మీకు అధికారంలో ఉండే అర్హత ఎక్కడ ఉంది?. చంద్రబాబు చెప్పిన సొల్లు మాటలు ఇవే. కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఇంటి నుండి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పాడు. మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు బిగిస్తున్నారు. వాలంటీర్లకి 10వేలు ఇస్తామని చెప్పారు.. వాలంటీర్లు లేకుండా చేశారు..మెడికల్ కాలేజీలు తీసుకోవాలని అనుకొనే వాళ్లను చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పాడు. ఎకరం భూమి రూపాయికి, ఆసుపత్రి ఫ్రీ.. రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టెండర్లు ఒక్కడు కూడా వేయలేదు. కానీ ఆదోనికి ఒక టెండర్ వచ్చిందని సంకలు గుద్దుకున్నారు. రెండు రోజుల్లోనే టెండర్ మేము వేయలేదని కిమ్స్ చెప్పింది. ప్రేమ్ చాంద్ షాకి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు సత్యకుమార్ ప్రకటించాడు. కిమ్స్ 26 ఆసుపత్రిలో ప్రేమ్ చాంద్ షా అనే వ్యక్తి లేడు. ఉన్నాడని ఆధారాలతో నిరూపించగలడా?. లక్ష కోట్లు ఆస్తులు దోచేస్తున్నారు..అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. నీళ్లు తోడం అని ప్రతీ మూడు నెలలకు నారాయణ చెపుతున్నారు. ప్లాట్స్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాటి సింగపూరు వాళ్ళు ఏమైపోయారు?. సింగపూర్ అమరావతి కట్టినట్లు ఉంది.. మెడికల్ కాలేజీల పరిస్థితి. నూతన సంవత్సర వేడుకలకు విదేశాలు పోతారు.. మీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?. పోలీస్ వాహనాలకు డీజిల్ ఇచ్చారా? ఒక్క పైసా కూడా నేటికి ఇవ్వలేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పింది. ఏదో ఒక రోజు పోలీసులు చంద్రబాబుపై సహాయ నిరాకరణ చేస్తారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమే. చంద్రబాబు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు.. వచ్చిన ఆదాయం ఏం చేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. -
కొబ్బరి కాయ కొట్టడం తప్ప.. నువ్వు చేసిందేమీ లేదు బాబూ
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ పై బొత్స సత్యనారాయణ రియాక్షన్
-
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చిన ఏకైక మగాడు
-
చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత
-
జగన్ కృషి వల్లే భోగాపురం ఎయిర్ పోర్ట్.. అసలు నిజాలు ఇవిగో..!
-
జగన్ విజన్.. దటీజ్ భోగాపురం
సాక్షి, అమరావతి : భూ సేకరణ పూర్తి చేయలేదు.. కనీసం కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకోలేదు.. అయినా భోగాపురం ఎయిర్‌పోర్టును మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014–2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు తీసుకురాలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. కనీసం ఎన్వోసీ కూడా లేదు.అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూ సేకరణ, ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమా అనిపించేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా వైజాగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం 2,200 ఎకరాల్లో నిర్మించేలా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు.కేంద్రం కూడా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2022 నవంబర్‌లో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసింది. దీంతో 2023 మే 3న వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాయు వేగంతో పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్టు తానే నిర్మిస్తున్నట్లు బాబు డబ్బా కొట్టుకోవడం ప్రారంభించారు. త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తొలిసారిగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ జగన్ సర్కారు నిర్దేశించిన విధంగానే 2026 జూన్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.సామాజిక మాధ్యమాల్లో క్రెడిట్ చోరీ ట్రెండింగ్ వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదానీ డేటా సెంటర్.. ఇలా అన్ని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొని అభాసుపాలైనప్పటికీ వురోసారి నిస్సిగ్గుగా భోగాపురం ఎయిర్‌పోర్టును తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబు క్రెడిట్ చోరీపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా పెట్టి ఉతికి ఆరేస్తున్నారు.శంషా బాద్ ఎయిర్‌పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయంటూ జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు చెప్పిన మాటల వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతిని కూడా తీసుకు రాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ఒక్క రూపాయి భూ పరిహారమూ చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. అయినా క్రెడిట్ తీసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.క్రెడిట్ తండ్రీ తనయులదే..మా ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో.. ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. – 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు -
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ పై YS జగన్ రియాక్షన్
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి ఆ నాడు జగన్ చెప్పిన మాటలు
-
జగన్ కృషి.. భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి ఫ్లైట్ ల్యాండింగ్
-
జగన్ కృషి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ రన్ వే ప్రత్యేకతలు
-
సెల్ ఫోన్.. గూగుల్ డేటా సెంటర్.. భోగాపురం!.. బాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను నేనే కట్టాను.. సెల్ ఫోన్‌ను నేనే కనిపెట్టాను.. సత్య నాదెళ్ల, పీవీ సింధులు నా వల్లే ఎదిగారు.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను.. అని గొప్పలు చెప్పుకునేదెవరని అడిగితే.. ‘చంద్రబాబే’ అని ఎవరైనా ఇట్టే సమాధానమిస్తారు. రూపాయి పని చేయకపోయినా మొత్తం తానే చేసినట్లు, గంపెడు మట్టి పోయకున్నా ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఇసుమంత కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారు.వాస్తవానికి ఈ విమానశ్రయానికి ఏ మాత్రం అనుమతులు, భూసేకరణ వంటి ప్రాథమిక ప్రక్రియలు చేపట్టకుండానే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇదే చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కోర్టు కేసులను కొలిక్కి తెచ్చారు. భూసేకరణ పూర్తి చేసి, భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి విమానాశ్రయానికి సంబంధించి దాదాపుగా పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పనుల పూర్తికి చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకుని.. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తద్వారా మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జనం చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో భూ సేకరణ ⇒ 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. ⇒ భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ⇒ విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ⇒ ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తయ్యింది. చంద్రబాబువి టెంకాయ రాజకీయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5 వేల ఎకరాలకు దిగొచ్చారు. భూ సేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నామన్నది ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం గమనార్హం. క్రెడిట్ చోరీకి పోటాపోటీ వైఎస్ జగన్ కృషినంతటినీ పక్కన పెట్టి.. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లు భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ చోరీలో పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌కు వచ్చినప్పుడల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. లోకేశ్ ఓ దశలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను నిలదీశారంటూ కూడా ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘనత తమదేనని ఈ ముగ్గురూ ఎవరంతకు వారు తమ కోటరీల ద్వారా ప్రచారానికి తెర లేపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత వైఎస్ జగన్‌ది అయినప్పటికీ.. ఆయనకు పేరు రాకుండా ఉండేందుకు వీరు పాట్లు పడుతుండటంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్‌దే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగవిుంచింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది.ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకోవడంతో జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్‌కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Botsa: తల దించుకుంటా మీకు దమ్ముంటే నిరూపించండి
-
భోగాపురం.. జగన్ వరం.. బాబు కుట్రలు షురూ !
-
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 675 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీవీఐఏఎల్)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్), ఎన్ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీసీడీల రూపంలో.. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్ఐఐఎఫ్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ గిరి తెలిపారు. హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) జీబీఎస్ రాజు తెలిపారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది. -
చకచకా కొనసాగుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు
-
హవ్వ! ఇదేం తీరు రామోజీ?
తెలుగుదేశం ఎందుకు చేయలేకపోయింది ‘‘నిజంగా టీడీపీకి భోగాపురం ఎయిర్‌పోర్టుపై చితశుద్ధి ఉంటే ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు? హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు అన్ని కేసులనూ దేవుడి దయతో పరిష్కరించుకుని రైతుల ఆమోదంతో భూసేకరణను పూర్తి చేశాం.అంతేకాకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రూ.80 కోట్లు ఖర్చు చేసి అన్ని వసతులు, సౌకర్యాలతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేసి రైతులు స్వచ్ఛందంగా వెళ్లేలా చేశాం. విశాఖ నుంచి భోగాపురానికి ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.6,300 కోట్లతో నిర్మించడానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నాం. వీటి పనులు త్వరలో మొదలవుతాయి. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల నీటి ఎద్దడిని పరిష్కరించడానికి రూ.195 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 30 నెలల్లో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయి. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కిరీటంగా మారుతుంది.’’ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అసత్యాలు ప్రమాదకరం. అర్థసత్యాలు మరింత ప్రమాదకరం. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన వేళ.. ‘ఈనాడు’ అర్థసత్యాల రూటును ఎంచుకుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ... వాటిలో కొంత మాత్రమే ఇస్తూ... ‘‘హవ్వ... అది నోరేనా?’’ అంటూ తన అక్కసు మొత్తం వెళ్లగక్కేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా చెప్పినవన్నీ ఇపుడు చేశాకే... విమానాశ్రయానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం తనదైన ముసుగేసేసింది. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకుండానే... ఎప్పుడో రెండేళ్ల కిందటి ఫోటో తీసుకొచ్చి కొట్టారంటూ ప్రచారం చేయటం... వ్యాపారులు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారని అబద్ధాలు చెప్పి గుండెలు బాదేసుకోవటం... ఇపుడేమో భోగాపురంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పి దుష్ప్రచారానికి దిగటం... ఇవన్నీ తాజా పరిణామాలు కావటంతో ‘‘ఈనాడు మరీ ఇంతలా దిగజారిపోయిందేంటి?’’ అనే వ్యాఖ్యలు, దానికి జోడించిన కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏఏ అంశాలను వ్యతిరేకించారు? ఇపుడు వాటి విషయంలో ఎలా ముందుకు వెళుతున్నారో చూద్దాం... ఎన్నికలకు నిండా నెల రోజులు కూడా లేదు. భూ సేకరణ పూర్తికాలేదు. ఎలాంటి అనుమతులూ లేవు. అయినా సరే... హడావుడిగా ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు నాయుడు. అనుమతులు లేకుండా ఎలా చేశారు? భూసేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారు? అసలు ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఎందుకింత హడావుడి? అని ‘ఈనాడు’ ఒక్క ప్రశ్న వేస్తే ఒట్టు!!. పైపెచ్చు కొబ్బరికాయ కొట్టిననాడే విమానాశ్రయం పూర్తయిపోయి విమానాలు ఎగురుతున్న రేంజిలో కవరేజి. ఇప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ రామోజీరావు మాత్రం... సవాలక్ష అర్థసత్యాలతో చెలరేగిపోయారు. నిజానికి 2018 మార్చి దాకా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి. అన్నిటికన్నా ముఖ్యం... విజయనగరం జిల్లాకే చెందిన పి.అశోక్‌గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. సొంత జిల్లాలో వస్తున్న విమానాశ్రయానికి అన్ని అనుమతులూ తెప్పించడానికి ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనతో హడావుడి మాత్రం చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసింది కూడా విమానాశ్రయానికి సంబంధించిన భూమిలో కాదు. అది తన సొంత భూమి అని, తన నుంచి విమానాశ్రయం కోసం సేకరించటం కూడా జరగలేదని, కానీ అందులో శంకుస్థాపన చేశారని అప్పట్లో సత్యనారాయణ అనే రైతు వాపోయాడు. చివరకు ఆ రైతు గోడును కూడా పట్టించుకోని రామోజీరావు... ఇపుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్‌పై అభాండాలు వేయటం విచిత్రం. అమరావతి రైతులతో పోలికా? అప్పట్లో అమరావతి రైతులను త్యాగధనులగాను, భోగాపురం రైతులను లిటిగేషన్ పెట్టే రైతులుగాను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం నిజం కాదా? అమరావతి రైతులతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... తాను ఇచ్చిన పిలుపుతో అమరావతి కోసం. గన్నవరం విమానాశ్రయం కోసం రైతులు భూమిని ఇచ్చి త్యాగం చేశారని, కానీ భోగాపురం రైతులు భూములిచ్చి కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెడుతున్నారని, అందుకే తాము ఎయిర్‌పోర్టును నిర్మించలేకపోతున్నామని చెప్పారు. మరి ‘ఈనాడు’ ఈ వాస్తవాలెందుకు రాయదు? ముఖ్యమంత్రి జగన్ మాట మార్చారంటూ తప్పుడు కథనాలేల? వ్యతిరేకించింది 12,000 ఎకరాల భూసేకరణనే... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు నాయుడు 2015లో రైతుల నుంచి 12,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయింది. ఈ ఆందోళనతో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికని ప్రశ్నించారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు. చివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు... ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు... ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ ప్రస్తావించని ‘ఈనాడు’... నాడు భూసేకరణను వ్యతిరేకించి, నేడు శంకుస్థాపన చేస్తున్నారంటూ రాయటం దారుణం కాక మరేమిటి? ఏ1గా నిలిచింది జీఎంఆర్ సంస్థే... ► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలుత పిలిచిన టెండర్లల్లో ఎయిర్‌పోర్టు అథారిటీఆఫ్ ఇండియా ఎంపికయింది. కానీ ఆ టెండర్లను రద్దుచేసి తిరిగి పిలిచిన టెండర్లలో జీఎంఆర్ సంస్థే ఏ1గా నిలిచింది. ఈలోగా ఎన్నికలు సమీపించడంతో భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీఎంఆర్‌తో ఒప్పందం లేకుండానే హడావుడి శంకుస్థాపన చేశారు. అందుకే నాటి శంకుస్థాపనకు సైతం జీఎంఆర్ ప్రతినిధులు దూరంగా ఉన్నారు. ► ఈ ఎయిర్‌పోర్టు భూసేకరణపై సుప్రీంకోర్టు నవంబర్11, 2022న తీర్పు ఇస్తే జనవరి 2023 నాటికి భూసేకరణ పూర్తయ్యింది. ► ఈ ఏడాది మార్చిలో పునరావాస గ్రామాలకు ప్రజలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ► ఇక ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ 2022 నవంబర్‌లో వచ్చింది. ఇలా అడ్డంకులన్నీ తొలగించాకే శంకుస్థాపన చేశారు సీఎం జగన్. అసలు ‘ఈనాడు’ ఏడుపు ఎందుకంటే నాడు చంద్రబాబు చేయలేకపోయింది..నేడు జగన్ చేస్తున్నారనే ఈర‡్ష్య ఒకటి కాగా... జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగనే పూర్తయ్యాక విమానాశ్రయాన్ని ప్రారంభించాలని వ్యాఖ్యానించటం ఎల్లో ముఠా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే శంకుస్థాపన కార్యక్రమం వార్తను కుదించేసి... అసత్యాలు, అర్థసత్యాలతో కూడిన కథనాన్ని పతాక శీర్షికల్లో వేసేసింది. పునరావాస గ్రామాలూ పూర్తి... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నా చిత్తశుద్ధి లేకుండా భోగాపురాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నది చంద్రబాబు నాయుడు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్ దీనికి అనుమతులు సాధించటంతో పాటు ఈ నాలుగేళ్లలో పునరావాస గ్రామాలను సైతం పూర్తి చేశారు. అప్పట్లో బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించిన మాట వాస్తవం. అందుకే స్థానికులు తమకు పరిహారం దక్కి.. స్వచ్ఛందంగా పునరావాస కాలనీలకు వెళ్లిన తరవాతే శంకుస్థాపన చేశారన్న విషయాన్ని దాచిపెడతారెందుకు రామోజీరావు గారూ? -
CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. ఆయనను ఎప్పుడు కలిసినా నేను విశాఖకు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవాడిని. ఆయన దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డేటా సెంటర్ రావడం అంటే విశాఖనగరం ముఖ చిత్రాన్ని మార్చడమే. దీనికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూడా గొప్ప విషయం. ఈ రెండిటికి ఒక రకంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే.. అదానీ డేటా సెంటర్ లోనే మరో ఐదేళ్లలో 39 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ పార్క్, ఐటి పార్కు, విమానాశ్రయంలో కార్గో సెంటర్, ఎయిరోసిటీ మొదలైన వాటి ద్వారా మరిన్ని వేల మందికి అవకాశాలు రాబోతున్నాయి. వీరితో పాటే సర్వీస్ రంగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని కూడా జగన్ ప్రకటించారు. అంటే విశాఖ సిగలో ఈ పరిపాలన రాజధాని మరో ఆభరణం అవుతుంది. ఈ రకంగా తెలంగాణ రాజదాని హైదరాబాద్ కు విశాఖ అతి త్వరలోనే పెద్ద పోటీ కాబోతోంది. ఐటీ రంగంలో విశాఖ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే మల్టీకల్చరల్ నగరంగా ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో ఇక్కడ నివసిస్తున్నారు. ఏపీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ దశలో ఈ అభివృద్ది అంతా జరిగితే విశాఖకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల పంట పడుతుంది. 👉 ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా బాగా తగ్గిపోతాయి. విశాఖకు సహజమైన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఒక వైపు సముద్ర తీరం, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతంలో నగరం విస్తరణకు ఎనలేని అవకాశం ఉండడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర ప్రాంతాన్ని, ఈ కొత్త ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదానీ డేటా సెంటర్‌ను తీసుకు రావడానికి ఆయన విశేష కృషి చేశారు. రాజకీయంగా తన పలుకుబడిని సైలెంట్ గా ఉపయోగించారు. వారికి అవసరమైన భూమిని కేటాయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. 👉 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఆదాని డేటా సెంటర్ పై ఎంత విష ప్రచారం చేసినా, తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లారు సీఎం జగన్. దీనిని రాకుండా చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలం అవడంతో తెలుగుదేశం మీడియా కొత్త రాగం అందుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిందని ప్రచారం ఆరంభించారు. అప్పుడు అదానీ గొప్పవాడయ్యాడు. అదే జగన్ టైమ్ లో అదానీ ముందుకు వస్తే ఎంత నీచ ప్రచారం చేశారో గమనిస్తే ఈ మీడియాలపై చీదర వేస్తుంది. 👉 నిజానికి గత ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు హడావుడిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. చంద్రబాబుకు ఇలా చేయడం కొత్తకాదు. అది వేరే విషయం. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ వంటివాటిని కూడా అలాగే చేశారు. కాని వాటన్నింటిని ఉత్తిత్తి వ్యవహారంగానే మిగిల్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు చేశారు. పర్యావరణ తదితర కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులను సాధించారు. ఇవన్ని పూర్తి అయిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 👉 అంతేకాక ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న గ్రంధి మల్లిఖార్జున రావు ఈ జిల్లాకే చెందినవారు కావడం అదనంగా కలిసి వచ్చే విషయం. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి కోరినట్లు ఆరు నెలల నుంచి ఏడాది ముందుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా మరోసారి తెలియచేస్తుంది. 2026లో తానే వచ్చి మళ్లీ ఎయిర్ పోర్టును ప్రారంబిస్తానని ఆయన ప్రకటించారు. అంటే దాని అర్దం 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారన్నమాట. 👉 యధాప్రకారం ఆయన తాను మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడానికి సాహసించలేదు. అది ఒక్క జగన్ వల్లే అయింది. ఇక్కడ మరో సంగతి చూడాలి.. ఆదానీ డేటా సెంటర్ కాని, ఇతరత్రా స్కిల్ యూనివర్శిటీ వంటి ఆయా అభివృద్ది కార్యక్రమాలను విశాఖలో చేపట్టడం వల్ల అవి వేగంగా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది. అదే అమరావతి గ్రామాలలో ఏర్పాటు చేయవలసి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. విశాఖలో చాలా వరకు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతి గ్రామాలలో సరైన రోడ్లు కూడా లేవు. కొత్తగా పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే ఔత్సాహికులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. 👉 అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఎకరా భూమి ని నాలుగు కోట్ల వరకు తీసుకువెళ్లారు. దీనివల్ల కొత్తగా ఎవరైనా సంస్థలు పెట్టాలంటే చాలా వ్యయం చేయవలసి వస్తుంది. వారికి గిట్టుబాటు కాని పరిస్థితి ఎదురు అవుతుంది. గత ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేవు. అటవీ భూములు ఉన్నా వాటిని వాడుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. వీటిని గుర్తించకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. పోనీ ఏవైనా నిర్మాణాలు చేశారా అంటే అంతా తాత్కాలికం అన్నారు. తద్వారా వందల కోట్ల రూపాయల నిదులను దుర్వినయోగం చేయడానికి సిద్దమయ్యారు. 👉 ఈ నేపధ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. హైదరాబాద్ మాదిరి వేగంగా అభివృద్ది చెందడానికి, ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారడానికి విశాఖకు ఉన్న అవకాశాలను ఆయన అంచనావేశారు. ఇప్పటికే విశాఖ ఈ విషయంలో కొంతమేర ఉపయోగపడుతోంది. పరిపాలన రాజధాని అవడం, డేటా సెంటర్, కొత్త ఎయిర్ పోర్టు మొదలైనవన్ని వస్తే హైదరాబాద్ కు గట్టి పోటీ ఇచ్చే నగరంగా విశాఖ తయారవుతుంది. కానీ.. 👉 దీనిని అడ్డుకోవడానికి టిడిపి నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు విపరీతమైన కృషి చేశాయి. విష ప్రచారంతో ప్రజలలో వ్యతిరేక భావాలు నాటడానికి యత్నించాయి. అయినా జగన్ వారిని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అవి వాస్తవరూపం దాల్చి విశాఖ రూపురేఖలను మార్చబోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలోను టీడీపీ వర్గాలు ఇలాగే నిత్యం దుష్ప్రచారం చేసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యవహరించి ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. అలాగే జగన్ కూడా ఎంతో పట్టుదలతో విశాఖ అభివృద్దిని కార్యరూపంలోకి తెచ్చి శెబాష్ అనిపించుకుంటున్నారు. ఎంతైనా రాజశేఖరరెడ్డి కుమారుడు కదా. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలియదుగానీ.. -
జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: 30 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ హయాంలోఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారని ఏకిపారేశారు. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అందుకే తనను జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని గుడివాడ ఎద్దేవా చేశారు. అందుకే విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈమేరకు అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? -
సీఎం జగన్ పర్యటనకు అపూర్వ స్పందన.. కిక్కిరిసిన సభా ప్రాంగణం
సాక్షి, విజయనగరం: సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లన్నీ కిటకిటలాడాయి. సీఎం జగన్ కోసం వర్షంలో కూడా తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామతీర్దసాగరం ప్రాజెక్టు పనులతో పాటు చింతపల్లి వద్ద రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు. భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుందని ఆయన అన్నారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
కదిలివచ్చిన జనాభిమానం.. భోగాపురంలో జై జగనన్న! (ఫొటోలు)
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాన కార్యక్రమం... డ్రోన్ వీడియో
-
వలసల ఉత్తరాంధ్ర జాబ్‌హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం.. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్ హబ్‌గా మారుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూలపేటలో ఈ మధ్యే పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇవాళే అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. డేటా సెంటర్‌తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఓర్వలేకనే.. ఇవాళ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారు. పైగా మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఇవాళ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపం చేసుకున్నాం. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్‌కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా.. 2026లో మీ బిడ్డనే(సీఎం జగన్ తనను ఉద్దేశించుకుంటూ..) వచ్చి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తాడని,ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరు ఎన్నికుట్రలు చేసినా ఫలించవని ధీమా వ్యక్తం చేశారాయన. 24 నుంచి 30 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని జీఎంఆర్ హామీ ఇచ్చింది. ఏ380 డబుల్ డెక్కర్ ల్యాండ్‌అయ్యేలా.. ఏర్పాట్లు చేస్తాం. మొదటి ఫేజ్‌లో 60 లక్షల జనాభాకు సదుపాయలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి నాలుగు కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అందుకే అల్లూరి జిల్లా.. ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే.. మన్నెం వీరుడు అల్లూరి గుర్తుకొస్తారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం. బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన గడ్డ ఇది. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నాం. అభివృద్ధికి సులువుగా ఉండాలనే ఉన్న మూడు జిల్లాలను.. ఆరు జిల్లాలను చేశాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. జూన్‌లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను జాతికి అంకితం చేస్తాం. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్ తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచే విశాఖ నుంచి పాలన నడుస్తుందని మరోసారి భోగాపురం బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: డబుల్ డోస్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోవాలా! -
నెరవేరబోతోన్న ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల
-
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనేక ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మూలపేట పోర్ట్ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. మరో రెండున్నరేళ్లలో మూలపేట పోర్టు పూర్తి కానుంది. రేపు(బుధవారం) భోగాపురం ఎయిర్పోర్ట్, డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ‘‘రూ.3,500 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. 2025 సెప్టెంబర్ లోపు ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం. టెక్ పార్క్ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం. రూ.6,500 కోట్లతో భోగాపురం విశాఖ మధ్య 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్-సైబరాబాద్ ట్విన్ సిటీస్ మాదిరిగా భవిష్యత్‌లో విశాఖ-విజయనగరం అభివృద్ధి చెందుతాయి’’ అని అమర్నాథ్ అన్నారు. చదవండి: ‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’ ‘‘ఎప్పుడైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకువచ్చారా? 2019 ఫిబ్రవరి 15న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో కనీసం భూ సేకరణ, రన్ వే కోర్టు క్లియరెన్స్‌లు తీసుకోలేదు. సిమెంట్ పలక ఉంటే చాలు.. చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేస్తారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు -
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి: కరికాల వలవన్
సాక్షి, విజయవాడ: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మాట్లాడుతూ విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎయిర్పోర్ట్ కోసం పరిష్కరించామని, భూ సేకరణ కేసులు, పర్యావరణ కేసులు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్రం నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఎన్వోసీ తెచ్చాం. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్, ఆదాని డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆదాని డేటా సెంటర్‌తో రూ.20 వేల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఐటీ పార్క్ కూడా ఆదాని సంస్థ అభివృద్ధి చేస్తుంది. 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చెయ్యడానికి పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ మౌలిక వసతులు పై దృష్టి పెట్టారని కరికాల వలవన్ పేర్కొన్నారు. చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ -
Bhogapuram Airport: సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన
సాక్షి, విజయనగరం: వచ్చే నెల(మే) 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయనున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం మంత్రి బొత్స.. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ జరిగింది. ఈ సమీక్షలో మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి వచ్చే నెల 3న శంకుస్థాపన
-
భోగాపురం విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అదాని డేటా సెంటర్‌కు త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ఆయన బుధవారం ఎండాడ లా కాలేజీ రోడ్డు పనోరమ హిల్స్ వద్ద వైఎస్సార్సీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల్లో త్వరలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగాక విశాఖ పరిపాలన రాజధాని కానుందని చెప్పారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ మంత్రులు పి.బాలరాజు, దాడి వీరభద్రరావు, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
-
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది. చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ -
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్‌కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్‌పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. -
భోగాపురం విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో ప్రపంచస్థాయి సౌకర్యాలతోపాటు సరుకు రవాణా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్ కార్గో అవకాశాలపై గురువారం ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాల ద్వారా సరుకు రవాణాకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్ కార్గో సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఎగుమతిదారులను కోరారు. ఎయిర్ కార్గో సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లనవసరం లేకుండా రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కస్టమ్స్ విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్‌తోపాటు వివిధ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టు అధికారులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
పర్యావరణ కోణంలోనే చూడాలి
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన కేసులను పర్యావరణ కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారని విచారించబోమని పేర్కొనడం సరికాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయానికి 2017 ఆగస్టులో అనుమతులు వచ్చాయి. వీటి విషయంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికురాలు దాట్ల శ్రీదేవి చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. 90 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయలేదని.. ఈ ఆలస్యం కారణంగా విచారించబోమని ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. వీటిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీ ఆదేశాలను పక్కనపెడుతున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతుల పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయని.. వాటిని అధ్యయనం చేయడం, సాంకేతిక, ఇతర అంశాలపై నిపుణులతో సంప్రదింపులకు సమయం పట్టినందున పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైందన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషనర్‌తోపాటు ఇతరులు కూడా ఎన్జీటీ ముందు వాదనలు వినిపించొచ్చని పేర్కొంది. -
భోగాపురం దాకా విశాఖ లైట్ మెట్రో
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ నిర్మించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. కేవలం నగరంలోనే మెట్రో రైలు నడపడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం కాకపోవడం ఒక లోపంగా మారింది. అలాంటి పరిస్థితి విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో 46.40 కిలోమీటర్ల మేర మూడు లైట్ మెట్రో కారిడార్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మొత్తాన్ని కలుపుతూ 140 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్లను ప్రతిపాదించింది. అందులో కొమ్మాది–ఆనందపురం జంక్షన్, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతిపాదించిన కారిడార్లను రెండో దశలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుతో తొలి దశలోనే నగరాన్ని అనుసంధానిస్తే బాగుంటుందన్న అంచనాతో రోడ్ మ్యాప్ రూపొందించారు. డీపీఆర్, టెండర్ల ప్రక్రియ ఒకేసారి తొలి దశలో స్టీల్‌ప్లాంట్–కొమ్మాది జంక్షన్, గురుద్వారా–పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం–ఆర్కే బీచ్, కొమ్మాది–ఆనందపురం జంక్షన్, లా కాలేజి–మరికివలస, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ 79.91 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. డీపీఆర్‌కి సమాంతరంగా ఈ ఆరు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధమయ్యేటప్పటికి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రెండో దశలో ట్రామ్ వ్యవస్థ! రెండో దశలో 60.2 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్ఏడీ జంక్షన్–పెందుర్తి, స్టీల్‌ప్లాంట్–అనకాపల్లి, పాత పోస్టాఫీస్–రుషికొండ బీచ్, రుషికొండ బీచ్–భీమిలి బీచ్ కారిడార్లను ఆధునిక ట్రామ్ వ్యవస్థలుగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తొలి దశలో చేపట్టే ఆరు కారిడార్లలో జన సమ్మర్థం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వాటిని లైట్ మెట్రోగా, రెండో దశలో చేపట్టే కారిడార్లలో జన సమ్మర్థం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రామ్ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. కానీ, ముందస్తు అంచనాతో ట్రామ్ వ్యవస్థపైనా డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్లను ఈ సంవత్సరమే ప్రారంభించి 2024 నాటికి, రెండో దశను 2023లో ప్రారంభించి 2028–29 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంఆర్‌సీ అధికారులు స్పష్టం చేశారు. -
వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేయం: ఏఏఐ
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్ సభ్యులు ఎస్.సురేశ్ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. -
‘అంత గోప్యత ఎందుకో’
విజయనగరం జిల్లా: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆగమేఘాల మీద భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేయడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తహతహలాడటం ఓట్ల కోసమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో రైతులు జిల్లా అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలా త్యాగాలు చేశారని అన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో భోగాపురం ఎయిర్‌పోర్టునకు నిర్మాణ సామర్థ్యం లేదని గతంలో చెప్పడం ప్రజలకు గుర్తుందని వ్యాక్యానించారు. ప్రాజెక్టులకు అంచనాలు(ఎస్టిమేషన్లు) వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో కూడా తోటపల్లికి ఆఖరిలో రాయి వేసి వెళ్లిపోతే తర్వాత వచ్చిన వైఎస్సార్, బొత్స సత్యనారాయణలు దానిని 90 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భోగాపురం విషయంలో అంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎనిమిది కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినా, టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని వారికి బిడ్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ కంపెనీకి క్వాలిఫికేషన్ ఉందని శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారని అడిగారు. ఎన్నికల హామీలు 5 ఏళ్లలో నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లేయాలని అడగాల్సిన మీరు, పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆఖరిలో డ్రామాలతో ఓట్లు అడగాలనుకోవడం దుష్ట సాంప్రదాయమన్నారు. అవాస్తవ ప్రక్రియ ద్వారా మీరు(చంద్రబాబు) ముందుకు వెళ్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ భోగాపురం రైతుల్లో భరోసా కల్పించారని అన్నారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సహకరిస్తే భోగాపురం రైతులపై కేసులు ఎత్తివేస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎందుకు కేసులు ఎత్తివేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కొవ్వాడ తరహాలో రైతులకు జరిపిన చెల్లింపులను భోగాపురం రైతులకు కూడా చెల్లించాలని అడిగినా ఇంకా ఎందుకు చెల్లించలేదని సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కక్షాపూరితమైన చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. -
13న ‘భోగాపురం’ సినిమా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముంగిట మరో శంకుస్థాపన సినిమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. భూ సేకరణ పూర్తి కాకుండా, ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారో తెలియకుండానే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే, ఎన్నికల కోడ్ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూ సేకరణ, టెండర్లు వంటి కీలక పనులు కూడా కాకుండా కేవలం ఎన్నికల ప్ర,చారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం. టెండర్ల ప్రక్రియపై నీలినీడలు భోగాపురంలో సుమారు రూ.4,208 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 2,700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, అందులో ఇంకా 300 ఎకరాలను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2016లో టెండర్లు పిలవగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి మెయింటినెన్స్, ఓవర్ ఆయిలింగ్(ఎంఆర్వో)తో కలిపి టెండర్లను పిలిచింది. తాజా టెండర్లలో ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపించగా, ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలపాలంటూ ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలైన తర్వాత కూడా వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడంతో ఈ టెండర్ల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 22న ఎంతమంది టెండర్లలో పాల్గొంటారనేది ప్రశ్నార్థకరంగా మారింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, ముందుగానే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పేరుతో కొబ్బరికాయ కొట్టి మరో శిలాఫలకం వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు ఇదే విధంగా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. -
భోగాపురం నుంచి బాత్రూం వరకు..
సాక్షి, న్యూఢిల్లీ : భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి బాత్రూం వరకు టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. భోగాపురం మిమానాశ్రయం నిర్మాణ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్‌ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ప్రైవేట్ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పాల్గొనకుండా సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు. -
ఏఏఐ టెండర్లు రద్దు చేసిన చంద్రబాబు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ వెనుక భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ వెనుక భారీ దోపిడీకి కుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనను ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్లో పాల్గొనకుండా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిషేదించారని పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే టెండర్‌కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగిందని ఆరోపించారు. గతంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఈ టెండర్‌ను దక్కించుకోవడంతో కుంటి సాకులు చూపుతూ సీఎం చంద్రబాబు దానిని రద్దు చేశారన్నారు. తాజాగా జారీ చేసిన టెండర్లో అసలు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ పాల్గొనకుండా నిషేదించడం సరైన చర్యనేనా అని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీలైతే వారితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చని, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అయితే దోపిడీ సాధ్యకాదనే ఇలా చేశారని మండిపడ్డారు. ఇది కాదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చదవండి: టార్గెట్ భోగాపురం -
భారీ లూటీకి బాబు సర్కారు స్కెచ్
-
టార్గెట్ భోగాపురం
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయలు కమీషన్లు కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి అనుకూలంగా అస్మదీయులకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు రూపొందిస్తున్న విధానంలోనే ఈ ఎయిర్పోర్ట్ పనులను కూడా అప్పగించేందుకు రెడీ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని కూడా గతంలో దాఖలు చేసిన బిడ్లలో పేర్కొంది. అయితే ఆ సంస్థ నుంచి కమీషన్లు రావని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారు. తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా వ్యూహం పన్నారు. ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా దూరంగా ఉంచవచ్చో అదే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. బిడ్లలో పాల్గొనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుండాలనే నిబంధన పెట్టడం వెనుక ఏఏఐని నిలువరించే ఉద్దేశం స్పష్టమవుతోంది. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కమీషన్లు రావనే పాత టెండర్లు రద్దు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనాన్షియల్ బిడ్లను 2017 ఆగస్టు 21వ తేదీన తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఏఏఐ తెలిపింది. ఈ బిడ్లలో పాల్గొన్న జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలని ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సిఫార్సు చేశారు. అయితే ఏఏఐ నుంచి ముడుపులు, కమీషన్లు రావని ఉద్దేశంతో ముఖ్యనేత.. అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు కూడా తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా బిడ్లను ఆహ్వానించినా ఏఏఐ మళ్లీ పాల్గొంటే తమ లక్ష్యం నెరవేరదని చాకచక్యంగా అర్హత నిబంధనలను రూపొందించారు. ఈ షరతుల ద్వారా బిడ్లలో ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘రియల్’ వ్యాపారం చేసి ఉంటేనే... సాధారణంగా ప్రైవేట్ సంస్థలైతే వాణిజ్య, రియల్ ఎస్టేట్ నిర్మాణాలను చేపట్టి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావటంతో ఏఏఐ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టదు. దీన్ని ఆసరాగా తీసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం బిడ్లలో పాల్గొనే వారు గత పదేళ్లలో 1.50 లక్షల చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉండాలనే నిబంధన విధించారు. అలాగే కనీసం 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కమ్ వాణిజ్య వ్యాపారం చేసి ఉండాలని, కనీసం 100 ఎకరాల్లో మూడు లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో రెసిడెన్షియల్ అండ్ టౌన్షిప్ నిర్మించి ఉండాలనే షరతులను పొందుపరిచారు. ఈ నిబంధనల ద్వారా ఏఏఐని బిడ్లలో పాల్గొనకుండా నిలువరించారని, కావాలనే ఇలాంటి మెలిక పెట్టారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన సంస్థను ఎంపికచేసి పనులు కట్టబెట్టేందుకే ఇలాంటి నిబంధనలను తెరపైకి తెచ్చారని వారు చెబుతున్నారు. మూడు దశల్లో పనులు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలుత 5,311 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించాలని భావించారు. తర్వాత ఒక దశలోనే 2,708 ఎకరాల్లో రూ. 2,461 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించి 2016 జూలైలో బిడ్లను ఆహ్వానించారు. అయితే ఇప్పుడు 3 దశల్లో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు దశలకు నిర్మాణ వ్యయం రూ. 4,209 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశకు రూ. 2,302.51 కోట్లు, రెండో దశకు రూ. 989.58 కోట్లు, మూడో దశ పనులకు రూ. 917.01 కోట్లు వ్యయం అవుతుందని ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పనులను అనుకూల కంపెనీకి అప్పగించి తద్వారా రూ. కోట్లు కొల్లగొట్టడానికి ముఖ్యనేత వ్యూహం పన్నారని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘అక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఓకే’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆసక్తి చూపుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో బుధవారం వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. పీపీపీ విధానంలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు ఉద్దేశించిన టెండర్లో పలు మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. అందుకనే మొదట జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసింది. కాగా, తాజాగా జారీ చేసిన టెండర్ బిడ్లను తెరిచిన పిమ్మట ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వివరించారు. తాజా టెండర్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంస్థ విధిగా ఏవియేషన్ అకాడమీ, ఎంఆర్వోను అభివృద్ధి చేయాల్సిసిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. చేపల వేటకు నష్టం లేదు సముద్ర గర్భంలో ఓఎన్జీసీ నిర్మించిన పైప్‌లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు నష్టం జరుగుతోందని రాజ్యసభలో విజయసాయి రెడ్డి బుధవారం సంబంధిత మంత్రిని వివరణ కోరారు. స్పందించిన పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఓఎన్జీసీ సముద్ర గర్భంలో నిర్మించిన పైప్‌లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ, గెయిల్, ఆయిల్ ఇండియా కంపెనీలు సముద్ర గర్భంలో నిర్మించిన పైప్లైన్ల వల్ల సముద్రంలోని చేపలు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్న ఉదంతాలేవీ తమ దృష్టికి రాలేదన్నారు. ఓఎన్జీసీ తన రాజమండ్రి అసెట్ ద్వారా విడుదలయ్యే వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేందుకు 2017 ఫిబ్రవరిలో 1.5 కిలో మీటర్ల మేర సముద్ర గర్భంలో సురక్షితంగా పైప్ లైన్‌ను నిర్మించిందని తెలిపారు. అధీకృత సంస్థల అనుమతులతోనే సముద్రగర్భంలో పైప్లైన్ల నిర్మాణం జరిగిందనీ, మత్స్య సంపదకు లేదా మర బోట్లకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. సముద్ర గర్భంలో పైప్‌లైన్ నిర్మాణాలు లేదా డ్రెడ్జింగ్ పనులతో మరపడవలు లేదా మత్స్య సంపదకు నష్టం జరుగుతోందని నిరూపించే ఆధారాలేవీ లేవని ఓఎన్జీసీ తెలియచేసినట్లు మంత్రి చెప్పారు. అయితే, జిల్లాలోని కరవాక గ్రామానికి చెందిన మత్స్యకారులు పైప్‌లైన్ నిర్మాణంతో చేపల వేటకు, వలలకు, పడవలకు నష్టం వాటిల్లుతోందనీ, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓఎన్జీసీకి ఒక వినతి పత్రం అందచేశారని మంత్రి గుర్తుచేశారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుపై ఫలించని బాబు యత్నాలు
-
కమీషన్ల కథ అడ్డం తిరిగింది!
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్థికంగా భారీ లబ్ధిపొందాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయం, అదనపు భూసేకరణ సాకులతో భోగాపురం టెండర్లను సీఎం చంద్రబాబు రద్దు చేయించడం తెలిసిందే. అయితే ఈ టెండర్ల రద్దుకు సీఎం ఏ కారణాలనైతే చెప్పారో ఆ పనులన్నీ కూడా తాము చేపడతామని స్పష్టం చేస్తూ ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. ఏఏఐకి అప్పగిస్తే సొంతలాభం ఉండదనే! పోలవరం తరహాలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఎస్కలేషన్స్ పేరుతో ఇష్టానుసారం అంచనాలను పెంచేసి కమీషన్లు కాజేసే యత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను అప్పగించకుండా టెండర్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకి పనులు అప్పగిస్తే ముడుపులు రావనే ఉద్దేశంతోనే భోగాపురం టెండర్లను రద్దు చేశారని అధికార వర్గాలే వ్యాఖ్యానించాయి. ఇదే అంశాన్ని ‘సాక్షి’ ఇప్పటికే పాఠకులకు తెలియజేసింది. అదనపు పనులకు ఏఏఐ సంసిద్ధత భోగాపురంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పోర్టును తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో (ఏఏఐ) తెలిపింది. మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేట్ (ఎంఆర్వో), ఏవియేషన్ అకాడమీని కూడా నిర్మిస్తామని, అదనపు పనులు చేపట్టాలంటే రాయితీ ఒప్పందంలో ఆ విషయాలను పొందుపరచవచ్చంటూ ఈ నేపథ్యంలో టెండర్ గడువును పొడిగించాల్సిందిగా ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖలో కోరింది. మరోవైపు టెండర్లలో పాల్గొని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దక్కించుకున్న ఏఏఐకి ఆ పనులను అప్పగించాలంటూ పౌర విమానయానశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఏఏఐకి అప్పగించడమే సముచితం ఏఏఐ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్ లిమిటెడ్ ) సీఈవో లోతుగా అధ్యయనం చేశారు. టెండర్లలో పాల్గొని అత్యధికంగా రెవెన్యూ వాటా ఇవ్వడంతోపాటు అదనపు పనులు చేపట్టేందుకు కూడా అంగీకరిస్తూ లేఖ రాసినందున భోగాపురం విమానాశ్రయం పనులను ఏఏఐకి అప్పగించడమే మేలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టెండర్ రద్దుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర పౌర విమానయానశాఖ వివరణ కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఏఏఐకి పనులు అప్పగించాలని సూచించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ముఖ్యమంత్రి చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. రెండు బిడ్లూ సక్రమమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 2016 జూన్‌లో పీపీపీ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ దాఖలు గడువును ముఖ్యమంత్రి సూచన మేరకు 2017 జూలై 31 వరకు అధికారులు పొడిగించడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్లు దాఖలు చేశాయి. ఈ రెండు బిడ్లూ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది. అత్యధిక రెవెన్యూ వాటా ఇస్తామన్నా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ చైర్మన్ సమక్షంలో 2017 ఆగస్టు 21వ తేదీన ఫైనాన్సియల్ బిడ్లు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖలన్నీ కూడా ఇదే సిఫార్సు చేశారు. అయితే ఏఏఐకి ఇవ్వడం ఇష్టం లేని సీఎం చంద్రబాబు అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో తో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఇలా... భోగాపురం వద్ద 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ. 2,461 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను సేకరించేందుకు హడ్కో నుంచి రూ.840 కోట్ల రుణం మంజూరైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిడెట్ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేశారు. తొలుత 5,311 ఎకరాలు అవసరమని, రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రెండు దశల్లో కాకుండా ఒకేదశలో 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎయిర్ పోర్టుకు 1,733.66 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 592.69 ఎకరాలు, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డుతో పాటు వాణిజ్య ప్రాంతానికి 175.70 ఎకరాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్‌కు 201.21 ఎకరాలను కేటాయించారు. -
టీడీపీ సర్కార్ భూదోపిడీపై ప్రధానికి లేఖ
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వ భూ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజులు వారి స్వప్రయోజనాల కోసమే విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ రద్దు వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు కేబినెట్ సమావేశం పెట్టి భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని దీన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. టెండర్ల రద్దుకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్టు అని, భూసేకరణ జరగలేదని చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబులాంటి దుర్భుద్ధి కలిగిన వ్యక్తిని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని బొత్స విమర్శించారు. స్థానిక ఎంపీగా ఉన్న అశోక్ గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. టీడీపీ తరపున పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి హయాంలో ఎంత దోపిడీ జరుగుతుందో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక ఉదాహరణ అని బొత్స అన్నారు. 2013 సంవత్సరంలో భోగాపురంను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. 2015లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భోగాపురంకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జరిగిన టెండర్లో అశోక్‌గజపతిరాజు శాఖకు సంబంధించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ పాల్గొన్నాయని బొత్స గుర్తు చేశారు. కాగా టెండర్లో ప్రభుత్వరంగ సంస్థ 30.2 శాతం ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని కోడ్ చేసిందని, మరో ప్రైవేట్ సంస్థ 21.6 శాతానికి కోడ్ చేసిందన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ ఇస్తే ఈ నాయకుల దోపిడీకి అవకాశం ఉండదు కాబట్టే టెండర్‌ను రద్దు చేశారన్నారు. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్టు, భూసేకరణ జరగలేదని కుంటిసాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 10 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే దిగొచ్చిందన్నారు. 10 వేల ఎకరాలను 5300 ఎకరాలకు తీసుకొచ్చి దాన్ని మళ్లీ 2560 ఎకరాలకు ఫైనల్ చేసిందన్నారు. దాంట్లో 2500ల ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మళ్లీ భూసేకరణ జరగలేదని చెప్పడంలో ఆంతర్యం దోపిడీ అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మామూళ్లకు లాలూచీ పడ్డారని అర్థం అవుతుందని అన్నారు. -
భారీ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు
ప్రధానికి విమాన ప్రయాణికుల సంఘం లేఖ గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదని భారత విమాన ప్రయాణికుల సంఘం పునరుద్ఘాటించింది. రైతుల్ని రోడ్డున పడేసి అవసరానికి మించి విమానాశ్రయం నిర్మించాలనుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం వల్ల విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, అదే సమయంలో భోగాపురంలో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, ఇరువైపులా మరో 150 మీటర్ల మేర విస్తరించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలొచ్చాయన్నారు. అందువల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రయాణికుల అవసరాలకు సరిపోయేలా భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తే చాలన్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంటే పెద్దిగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్టుకు శరవేగంగా భూసేకరణ
► వచ్చే నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సర్వే ► ఇంకా సేకరించాల్సినది 345ఎకరాలు మాత్రమే ► పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న రెవెన్యూ అధికారులు భోగాపురం : గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు దాదా పు భూములు సిద్ధమయ్యాయి. సర్వే పనుల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చినెలలో పూర్తి స్థాయిలో భూసేకరణ చేసేందుకు అవసరమైన పనులు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తుది నోటిఫికేషన్ ప్రకారం 2545 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒప్పటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా సేకరించాల్సింది కేవలం 345ఎకరాలే. దానికి సంబంధించిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడంవల్ల ఈ జాప్యం ఏర్పడింది, అయితే వారిని కూడా అంగీకరింపజేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. చేతులు మారిన డి–పట్టా భూముల స్వాధీనం: ఎయిర్‌పోర్టు ప్లానులో గతంలో ఇచ్చిన డి–పట్టాభూములు ఎక్కువగా చేతులు మారిన విషయాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ప్లానులో ఇలా 215 ఎకరాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. దానిలో 175ఎకరాలకు సంబంధించిన రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు 3నెలల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా ఆర్డీఓ ఎదుట అప్పీలు చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకూ 50ఎకరాలకు సంబంధించిన రైతులు అప్పీలు చేసుకున్నారు. ఇంకా 40 ఎకరాలకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కవులవాడ రెవెన్యూలో 120 ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 8, గూడెపువలస రెవెన్యూలో 50, రావాడ రెవెన్యూలో 30 ఎకరాలు డి పట్టా భూములు చేతులు మారాయని తహసీల్దారు అధికారికంగా తెలిపా రు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పునరావాస స్థల అభివృద్ధి బాధ్యత వుడాకు: ఎయిర్‌పోర్టు ప్లానులో మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట గ్రామాలను తరలించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 376 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. వీరందరికీ చెరుకుపల్లి వద్ద నివాస యోగ్యమైన స్థలాన్ని అధికారులు గుర్తించి దానిని అభివృద్ధి చేసే బాధ్యత వుడాకు అప్పగించారు. త్వరలో పునరావాస పనులను చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆక్రమిత భూముల సర్వే: ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూముల్లో డి పట్టాలు లేకుండా సాగుచేస్తున్న భూమి 40 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని ఎవరు సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పక్కాగా సర్వే చేపట్టే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు డి.లక్ష్మారెడ్డి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు తలొంచినా వారిపై వేటు తప్పదని గట్టిగా హెచ్చరించారు. -
భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళన
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ బాధిత గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టారు. వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎ.రావివలస కూడలి వద్ద కురుపాం మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తితోపాటు సీపీఎం నాయకులను, బాధితులను అరెస్ట్‌చేసి భోగాపురం స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాస్తారోకో
భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా సాలూరు పట్టణంలో ఆదివారం సీపీఐ రాస్తారోకో చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపరిరక్షణ పోరాట కమిటీ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం మందస్తుగా స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంది. దీనికి నిరసనగా సీపీఐ నాయకుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. -
బోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తత
-
భోగాపురం ఎయిర్ పోర్టు వద్దు: మావోయిస్టుల లేఖ
-
భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
-
భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు భూ సేకరణపై మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఉప్పాడ సూర్యనారాయణ, కాకర్లపూడి సత్యనారాయణ రాజు ...న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 30వ తేదీలోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకూ రైతుల పంటలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించింది. కాగా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు కాగా భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు. -
మదగజాలు మనకెందుకు?
భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిశ దశ తీరు ఆందోళనకు, విచారానికి గురిచేస్తోంది. భారత దేశంలో ప్రభుత్వాలు తాము ఏం చేయదలుచుకున్నాయో, అదే చేస్తుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని అదుపులో పెట్టలేరు. ఆ ప్రభుత్వాలు కూలిపోయిన తరువాత కూడా వాటి ద్వారా ఒనగూడిన నష్టాలను ప్రజలు అనుభవిస్తూ ఉండవలసిందే. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ ఆ ప్రభుత్వం వల్ల సంభవించిన చేటును ప్రజలంతా చవిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మరో దశాబ్దానికి గాని కోలుకోలేదు. 2004-2014 మధ్య మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ విజ్ఞులైన రాజకీయవేత్తలు తప్పులు జరిగాయని భావించగానే పద్ధతి మార్చు కుంటారు. జాన్ ఎఫ్ కెన్నడీ తాను చేసిన తప్పులను గ్రహించాడు. వాటిని సరిదిద్దుకున్నాడు కూడా. అందుకే ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నాం. రైతులు, దళితులు, ఇతరులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం అమలు తీరు మారాలని నేను ముందునుంచీ ఆందోళన చేస్తున్నాను. పోలవరం డ్యామ్ పేరుతో, తాడిపూడి పంపింగ్ పథకం పేరుతో, కాకినాడ సెజ్ కోసం, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కోసం, రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ కోసం ఈ పేదవర్గాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. అవసరాలకు అనుగుణంగానే... రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక వసతులు అవసరమే. కానీ వాటి నిర్మాణం అవసరాలకు అనుగుణంగా జరగాలి. ఓ విమానాశ్రయమో, నౌకాశ్రయమో నిర్మించి పెడితే విమానాలూ, నౌకలూ వాటంతట అవే వస్తాయనుకోవడం తప్పుడు అభిప్రాయం. ఇది రుజువైంది కూడా. చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక వసతుల సామర్థ్యాన్ని అతిగా పెంచుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు అవసరం లేని రోడ్లు నిర్మించాయి. వృథాగా రైల్వేమార్గాలను నిర్మించి పెట్టుకున్నాయి. విమానాశ్రయాలను నిర్మించి ఖాళీగా పెట్టుకున్నాయి. దీనితో ఎదురైన ఆర్థికభారం ఆ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జపాన్ సంపన్న దేశం కాబట్టి తన పౌరులను కష్టాలలో పడకుండా రక్షించుకుంది. చైనాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు కాబట్టి, ప్రజల ఆగ్రహాన్ని అణచిపెట్టి ఉంచింది. చైనా 150 కొత్త విమానాశ్రయాలను, వందలాది కొత్త నౌకాశ్రయాలను నిర్మించింది. రైల్వే మార్గాన్ని రెట్టింపు చేసింది. వేల మైళ్ల జాతీయ రహదారులను తయారుచేసింది. కానీ వాటిలో చాలావరకు విమానాశ్రయాలలో విమానాల జాడ కానరాదు. నౌకాశ్రయాలలో నౌకల రాకపోకలు ఉండవు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు ఖాళీ. అతి సామర్థ్యమే చైనా సంక్షోభానికి కారణమని ప్రతి ప్రముఖ ఆర్థికవేత్త చెబుతాడు. అక్కడ ఇప్పుడు చాలా సిమెంట్ కర్మాగారాలను మూసేశారు. కానీ ఒకటి. అవినీతి రాజకీయవేత్తలతో ఆ దేశం వ్యవహరించే తీరు ప్రత్యేకం. అవినీతి వ్యవహారాలలో పట్టుబడితే, అలాంటివాళ్లను కాల్చి చంపే బృందం లేదా ఉరి తీయడానికి తాళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక రైల్వే మంత్రి కాల్పుల బృందం చేతిలో మరణించాడు. ఈ గణాంకాలు తెలియవా? నౌకాశ్రయాలూ, విమానాశ్రయాల స్థాయి మౌలిక వసతుల గురించి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాట్లాడుతోంది. మికెన్సీ వంటి విదేశీ నిపుణులు, సింగపూర్ ప్రభుత్వం దీనికి సలహాదారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో 4,000 ఎకరాలలో విమానాశ్రయం నిర్మించాలని ఆరాటపడుతోంది. అలాగే రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరించాలని అనుకుంటోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 3,500 ఎకరాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా దాదాపు అంతే. ముంబై విమానాశ్రయాన్ని 2,200 ఎకరాలలో నిర్మించారు. హైదరాబాద్‌లోనే బేగంపేట విమానాశ్రయం 700 ఎకరాలలో ఏర్పాటైంది. రోజుకు ఢిల్లీ-1,400, ముంబై-1,200, చెన్నై-400, హైదరాబాద్- 300, అహ్మదాబాద్ - 120, గోవా-100, త్రివేండ్రం-50, విశాఖపట్నం-40, భువనేశ్వర్-35, రాజమండ్రి-16 వంతున విమానాలు రాకపోకలు సాగిస్తాయి. భోగాపురం షాంఘై నగరం కాదు భోగాపురాన్ని ఎవరైనా ఒక పెద్ద నగరంగా భావించగలరా? అదేమైనా చైనాలో షాంఘై నగరమా? విశాఖ విమానాశ్రయానికి 40 విమానాలు రాకపోకలు సాగిస్తుంటే, భోగాపురానికి 4 మించి రాకపోకలు సాగించవు. అసలు ఒక్కటి కూడా రాకపోయినా ఆశ్చర్యం లేదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నదేమిటి? ఒక్కొక్క ప్రయాణికుడి రూ. 500 వంతున అభివృద్ధి రుసుము కింద చెల్లిస్తే తప్ప వాటిని నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పాయి. ఆ రకంగా చూస్తే ప్రయాణికుడు నుంచి రూ. 2,000 వసూలు చేస్తే తప్ప భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇది ప్రభుత్వ నిర్వహణలో విమానాశ్రయమైతే, నాసిక్ విమానాశ్రయం మాదిరిగా మూసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. విజయవాడ, విశాఖ విమానాశ్రయాలు ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరి, కేవలం 200 మైళ్ల పరిధిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎందుకు? నిజానికి రాజమండ్రి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలు ఇప్పటికి కూడా ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయం మొత్తం ఖాళీగా ఉంటాయి. ఈ నౌకాశ్రయాలు అవసరమా? ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు నౌకాశ్రయాలు పనిచేస్తున్నాయి. ఇంకా మచిలీపట్నం, నరసాపురం, నిజాంపట్నం, ఓడరేవు, ముత్యాలంపాలెం, భీమునిపట్నం నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన సందర్భంగా కేవలం కొన్ని మైళ్ల దూరంలో దగ్గరదగ్గరగానే నౌకాశ్రయాలు చూసి, ఇక్కడ కూడా అలాగే నిర్మిస్తే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. కానీ జపాన్‌లో కనిపించే ఆ నౌకాశ్రయాలన్నీ వందల సంవత్సరాల క్రితమే నిర్మించుకున్నవి. 1900 సంవత్సరం నుంచి మొదట రష్యాతో తరువాత అమెరికాతో జరిగిన యుద్ధాల సమయంలో వాటిని నిర్మించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి చరిత్ర లేదు. భావనపాడు, కళింగపట్నాలలో చేపలవేటకు ఉద్దేశించిన నౌకాశ్రయాల నిర్మాణం పూర్తయింది. తీరా చేపలవేట పడవలను ఎక్కువగా విశాఖలోనే ఉపయోగిస్తున్నారు. కానీ చేపలవేట సాగించే పడవలు లేని చోట్ల వేల ఎకరాలు సేకరించి నౌకాశ్రయాలు నిర్మించారు. చైనాను చూసి మోసపోవద్దు మన నాయకులు చైనాలో పర్యటించి వచ్చి, అక్కడి అభివృద్ధి గురించి ఊదరగొడుతూ ఉంటారు. కానీ చైనా అభివృద్ధిని చూసి ఇవాళ ప్రపంచం నవ్వుకుంటోంది. గడచిన సంవత్సరం 130 చైనా విమానాశ్రయాలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రఫుల్ పటేల్ పౌర విమానయాన మంత్రిగా ఉండగా నాసిక్ నగరానికి ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేశారు. అక్కడ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, దిగదు. దానిని వైమానిక దళాన్ని తీసుకోమన్నారు. ఇప్పుడు పటేల్ మంత్రి కాదు. కాబట్టి బంట్రోతు కూడా ఆయన మాట వినడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటికి ఇలాంటి పనికి మాలిన బహుమానాలు మాత్రం మనకి వద్దు. ఇంకో పౌర విమానయాన మంత్రి వస్తే తరువాత పరిస్థితి ఏమిటి? నాలుగు వేల ఎకరాల భూమిని ఎందుకు వృథా చేయాలి? ఈ దండగమారి వ్యవహారాలు ఎందుకు! భోగాపురం విమానాశ్రయం శుద్ధ దండగమారి వ్యవహారం. దేశంలోని మిగిలిన విమానాశ్రయాల కోసం సేకరించిన భూమి, భోగాపురం విమానాశ్రయం కోసం సేకరించిన భూమి కంటే తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. నాసిక్ విమానాశ్రయం వలె దీనిని మూసివేయడం జరగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు భరోసా ఇవ్వాలి. ఐదేళ్ల తరువాత కూడా విమానాశ్రయం పుంజుకోకపోతే రైతుల భూములు వారికి తిరిగి ఇవ్వాలి. నిజానికి రాకపోకలు సరిగా లేని, 4,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని నిర్వహించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు. అంతా సజావుగా సాగాలంటే ఇక్కడికి రోజుకు కనీసం 500 విమానాలు రాకపోకలు సాగించాలి. మచిలీపట్నం సహా, ఇతర నౌకాశ్రయాలు కూడా వ్యర్థమే. ఇవి సహజ నౌకాశ్రయాలు కాకపోవడం వల్ల, నిత్యం పూడిక తీయవలసిన పని ఉంటుంది. ఇంత భూమి సేకరించడం వెనుక ఆలోచన చూస్తుంటే, ఎవరో రియల్ఎస్టేట్ వ్యాపారులకు భూమి అప్పగించి, మనకి ఇంకో నౌకాశ్రయం వచ్చిందని చెప్పడానికే అని అనిపిస్తుంది. కాకినాడ సెజ్ 10,000 ఎకరాల భూమికి సంబంధించినది. కానీ అక్కడ జరుగుతున్నదేమీ లేదు. సెజ్ పేరుతో తీసుకున్న తమ భూములను వెనక్కు ఇవ్వాలని అక్కడ రైతులు కోరుతున్నారు. ఒకటి వాస్తవం. మహారాజులు కూడా తెల్ల ఏనుగులను భరించలేరు. నిజానికి అనాలోచితంగా నిర్మించిన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు తెల్ల ఏనుగులు కూడా కాదు. అవి మదగజాలు. మనుషులను చంపడానికే ఉపయోగపడతాయి. అవి మనకొద్దు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 98682 33111 - పెంటపాటి పుల్లారావు -
జగన్‌కు ఘనస్వాగతం
పర్యటనలో పోటెత్తిన జనం అందరినీ అప్యాయంగా పలుకరించిన విపక్షనేత ఆయన వాహనశ్రేణిని అనుసరించిన పార్టీ కార్యకర్తలు విశాఖపట్నం/తగరపువలస: భోగాపురం ఎ యిర్‌పోర్టు నిర్వాసిత రైతాంగపక్షాన నిలిచేం దుకు సోమవారం విశాఖ చేరుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తుల వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన భోగాపురానికి బయలుదేరారు. మార్గ మధ్యలో భీమిలి మండలం మజ్జివలసలో పోర్ట్‌ట్రస్ట్ సభ్యుడు దాట్ల వెంకట అప్పలప్రసాదరాజు ఇంటివద్ద కాస్సేపు ఆగారు. ఈసందర్భంగా ఆ గ్రామానికి జనం భారీగా తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. భీమిలి నియోజకవర్గంతో పాటు నగరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడకు వచ్చిన వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. మహిళలు, చిన్నపిల్లలతో జగన్మోహన్రెడ్డి పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్ రాకతో గ్రామం కోలాహలంగా మారింది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్యనాయకులతో పాటు, జిల్లాకు చెందిన సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. అనంతరం ఆయన అక్కడ నుంచి మహరాజుపేటకూడలి మీదుగా రాజాపులోవ వైపు ఆయన వెళ్లారు. ఆయన వాహన శ్రేణిని కార్యకర్తలు, నాయకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా అనుసరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు సుజ య్ కృష్ణ రంగారావు, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ సూర్య నారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, చెంగల వెంకటరా వు, కర్రి సీతారాం, కరణం ధర్మ శ్రీ, మళ్ళ విజయప్రసాద్, తైనాల, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, సీఈసీ సభ్యులు దామ సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, మైనార్టీ సెల్ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త ఫారూకీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, బోణి వేణు, ఆడారి రవికుమార్‌లతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూములు పోతే ఎలా బతకాలి?
-
చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు
-
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తూడెం ఎయిర్పోర్ట్ నోటిఫై భూముల్లోరైట్స్ సంస్థ సర్వేరాళ్లు పాతింది. తూడెం, గిద్దలపాలెంలో భారీ బందోబస్తు చేపట్టడమే కాకుండా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీటీసీ పైల రాము భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమ భూముల్లో అనుమతి లేకుండా సర్వేరాళ్లు వేయటంపై నిరసన తెలిపారు. కాగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తారని సుజయ్ కృష్ణరంగారావు తెలిపారు. ఆయా గ్రామాల్లో సుజయ్ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు నిన్న పర్యటించారు. -
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉద్రక్తత చోటు చేసుకుంది. భోగాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానశ్రయానికి గురువారం అధికారులు స్థల పరిశీలన చేయనున్నారు. ఈ అంశంపై రైట్ అనే సంస్థ సర్వే చేయనుంది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. తమ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు పలు ధర్నాలు కూడా చేపట్టారు. తాజాగా సర్వే నేపథ్యంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందనే ముందస్తు చర్యగా నిర్వాసిత గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
'రాష్ట్ర మంత్రులు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి'
విజయనగరం : ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రులు, అధికారులు ఎవరొచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో 10 ప్రజా సంఘాలతో బహిరంగసభ మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ప్రజలకు, రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు బహిరంగ సభకు హాజరయ్యారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా, అధికార ప్రభుత్వ ధోరణి మాత్రం మారలేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే తన భూమి కోల్పోవాల్సి వస్తుందని భయపడి సూరి అనే ఓ రైతు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. -
భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్
హైదరాబాద్: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు. -
పోలీసుల చిచ్చు.. బాధితులకు ఉచ్చు
ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. కక్షలు రగిలేచోట శాంతిసుమాలు విరిసేందుకు కృషి చేయాలి. అలాంటి పోలీసులే దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.. అంటున్నారు విమానాశ్రయం బాధితులు. గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే చేస్తున్న అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు. అనంతరం పోరాట కమిటీ నేతలు నచ్చజెప్పడంతో ఎవరికి వారు వెనుదిరిగారు. కానీ భోగాపురం పోలీసులు రెవెన్యూ అధికారులు వారిస్తున్నా గ్రామస్తులపై అకారణంగా కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే అతిగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భోగాపురం: గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో తూర్పుబడిలో సర్వే చేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీకి చెందిన విమానాశ్రయ వ్యతిరేక కమిటీ నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నాయకులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడుతున్న రైతులు, గ్రామస్తులను నిలువరించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తారని, తక్షణమే వెళ్లిపోవాలని అధికారుల్ని కోరడంతో అంతా వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో వచ్చిన సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధు మార్గమధ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు, రైతులను ఆపి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడున్న వారిని పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో వీడియో తీసి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ ఎవీ రమణ అదేరోజు సాయంత్రం భోగాపురం వచ్చారు. రెవెన్యూ అధికారులను కేసు పెట్టమని కోరగా.. ప్రజలతో తమకు సత్సంబంధాలుండాలని, వారి భూమిలోకి వెళ్లామని మాత్రమే తమను అడ్డుకున్నారు తప్ప ఏం జరగలేదని, ఎలాంటి కేసులొద్దని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారుల వినతిని వినిపించుకోకుండా స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేస్తున్నాం రండని పిలిచి ముందుగా పదిమందిపై కేసులు నమోదుచేశారు. అప్పటికీ సెలవులో ఉన్న తహశీల్దారు డి.లక్ష్మారెడ్డి కేసులు వద్దని సీఐకి ఫోనులో చెప్పినా ఏం లేదంటూనే కేసులు నమోదు చేసేశారు. అది చాలదంటూ వారి వద్దనున్న వీడియో ఆధారంగా మరో 12మందిపై విడతల వారిగా కేసులు నమోదు చేశారు. అదీచాలక గ్రామాల్లోకి వెళ్ళి కేసులు నమోదు చేసిన ఇళ్లకు నోటీసులు కూడా అంటించారు. దీంతో పోలీసుల తీరుపై రెవెన్యూ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల మధ్య సఖ్యత చెడిందని ఒక రెవెన్యూ అధికారి వాపోయారు. మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులా? మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చేందుకు వ్యతిరేకిస్తున్నా మా సమ్మతి లేకుండా భూముల్లోకి చొరబడటం దౌర్జన్యం కాదా. అడ్డుకుంటే కేసులు పెడతారా? పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ, ఇళ్లకు నోటీసులు అంటిస్తూ భయబ్రాంతుల్ని చేస్తున్నారు. - కోరాడ పాపయ్యమ్మ, బాధితురాలు పోలీసులే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పాలి మా భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్నందుకే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారు. మేం బాధను చెప్పుకోడానికి వీలులేకుండా సెక్షన్లు అంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులే అన్యాయానికి పాల్పడితే ఎవరికి చెప్పుకుంటాం? -కోరాడ సన్యాసమ్మ, బాధితురాలు -
లెఫ్ట్..లెఫ్ట్
భోగాపురం: విమానాశ్రయ నిర్మాణానికి ఏకాదశి మంచిదని, అధికారులు ఇటీవల ఇచ్చిన ప్లాను ప్రకారం నిర్ణయించిన స్థలంలో ప్రాథమిక మార్కింగ్ చేసేందుకు వచ్చిన రైట్స్ బృందాన్ని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు తరిమికొట్టారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల సహా కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలోని తూర్పుబడికి సోమవారం మధ్యాహ్నం రైట్స్ బృందం చేరుకుంది. అధికారులు ఇచ్చిన ప్లాను ప్రకారం ఆర్ఐ సత్యనారాయణ, సర్వేయరు సింహాచలం నాయుడులు వీఆర్ఓలు లక్ష్మణరావు, శ్రీనుల సహకారంతో ఈశాన్య దిశలో సర్వే నిర్వహించి ప్రాథమిక మార్కింగ్ (స్టార్టింగ్ పాయింట్)ను గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని సెలవులో తిరుపతి వెళ్లిన తహశీల్దారు డి.లక్ష్మారెడ్డికి ఫోన్ ద్వారా సర్వేయరు తెలియజేశారు. సర్వే జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని, మా భూముల్లో ప్లాన్లు వేసుకుని సర్వే చేసేందుకు మీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్స్ బృంద సభ్యుడి వద్దనుంచి బ్యాగులు లాక్కుని అందులో ఉన్న ప్లాను పేపర్లను బాధిత గ్రామస్తులు చించి పారేశారు. ఎవరైనా భూముల్లోకి వస్తే ఊరుకునేది లేదని, మమ్మల్ని పిలకుండా, మాతో సంప్రదించకుండా సర్వేలు చేయడానికి మీరెవ్వరు, ఎన్నిసార్లు అడ్డగిస్తున్నా దొంగతనంగా వస్తూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మాపై కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో పెట్టి మా భూములు తీసుకుందామనుకుంటున్నారేమో మిమ్మల్ని చంపి మేమూ అలాగే చేస్తాం అంటూ హెచ్చరించారు. అలాగే కో-ఆర్డినేటర్ ప్రసాద్‌ను సంఘటనా స్థలం వద్దనుంచి తరిమి కొట్టారు. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, బెరైడ్డి ప్రభాకరరెడ్డి, శివారెడ్డి, ఎర్ర అప్పలనారాయణ, పట్న తాతయ్యలు, కొల్లి రామమూర్తి, మట్ట వెంకటరమణారెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించారు. దొంగచాటుగా సర్వేలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వీఆర్ఓలు, రైట్ బృంద సభ్యులను ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఎయిర్‌పోర్టుకి వ్యతిరేకంగా ఆరునెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా సర్వేలు నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే రెవెన్యూ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోవడంతో పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ తదితరులతో సీఐ చర్చించారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డగించడం సరికాదని, ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడాలని, ఒకసారి స్టేషనుకు రావాలని సీఐ కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. నాయకులతో సీఐ చర్చలు పోలీస్ స్టేషన్లో చర్చిద్దామని సీఐ ఆహ్వానించడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టరు సురేష్‌బాబు, మాజీ ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, వరుపుల సుధాకర్, సుందర గోవిందరావులు సీపీఎం మండల కార్యదర్శి బి.సూర్యనారాయణ తదితరులు సోమవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో సర్కిల్ కార్యాలయంలో సీఐతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులు, రైతులకు ఏదైనా సమస్య ఉంటే సామ రస్యంగా మాట్లాడుకోవాలి తప్ప విధుల్లో ఉన్న ఉద్యోగులకు అడ్డుతగలరాదని కోరారు. దీనిపై సురేష్ బాబు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులతో మాత్రమే విశాఖ, విజయనగరంలో సమావేశాలు పెట్టుకుని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేయడాన్ని ఖండించారు. దీనిపై సీఐ ఆర్డీఓతో ఫోనులో సంప్రదించగా పోరాట కమిటీ నాయకులు తన కార్యాలయానికి రావాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో కాకుండా మండల కేంద్రంలో రైతులు, నాయకులతో ఆర్డీఓ సమావేశం ఏర్పాటుచేయాలని వారంతా కోరారు. నాయకులపై కేసు నమోదు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు స్ఐ దీనబంధు తెలిపారు. -
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన రైతులు
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే పత్తివాడనారాయణ స్వామి నాయుడు ఇంటిని బాధిత రైతులు ముట్టడించారు. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని బాధితులు ఎమ్మెల్యే పత్తివాడను కోరారు. ఎమ్మెల్యే మాత్రం ఎయిర్ పోర్టు అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యేని గృహంలోనే నిర్భందించారు. -
సర్వేబృందాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
భోగాపురం (విజయనగరం): భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చిన సర్వే బృందాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. చీపుర్లు, చాటలు చేతపట్టుకుని సర్వేయర్లను ఊరి బయటకు తరిమారు. కారిగొల్లపేట గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు శాపనార్ధాలు పెట్టారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్
పనుల పర్యవేక్షణకు బీఐఏసీఎల్ ఏర్పాటు హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ లిమిటెడ్ (బీఐఏసీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఐఏసీఎల్ సంస్థలో పది ముఖ విలువ కలిగిన యాభై లక్షల వాటాల రూపంలో రూ.ఐదు కోట్లను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శి, రహదారులు భవన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇన్‌క్యాప్ ఎండీ, విజయనగరం జిల్లా కలెక్టర్లను బీఐఏసీఎల్ డెరైక్టర్లుగా నియమించింది. -
ప్రాణాలైనా ఇస్తాంకాని..భూములివ్వం


