జగన్‌ శ్రమ ఫలితమే ‘భోగాపురం’ | Former Minister Perni Nani Slams Chandrababu Lies On Bhogapuram Airport And Governance Failures, More Details Inside | Sakshi
Sakshi News home page

జగన్‌ శ్రమ ఫలితమే ‘భోగాపురం’

Jan 6 2026 6:08 AM | Updated on Jan 6 2026 11:22 AM

Perni Nani fires on CM Chandrababu Over Bhogapuram Airport

ఆ ఎయిర్‌పోర్టుకు, చంద్రబాబుకు ఏం సంబంధం?: పేర్ని నాని ధ్వజం

ఒక్క ఎకరా భూమి కూడా చేతికి రాకుండానే ఎన్నికల ముందు ఓ రాయి వేసి మభ్యపుచ్చారు 

ఆయన చరిత్ర అంతా అసత్యాలు, బురిడీ, మాయమాటలే 

ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకోవడం బాబు నైజం 

ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఎక్కడ? 

ఏపీలో పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని కేంద్రమే చెబుతోంది  

చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర అంతా అసత్యాలు, బురిడీ, మాయమాటలు చెప్పటమేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టం, ఆలోచన, శ్రమతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ట్రైల్‌ రన్‌ అనంతరం ప్రెస్‌ మీట్‌లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామ్మోహన్‌నాయుడు దేశం మొత్తం సిగ్గుపడి తలవంచుకునేలా ఇండిగో వ్యవహారంలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అసలు భోగాపురం ఎయిర్‌పోర్టుకు, చంద్రబాబుకు ఏం సంబంధం? అని సూటిగా ప్రశి్నంచారు. సోమవారం మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్ర­వ­రి 14వ తేదీన రాయి వేశారు. ఇదే రీతిలో డ్రామా­లాడుతూ బందరు పోర్టుకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు. వైఎస్‌ జగన్‌ పటిష్ట ప్రణాళికా, చర్యలతో ఏడాదిలో బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో అది కూడా తామే కట్టామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు.

నిజానికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2,200 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద నగదు చెల్లించి వారికి కాలనీలు కూడా ఏర్పాటు చేసిన తరువాతే 2023­లో శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి ఎన్‌హెచ్‌–16ని కలిపే విధంగా నిరి్మంచాలని, అందుకు రూ.6,600 కోట్లు మంజూరు చేయాలని ఆ సమయంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరి అందుకు ఒప్పించారు.  

భోగాపురం ఎయిర్‌పోర్టును తామే నిరి్మంచామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అదే నిజమైతే 18 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎలా సాధ్యం? ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ చోరీ చేయడమే చంద్రబాబు నైజం. తాము తీసుకువచ్చిన పరిశ్రమలన్నీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వెళ్లిపోయాయని చంద్రబాబు, లోకేశ్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అలాగైతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎందుకు వెళ్లలేదు?  

⇒ రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహిస్తామని చంద్రబాబు సర్కారు చెబుతున్నా టెండర్లు ఎందుకు రావట్లేదు? ఆదోని మెడికల్‌ కళాశాలకు టెండరు వచ్చిందని, కిమ్స్‌ హాస్పటల్‌ మేనేజ్‌మెంట్‌ దాన్ని దాఖలు చేసిందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. అయితే కిమ్స్‌ ఆస్పత్రి ప్రతినిధులు తాము ఆ టెండరు వేయలేదని చెప్పారు. దీనిపై విలేకరులు మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ను ప్రశ్నిస్తే.. ఆసుపత్రి నిర్వాహకుడు ప్రేమ్‌చంద్‌ షా దాఖలు చేశారని చెబుతున్నారు. నిజానికి దేశంలోని 26 కిమ్స్‌ ఆస్పత్రుల్లో ప్రేమ్‌చంద్‌ షా పేరుతో గుండె వైద్యనిపుణులు ఎవరూ లేరని మా పరిశీలనలో తేలింది. మరి ప్రేమ్‌చంద్‌ షా ఎవరు? ఆయన టెండరు వేసినట్లు, ఆయనెవరో ఆధారాలతో చెప్పే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? 

⇒ ఎన్నికల ముందు రూ.15 వేలు ఫీజుతోనే మెడికల్‌ విద్య సీట్లు కళాశాలల ద్వారా అందుబాటులోకి తెస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మాయమాటలు చెప్ప­టం ఆయనకు అలవాటైపోయింది. ప్రభుత్వ వైద్యం బాగోదని..  ప్రైవేటు వైద్యం మాత్రమే బాగుంటుందని చెప్పిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా? 
⇒  తాము అధికారంలోకి వస్తే కరెంట్‌ చార్జీలు పెంచబోమని, ప్రతి ఇంటి నుంచి కరెంట్‌ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో కరెంట్‌ మీటర్లు పెడితే బద్దలు కొడతామని అన్న తండ్రీ, కుమారుడు ఇప్పుడు అవే మీటర్లు బిగిస్తున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం ఏకంగా రూ.10 వేలకు పెంచి ఇస్తామని నమ్మబలికి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేశారు.  

⇒  చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకటి రెండు నెలలు మినహా ప్రభుత్వ ఉద్యోగులకు  ఒకటో తేదీన జీతాలు ఎందుకు వేయటం లేదు? సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న వాగ్దానం ఏమైంది? డీఏ, ఎరియర్స్‌ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించలేదు. ఐఆర్‌ కూడా ప్రకటించకుండా గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉపాధ్యాయులకు ‘టెట్‌’ పెడుతున్నారు. పోలీస్‌ సిబ్బందికి సరెండర్‌ లీవ్‌లు సంవత్సరానికి మూడుసార్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వంలో నిల్వ ఉంచిన సొమ్ము మినహా 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. హోంగార్డులకు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జీతం పెంచారు. ఆ తరువాత మీరు ఒక్క రూపాయి అయిన జీతం పెంచారా? ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ కునారిల్లుతోందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వ్యాఖ్యానించటం నిజం కాదా? పోలీసులు కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది. 

⇒  వైఎస్‌ జగన్‌ తన కుమార్తె వద్దకు లండన్‌ వెళితే రూ.12 కోట్లు ఖర్చు చేశారని వ్యా­ఖ్యలు చేసిన చంద్రబాబు, లోకేశ్‌ ప్రస్తుతం హై­ద­రాబాద్‌ నుంచి బాలి, లండన్, స్విట్జర్లాండ్‌ వెళ్లి తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతోంది? పోలీసులకు పెట్రోల్‌ ఖర్చులు ఇవ్వలేని వారు వీటికి రూ.కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చేసిన దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. ఎవరో చేసిన పని తన ఖాతాలో వేసుకుని, తానే చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం మానుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌ డీఏలు చెల్లించటంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి.  

⇒ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా, తలకిందులుగా తపస్సు చేసినా.. జనబలం, గుండెబ­లం ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు. 2029 ఎన్ని­కల్లో వైఎస్‌ జగన్‌ను ప్రజలంతా తమవాడిగా, ఇంట్లో మనిíÙగా గెలిపించుకోవటం ఖాయం.  
⇒  చంద్రబాబు ప్రభుత్వం పలు సంస్థల పేరుతో వేల ఎకరాలు కేటాయింపులు చేస్తున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవటం ప్ర­జలను మోసం చేయటమే. సింగపూర్‌లా అమ­రావతి నిర్మాణం చేస్తామని ప్రభుత్వ పెద్దలు మా­యమాటలు చెబుతున్నారు. మంత్రి నారాయణ మాత్రం రోజూ తుమ్మ చెట్లు నరుకుతున్నామని చెప్పటం మినహా ఇంతవరకు చేసిందేమీ లేదు.

⇒  విదేశాల నుంచి తీసుకువచ్చిన ప్రతి­నిధులతో సమ్మిట్లు నిర్వహించి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. హోటళ్లలో వంటవారిని తీసుకొచ్చి సూ­టు బూటు వేస్తున్నారని తెలంగాణ మాజీ సీఎంకేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధపడటం విడ్డూరంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement