భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళన | cpm leaders, Victims protests against bhogapuram airport | Sakshi
Sakshi News home page

భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళన

Dec 21 2015 1:37 PM | Updated on Apr 6 2019 8:52 PM

విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు.

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ బాధిత గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టారు. వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎ.రావివలస కూడలి వద్ద కురుపాం మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తితోపాటు సీపీఎం నాయకులను, బాధితులను అరెస్ట్‌చేసి భోగాపురం స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement