ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత | lands survey in bhogapuram | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత

Oct 1 2015 11:39 AM | Updated on Sep 3 2017 10:18 AM

విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉద్రక్తత చోటు చేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉద్రక్తత చోటు చేసుకుంది. భోగాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానశ్రయానికి గురువారం అధికారులు స్థల పరిశీలన చేయనున్నారు. ఈ అంశంపై రైట్ అనే సంస్థ సర్వే చేయనుంది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. తమ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు పలు ధర్నాలు కూడా చేపట్టారు. తాజాగా సర్వే నేపథ్యంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందనే ముందస్తు చర్యగా నిర్వాసిత గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement