భూ దోపిడీ.. క్రెడిట్‌ చోరీ.. | YS Jagan React On Bhogapuram Airport | Sakshi
Sakshi News home page

భూ దోపిడీ.. క్రెడిట్‌ చోరీ..

Jan 9 2026 5:16 AM | Updated on Jan 9 2026 7:38 AM

YS Jagan React On Bhogapuram Airport

‘భోగాపురాన్ని’ తన ఖాతాలో వేసుకునేందుకు కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాలు: వైఎస్‌ జగన్‌ నిప్పులు

గతంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా కనీసం అనుమతులు తేవడంలోనూ విఫలం 

బాబు చిత్తశుద్ధిపై అనుమానంతో కోర్టుల్లో 130 కేసులు దాఖలు..

2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు ముందుకు 

రైతుల్లో విశ్వాసాన్ని కల్పించి కోర్టు కేసులన్నీ పరిష్కరించాం 

విమానాశ్రయం ప్రాజెక్టును 2,700 ఎకరాలకు మార్చి విజయవంతంగా భూ సేకరణ చేశాం 

మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి పునరావాస కాలనీలను నిర్మించాం

ఒక్క భూ సేకరణకే ఏకంగా రూ.960 కోట్లు వెచ్చించాం

కేంద్ర, రక్షణ, పర్యావరణ సంస్థల నుంచి అనుమతులన్నీ తీసుకొచ్చి ప్రాజెక్టును చేపట్టాం 

2023 మే3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా 

2026లో తొలి విమానం ఇక్కడ నుంచి టేకాఫ్‌ అవుతుందని చెప్పా.. ఇప్పుడు అదే జరుగుతోంది 

విమానాశ్రయంతోపాటు 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు ఆలోచన కూడా చేశాం 

కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ ఆ రోడ్డు పనులకు నిధులు తీసుకొచ్చాం 

చంద్రబాబు ఈ రెండేళ్లలో కనీసం కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు

సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భారీగా భూ దోపిడీకి పథకం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్‌ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిందేమీ లేకపోగా.. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ, నిస్సంకోచంగా క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలన్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 5 వేల ఎకరాలు అని చెప్పారన్నారు.

దీంతో ప్రజలు ఆయన చిత్తశుద్ధిపై అనుమానంతో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో  ఏకంగా 130 కేసులు దాఖలు చేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. నాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టుకు కనీస అనుమతులు తేవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో విశ్వాసాన్ని నింపి, కోర్టు కేసులను పరిష్కరించి 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లా­మని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..  

భూ సేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అంతర్జాతీయంగా చూసినా 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం ఏర్పాటవుతుంది. మేం ప్రభుత్వంపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం.  సమయాన్ని వెచ్చించి.. శ్రమించి విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.

కనీసం కనెక్టివిటీ రోడ్డూ పూర్తి చేయలేదు..
భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు  చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్‌ జగన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌..’ అని ప్రకటించారు (ఆ వీడియోను ప్రదర్శించారు). కానీ, ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్‌ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు.

రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నా చంద్రబాబు రోడ్డు పనులను చేయకుండా గాలికొదిలేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు. త్వరలో భోగాపురం నుంచి విమానాలు టేకాఫ్‌ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సరైన రోడ్లు లేవు. చంద్రబాబు, పౌర విమానయానశాఖ  మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్‌ ఇస్తారు. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? భూ సేకరణ చేశారా? కనీసం ఇప్పుడు జరగాల్సిన పనులైనా చేయించారా? చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తన కాంట్రిబ్యూషన్‌ ఏమీ లేకుండానే క్రెడిట్‌ కొట్టేస్తారు! ఎవరో పని చేస్తే.. ఆ క్రెడిట్‌ తీసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి సంకోచం లేకుండా చోరీ చేసేస్తారు.

బాబు అనుమతులు కూడా తేలేకపోయారు..
నాడు చంద్రబాబు హయాంలో అశోక్‌ గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా.. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు, ఎన్‌వోసీలు తేలేకపోయారు. ఆ ప్రా­జెక్టు అనుమతులు అన్నీ మేమే తీసుకొచ్చాం. విశాఖపట్నంలో డిఫెన్స్‌ ఎస్టాబ్లి‹Ùమెంట్లు (రక్షణ శాఖ విభాగాలు) ఎక్కువగా ఉన్నందున ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం. మేం అధికారంలోకి వచ్చి­న తర్వా­త అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. నేను స్వయంగా ప్రధానిని కలిసి లేఖలు ఇచ్చా. అనేక సార్లు విజ్ఞ్ఞప్తి  చేశా.

అందుకే.. మా హయాంలోనే ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బీసీఏఎస్‌ (బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవివేషన్‌ సెక్యూరిటీ), రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఎన్‌వోసీ, అన్ని బ్యాంకుల ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పర్మిషన్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగానే జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అవసరమైన అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. కోవిడ్‌ లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకెళ్లాం. ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్‌ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్‌ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది. ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్‌ తీసుకో­వాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు.. కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.

భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు  చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్‌ జగన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌..’ అని ప్రకటించారు. – వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement