‘భోగాపురం.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు’ | YSRCP React On Bhogapuram international airport | Sakshi
Sakshi News home page

‘భోగాపురం.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు’

Aug 1 2026 1:20 PM | Updated on Aug 1 2026 1:59 PM

YSRCP React On Bhogapuram international airport

సాక్షి, తాడేపల్లి: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభంపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలంటూ పోస్టు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారని.. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.

వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా..‘రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్‌ అన్నకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ హయాంలో ఎయిర్‌పోర్టు భూసేకరణకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించటంతోపాటు, అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఎయిర్‌పోర్టుకు పునాది వేసి, దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అందుకే వారంతా థ్యాంక్యూ జగన్ అన్నా అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారు’ అని పోస్టు చేసింది. 
 

చంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు. వైఎస్‌ జగన్ కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement