వెనుక సీట్లలో కూర్చున్న ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు
పూసపాటిరేగ: అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రొటోకాల్ లేని నేతలను వీవీఐపీ గ్యాలరీలలో కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టు సభలో ముందు వరుసలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు.
ఆ తరువాత వరుసలో వీవీఐపీ పాసులు సంపాదించిన కూటమి నేతలు, జీఎంఆర్ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆ తరువాత వరుసలో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, చివరి వరుసలో సాధారణ ప్రజలకు సమీపంలో ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవిస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.


