కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారం మదంతో పచ్చమూకలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్ సిపీ నేత గిరి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. టీడీపీ నేత నాగరాజు ఈ దాడికి పాల్పడ్డారు. ఏ కారణం లేకుండానే వైసీపీ నేత ఇంటిని ధ్వంసం చేశారు.
దీంతో వైఎస్సార్ సిపీ నేతను పరామర్శించడానికి ఎమ్మెల్యే విరుపాక్షి అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై కూడా టిడిపి గూండాలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడుకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై టిడిపి నాయకులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చోద్య చూస్తున్నారు. గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంకా గొడవ సర్దుమనుగు కాక ముందే టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సంగాల గ్రామానికి బయలుదేరారు.


