సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్‌లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్‌ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.
దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్‌రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.


