అట్లాంటాలో వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్‌సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.
వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్‌ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.


