టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు | Indian origin woman shot dead in Toronto | Sakshi
Sakshi News home page

టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు

Jul 27 2026 7:19 PM | Updated on Jul 27 2026 8:41 PM

Indian origin woman shot dead in Toronto

కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన ఓ యువతి(26)ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య కేసుపై కెనడియన్ పోలీసులు వివరాలు తెలిపారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.

మృతురాలిని నవనీత్ కౌర్‌గా, నిందితుడిని బ్రాంప్టన్‌కు చెందిన శరణ్‌జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకెవరూ పరారీలో లేరని, హత్య కేసుల దర్యాప్తు విభాగం విచారణ కొనసాగిస్తోందని తెలిపారు.

హంబర్‌వుడ్ బులేవార్డ్, రెక్స్‌డేల్ బులేవార్డ్ కూడలిలో ఈ కాల్పులు జరిగాయని టొరంటో పోలీసు సర్వీస్‌ తెలిపింది. కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తుపాకీ గాయంతో ఉన్న నవనీత్ కౌర్‌ను గుర్తించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా, ఘటనాస్థలిలోనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు బాధితురాలు, నిందితుడు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై కాల్పులు జరిపి, పోలీసులు చేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. శరణ్‌జీత్ సింగ్‌పై హత్య కేసుతో పాటు, చట్టపరమైన షరతులను ఉల్లంఘించిన అభియోగం కూడా నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement