వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.
ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్‌పై దాడి అని శీర్షిక పెట్టారు.


