breaking news
Kharg Island
-
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్పై దాడి అని శీర్షిక పెట్టారు. -
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్‌లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. -
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్‌కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
అన్నంత పని చేసిన ట్రంప్.. మళ్లీ యుద్ధ మేఘాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్ డెడ్‌లైన్ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్‌తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది. -
ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపం మాదే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్‌కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే, ఇరాన్‌లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు 'మీరెందుకు అలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ వాళ్లే మూర్ఖులు’ అంటూ మండిపడ్డారు. అలాగే, ఇరాన్‌పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా, ట్రంప్ స్పందిస్తూ.. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు.అమెరికాకే ముప్పు..?మరోవైపు.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. ఈ సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని ఇటీవలి వారాల్లోని నివేదికలు కూడా సూచించాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఖార్గ్ ద్వీపంపై ఎలాంటి దాడి అయినా అత్యంత ప్రమాదకరమని, అది అమెరికా సైనికుల ప్రాణనష్ణాన్నిపెంచుతుందని, సంఘర్షణను పొడిగించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకదానికి ముప్పు వాటిల్లుతుందని సైనిక విశ్లేషకులు హెచ్చరించారు.JUST IN: 🇺🇸🇮🇷 President Trump confirms he is considering seizing Iran's Kharg Island, FT reports."My preference would be to take the oil…I don't think they have any defense. We could take it very easily." pic.twitter.com/W7Ze4jj4Zi— BRICS News (@BRICSinfo) March 30, 2026ఇక, పలు నివేదిక ప్రకారం, ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు నిలుపుకోవడం వంటి కార్యకలాపాల కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 2,200 మంది మెరైన్లతో సహా సుమారు 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరో 2,200 మంది మెరైన్లు మార్గంలో ఉన్నారు. వాషింగ్టన్ సాధ్యమయ్యే విస్తరించిన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నందున, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన వేలాది మందిని కూడా మోహరించాలని ఆదేశించారు.పెరుగుతున్న మరణాల సంఖ్యయుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్‌లో 19 మంది మరణించారు. లెబనాన్‌లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ఎందరొచ్చినా మసి చేస్తాం : ఇరాన్
-
సరదా కోసమైనా ఖార్గ్ దీవిపై దాడి చేస్తాం : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్‌పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు.అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్‌తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్‌తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్‌పై పడినట్లు సమాచారం.ఖార్గ్ ఐలాండ్‌పై దాడులు జరగడం వల్ల ఇరాన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


