ఖర్గ్‌ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం | Trump issues warning to Iran | Sakshi
Sakshi News home page

ఖర్గ్‌ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం

Jul 8 2026 7:42 PM | Updated on Sep 25 2026 5:32 PM

Trump issues warning to Iran

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్‌ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే  ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చి చెప్పారు. ఇరాన్‌ తప్పులు చేస్తూనే ఉందని చర‍్చల పేరుతో ఇరాన్‌ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్‌ఫైర్‌ ముగిసిందని చెప్పారు.  

కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన  ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. 

గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్‌ నగరంలో జరుగుతాయి. 

ఈ నేపథ్యంలో ట్రంప్‌ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్‌కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement