Live Updates
పశ్చిమాసియా యుద్ధం.. ఎందరొచ్చినా మసి చేస్తాం : ఇరాన్
నాటో గగనతంలోకి దూసుకొచ్చిన ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్
- నాటో గగనతంలోకి దూసుకొచ్చిన ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్
- టర్కీ గగనతలంలో క్షిపణిని కూల్చేసిన నాటో ఎయిర్‌డిఫెన్స్
- ఇప్పటివరకూ నాలుగుసార్లు క్షిపణులను అడ్డుకున్నామన్న టర్కీ
- నాటో సభ్యదేశంపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
- దాడి చేయలేదని ఇరాన్ బుకాయిస్తుంది: టర్కీ రక్షణమంత్రిత్వ శాఖ
2026-03-30 21:38:18
ఖర్గ్ దీవిని పూర్తిగా పేల్చి నాశనం చేస్తాం: ట్రంప్
- ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం త్వరగా కుదరాల్సిందే
- లేదంటే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై దాడి
- ఖర్గ్ దీవిని కూడా పూర్తిగా పేల్చి నాశనం చేస్తాం: ట్రంప్
2026-03-30 19:04:51
ఇరాన్ భీకర దాడులు
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
- హైఫా నగరంలోని ఆయిల్ ఫ్యాక్టరీపై దాడి
- ఇరాన్ దాడితో ఆయిల్ ట్యాంకర్లలో చెలరేగిన మంటలు
2026-03-30 18:41:56
అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ నో పర్మిషన్
- అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ అనుమతి నిరాకరణ
- ఇరాన్‌తో యుద్దంలో పాల్గొనే అమెరికా విమానాలకు నో పర్మిషన్
- మా దేశ గగనతలం మూసివేశాం
2026-03-30 17:24:06
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకొద్దు: ఇరాన్
- పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు వద్దే వద్దు
- అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరగలేదన్న ఇరాన్
- దౌత్యం విషయంలో అమెరికా తరుచు మాటమారుస్తోంది
- యుద్ధం ముగింపు విషయంలో మా వైఖరి స్థిరంగా ఉంది
2026-03-30 17:19:52
అమెరికా షరతులను తిరస్కరించిన ఇరాన్
- అమెరికా షరతులు అతిగా ఉన్నాయన్న ఇరాన్
- అమెరికా షరతులను తిరస్కరించిన ఇరాన్
- పాకిస్తాన్ ద్వారా ఇరాన్, అమెరికాలు పరస్పర సందేశాలు
- హోర్ముజ్ విషయంలో చర్చల కోసం అమెరికా మమ్మల్ని యాచిస్తోంది: ఇరాన్
2026-03-30 16:47:01
ఇజ్రాయెల్‌పై ఇరాన్-హిజ్బుల్లా సంయుక్త దాడి
- ఉత్తర ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్- హిజ్బుల్లా గ్రూపు
- ఇజ్రాయెల్‌లోని హైఫా ప్రాంతంలో ఉన్న బజాన్ చమురు శుద్ధి కర్మాగారం సముదాయం దాడి
- ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఇదొకటి.
2026-03-30 15:37:48
ఇరాన్ అణు కేంద్రాల ధ్వంసం నిజమే : ఐఏఈఏ
- ఇరాన్‌లోని రెండు ప్రధాన అణుకేంద్రాలపై ఇటీవల దాడులు
- అందులో ఒకటి అరాక్‌లోని భారజల రియాక్టర్
- ఆ దాడిలో ఈ భారజల ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైందని వెల్లడించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ
2026-03-30 12:53:29
ఇరాన్‌కు ఆత్మరక్షణ తప్ప మరేమీ మిగల్లేదు: ట్రంప్
- ఇరాన్ ఆర్థిక జీవనాడి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చన్న ట్రంప్
- మేము ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు
- మా ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయి
- కొన్నాళ్లు ఆ ద్వీపాన్ని మా అధీనంలో ఉంచుకోవచ్చు కూడా
- ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగిలిందని అనుకోవడం లేదు
- ఒక్కసారి మేము దాడి మొదలుపెట్టాక.. దానిని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకుంటాం
- ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం
- గ్రౌండ్ ఆపరేషన్ చిట్టచివరి ఆప్షన్‌గా పేర్కొన్న ట్రంప్
2026-03-30 11:59:31
దుర్ధినంలో ఇరాన్
- అమెరికా సైన్యం కీలక లక్ష్యాలను ధ్వంసం చేశాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
- దుర్ధినంలో ఇరాన్
- ప్రపంచంలో అత్యుత్తమమైన, అత్యంత శక్తివంతమైన మన గొప్ప సైన్యం
- ఎంతో కాలంగా కోరుకుంటున్న అనేక లక్ష్యాలను నిర్మూలించి, ధ్వంసం చేసింది
- ఇరాన్‌తో ప్రత్యక్ష, పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి
- ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుంది
- అదే సమయంలో విఫలమయ్యే అవకాశం కూడా ఉంది
- అమెరికా ఇప్పటికే ఇరాన్‌లో పాలన మార్పును సాధించిందని నొక్కి చెప్పిన ట్రంప్
2026-03-30 10:14:14
మేం వెయిటింగ్ : ఇరాన్ స్పీకర్
- తమ భూతలంలోకి అమెరికా సేనల రాక కోసం ఎదురు చూస్తున్న ఇరాన్
- అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాన్ని మసి చేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ప్రకటన
- ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందని హెచ్చరిక
2026-03-30 07:46:55
తిరిగి వెళ్లేది శవాలే : ఇరాన్
- తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది శవాలేనంటూ హెచ్చరిక
- ఇరాన్ మిస్సైల్ లాంచింగ్, గగనతల రక్షణ వ్యవస్థలు, నౌకా మార్గాలను దెబ్బకొట్టి వెన్ను విరవాలని అమెరికా యోచన
- ఇరాన్‌కు ఆర్థికంగా ఆయువు పట్టైన ఖర్గ్ దీవిని దిగ్బంధిస్తే విధి లేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా
- ట్రంప్ బెదిరింపులతో సరిపెట్టబోరని, తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ ప్రకటన
- ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్ పరిస్థితి నరకప్రాయం అవుతుందని హెచ్చరిక
2026-03-30 07:46:55
ట్రంప్ ఆదేశిస్తే..
- గల్ఫ్‌కు చేరుకున్న 3,500 మంది మెరైన్లు, సైనికులు
- ఇరాన్‌తో ప్రధాన భూభాగంతో పాటు ఖర్గ్ ద్వీపంపై దాడి చేసేంత దూరంలోనే మోహరింపు
- పశ్చిమాసియాలో 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా.
- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు రాగానే దాడులు చేసేందుకు రంగం సిద్ధం
- వీరికి తోడు మరో 10 వేల మంది సైనికులను త్వరలో పశ్చిమసియాకు తరలించాలని భావిస్తున్న అమెరికా
2026-03-30 07:46:55
సై అంటే సై
- భూతలానికి విస్తరించనున్న పశ్చిమాసియాలో యుద్ధం
- ముఖాముఖి పోరుకు సై అంటే సై అంటున్న అమెరికా, ఇరాన్
- ఇప్పటికే పశ్చిమాసియాకు వేలాది మంది అమెరికా సైనికులు
2026-03-30 07:46:55
ఖార్గ్ ఐలాండ్ ఆక్రమించే దిశగా అమెరికా అడుగులు
- ఇరాన్ చమురు సంపదను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్
- ఖార్గ్ ఐలాండ్ ఆక్రమించే దిశగా అమెరికా అడుగులు
- ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉందన్న ట్రంప్
- పశ్చిమాసియాకు చేరుకున్న మరో 3,500మంది అమెరికా సైనికులు
- పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు
- 15 అంశాలతో ఇరాన్‌కు ప్రతిపాదనలు పంపిన వైట్ హౌస్
- ఇరాన్ యురేనియం నిల్వల వెలికితీతకు అమెరికా ప్లాన్
- సైనిక ఆపరేషన్‌పై ట్రంప్ తీవ్ర కసరత్తు
- ఇరాన్ వద్ద 970పౌండ్ల యురేనియం స్వాధీనమే లక్ష్యం
- ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా అమెరికా దాడులు
- ఏప్రిల్6లోపు హర్మూజ్ జలసంధి తెరవాలని ట్రంప్ అల్టిమేటం
- భూతల యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్న రక్షణ రంగ నిపుణులు
- గల్ఫ్ రీజియన్‌లో భారీగా అమెరికా మెరైన్ల మోహరింపు
2026-03-30 07:28:06
కువైట్ పవర్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి
- పశ్చిమాసియాలో మరింత ముదిరిన యుద్ధ మేఘాలు
- కువైట్ పవర్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి
- తమ దేశ సార్వభౌమాధికారంపై దాడి జరిగిందన్న కువైట్
- కువైట్ రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసిన అధికారులు
- చమురు,విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
2026-03-30 07:28:06
Advertisement


